టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ రాబోతుంది! త్వరలో రోడ్డెక్కనున్న బేబీ ఫార్చ్యూనర్

అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి టయోటా (Toyota)కు కార్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకట్టుకునే డిజైన్, నమ్మకమైన పనితీరు, రఫ్ అండ్ టఫ్ దారుల్లో నడిపే సామర్థ్యం గల వాహనాలను విడుదల చేయడంలో టయోటా బ్రాండ్ నమ్మకమైన కంపెనీ. ముఖ్యంగా దాని ప్రసిద్ధ మోడల్ ఫార్చ్యూనర్‌ (fortuner) అంటే ఇండియాలో చాలా మంది ఫేవరెట్ మోడల్. ఈ suv ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ.33.78 లక్షల నుంచి రూ.51.94 లక్షల వరకు ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. అధిక ధర కారణంగా కొంతమంది ఈ కారును కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించేవారు. కాదు. ఇంతకంటే తక్కువ ధరలో లభించే మోడళ్లను కొనుగోలు చేయడానికి చూసేవారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ డ్రాప్.. క్లాసిక్ 350 కి దెబ్బ పడిందా?

రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield), ఇంగ్లాండ్‌లో పుట్టినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ బైక్ కంపెనీగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ప్రతి నెలా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, గత మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో సుమారు 12 వేల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు తక్కువగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఎన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మోడల్స్ అమ్ముడవుతున్నాయి? గత ఏప్రిల్ నెలలో అవి ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయో చూద్దాం.

సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ కారులో కొత్తగా ఏముంది? కొనవచ్చా, లేదా?

సంవత్సరం 2019, ప్రపంచం కోవిడ్ అనే పదం కూడా వినలేదు, యూరోప్‌లో భారీ కార్ షోలు ఇంకా జరుగుతూనే ఉండేవి. అలాంటి కాలంలోనే టాటా మోటార్స్ తన ఆల్-న్యూ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. ఇది 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 45X కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్. తర్వాత వచ్చింది మహమ్మారి, తదనంతరం కొత్త ఉద్గార నిబంధనలు వచ్చాయి. దీంతో టాటా ఆల్ట్రోజ్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉంది. ఇంజిన్‌లను కఠినమైన ఎమిషన్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చడం, అలాగే iCNG, Racer వెర్షన్లను పరిచయం చేయడం వంటి మార్పులతో ఈ హ్యాచ్‌బ్యాక్‌కు కొంత ఫ్రెష్‌నెస్ కలిగించింది. కానీ టాటా మిగిలిన లైనప్ మాత్రం కొత్త మోడళ్లను లేదా పెద్ద మార్పులతో పెరుగుతుండగా, ఆల్ట్రోజ్ మాత్రం తనదైన బాటలోనే సాగింది.

డాష్‌క్యామ్‌కు ఊహించని డిమాండ్! ఎందుకంటే ఇది ప్రమాదాలకు పక్కా సాక్ష్యం!

కొత్త వెహికల్ కొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది సేఫ్టీకి (Safety). కస్టమర్ల మనసును అర్థం చేసుకునే అన్ని బ్రాండ్‌లు తమ వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లను పెంచాయి. అయితే, ఇప్పుడు బయటపడిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం.. ప్రజలు ఎక్కువగా కోరుకుంటుంది ADAS ఫీచర్‌నో, ఎయిర్‌బ్యాగ్‌లనో కాదు అనేది ఆశ్చర్యకరమైన నిజం.
Advertisement

ఒకప్పుడు రాజు లాగా వెలిగిన హోండా సిటీ... ఇప్పుడు అమ్మకాల పతనంలో?

ఒకప్పుడు భారతీయ కారుప్రియులకు సెడాన్ అంటే ఓ స్టేటస్ సింబల్, సౌకర్యం, క్లాస్ అన్నీ కలబోతగా అనిపించేది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుందాయ్ వెర్నా లాంటి మోడళ్లు ఒక్కసారి రోడ్డు మీద కనిపిస్తే, తల తిరిగి చూసేంతగా ఆకర్షించేవి. ఈ కార్లు సాఫీగా సాగిపోయే రైడ్ అనుభవం, ఇంటీరియర్ ప్రీమియం లుక్‌తో అందరిని కట్టిపడేసేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. SUVలు బలంగా ఎంట్రీ ఇచ్చాయి. బలమైన పనితీరు, క్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాల కారణంగా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదే సమయంలో సెడాన్లకు తగ్గుతుంది. తాజాగా హోండా సిటీ సెడాన్ అమ్మకాలు కూడా దీనిని రుజువు చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ నుంచి వచ్చిన అమ్మకాల నివేదిక ప్రకారం, హోండా సిటీ ఏప్రిల్ 2025 లో గతంలో కంటే సగానికి పైగా తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

అదీ థార్ పవర్.. రోడ్డు మీద పీకల్లోతు నీరున్నా దూసుకెళ్తుంది

ప్రస్తుతం పలుచోట్లు వర్షాలు దంచికొడుతున్నాయి. ముంబై, బెంగుళూరు లాంటి నగరాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. చాలా మందికి వర్షంలో, నీటి ప్రవాహంలో వాహనాలు నడపడం ఒక సరదా. ముఖ్యంగా ఎస్‌యూవీలు ఉన్నవారికి ఇది కాస్త గర్వంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు.

BS6 తరువాత నిబంధనలు మరింత కఠినం.. డీజిల్ కార్లు ఇక అంతరించిపోతాయా?

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, వాయు కాలుష్య ప్రభావాలు రోజు రోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భారత్ కూడా తన వంతుగా చర్యలు తీసుకుంటోంది. భారతదేశంలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ నిబంధనలను (BS Norms) అనుసరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా BS6 నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో వాహనాల నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. దీని వలన వాయు కాలుష్యం తగ్గడానికి దోహదపడుతుంది. BS6 ప్రకారం, వాహన తయారీదారులు, నిర్దిష్ట మోతాదుకు మించి వాయు కాలుష్యం విడుదల చేయని విధంగా తమ ఇంజిన్ టెక్నాలజీని మార్చాల్సి ఉంది. దీంతో వాహనాల డిజైన్, ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

భారత్ ఆటో మార్కెట్.. ఏ రాష్ట్రం టాప్ ? ఏ రాష్ట్రం వీక్?

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్లు అమ్ముడవుతున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. ప్రతిరోజూ వేల సంఖ్యలో కార్లు భారత్లో అమ్ముడవుతున్నాయి. కార్లు మాత్రమే కాకుండా, ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాల విక్రయాలు కూడా మన దేశంలో అద్భుతంగా ఉన్నాయి. వీటిని ప్యాసింజర్ వెహికల్స్ అని పిలుస్తారు. గత 2024 ఏప్రిల్ నుంచి 2025మార్చి వరకు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడైన భారతీయ రాష్ట్రాల వివరాలు వెల్లడయ్యాయి.

హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో వచ్చేస్తుంది.. జులై 1న డబుల్ లాంచ్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అలాగే మెరుగైన పెర్ఫామెన్స్ అందించే బ్యాటరీలతో కూడిన ఈవీలు విడుదల అవుతుండటంతో చాలా మంది కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఎక్కువగా ఎలక్ట్రిక్ మోడళ్ల వైపు చూస్తున్నారు. ఓలా, ఏథర్, సింపుల్ వన్ వంటి స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ఈ విభాగంలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, బజాజ్, హోండా, TVS వంటి ఆటోమోటివ్ దిగ్గజాలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ పోటీలోకి దిగాయి. ఈ క్రమంలో ఇప్పుడు హీరో మోటోకార్ప్ (Hero Motorcorp) కూడా తన తదుపరి అడుగును వేయబోతోంది.

ప్రపంచంలోనే తొలి గేర్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి కొంటే లైఫ్ టైం వారంటీ

దేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో స్కూటర్ల మాదిరిగానే బైక్‌లు కూడా ట్రెండింగ్‌గా మారుతున్నాయి. ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే మోడల్ మ్యాటర్ ఏరా(Matter Aera). ప్రపంచంలోనే గేర్‌బాక్స్ ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ కావడంతో ఏరా చాలా ట్రెండింగ్‌లో ఉంది.

3 లక్షల యూనిట్ల మైలురాయి దాటిన టయోటా ఫార్చ్యూనర్, లెజెండర్‌

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా తన ముద్రను వేసుకుంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి వాహన తయారీదారులకు పోటీగా కొత్త కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తూ, దేశం నలుమూలల తన కార్లను ప్రజలకు చేరవేస్తుంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తన ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది. తాజాగా టయోటా తన రెండు ప్రసిద్ధ మోడళ్లకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. తన ఫ్లాగ్‌షిప్ SUVలు ఫార్చ్యూనర్ (fortuner),లెజెండర్ (legender) భారతీయ మార్కెట్లో మరోసారి తమ సత్తా చాటినట్లు ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల కలిపి 3 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.

ధర తక్కువ, సేఫ్టీ ఎక్కువ.. అదరగొడుతున్న స్కోడా కైలాక్

కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV) కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు, సేఫ్టీ ఉన్న కారు కోసం చూస్తున్నారా ? అయితే, మార్కెట్‌లోకి ఒక కొత్త కారు వచ్చింది. ఇది మారుతి (Maruti), టాటా (Tata) వంటి పెద్ద కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తుంది.
Advertisement

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ప్లెండర్ అమ్మకాలు డౌన్

దేశంలోని రోడ్లపై ఎక్కడ చూసినా కనిపించే బైక్ అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది "హీరో స్ప్లెండర్ (Hero Splendor)". సింపుల్ డిజైన్, అనుకూలమైన ధర, మైలేజీలో మహారాజు, ఇవన్నీ కలిసి స్ప్లెండర్‌ను పేద, మధ్యతరగతి ప్రజలకు నమ్మరమైన మోడల్‌గా మార్చాయి. చిన్న నగరం అయినా, గ్రామమైనా, పట్టణమైనా, ప్రతి కుటుంబంలో కనీసం ఒక స్ప్లెండర్ కనిపిస్తుంది. అంతటి పాపులారిటీ ఉన్న ఈ మోడల్ ఈ ఏప్రిల్‌లో మాత్రం కొంచెం వెనుకబడింది. 2025 ఏప్రిల్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 1,97,893 యూనిట్ల స్ప్లెండర్ బైకులను విక్రయించింది. అయితే, 2024లో ఇదే నెలలో అమ్మకాల సంఖ్య 3,20,959 యూనిట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాదిలోనే అమ్మకాలు దాదాపు 38.3 శాతం మేరకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ బైక్ కొనాలంటే వేగంగా వెళ్ళండి.. హోండా షైన్ సేల్స్ చూశారా!

కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్, తక్కువ ధర, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలా? అయితే, హోండా షైన్ (Honda Shine) గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) వంటి కంపెనీలకు షాక్ ఇస్తూ హోండా షైన్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ బైక్‌లో ఏముంది? ఎందుకని షోరూముల్లో జనం కిటకిటలాడుతున్నారు? చూద్దాం.

వర్షాకాలానికి అద్భుతమైన 3 SUVలు.. థార్, గూర్ఖా, జిమ్నీ వివరాలు

వర్షకాలం వచ్చిందంటే చాలు కార్లతో బయటికి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. రోడ్లు జారిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, మట్టి మార్గాల్లో వాహనం నడపడం వంటి వాటి వల్ల వర్షకాలం కార్లను బయటికి తీయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆఫీస్ లేదా ఇంటికి వెళ్లడానికి లేదంటే ఇతర అవసరాలకు కారును వర్షపు నీళ్లలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఇటీవల కాలంలో వర్షంలో కూడా తిరగడానికి కంఫర్ట్‌గా ఉండే మోడళ్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాల ఆధారంగా చేసుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిని కొనడానికి కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వాతవరణ పరిస్థితుల్లో ఎస్‌యూవీ (SUV)లు ఎంతగానో ఉపయోగపడుతాయి. కొన్ని ప్రధాన SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంవత్సరానికి ఒక్కసారి కడితే చాలు.. టోల్ ఫ్రీ ప్రయాణం!

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణాలు చేస్తుంటారా.. టోల్ ప్లాజాల దగ్గర నిలబడి డబ్బు కట్టడం విసుగు తెప్పిస్తుందా.. అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకురాబోతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి డబ్బు కడితే చాలు, ఏడాది పొడవునా టోల్ భారం ఉండదు. కేవలం కొన్ని సెకన్లలో టోల్ ప్లాజా దాటేయొచ్చు. మరి ఈ కొత్త వార్షిక టోల్ విధానం ఏమిటి? ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది? వివరాలు తెలుసుకుందాం.

ఏప్రిల్‌లో మరోసారి టయోటా మ్యాజిక్.. ఒక్క నెలలో 2,421 టైజర్ అమ్మకాలు

దేశీయ కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న సంస్థలలో టయోటా ఒకటి. వినియోగదారుల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ జపాన్‌కు చెందిన తయారీదారు, భారత మార్కెట్‌లో ఇన్నోవా, గ్లాంజా, ఫార్చ్యూనర్, రుమియన్ వంటి మోడళ్లతో బాగా ప్రసిద్ధి పొందింది. టయోటా మోడళ్లకు డిమాండ్ ఎప్పటికీ తక్కువ కాదు. తాజాగా కంపెనీ గత నెల అంటే, ఏప్రిల్ 2025లో సాధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, టయోటా మరోసారి తన మార్కెట్‌ స్థిరత్వాన్ని రుజువు చేసింది. మొత్తం 24,833 కార్లను విజయవంతంగా డెలివరీ చేసింది. ఈ సంఖ్య చూస్తేనే కంపెనీకి వినియోగదారులలో ఎంతటి ఆదరణ ఉందో అర్థం అవుతుంది. ఈ మొత్తంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అమ్ముడైన మోడల్‌ అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) కూడా కీలక పాత్ర పోషించింది.

ఓలా రోడ్‌స్టర్ X వచ్చేసింది.. కస్టమర్లకు డెలివరీలు మొదలయ్యాయి!

ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ X(Roadster X) ను మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్న కంపెనీ ఇప్పుడు రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్ ద్వారా పెట్రోల్ బైకులకు గణనీయమైన పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఓలా డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులకు రోడ్‌స్టర్ X బైక్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఇ-బైక్ డిజైన్ చూసినవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేలా చేసే ఆకట్టుకుంటుంది. స్పోర్టీ లుక్స్, మోడర్న్ ఫినిషింగ్, యూత్‌ఫుల్ స్టైల్‌ను ఈ బైక్ ప్రతిబింబిస్తుంది.

టాటా హారియర్ EV..500 కి.మీ. రేంజ్, అద్భుతమైన ఫీచర్లు!

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? మహీంద్రాకు షాక్ ఇవ్వడానికి టాటా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకువస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు టాటా హారియర్ EV (Tata Harrier EV) అనే కారుతో టాటా మోటార్స్ పెద్ద ప్లాన్ వేసింది.

ఈ వైరల్ వీడియో చూడండి: ఫార్చ్యూనర్‌కు ఇలాంటి గతి పట్టిందే!

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్‌లు ఎంత ముఖ్యమో తెలుసా? ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) లాంటి పెద్ద SUVనడిపేటప్పుడు సైడ్ మిర్రర్‌లు లేకపోతే ఎంత ప్రమాదమో ఊహించగలరా? అయితే, ఒడిశాలో ఒక ఫార్చ్యూనర్ డ్రైవర్ చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు. సైడ్ మిర్రర్ బదులు అద్దం పెట్టుకున్న ఆ డ్రైవర్ గురించి.. ఆ సంఘటన గురించిన పూర్తి వివరాలు, ఇంకా ఫార్చ్యూనర్ స్పెషల్స్ గురించి తెలుసుకుందాం.
Advertisement

హోండా కొత్త బైక్ రెబెల్ 500.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే

దేశీయ ప్రముఖ టూవీలర్ వాహన తయారీదారు హోండా స్కూటర్ & మోటార్‌సైకిల్ ఇండియా (HMSI), దేశంలోని ప్రతి మూలకూ చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా, ఈ సంస్థ నంచి వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. నమ్మకమైన పనితీరు కారణంగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హోండా కంపెనీ రూపొందించే బైక్‌లు, స్కూటర్లు నిత్యజీవిత అవసరాలకు సరిపోయేలా ఉండటంతో, ప్రజలు వాటిని నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు. దాని విజయపరంపరను కొనసాగించడానికి హోండా ఇటీవల అదిరిపోయే బైకును విడుదల చేసింది. దాని పేరే "రెబెల్ 500 (Rebel 500)". బైక్‌ రూపకల్పన నుండీ పనితీరు వరకు ప్రతీ విషయంలోనూ ఒక ప్రత్యేకతను చూపిస్తోంది.

5-స్టార్ సేఫ్టీతో టాటా కర్వ్: సిట్రాన్ బసాల్ట్‌కు షాక్ ఇచ్చేనా?

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? స్టైల్‌తో పాటు సేఫ్టీ కూడా ఉండాలని అనుకుంటున్నారా ? మార్కెట్‌లో కొత్తగా వస్తున్న కూపే ఎస్‌యూవీల గురించి తెలుసుకోవాలని ఉందా? టాటా మోటార్స్ 'కర్వ్' (Curvv) అనే కొత్త కారుతో బరిలోకి దిగుతోంది.

స్పోర్ట్స్ కార్‌ను తలపించే ఫోక్స్‌వ్యాగన్ కొత్త మోడల్.. డ్రైవింగ్ ఫీడ్‌బ్యాక్ ఇదే!

"GTI" అనే మూడు అక్షరాలు, హాట్ హ్యాచ్‌ల పట్ల మక్కువ కలిగిన ఆటోమొటివ్ ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ పేరుకు గుర్తుగా నిలిచిన కార్ అంటే ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్‌నే. ప్రపంచవ్యాప్తంగా డ్రైవింగ్‌ను ఆస్వాదించే వారికి ఇది ఒక విలక్షణమైన ఎంపిక. వీకెండ్ ట్రిప్స్ కోసం ఉత్సాహంగా నడిపే కారు కావాలి, కానీ అదే సమయంలో కుటుంబానికి సరిపడే హ్యాచ్‌బ్యాక్ కావాలి అన్నవారికి ఇది చాలా కాలంగా హిట్టయిన మోడల్. కానీ 2007లో ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ, గోల్ఫ్ మాత్రం ఎన్నడూ ఇండియాలోకి రాలేదు. దీని ప్రధాన కారణం, దీని ధర, పరిమాణం భారత మార్కెట్‌కి అనువుగా ఉండకపోవడమే. అందుకే అప్పట్లో మనకు గోల్ఫ్‌కి ప్రత్యామ్నాయంగా జెట్టా (అంటే సెడాన్ రూపంలో గోల్ఫ్‌) వచ్చింది.

టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ వస్తోంది.. మైలేజ్ చూసి మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్ ఏది ఎక్కువ ఇస్తుందని ఆరా తీస్తున్నారా ? అయితే TVS నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే మైలేజ్‌తో మార్కెట్‌ను పూర్తిగా మార్చేయడానికి టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ (TVS Jupiter 125 CNG) స్కూటర్ వస్తోంది.

ఎర్టిగా నుంచి కారెన్స్ క్లావిస్ వరకు.. 7 సీటర్ ఫ్యామిలీ కార్లు

ప్రస్తుత కుటుంబ ప్రయాణాలకు ప్రాముఖ్యత పెరిగింది. దీంతో 7 సీటర్ కలిగిన కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. . ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు మూడు వరుసల్లో కూర్చోనే వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇవి కేవలం ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలు కాదు. ఇవి కుటుంబ బంధాలను దగ్గర చేయే వేదికలు కూడా. అందరు కలిసి హాయిగా ఒకే కారులో ఆడుతూ, పాడుతూ సంతోషంగా ప్రయాణిస్తుంటే ఆ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. మార్కెట్లో ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ అధునాతన ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్ క్లావిస్ వంటి పెద్ద కార్లు కుటుంబాలకు బాగ అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి ఒకసారి కింది కథణంలో తెలుసుకుందాం.