భారత మార్కెట్లోకి హోండా కొత్త X-ADV స్కూటర్ విడుదల

ప్రముఖ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) భారత మార్కెట్లో తన పట్టును కోల్పోకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా కొత్త మ్యాక్సీ స్కూటర్ X-ADV ను విడుదల చేసింది. ఇది కేవలం ఓ స్కూటర్ మాత్రమే కాదు, ఇది అడ్వెంచర్ బైక్‌కి ఒక కొత్త రూపం. ఈ మోడల్ కోసం టూవీలర్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు దీన్ని అధికారికంగా తీసుకొచ్చింది. హోండా ఈ మోడల్‌ను రూపొందించిన విధానం, దాని లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది, ఒకవైపు అడ్వెంచర్ విభాగంపై దృష్టి సాధిస్తూనే రోజు అవసరాలను కూడా తీర్చుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేసింది.

కొత్తగా బైక్ నేర్చుకున్నారా? టీవీఎస్ రోనిన్, బుల్లెట్ 350, పల్సర్ N160 బెస్ట్ ఆప్షన్స్!

మీరు కాలేజీ మెట్లు ఎక్కబోతున్నారా? కొత్త బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఏ బైక్ కొనాలి, అది స్టైలిష్‌గా ఉండాలి బడ్జెట్లో ఉండాలని ఆలోచిస్తున్నారా ? కొత్తగా బైక్ నడపడం నేర్చుకున్న వారికి లేదా కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సరైన బైక్‌ను ఎంచుకోవడం పెద్ద టాస్క్.

టయోటా నిస్సాన్‎తో పొత్తు.. త్వరలో మార్కెట్లోకి టయోటా మాగ్నైట్

టాటా, మహీంద్రా లాంటి దేశీయ కంపెనీలతో పాటు జపనీస్ కార్ల తయారీ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టయోటా(Toyota) రీబ్యాడ్జింగ్ వ్యూహంతో దూసుకుపోతోంది. మారుతి సుజుకి మోడళ్లను టయోటా బ్రాండ్‌తో విడుదల చేసి మంచి విజయాలు సాధించింది. ఇప్పుడు టయోటా కన్ను నిస్సాన్(Nissan) కంపెనీ మీద పడింది. ముఖ్యంగా నిస్సాన్ మాగ్నైట్(Nissan Magnite) టయోటా కుటుంబంలోకి రానుందని పుకార్లు షికారు చేస్తున్నాయి.

భారతంలో కాంపాక్ట్ SUV అమ్మకాల్లో ఎవరిది అగ్రస్థానం?

భారతదేశంలో SUVల పట్ల ప్రజల్లో ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో SUVలను కొనుగోలు చేసే వారిలో పెరుగుదల కనిపించింది. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి, ఇవి సాధారణ సెడాన్‌లు లేదా హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే రోడ్డుపై అధిక స్థితిని కలిగి ఉంటాయి. దాంతో పాటు, డ్రైవింగ్ సమయంలో మంచి వీక్షణ కూడా లభిస్తుంది. SUVల విభాగంలో అనేక తరహాలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో కాంపాక్ట్ SUVల డిమాండ్ ప్రత్యేకంగా ఉంది. సాధారణంగా 4.2 మీటర్ల నుండి 4.4 మీటర్ల పొడవు కలిగిన కారు మోడళ్లను కాంపాక్ట్ SUVలుగా వర్గీకరిస్తారు.
Advertisement

500 కి.మీ రేంజ్, ఫుల్ లగ్జరీ.. టాటా కొత్త సియెరా అంచనాలు!

టాటా మోటార్స్ నుంచి మరో పెద్ద అడుగు పడబోతోంది. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా, సంస్థ సరికొత్త 'టాటా సియెరా' ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆకట్టుకునే డిజైన్, లగ్జరీ ఫీచర్లుతో రానున్న ఈ కారు ముందుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వచ్చి, ఆ తర్వాత పెట్రోల్/డీజిల్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ కారు ధర, ఫీచర్లు, లాంచ్ తేదీ వివరాల గురించి తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన మహీంద్రా బొలెరో, బొలెరో నియో బోల్డ్ ఎడిషన్లు

భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (Mahindra And Mahindra) ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆశ్చర్యపరచడంలో ముందుంటుంది. తాజాగా కంపెనీ తమ రెండు ప్రజాదరణ పొందిన SUV మోడళ్లైన బొలెరో, బొలెరో నియోలకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చి 'బోల్డ్ ఎడిషన్ (Bold Edition)' పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్లు మామూలు మోడళ్లతో పోల్చితే లుక్స్ పరంగా మరింత ఆకర్షణీయంగా, గ్లామర్‌తో నిండినవిగా కనిపిస్తున్నాయి. బ్లాక్ ట్రీట్‌మెంట్, స్టైలిష్ డెకల్స్, బాడీ కలర్ గార్డ్స్ వంటి ఫీచర్లు SUV రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. వీటి లుక్స్ చూస్తే ఒక రేంజ్ ఉంది అనిపిస్తుంది. ఇవి ఇప్పటికే మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న వెర్షన్లతో పోలిస్తే సుమారుగా రూ. 40,000 ఎక్కువ ధరకు లభిస్తాయి.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI: లాంచ్‌కు ముందే 150 కార్లు బుక్.. దీని స్పెషల్ ఏంటి?

వోక్స్‌వ్యాగన్ ఇండియా మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతుంది. మే 26, 2025న తమ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్ వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని లాంచ్ చేయబోతోంది. భారతదేశంలో తమ ప్రొడక్ట్ లైనప్‌ను పెంచుకోవడానికి వోక్స్‌వ్యాగన్ ఎంత కట్టుబడి ఉందో ఈ లాంచ్‌తో స్పష్టమవుతోంది.

రెనాల్ట్ కార్లకు రిలీఫ్ ఇచ్చే సమ్మర్ క్యాంప్ మొదలైంది!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో, వాహన యజములు తమ కార్లకు తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో, భారతదేశంలో ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ అయిన రెనాల్ట్, తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దేశవ్యాప్తంగా వేసవి శిబిరాన్ని ప్రారంభించింది. మే 19 నుండి మే 25, 2025 వరకు ఈ ప్రత్యేక సర్వీస్ క్యాంప్ దేశంలోని అన్ని రెనాల్ట్ అథారైజ్డ్ సర్వీస్ సెంటర్లలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెనాల్ట్‌కు 580 టచ్‌పాయింట్లు ఉండటం వల్ల, ప్రతి వినియోగదారుడికి ఈ క్యాంప్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా రెనాల్ట్ కస్టమర్లు తమ వాహనాలను పూర్తిగా చెక్ చేయించుకోవచ్చు.

జూలై 2025 లో రెండు కొత్త విడా ఈ-స్కూటర్లు.. మార్కెట్ లో సంచలనం!

భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ రసవత్తరంగా మారుతోంది! ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి కంపెనీలు తమదైన ముద్ర వేస్తుండగా, ఇప్పుడు హీరో మోటోకార్ప్ కూడా దూకుడు పెంచింది. తక్కువ ధరలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించి, మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ కొత్త స్కూటర్లు ఎలా ఉండబోతున్నాయి? పోటీదారులకు ఎంతవరకు సవాల్ విసురుతాయి? తెలుసుకుందాం.

దక్షిణ భారతంలో టయోటా కార్లకు వేసవి బంపర్ ఆఫర్లు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) భారత ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. టయోటా వాహనాన్ని ఒకసారి ఉపయోగించిన వినియోగదారు, మళ్లీ మరొక బ్రాండ్‌ వైపు చూడడంలేదు అన్నదే సాధారణంగా వినిపించే అభిప్రాయం. ఇప్పుడు, టయోటా తమ కస్టమర్లను మరోసారి ఆకట్టుకునేలా, వేసవి కాలానికి అనుగుణంగా ఓ ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మెగా సమ్మర్ సెలబ్రేషన్ పేరిట టయోటా కిర్లోస్కర్ మోటార్ దక్షిణ భారతదేశంలోని అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం టయోటా కార్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మే, జూన్ 2025లో ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లు, డిస్కౌంట్లు అందించబోతున్నారు.

చిన్నారుల ప్రాణాలు తీసిన కారు: ద్వారపూడిలో జరిగిన హృదయ విదారక ఘటన

చిన్నారి పిల్లల ఆటవిడుపు విషాదంగా మారింది. ఆంధ్రాప్రదేశ్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆడుకుంటూ కారులోపల చిక్కుకున్న నలుగురు చిన్నారి పిల్లలు ఊపిరాడక చనిపోవడం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటనకు కారణాలేంటి? తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? వివరంగా తెలుసుకుందాం.

ఫార్చ్యూనర్ ఏప్రిల్‌లో మరింత దూకుడు.. 25% పెరిగిన అమ్మకాలు

టయోటా కంపెనీ అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రసిద్ధ వాహన తయారీ కంపెనీగా తన స్థానాన్ని ఇటీవలి కాలంలో మరింత బలపరుచుకుంది. ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో తయారీదారులంతా తమ సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టయోటా కూడా తన ప్రసిద్ధ మోడల్ ఫార్చ్యూనర్ (fortuner)కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఫార్చ్యూనర్ భారత మార్కెట్లో తన స్థిరమైన స్థానాన్ని మరింత బలపరిచింది. ఒక పూర్తి SUVగా, ఇది కేవలం వాహనం మాత్రమే కాకుండా దాని దృఢమైన డిజైన్, హై-ఎండ్ ఫీచర్లు,రోడ్డుపై ప్రభావాన్ని చూపే డిజైన్‌తో ఇది అనేక మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అందుకే చాలామంది, ఈ వాహనాన్ని ఒక లగ్జరీ ఎలివేషన్‌గా కూడా పరిగణిస్తున్నారు. ఇటీవల విడుదలైన టయోటా కార్ల విక్రయ గణాంకాల్లో ఫార్చ్యూనర్ ప్రదర్శన మరింత స్పష్టంగా కనిపించింది.
Advertisement

ఎంజీ సంచలనం.. ఒక్కరోజే 150 విండ్‌సర్ ఈవీ ప్రో కార్ల డెలివరీ!

ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎంజీ మోటార్స్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు విండ్‌సర్ ఈవీ ప్రోను విడుదల చేసింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేకాదు, దీని ధర కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. విడుదలైన వెంటనే ఈ కారుకు భారీ స్పందన లభించింది. ఏకంగా ఒక్క రోజులోనే 150కార్లను డెలివరీ చేసి ఎంజీ తన సత్తా చాటింది.

పవర్‌ఫుల్ SUV అయినా మట్టిలో చిక్కుకుంది.. చివరికి ట్రాక్టర్ వచ్చి కాపాడింది

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) 2024 చివరలో అత్యంత ప్రజాదరణ పొందిన SUV మోడల్ అయిన థార్‌కు కొత్త రూపాన్ని తీసుకొచ్చింది, అదే థార్ రాక్స్ (Thar roxx). ఇది ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 3-డోర్ల థార్ మోడల్‌కు కొనసాగింపుగా 5-డోర్ల వెర్షన్‌‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. మాములుగానే 3 డోర్ థార్ మార్కెట్లోకి విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఎంతో ఆదరణ సంపాదించింది. అయితే కుటుంబ ప్రయాణాలకు ఇది అనుకూలంగా లేకపోవడంతో కంపెనీ వెంటనే రాక్స్‌ను తీసుకురాగా, ఇది విజయవంతంగా అమ్మకాలను సాధిస్తుంది. ఇప్పటికే ఈ కారును చాలా మంది వాడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కారుకు సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది.

ధర తక్కువైనా పట్టించుకోలేదు.. కానీ ఏప్రిల్‌లో ఈ మారుతి SUV హాట్ కేక్!

ఒకప్పుడు అంతగా డిమాండ్ లేని ఒక మారుతి SUV ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తక్కువ ధర, మంచి ఫీచర్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోని ఈ కారుకు ఏప్రిల్ నెలలో మాత్రం ఊహించని స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇంతకీ ఆ కారు ఏంటి? దానికి ఒక్కసారిగా ఎందుకంత డిమాండ్ పెరిగింది? ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

మోస్ట్ పాపులర్ ఐ20 కారులో కొత్త వేరియంట్ వచ్చేసింది

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన హ్యాచ్‌బ్యాక్ లైనప్‌‌ను మరింత విస్తరించడానికి సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రసిద్ధ మోడల్ హ్యుందాయ్ i20కి కొనసాగింపుగా మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇది చాలా అధునాతనమైనది, బడ్జెట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉంది. దీని ధర వచ్చేసి ఎక్స్-షోరూమ్ రూ. 7.51 లక్షలకు న్యూఢిల్లీలో లభిస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్ అయిన 'స్పోర్ట్జ్'తో పోల్చితే, ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ కొన్ని అదనపు ఫీచర్లతో వస్తోంది, ప్రత్యేకంగా ధర పరంగా మరింత సౌకర్యవంతంగా ఉండడం దీని ప్రత్యేకత.

స్కార్పియో, థార్‌కు తిరుగులేదు! మహీంద్రా టాప్ సెల్లర్స్ ఇవే!

మహీంద్రా కార్ల గురించి ఈ మధ్య కాలంలో వింటున్నట్లు అయితే.. అమ్మకాల పరంగా ఈ కంపెనీ కొద్ది నెలల్లోనే ఊహించని స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు నాలుగో స్థానంలో ఉండే మహీంద్రా ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి దూసుకుపోయింది. ఇంత సడెన్‌గా ఏం జరిగింది? ఏ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి? మహీంద్రా ఓనర్లు ఎందుకు గర్వంగా ఫీలవుతున్నారో ఈ వార్తలో తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన హోండా రెబెల్ 500.. ధర, డిజైన్, ఫీచర్లు ఇవే!

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తన ప్రీమియం బైకుల విభాగంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త బైకును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేరు 'రెబల్ 500 (Rebel 500)'. క్లాసిక్ బాబర్ స్టైల్ డిజైన్‌తో వస్తున్న ఈ మిడ్-సైజ్ క్రూయిజర్ బైక్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌తో పాటు కొత్త కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది. డిజైన్ పరంగా ఒక ప్రత్యేకమైన రూపంతో అందరిని కట్టిపడేసేలా ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌ను గురుగ్రామ్, ముంబై మరియు బెంగళూరులో కొనుగోలు చేయొచ్చు. ఇది హోండా ప్రీమియం డీలర్ నెట్‌వర్క్ అయిన బిగ్ వింగ్ టాప్‌లైన్ (BigWing Topline) అవుట్‌లెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ బైక్‌ను గురుగ్రామ్, ముంబై మరియు బెంగళూరులో కొనుగోలు చేయొచ్చు.

యూకే కార్లు కొనాలనుకునే వారికి శుభవార్త! రేంజ్ రోవర్ స్పోర్ట్ ఇకపై 80 లక్షలకేనా?

భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఖరారైంది. ఈ ఒప్పందం వల్ల యూకేలో తయారైన కార్ల ధరలు భారతదేశంలో గణనీయంగా తగ్గనున్నాయి. ఇది బ్రిటిష్ కార్ల తయారీదారులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. భారతీయ వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లో లగ్జరీ కార్లను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

వింటేజ్‌కి న్యాయం చేస్తూ పద్మిని మళ్ళీ మెరిసింది

కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఆటోమొబైల్ ప్రపంచంలో ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్ కలిగిన కార్లు మార్కెట్లో రోడ్లపై హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి టైంలో కూడా పాత జ్ఞాపకాల లాంటి వింటేజ్ కార్లకు మాత్రం ఇప్పటికీ చాలా మందిలో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త కొత్త డిజైన్లు, ఫీచర్లు వచ్చినా, కొన్ని వాహనాలు మాత్రం కాలాన్ని మించిన క్లాసిక్స్‌గా మిగిలిపోతాయి. అలాంటి కార్లలో ప్రతి భారతీయుడికి గుర్తొచ్చే పేర్లు, హిందూస్థాన్ అంబాసిడర్, మారుతి 800, ఫియట్ పద్మిని. ఈ మూడింటిలోనూ ఫియట్ పద్మినికి ఒక ప్రత్యేకం. ఆకట్టుకునే డిజైన్, పనితీరు పరంగా అప్పటి కాలం కారు లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న మోడల్. వాస్తవానికి, ఈ కార్ మొదట ఫియట్ 1100 డిలైట్ అనే పేరుతో భారతీయ రోడ్లపైకి వచ్చింది.
Advertisement

ఎంజీ, మహీంద్రాకు పోటీగా టాటా హారియర్ ఈవీ

అమ్మకాల పరంగానే కాదు, వేర్వేరు ధరల శ్రేణుల్లో అనేక రకాల మోడళ్లను విడుదల చేస్తూ టాటా మోటార్స్ భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మోడల్ అయిన విండ్‌సర్‌తో ఎంజీ టాటాను వణికిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలతో మహీంద్రా కూడా ఎదుగుతోంది. ఈ పరిస్థితుల్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేసి ఎంజీని, మహీంద్రాను అధిగమించాలని టాటా ప్రయత్నిస్తోంది.

మార్కెట్లో ఎక్స్‌టర్‌కు బ్రేక్ పడిందా? 30 శాతం అమ్మకాల తగ్గుదల!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియాలో కూడా తన హవాను చూపిస్తుంది. పెరుగుతున్న పోటీ మార్కెట్లో కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి గతంలో ఎక్స్‌టర్ కారును తీసుకొచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఏప్రిల్ 2025లో కేవలం 5,416 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో (ఏప్రిల్ 2024) నమోదైన 7,756 యూనిట్లతో పోల్చితే దాదాపు 30 శాతం తగ్గుదల అంటే ఏడాది వ్యవధిలోనే ఈ మోడల్ భారీగా నష్టాన్ని చవిచూసింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, అది తక్కువ బడ్జెట్‌లో సరైన SUV అనిపించి వినియోగదారులను ఆకర్షించింది. ముఖ్యంగా టాటా పంచ్‌ను దీటుగా ఎదుర్కొంటుందనే అంచనాలు కూడా మొదట్లో చాలానే కనిపించాయి.

ఎక్కువ డబ్బు పెట్టినా ఈ కారే ఎందుకు కొంటున్నారు? అప్‌డేటెడ్ ఆల్ట్రోజ్‌లోని అదనపు ఫీచర్లు!

ఇటీవల టాటా తమ అప్‌డేట్ చేసిన ఆల్ట్రోజ్‌ని రిలీజ్ చేసింది. ఈ కారు దాని అద్భుతమైన స్టైలింగ్, మునుపటి మోడల్ కంటే కూడా అధునాతనమైన ఇంటీరియర్‌తో హ్యాచ్‌బ్యాక్ లవర్స్‎ను ఆకర్షిస్తోంది. టాటా హ్యాచ్‌బ్యాక్ సిరీసులో ఎంట్రీ-లెవెల్ టియాగో కంటే పైన ఉన్న ఆల్ట్రోజ్, అదనపు సౌకర్యం, సేఫ్టీ మెరుగుదలలతో కూడిన ప్రీమియం ఆప్షన్‎గా నిలుస్తోంది.

పెట్రోల్ కూడా సేవ్ చేస్తుంది.. లుక్ కూడా కిల్లర్! కొత్త అవెనిస్ వచ్చేసింది

భారతీయ మార్కెట్లోకి ఇటీవల కొత్త స్కూటర్ విడుదల అయింది. దేశంలో టూవీలర్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకుని ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించడానికి ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకి (SUZUKI) 2025లో మళ్లీ ఒకసారి యువతను ఆకట్టుకునేలా స్టైల్‌, మైలేజీ అందించే అవెనిస్ స్కూటర్ (avenis scooter) లాంచ్ అయింది. ఈ స్కూటర్‌ను మే 17, 2025న రూ. 91,400 (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేశారు. ఇది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతికంగా కూడా బలంగా రూపుదిద్దుకుంది. ఈ కొత్త అవెనిస్‌ స్కూటర్‌లోని ప్రధాన అప్‌డేట్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్‌లో తీసుకువచ్చిన మార్పులే. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజిన్ పనితీరు మెరుగుపరిచారు. దీని ద్వారా తక్కువ స్థాయిలో కాలుష్యం విడుదల అవుతుంది.

మైలేజ్‌లో నెంబర్ వన్..సేఫ్టీలోనూ సూపర్..అయినా ఈ కారును కొనేవారే లేరు

భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. మారుతి సుజుకి కార్లు మంచి మైలేజ్ ఇవ్వడం, ఎక్కువ సంఖ్యలో సర్వీస్ సెంటర్లు ఉండడం ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు కార్ల ధర తక్కువగా ఉండడం కూడా దాని మొదటి స్థానానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే మారుతి సుజుకికి చెందిన కొన్ని తక్కువ ధర కార్లు అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయి.