Jaspreet Bumrah:జస్ప్రీత్ బుమ్రా-సంజనా గణేషన్ : ఈ దంపతుల ఆదాయం ఎంతో తెలుసా..?

జస్ప్రీత్ బుమ్రా మరియు సంజనా గణేశన్ యొక్క కలిపిన నెట్ వర్త్‌ను అన్వేషించండి, క్రికెట్ మరియు ఈవెంట్ల హోస్టింగ్ నుండి వచ్చే ఆదాయాన్ని కలుపుకొని.

రోల్స్ రాయిస్ లో వెనక నుంచి తెరుచుకునే డోర్స్.. వాటిని 'సూసైడ్ డోర్స్' అని ఎందుకంటారు?

కార్ల డిజైన్ కాలానికనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పాత కాలం నాటి ఒక అదిరిపోయే ఫీచర్ మళ్లీ కొత్తగా, బోల్డ్ స్టేట్‌మెంట్‌లా తిరిగి ఎంట్రీ ఇస్తోంది. అవే సూసైడ్ డోర్స్. ఈ డోర్స్ మామూలు కార్ డోర్స్ మాదిరి ముందు నుంచి కాకుండా వెనుక నుంచి తెరుచుకుంటాయి. ఈ డిజైన్ కొత్తదేమీ కాకపోయినా ఇప్పుడు కార్ల కంపెనీలు పాత స్టైల్‌కు కొత్త మెరుగులు దిద్దుతుండడంతో దీనిపై మళ్లీ దృష్టి పడుతోంది.

టాప్ 3 స్కూటర్‌గా యాక్సెస్ 125 దూసుకొచ్చింది.. గత సంవత్సరం కన్నా 17% వృద్ధి

దిగ్గజ టూవీలర్ తయారీదారు సుజుకీ (suzuki)కి చెందిన యాక్సెస్ 125 (Access 125) అనే స్కూటర్ పేరు వినగానే, చాలా మంది వినియోగదారుల మనసులో నమ్మకమైన, రోజువారీ ప్రయాణాలకు అనుకూలమైన ఒక స్కూటర్ కనబడుతుంది. ఇది ఒక మంచి పనితీరు, మైలేజ్, కంఫర్ట్‌కి కలయికగా మారింది. అందుకే, దేశవ్యాప్తంగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు ఈ స్కూటర్ కనిపిస్తుంది. తాజాగా విడుదలైన మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, యాక్సెస్ 125 స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 మోడళ్లలో మూడవ స్థానాన్ని అధిరోహించింది. మార్కెట్లో ఎంతో పోటీ ఉన్నప్పటికి కూడా ఇతర మెడళ్లను దాటుకుని ఇది మెరుగైన స్థానం పొందడం గమనార్హం.

సెలబ్రిటీల ఫేవరెట్ మిని కూపర్ S: హిషమ్ అబ్దుల్ వహాబ్ కూడా కొనేశాడు!

ఎప్పటికప్పుడు గొప్ప గాయకులను ఐడియా స్టార్ సింగర్ అనే రియాలిటీ షో ద్వారా ఇండస్ట్రీకి ఒక పెద్ద గిఫ్ట్, ఓ అద్భుతమైన టాలెంట్ దొరికారు. 2007లో ఐడియా స్టార్ సింగర్‌కు గెస్ట్‌గా వచ్చిన హీరో జయసూర్య, అతడి పాట విని మీరు పాటతోనే బతుకుతారు అని అన్నారు. ఆ తర్వాత వినీత్ శ్రీనివాసన్ తీసిన 'హృదయం' సినిమాతో వచ్చిన అవకాశం అతని మ్యూజిక్ కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్.
Advertisement

ఓ అద్భుత కారు అమ్మకాల్లో పడిపోయింది! టాటా ఆల్ట్రోజ్‌కు ఏమైంది?

భారతదేశపు ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా ఆల్ట్రోజ్ (Altroz) భారత మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అయితే, మే 2025 అమ్మకాల దృష్టిలో చూస్తే ఈ మోడల్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ మే 2025లో కేవలం 2,779 ఆల్ట్రోజ్ యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 4,983 కార్ల అమ్మకాలతో పోల్చుకుంటే 2,204 యూనిట్లు తక్కువ. ఈ మేరకు ఆల్ట్రోజ్ అమ్మకాల్లో దాదాపు 44 శాతం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతానికి అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికి రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

XUV700 Vs కియా కారెన్స్ క్లావిస్.. ఏ కారులో ఎక్కువ దమ్ముంది?

భవిష్యతులో మీ ఫ్యామిలీ కోసం ఒక కంఫోర్టబుల్, సేఫ్, ప్రీమియం కారు కొనాలని చూస్తున్నారా.. అయితే మహీంద్రా XUV700, కియా కొత్తగా తెస్తున్న కారెన్స్ క్లావిస్ మంచి ఆప్షన్లు కావచ్చు. ఈ రెండు కార్లు కూడా ఫీచర్లు, డిజైన్, పర్ఫామెన్స్ విషయంలో అద్భుతంగా ఉన్నాయి. దాదాపు ఈ రెండు మోడల్స్ కూడా రూ.25లక్షల బడ్జెట్లోనే వస్తాయి.

భారత రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ ధరలు పెంపు వివరాలు ఇవే

భారతీయ రైల్వేల ద్వారా దేశంలో కోట్లాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. తక్కువ ధరలో, ఎక్కువ దూరం ప్రయాణించే పేద, మిడిల్ క్లాస్ వారికి రైల్వేలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బస్సులు, విమానాల్లో అయ్యే ఖర్చులతో దీని ద్వారా తక్కువ ఖర్చలో ప్రయాణం చేయవచ్చు. అయితే తాజాగా రైల్వే ధరల గురించి ఒక కీలక సమాచారం వచ్చింది. భారతీయ రైల్వే ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలుస్తుంది. ఈ కొత్త ధరలు వచ్చే నెల అంటే జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రైల్వేలో టికెట్ ధరల పెంపుదల అనేది చాలా ఏళ్ల తరువాత జరుగుతున్న ప్రక్రియ. మధ్యతరగతి, పేదల అభిమానం రైళ్లపై ఎంతో ఎక్కువగా ఉంటుంది. కానీ ధరల పెరుగుదలతో రైలులో ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారబోతోంది.

బజాజ్ పల్సర్ అమ్మకాలు డౌన్.. కారణం ధరనా? పోటీనా?

బజాజ్ పల్సర్ బైకును యూత్‎ను దృష్టిలో పెట్టుకొని తయారుచేశారు. బైక్ డిజైన్, పనితీరు, ఫీచర్లు అందరికీ నచ్చుతాయి. ఇటీవల 'మే' నెలలో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 10 మోటార్‌సైకిళ్ల జాబితా విడుదలైంది. అందులో 'పల్సర్' 3వ స్థానంలో ఉంది. అయినా, అమ్మకాల సంఖ్య తగ్గింది. ఇదే జాబితాలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉండగా, హోండా షైన్ రెండవ స్థానంలో ఉంది.

గూగుల్ నుంచి మనకు సర్ ప్రైజ్ గిఫ్ట్- `అన్నీ` ఇక్కడే

గూగుల్ భారతదేశంలో శోధన అనుభవాలను మెరుగుపరచడానికి AI మోడ్‌ను పరిచయం చేస్తోంది, వినియోగదారుల ఇష్టమైన భాషల్లో సమగ్ర సమాధానాలను అందిస్తోంది.

బెస్ట్ స్కూటర్.. టీవీఎస్ జూపిటరా? హోండా యాక్టివా 6జీనా? ఎవరికి ఏది పర్ఫెక్ట్?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా 6జీ ముందుంటాయి. అమ్మకాల విషయానికి విషయంలో కూడా అవి టాప్ ప్లేసులో ఉంటాయి. ఈ రెండు స్కూటర్లు చాలా కాలంగా ఒకదానికొకటి పోటీ ఇస్తూనే ఉన్నాయి.

వంటల వీడియోలతో మొదలైంది.. ఇప్పుడు VIP నంబర్‌తో స్కార్పియో N

ఈ రోజుల్లో సోషల్ మీడియా సాధారణ జీవితాలను గడుపుతున్న వారిని కూడా ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మార్చి వేస్తుంది. ఇలాంటి వారి గురించి ఇటీవలి కాలంలో వింటూనే ఉన్నాం. అలాంటి కోవకే చెందిన వారు, రాజేష్ రావణి. రెండు దశాబ్దాల పాటు లారీ డ్రైవర్‌గా జీవితం గడిపిన ఆయన, ఒక్క యూట్యూబ్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయారు. ఆయన సాధారణంగా లారీ డ్రైవింగ్ చేసేవారు. రాజేష్‌కు వంట మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఈ క్రమంలో యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించాడు. మొదట్లో తన ట్రక్ ప్రయాణాల్లో వంట చేసుకుంటూ, దాన్నంతా కూడా వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. అవి ఎంతో సహజత్వంతో ఉండేవి. అతని మాటలు, నడక, వంట విధానంతో చాలా మందిని అట్రాక్ట్ చేశారు. దీంతో ఆయన ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయడం క్రమంగా పెరిగిపోయింది.

వర్షాకాలంలో మీ కారుకు 'హ్యుందాయ్' ట్రీట్‌మెంట్!

ప్రస్తుతం వానాకాలం మొదలైంది. అడపాదడపా వర్షాలు పడుతుంటాయి కాబట్టి బయటకి వెళ్లాలంటే అందరూ ఎక్కువగా కార్లనే ఉపయోగిస్తారు. ఈ సమయంలో కార్ల కండిషన్ చూసుకోవడం ప్రతి యజమాని బాధ్యత. ఈ మధ్య కాలంలో చాలా వాహన తయారీ కంపెనీలు తమ కస్టమర్ల కోసం మాన్‌సూన్ క్యాంపులను ప్రకటించాయి.
Advertisement

ముంబై ఎయిర్పోర్టుకు మహర్దశ-బిలియన్ డాలర్లను సమీకరించిన అదానీ గ్రూప్..!

అదాని ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కోసం విజయవంతంగా $1 బిలియన్ నిధులు సమీకరించింది, మౌలిక సదుపాయాలు మరియు స్థిరత్వం కార్యక్రమాలను మెరుగుపరుస్తుంది.

కేవలం బలంగా కాదు.. భద్రతలో కూడా సింహంలా హారియర్ EV

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది టాటా మోటార్స్ (tata motors). ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లు ప్రమాదాల్లోనూ ప్రయాణికులను ఎంతగానో కాపాడతాయనే పేరు సంపాదించుకున్నాయి. గతంలో టాటా కార్లు Bharat NCAP (భారత్ ఎన్‌‌క్యాప్) క్రాష్ టెస్ట్‌లలో వరుసగా 5-స్టార్ సేఫ్టీ రేటింగులు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే ట్రెడిషన్‌ను కొనసాగిస్తూ టాటా హారియర్ ఈవీ (tata harrier ev) తన మొదటి క్రాష్ టెస్ట్‌లోనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి మరోసారి టాటా గౌరవాన్ని పెంచింది. ఎలక్ట్రిక్ SUVల విభాగంలో ఇది సాధించిన ఈ ఘనత, భద్రతతోపాటు పనితీరులోనూ ఈ కారు ఎలాంటి ప్రమాణాలు పాటించిందో స్పష్టంగా తెలియజేస్తోంది.

రోజూ పొలానికి వెళ్లే బైకా కావాలా? వీటిని చూసే మీరు డిసైడ్ అవ్వాలి!

ప్రస్తుతం టూవీలర్ లేనిదే రోజువారి పనులు చేసుకోలేని రోజులు వచ్చాయి. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన బైకుల వాడకం ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా వారికి తగిన బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాడే బైక్‌లు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, మైలేజ్ ఎక్కువగా ఉండాలి, ధర చాలా వరకు అందుబాటులో ఉంటూ, మెరుగైన పనితీరును కనబరచాలి.

అరుదైన అమావాస్య- మిస్ చేసుకోవద్దు..!!

జూన్ 25న ఆషాఢ అమావాస్య యొక్క ప్రాముఖ్యత, శ్రేయస్సు కోసం ఆచారాలు, మరియు శుభ దానాలు మరియు ప్రార్థనల సమయాలను కనుగొనండి.

సింగిల్ ఛార్జ్ తో 450కిమీ.. విన్‌ఫాస్ట్ మార్కెటింగ్ ప్లాన్ అదుర్స్

భారతదేశంలో విన్‌ఫాస్ట్ కంపెనీ త్వరలో తమ కార్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈలోపే దేశంలోని ముఖ్యమైన షాపింగ్ మాల్స్‌లో ఈ కంపెనీ తమ VF6, VF7 కార్లను ప్రదర్శనకు ఉంచింది. ఇలాంటి కారు ఒకటి రాబోతోందని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ మార్కెటింగ్ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

అమెజాన్ ఉద్యోగులకు ఏఐ షాక్-సీఈవో ముందస్తు హెచ్చరికలు..!

అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ 1.5 మిలియన్ ఉద్యోగులను AI యొక్క మార్పు ప్రభావాల గురించి హెచ్చరిస్తూ, అనుకూలత మరియు నేర్చుకోవాలని కోరుతున్నారు.

కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. దాని ఫీచర్స్ ఇవే

మాలీవుడ్‌లో లెజెండరీ డైరెక్టర్‌లలో ఒకరైన హరిహరన్ డైరెక్షన్లో వచ్చిన 'మయూఖం' సినిమాతో హీరోయిన్‎గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మమతా మోహన్‌దాస్. మాలీవుడ్‌లోని టాప్ హీరోల పక్కన ముఖ్యమైన పాత్రలు చేసి, లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును కూడా అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డ్యూయల్ పర్పస్ డిజైన్.. సిటీకి సెట్, అడ్వెంచర్‌కు రెడీ.. షాక్‌వేవ్ బుకింగ్స్‌లో గ్రోత్

భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ అల్ట్రావయోలెట్ (Ultraviolett) పేరు ఇటీవల మారుమోగుతుంది. దిగ్గజ కంపెనీలకు పోటీగా మెరుగైన బ్యాటరీ, అద్బుతమైన పనితీరుతో కూడిన వాహనాలను విడుదల చేస్తూ మార్కెట్లో తన ఉనికిని బలంగా చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటి వరకు ఈవీ స్కూటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉండే వీటి సౌలభ్యం, అందుబాటు ధర వలన వినియోగదారులు ఎక్కువగా స్కూటర్లవైపే మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. స్టైల్, పనితీరు కోరే వారు ఎలక్ట్రిక్ బైక్‌లవైపు ఆసక్తిని చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన కొన్ని కంపెనీలు తమ సొంత మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Advertisement

ఆటో ఎక్స్‌పో నుంచి డైరెక్ట్ రోడ్డుపైకి కొత్త టాటా ఏస్ ప్రో వచ్చేసింది!

టాటా మోటార్స్ అనేది మనదేశంలోని టాప్ కార్ల తయారీ సంస్థ. కార్ల అమ్మకాలలోనే కాదు.. కమర్షియల్ వాహనాల అమ్మకాల్లోనూ టాటా మోటార్స్ ముందు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి మొదట్లో కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో టాటా కంపెనీ ముందుండేది. ఆ నమ్మకంతోనే 1998లో కార్ల అమ్మకాల్లోకి అడుగుపెట్టింది. టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల్లో ప్రజల మధ్య బాగా పాపులర్ అయిన వాహనం టాటా ఏస్.

జులై 2 నుంచి బుకింగ్స్ స్టార్ట్.. హారియర్ EV వచ్చేస్తోంది!

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) మార్కెట్‌లో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన హారియర్ EV కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేచి ఉండే సమయంలో, టాటా మోటార్స్ హారియర్ EV రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ల ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త హారియర్ EV RWD వెర్షన్ మొత్తం ఐదు వేర్వేరు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ వేరియంట్లన్నీ వినియోగదారుల విభిన్న అవసరాలకు తగ్గట్లు రూపొందించబడ్డాయి. కొత్త డిజైన్, లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన పనితీరు, ఆర్ధిక ప్రయోజనాలు ఇవన్నీ ఈ ఎలక్ట్రిక్ SUVని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

వచ్చింది స్పోర్టీగా.. చెలరేగింది అమ్మకాలలో! టీవీఎస్ ఎన్‌టార్క్ కొత్త రికార్డు!

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ (Tvs Motor)కు చెందిన ప్రసిద్ధ మోడల్ ఎన్‌టార్క్ 125(NTorq 125) ఒక గొప్ప మైలురాయికి చేరుకుంది. 2018లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మోడల్, విడుదలైన దాదాపు ఏడేళ్ల వ్యవధిలోనే 20 లక్షల యూనిట్లను విక్రయించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రారంభంలో యువతను లక్ష్యంగా తీసుకొని డిజైన్ చేసిన ఈ స్కూటర్, రోజురోజుకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఈ స్కూటర్‌కు భారత మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు NTorq 125 మోడల్‌ను 3 లక్షల యూనిట్లకు పైగా విదేశాలకు ఎగుమతి చేశారు. ఇది TVS గ్లోబల్ డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు అసలే తినొద్దు!

భారతదేశంలో మూత్రపిండాల ఆరోగ్య నిపుణులు, ఫాస్ట్ ఫుడ్ వినియోగం మూత్రపిండాల వ్యాధికి దోహదపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆహారపు మార్పులు మరియు ప్రజల అవగాహనను కోరుతున్నారు.

భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. రెండు ఆప్షన్స్ ఇస్తూ కీలక ప్రకటన

ఇండస్ వాటర్ ఒప్పందం కింద నీటిని నిలిపివేయడం యుద్ధానికి దారితీస్తుందని బిలావల్ భుట్టో ఇండియాను హెచ్చరించారు. ఉద్రిక్తతలను పరిష్కరించడానికి సంభాషణ అవసరమని ఆయన నొక్కి చెప్పారు.