95 కి.మీ. రేంజ్, స్టైలిష్ డిజైన్: సుజుకి ఇ-యాక్సెస్ వచ్చేసింది!

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే సుజుకి నుంచి ఒక అదిరిపోయే వార్త.. మార్కెట్‌లోకి రాకముందే అందరి దృష్టిని ఆకర్షించిన సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభమైంది. 95 కి.మీ. రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ స్కూటర్, ధర కూడా తెలిస్తే కచ్చితంగా కొనేస్తారు. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కుటుంబ ప్రయాణాల కలను నిజం చేసే మారుతీ సుజుకీ కొత్త కారు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) అతిపెద్ద కార్ల తయారీ దారుగా అవతరించింది. పోటీ పెరుగుతున్న కొద్ది కొత్త మోడళ్లను వరుసగా తీసుకొస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి సంస్థ ఒక కొత్త SUV‌ను తీసుకురానుంది. గతంలో ఇది గ్రాండ్ విటారా ఆధారంగా వచ్చే 7-సీటర్ వెర్షన్‌గా భావించబడినప్పటికీ, ఈ మోడల్ ఇప్పుడు ఒక సరికొత్త 5-సీట్ల మధ్యతరహా SUVగా రూపుదిద్దుకుంటోంది. ఇటీవలి మీడియా సమావేశంలో మారుతి సుజుకీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ స్వయంగా ఈ SUV ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాహనాన్ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు సంస్థ ఈ కొత్త మోడల్ పేరును అధికారికంగా వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం దీనిని 'Y17' అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు.

ఎక్సీకామ్ కొత్త EV ఛార్జర్: హార్మొనీ డైరెక్ట్ 2.0 వచ్చేసింది!

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) వాడుతున్నారా? లేక కొత్తగా EV కొనాలని చూస్తున్నారా? EV ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ సరిగా అవ్వట్లేదని, లేక స్పీడ్‌గా ఛార్జ్ కావట్లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.

గ్రామీణ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒబెన్ 'O100' ప్లాట్‌ఫామ్

బెంగళూరుకు చెందిన ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) భారతదేశంలోని వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా, ఈ సంస్థ కీలకమైన విభాగంలోకి అడుగుపెట్టి, సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రఖ్యాత పెట్రోల్ బైక్‌లైన హోండా షైన్, హీరో స్ప్లెండర్ లాంటి 100cc విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా "O100" అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. ఇది లక్ష రూపాయల లోపు ధరలో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయడానికి రూపొందించబడిన వినూత్న వేదిక. ఈ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందించబడ్డ బైక్‌లు, తక్కువ ఖర్చుతో నడిచే శక్తివంతమైన, నమ్మదగిన మోడళ్లుగా మార్కెట్‌లోకి రానున్నాయి.
Advertisement

Remuneration: ప్రభాస్‌తో రొమాన్స్‌కు త్రిప్తి డిమ్రీ.. యానిమల్ బ్యూటీకి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?


జెనీలియాకు తప్పిన ప్రమాదం.. ఆమెను కాపాడిన అద్భుతమైన కారు ఇదే

ఒకప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా గుర్తుందా? రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన తర్వాత తెలుగు సినీ ప్రపంచంలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంతకీ ఆ కారు ఏంటి? దాని ఫీచర్ల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు ప్రారంభం.. కస్టమర్లకు పండగే!

కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఓలా నుంచి వచ్చిన రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మరి ఈ బైక్ ధరలు, ఫీచర్లు, డెలివరీలకు సంబంధించిన తాజా వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

15 నిమిషాల్లో 620 కి.మీ.! షియోమి YU7 టెక్నాలజీకి టెస్లా కూడా షాక్!

చైనా‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (xiaomi) ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోన తన స్థానాన్ని బలపర్చుతోంది. సంస్థ తొలిసారి విడుదల చేసిన ఎలక్ట్రిక్ సెడాన్ SU7, అంచనాలకు మించి సక్సెస్ అయింది.. ఈ కారుకు మార్కెట్లో విశేష ఆదరణ లభించడంతో షియోమి దాదాపు 2.58 లక్షల కార్లను విక్రయించింది. ఇది సంస్థకు పెద్ద మైలురాయిగా నిలిచింది. తన కార్లకు మంచి డిమాండ్ ఉందని గమనించిన కంపెనీ తన వాహన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి YU7ని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUVను ప్రత్యేకంగా టెస్లా మోడల్ Yకి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినట్టు కంపెనీ చెబుతోంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. షియోమి మొబైల్ రంగంలో ఎలాంటి వినూత్నత చూపిందో, అదే స్థాయిలో ఆటోమొబైల్ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని ఈ కారుతో ప్రయత్నిస్తోంది.

CB750 హార్నెట్, CB1000 హార్నెట్ SP లాంచ్: బుకింగ్స్ ఓపెన్!

పవర్‌ఫుల్ బైక్‌లు కొనాలని చూస్తున్న వాళ్ల కోసం హోండా నుంచి సరికొత్త బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తమ ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. అవి CB750 హార్నెట్ (Hornet), CB1000 హార్నెట్ SP (Hornet SP). ఈ బైక్‌లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా అందిస్తాయి.

ఏప్రిల్‌లో MG హెక్టర్ SUVకి ఊహించని ఆదరణ

MG మోటార్ గత కొంతకాలంగా భారత మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు ధీటుగా బలమైన, అధునాతన కార్లను విడుదల చేస్తూ తన సేల్స్ పెంచుకోవడానికి చాలా కాలంగా కృషి చేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన అత్యంత ప్రసిద్ధ SUV మోడల్ అయిన హెక్టర్ (Hector) కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఏప్రిల్ 2025లో హెక్టర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇది విడుదలైనప్పటి నుంచి మార్కెట్లో మంచి స్పందనను రాబట్టినప్పటికీ, గత కొన్ని నెలలుగా దాని అమ్మకాల్లో కొంత తగ్గుదల నెలకొంది.

ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లతో ఎన్టీఆర్ లైఫ్ స్టైల్.. అదరగొడుతున్న 'యంగ్ టైగర్'!

సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఒకప్పుడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు, ఇప్పుడు ప్రైవేట్ జెట్‌తో పాటు కోట్లాది రూపాయల కార్లతో ఎలా జీవిస్తున్నాడు.

ఏప్రిల్‌లో సెలెరియో అమ్మకాలపై భారీ ప్రభావం.. 54% తగ్గుదల

మారుతీ సుజుకీకి (Maruti Suzuki) చెందిన ప్రసిద్ద సెలెరియో (Celerio) దేశంలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు బాగా ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్. ఇది ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మార్కెట్‌లో ఒత్తిడి ఎదుర్కొంటోంది. మారుతీ అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే సెలెరియో గతంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో స్థానం సంపాదించుకోగా ప్రస్తుతం మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాజాగా మారుతీ నుంచి వెల్లడైన సేల్స్ నివేదిక ప్రకారం, 2025 ఏప్రిల్ నెలలో సెలెరియో కేవలం 1,474 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయింది. ఇదే సమయంలో 2024లో 3,220 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది ఏకంగా 54.22 శాతం తగ్గుదలగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే అమ్మకాలు సగానికి పైగా తగ్గిపోవడం అంటే సాధారణ విషయం కాదు.
Advertisement

టాటా ఆల్ట్రోజ్ వర్సెస్ పోటీదారులు.. ఏది బెస్ట్?

కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా? టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఫేస్‌లిఫ్ట్, మారుతి బాలెనో (Maruti Baleno), టయోటా గ్లాంజా (Toyota Glanza), హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) వంటి కార్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్తను పూర్తిగా చదవండి. టాటా కంపెనీ ఇటీవల తమ ఆల్ట్రోజ్ కారుకు కొత్త అప్‌డేట్‌లు ఇచ్చి, మార్కెట్‌లోకి విడుదల చేసింది.

పవర్, టెక్నాలజీ, మైలేజ్ అన్నీ ఒక్కటే.. టయోటా RAV4 ఆవిష్కరణ

భారతీయ వాహన ప్రేమికుల మనసు దోచుకున్న తయారీదారుల్లో టయోటా (Toyota) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దీని బ్రాండ్ గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీతో కలసి పలు మోడళ్లను రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నా, "టయోటా" అనే పేరే ప్రజలను మళ్లీ మళ్లీ అదే వైపు మళ్లిస్తుంది. ఇక ఇప్పుడు, టయోటా మరో మారు ప్రపంచ మార్కెట్‌‌‌లో తన సత్తాను చూపించడానికి సిద్ధమైంది. కంపెనీ సరికొత్త తరం RAV4 SUVను ఇటీవల ఆవిష్కరించింది. బోల్డ్ డిజైన్, కట్ చేసిన లైన్లు, ఆకట్టుకునే హెడ్‌లైట్లు ఇవన్నీ కలసి ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా SUV అభిమానుల మనసులు గెలుచుకున్న మోడల్‌‌లో టయోటా RAV4 ఒకటి. చాలామంది దీనిని "మినీ ఫార్చ్యూనర్" అని పిలుస్తుంటారు.

23 ఏళ్లయినా తగ్గేదేలే: మహీంద్రా స్కార్పియో మార్కెట్ దుమ్ము రేపుతోంది!

SUV కారు కొనాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్‌లో ఏ SUVకి మంచి డిమాండ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? దాదాపు 23 ఏళ్లుగా మార్కెట్‌లో ఉన్నా, ఇప్పటికీ మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) కారుకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మిడ్-సైజ్ SUVసెగ్మెంట్‌లో మహీంద్రా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ స్కార్పియో, XUV700, XEV 9eలాంటి కార్లు మార్కెట్‌లో ఎలా దూసుకుపోతున్నాయో, ఇతర కంపెనీలకు ఎలా గట్టి పోటీ ఇస్తున్నాయో తెలుసుకుందాం.

కియా కారెన్స్ క్లావిస్ భారత మార్కెట్లో లాంచ్.. ప్రారంభ ధర రూ.11.49 లక్షలు

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు బలమైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. కస్టమర్లు కోరుకునే విధంగా అన్ని ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్స్‌తో అమ్మకాల పరంగా ఆశించిన మేరకు లక్ష్యాన్ని సాధిస్తుంది. కుటుంబ ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం గతంలో కారెన్స్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ కారుగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా కారెన్స్ క్లావిస్ (carens clavis) మోడల్‌ను దేశీయ మార్కెట్లో కియా ఇప్పుడు విడుదల చేసింది. రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త MPV, కేవలం ఫ్యామిలీకి మాత్రమే కాకుండా, వినియోగదారుల అవసరాలను అందుబాటులోనే తీర్చే బెస్ట్ ఎంపికగా నిలుస్తోంది.

టాటా, మారుతిలకు షాక్ ఇవ్వనున్న రెనాల్ట్: కొత్త కైగర్ రెడీ!

తక్కువ ధరలో మంచి ఎస్యూవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా ? టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా లాంటి కార్లతో పోటీ పడే ఓ కొత్త కారు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అదే రెనాల్ట్ కంపెనీ నుంచి వచ్చిన రెనాల్ట్ కైగర్(Renault Kiger). ఈ కారు ప్రస్తుతం తక్కువ ధరలో లభిస్తున్న SUV. ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ SUV కాబట్టి దీని ధర కూడా తక్కువగా నిర్ణయించింది కంపెనీ.

ఈ బైక్ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తుంది.. హోండా CB350పై అదిరిపోయే డిస్కౌంట్

దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన ప్రసిద్ధ మోడల్ హైనెస్ CB350‌ బైకును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. మిడ్-కెపాసిటీ సెగ్మెంట్‌లో తన మార్క్‌ను వేసేందుకు హోండా రూపొందించిన ఈ బైక్‌పై ఈ నెలలో రూ. 15,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్యాష్ డిస్కౌంట్లు, ఫైనాన్స్ సబ్సిడీలు లేదా యాక్సెసరీస్ ఉండవచ్చు. CB350 బైక్‌ రాయల్ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ లాంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. భారతీయ రైడర్ల అభిరుచులను పరిగణలోకి తీసుకుని తయారైంది. ఇటీవల టూవీలర్ సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో మరింత ఎక్కువ కస్టమర్లను ఆకర్షించేందుకు హోండా కంపెనీ తన CB350పై ఈ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది.

నిస్సాన్ మైక్రా ఈవీ వచ్చేసింది.. 408 కి.మీ. రేంజ్‌తో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్!

నిస్సాన్ మాగ్నైట్ లాంటి కారుతో మార్కెట్‌లో దూసుకుపోతున్న నిస్సాన్, ఇప్పుడు తన పాపులర్ మైక్రా మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొస్తోంది. పేరు చెబితేనే చాలా మందికి ఇష్టమైన మైక్రా, ఇప్పుడు 408 కిలోమీటర్ల రేంజ్‌తో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. ఇది భారతదేశానికి వస్తే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పెద్ద మార్పు రావడం ఖాయం. ఈ కొత్త నిస్సాన్ మైక్రా ఈవీ ప్రత్యేకతలు, ఫీచర్లు, ఇండియాకు వచ్చే అవకాశం గురించి తెలుసుకుందాం.

ప్రీమియం 6 సీటర్ కార్లలో మళ్లీ దూసుకెళ్తున్న XL6.. ఏప్రిల్ అమ్మకాల్లో వృద్ధి

భారతీయ కార్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఎంపీవీ మోడల్స్‌లో మారుతీ సుజుకీ ఎర్టిగా అంటే చాలా మందికి తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది మంచి పనితీరు, కుటుంబానికి అనువైన సౌకర్యాలతో ప్రజాధారణ పొందుతుంది. అయితే, ఎర్టిగా తరహాలోనే ఇంకొంచెం ఎక్కువ ఫీచర్లు, స్టైల్, ప్రీమియం అనుభూతి కోరుకునే వారికోసం మారుతీ సుజుకీ XL6 (ఎక్స్‌ఎల్6) అనే వేరియంట్ ప్రత్యేకంగా వచ్చింది. పేరు చెప్పినట్లుగానే, ఈ MPVలో ఆరు మందికి అనువైన సీటింగ్ ఉంటుంది, దీనివల్ల ఇది చిన్న కుటుంబాలతో పాటు పెద్ద కుటుంబం గల వారికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఎర్టిగాను సాధారణంగా అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తుండగా, XL6ను మాత్రం ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేకంగా 'నెక్సా' షోరూమ్‌లలో అందుబాటులో ఉంచారు.
Advertisement

టెస్లా లాంటి కారు భారత్‌లో.. డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో మైనస్ జీరో సంచలనం!

డ్రైవర్‌లెస్ కార్ల గురించి విన్నారా? టెస్లా కార్ల లాగే మన దేశంలో కూడా డ్రైవర్ లేకుండా నడిచే కారు వస్తే ఎలా ఉంటుంది? అలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేసింది. బెంగళూరుకు చెందిన మైనస్ జీరో (Minus Zero) అనే కంపెనీ, మన దేశానికి తగ్గట్టుగా ఒక కొత్త డ్రైవర్‌లెస్ సిస్టమ్‌ను తయారు చేసింది.

అందరికీ నచ్చిన టయోటా గ్లాంజా అమ్మకాల్లో తగ్గుదల

ఏప్రిల్ ముగిసిన తరువాత వాహన తయారీ కంపెనీలు వరుసగా తమ మోడళ్ల వారీగా అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ టయోటా తాజాగా తన ప్రసిద్ద మోడల్ గ్లాంజా‌కు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. మారుతీ సుజుకీ బాలెనో ఆధారంగా రూపొందించబడిన ఈ మోడల్, టయోటా బ్రాండ్‌కు కీలకమైంది. అధునాతన టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, అందుబాటు ధర కారణంగా గ్లాంజా మార్కెట్లో ప్రారంభదశలో మంచి స్పందన అందుకుంది. అయితే, ఈ మోడల్ అమ్మకాల పరంగా కొంత వెనుకడుగు వేస్తోంది. ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం, 2025 ఏప్రిల్‌లో టయోటా కంపెనీ 4,132 గ్లాంజా (glanza) మోడళ్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల.

MG విండ్సర్ ఎలక్ట్రిక్ కారుకు కొత్త వేరియంట్ విడుదల

ఎంజీ మోటార్స్‌కు చెందినటువంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ (Windsor) భారతీయ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. శక్తివంతమైన పనితీరు, స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ధర వంటి అంశాల ద్వారా ఈ కార్ చాలా మంది వినియోగదారుల మనసు దోచుకుంది. దీంతో దీనిని మరింత విస్తరించేందుకు MG మోటార్స్ తాజాగా విండ్సర్ ప్రో EV ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది సాధారణ విండ్సర్ EV కంటే కొంచెం అధిక ధరకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. అందులోని అదనపు ఫీచర్లు, రేంజ్, ప్రీమియం అనుభూతి దాన్ని మరింత విలువైన కార్‌గా మార్చాయి. ఈ కార్ ప్రారంభ సమయంలో ధర రూ.17.49 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ఆఫర్ కేవలం మొదటి 8,000 కస్టమర్లకు మాత్రమే వర్తించగా, ఆ సంఖ్య దాటిన వెంటనే దాని ధరను రూ.18.09 లక్షలకు పెంచారు.

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది: బేస్ మోడల్ రూ. 6.89 లక్షలకే!

మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మారుతి సుజుకి బాలెనో లాంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలని అనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. టాటా మోటార్స్ తన పాపులర్ ఆల్ట్రోజ్ కారుకు కొత్త అప్‌డేట్‌లు ఇచ్చి, ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పాత మోడల్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్ది, సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు.

భారతీయ రోడ్ల కోసం స్వదేశీ EV.. ఓబెన్ ఎలక్ట్రిక్ సంచలన ప్రకటన!

తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా ? అయితే మీకో శుభవార్త. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తమ రెండో స్వదేశీ ప్లాట్‌ఫామ్ 'O100'ను ప్రకటించింది.