హ్యుందాయ్ కస్టమర్ల కోసం సూపర్ యాప్.. అన్ని సేవలు ఒకే చోట!

ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హ్యుందాయ్ కంపెనీ తన కస్టమర్ల కోసం తీసుకొచ్చిన 'మైహ్యుందాయ్' (myHyundai) అప్లికేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్ ఇప్పుడు ఏకంగా 2.6 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ వినియోగదారులకు ఇది ఒక డిజిటల్ ఫ్రెండ్‌లా పనిచేస్తుంది.

క్రమంగా పడిపోతున్న టాటా సఫారీ అమ్మకాలు

టాటా సఫారీ (tata safari) అనే పేరు చాలాకాలంగా భారతీయ SUV ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సేఫ్టీ అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పచుకుంది. కానీ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మాత్రం ఈ కారుకు ఎదురుదెబ్బ తగలినట్టు తెలుస్తోంది. మారుతున్న ప్రజల అభిరుచుల కారణంగా రోజు రోజుకు విక్రయాల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ సఫారీకి సంబంధించిన అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఏప్రిల్ (2025) నెలలో టాటా కంపెనీ సఫారీ మోడల్ కేవలం 1,340 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇదే కాలంలో అంటే 2024 ఏప్రిల్‌లో ఈ కారుకు 1,716 యూనిట్ల అమ్మకాలు నమోదు కావడం జరిగింది.

షాకింగ్! రూ.4000 పెట్రోల్‌తో 1000 కి.మీ ప్రయాణమా? ఈ కారుతో సాధ్యమే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. కార్ల తయారీదారులు ఈ వాహనాల రేంజ్‌ను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో హోండా సిటీ హైబ్రిడ్ (హోండా సిటీ ఈహెచ్ఈవీ) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారులా పనిచేస్తూ, అవసరమైనప్పుడు పెట్రోల్‌కు మారుతుంది. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇది ఒక ఫుల్ ట్యాంక్‌తో 1000 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

భారతదేశంలో తయారైన ఫ్రాంక్స్.. జపాన్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో దుమ్మురేపింది!

మారుతీ సుజుకీ రూపొందించిన ఫ్రాంక్స్ (Fronx) కారు ఇప్పుడు కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటుతోంది. ఓ ప్రముఖ SUVగా అవతరించిన ఈ ఫ్రాంక్స్ కారు, బలమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. భారతదేశంలో ఇప్పటికే ఈ కారు వందల సంఖ్యలో అమ్ముడవుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే SUVని సుజుకి మోటార్ కార్పొరేషన్ మారుతీ సుజుకీ మాతృసంస్థ ఇప్పుడు జపాన్ మార్కెట్లో కూడా ఈ కారును విక్రయిస్తోంది. అక్కడ కూడా ఈ కారు మంచి ఆదరణ పొందుతూ పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇది కేవలం అమ్మకాలు మాత్రమే కాదు, ఫ్రాంక్స్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా అద్బుతమైన కారుగా నిలిచింది.
Advertisement

క్కువ ధర ఎలక్ట్రిక్ కారుకి షాకింగ్ న్యూస్! ఎంజీ కామెట్ ధర పెరిగింది!

సిటీల్లో తిరగడానికి ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత మహిళలు కూడా ఈ చిట్టి కారుకు అభిమానులుగా మారారు. దీని ప్రధాన బలం ఏమిటంటే ఇది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది.

మహీంద్రా నుంచి బొలెరో బోల్డ్ ఎడిషన్.. కొత్త డిజైన్ అదిరిపోయింది!

మహీంద్రా కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ బొలెరో దేశంలో చాలా కాలంగా అమ్మకానికి ఉంది. 2000వ సంవత్సరంలో మార్కెట్‌లో అడుగుపెట్టి, రెండు దశాబ్దాలకుపైగా భారతీయుల మదిలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మహీంద్రా వాహనం, నిజంగా ఒక లెజెండ్ అని చెప్పాలి. పట్టణాల్లో తక్కువగా కనిపించినా, గ్రామీణ భారత్‌లో ఇది ఒక సంచలనం. పొలాలు, పల్లెలు, ఎత్తైన ప్రాంతాలు, లోతైన దారులు,, ఎక్కడైనా కూడా రయ్ మంటూ దూసుకుపోయే పనితీరుతో బొలెరో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. గంభీరమైన డిజైన్, మెరుస్తున్న మెటల్ బాడీ, శక్తివంతమైన ఇంజిన్ కలిగిన బొలెరో వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మల్టీ పర్పస్ వాహనంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, దీని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.

బాలెనో కంటే 10 అడుగులు ముందున్న టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్

2025లో రిలీజ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్, మారుతి బాలెనో వంటి పోటీదారుల నుంచి తనను ప్రత్యేకంగా నిలబెట్టే అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌లతో వస్తోంది. స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీలో మార్పులతో, అప్‌డేట్ చేయబడిన ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త స్టాండ్డర్స్ నెలకొల్పడానికి రెడీగా ఉంది. ముఖ్యంగా బాలెనోలో లేని పది ప్రత్యేకమైన ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఇది మార్కెట్‌లో దాని స్థానాన్ని మరింత బలపరుస్తుంది.

ఔరా అనిపించేలా టయోటా కొత్త కారు.. అదిరిపోతున్న కరోల్లా క్రాస్ ఫేస్‌లిఫ్ట్

టయోటా బ్రాండ్ గురించి తెలియని వారు ఉండరు. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖమైన కార్లను విడుదల చేస్తూ మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ఆకట్టుకునే డిజైన్, క్లాస్-లీడింగ్ టెక్నాలజీ, మంచి పనితీరు కలిగిన వాహనాలను విడుదల చేయడంలో టయోటా బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. కంపెనీ తన విలువను పెంచుకోవడానికి టయోటా తాజాగా యూరోపియన్ మార్కెట్‌ కోసం తన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV కరోల్లా క్రాస్ (corolla cross) ను 2025 ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం చేసింది. అయితే ఇది భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో లేదు. మన మార్కెట్లో లాంచ్‌పై కంపెనీ నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త కరోల్లా క్రాస్ 2025 ఫేస్‌లిఫ్ట్ తన రూపాన్ని పూర్తిగా కొత్తగా సంతరించుకుంది.

తక్కువ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు,, హోండాకు మంచి ప్రత్యామ్నాయాలు!

హోండా యాక్టివా ఒకప్పుడు మిడిల్ క్లాస్ ప్రజల ఆల్ టైం ఫేవరెట్ స్కూటర్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. హోండా కూడా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఈ'ని ఇటీవల విడుదల చేసింది. దీని ధర రూ. 1.17లక్షల నుంచి రూ. 1.52లక్షల వరకు ఉంది. ఇది 1.5కిలోవాట్ బ్యాటరీతో ఒక ఛార్జ్‌పై 102కి.మీ రేంజ్ ఇస్తుంది. TFTడిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వచ్చింది.. చూసింది.. కానీ ఇంకా గెలవలేకపోయింది.. సిట్రోయెన్ సేల్స్ ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సుదీర్ఘకాలంగా స్థిరపడే ఆశతో అడుగుపెట్టిన ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం సిట్రోయెన్ (citroen) చాలా కాలంగా అమ్మకాల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం భారత వాహన మార్కెట్ ఎంతో ఆశాజకంగా ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారుల నుంచి బలమైన పోటీ కారణంగా సిట్రోయెన్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. తాజాగా 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను చూస్తే ఇది అర్థం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో సిట్రోయెన్ భారత్‌లో కేవలం 339 యూనిట్లను మాత్రమే విక్రయించింది. బ్రాండ్‌కి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి, యూనిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్లకు ఉన్న పేరును బట్టి కంపెనీ అమ్మకాల్లో వృద్ధిని చూపించాలని అనుకున్నప్పటికి క్రమంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతుంది.

పెరుగుతున్న పోటీకి తలొగ్గిన పంచ్? ఏప్రిల్‌ అమ్మకాల రిపోర్ట్

ప్రయాణికులకు ప్రమాద సమయంలో అత్యుత్తమ రక్షణ అందించే కార్లను తయారు చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది టాటా మోటార్స్ (tata motors). ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ వరుసగా తన మోడళ్ల వారీగా అమ్మకాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో తన ప్రసిద్థ మోడల్ పంచ్ మైక్రో SUVకి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, గత ఏడాది ఇదే నెలలో (ఏప్రిల్ 2024) 19,158 యూనిట్లు విక్రయించిన ఈ మోడల్, ఏప్రిల్ 2025లో కేవలం 12,496 యూనిట్లకే పరిమితమైంది. ఇది సుమారు 35 శాతం తగ్గుదలగా నమోదు కావడంతో, పంచ్ మోడల్‌కు మార్కెట్ డిమాండ్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్-5 SUVల జాబితాలో నిలిచిన పంచ్, ఇప్పుడు 6వ స్థానానికి పరిమితమవడం, గమనించదగిన మార్పు.

ఏప్రిల్‌లో దుమ్మురేపిన ఎస్‌యూవీలు ఇవే.. అమ్మకాల పరంగా ఏది టాప్ అంటే?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో 2025 ఏప్రిల్ నెలలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎస్యూవీ, ప్యాసింజర్ కార్లకు ఉన్న డిమాండ్‌ను ఇది స్పష్టంగా చూపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా కేవలం అత్యుత్తమ ఎస్‌యూవీగానే కాకుండా ఆ నెల మొత్తం అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దానికున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తుంది. ఆ తర్వాత మారుతి సుజుకి డిజైర్, మారుతి బ్రెజ్జా ఉన్నాయి. ఈ బ్రాండ్‌లు, మోడళ్లపై వినియోగదారుల అభిమానాన్ని ఇది నొక్కి చెబుతుంది.
Advertisement

మహీంద్రా థార్ దూసుకెళ్తోంది.. 2025 ఏప్రిల్ అమ్మకాల్లో అదిరిపోయే సేల్స్

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా నుంచి గతంలో విడుదలైన శక్తివంతమైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ (Thar) అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మార్కెట్లో తన హవాను చూపించిన ఈ మోడల్ ప్రతినెలా వేలకు పైగా విక్రయాలను నమోదు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత నెలలో కూడా ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్లు ఆసక్తి కనబరిచారు. తాజాగా ఏప్రిల్ 2025లో, మహీంద్రా థార్ తన ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెలలో బ్రాండ్ తొలిసారిగా 10,000 కార్ల నెలవారీ అమ్మకాల మార్కును దాటి, SUV ప్రీమియం విభాగంలో తన స్థానం మరింత బలపరిచింది.

సెడాన్ కార్లకు కష్టకాలం.. హోండా కీలక నిర్ణయం!

ప్రస్తుతం ఎస్యూవీల హవా నడుస్తోంది. వాటి ముందు సెడాన్ కార్లు వెలవెలబోతున్నాయి. మంచి ట్రావెల్ ఎక్స్‎పీరియన్స్, మైలేజీనిచ్చే సెడాన్‌లు కూడా వాటి ముందు నిలబడలేకపోతున్నాయి. హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్ వంటి కార్లు వెనుకబడిపోతుంటే, మారుతి డిజైర్, హోండా అమేజ్ మాత్రం ఇంకా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. చూడగానే ఎవరికైనా నచ్చే ఈ రెండు కార్లు భారతీయుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతం హోండా సంచలన నిర్ణయం తీసుకుంది.

హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు! వెన్యూ, ఎక్స్‌టర్, NIOSలను తక్కువ ధరలో సొంతం చేసుకోండి

దక్షిణ కొరియా బ్రాండ్ హ్యుందాయ్‌ ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీదారులకు పోటీగా అమ్మకాలతో దూసుకుపోతుంది. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్‌యూవీ వంటి విభాగాల్లో తన మెడళ్ల విక్రయాలతో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా మే నెలలో తన ప్రముఖ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇటీవలి ధర పెంపు తర్వాత, ఇప్పుడు కస్టమర్లకు మరింత సంతృప్తిని కలిగించడానికి హ్యుందాయ్ భారీ ప్రయోజనాలతో ముందుకొచ్చింది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUVలైన గ్రాండ్ i10 NIOS, వెన్యూ, ఎక్స్‌టర్ మోడళ్లపై దాదాపు రూ.75,000 వరకు ఆఫర్లు అందిస్తోంది. తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తగ్గింపు వివరాలను ఒకసారి చూద్దాం.

టాప్ ఎస్‌యూవీల లిస్ట్‌లో మహీంద్రా దూకుడు.. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓతో రికార్డులు!

మనదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త కారు కొనాలనుకునే వారి ప్రాధాన్యతల్లో ఈ తరహా కార్లు ఒకటిగా ఉంటున్నాయి. తక్కువ ధరలో ఎస్‌యూవీ లుక్‌లో కారు అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉండడంతో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సెగ్మెంట్లో తమ కార్లను విక్రయిస్తున్నాయి. వీటిలో మహీంద్రా కూడా ఒకటి.

సంచలనం సృష్టిస్తున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ స్కూటర్! యాక్టివా, జూపిటర్‌కు షాక్!

భారతదేశ ఆటోమొబైల్ రంగం గర్వంగా చెప్పుకునే విషయం ఇది. మన 'మేడ్ ఇన్ ఇండియా' స్కూటర్లు ప్రపంచ మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి, ఒక స్కూటర్ విదేశీయుల హృదయాలను కొల్లగొడుతోంది. త్వరలో సరికొత్త హంగులతో మీ ముందుకు రాబోతున్న ఆ సంచలనం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్ 2025 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! మే 22న గ్రాండ్ లాంచ్

ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే టాటా మోటార్స్ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. టాటా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2025 మోడల్‌ ఆల్ట్రోజ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. 2020లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, 2021లో డార్క్ ఎడిషన్‌ను పొందిన తర్వాత ఇదే మొదటి సారి డిజైన్ పరంగా ఓ ప్రధాన అప్‌డేట్‌ను పొందుతోంది. ఈ సారి టాటా ఆల్ట్రోజ్ మరింత శక్తివంతమైన, అదిరిపోయే విధంగా మన ముందుకు వస్తుంది. డిజైన్ పరంగా చాలా అపడేట్స్ ఉన్నాయి. పూర్తిగా మారిన బాడీ లైన్లు, బోల్డ్ 3D ఫ్రంట్ గ్రిల్ దీనికి స్పోర్టీ గంభీరతను అందిస్తున్నాయి.

ఎర్టిగాకు ఇక కష్టకాలం? కియా నుంచి అదిరిపోయే 7 సీటర్ MPV వచ్చేస్తోంది!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా, భారతీయ మార్కెట్‌లోకి మరో సంచలన కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అదే కియా కారెన్స్ క్లావిస్. ఇది నిజానికి కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అయినప్పటికీ కొత్త పేరుతో మార్కెట్లోకి వస్తోంది. ఈ కారుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ఇదే దీని ధరంటూ ఒక ఫోటో వైరల్ అయింది. కాని ఇది నిజం కాదు.

ప్రపంచాన్ని ఆకర్షించిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరి చూపు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. పలు తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్, మంచి బ్యాటరీ పనితీరు కలిగిన వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. లోకల్‌గా విక్రయిస్తూనే ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో TVS మోటార్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనతను సాధించింది. దేశం నుంచి ఎగుమతైన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏకంగా 86 శాతం వాటాను TVS ఒంటరిగా తన ఖాతాలో వేసుకుంది. ఇది కేవలం ఎగుమతుల గణాంకం మాత్రమే కాక, గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సంస్థగా TVS తన స్థిరమైన ఆధిపత్యాన్ని ప్రతిబింబించే ఉదాహరణగా నిలుస్తోంది.
Advertisement

టాటా కర్వ్ ధరలు పెరిగాయ్.. సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?

టాటా మోటార్స్ (Tata Motors) కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన కారు కర్వ్ (Curvv). టాటా కొత్త కూపే-స్టైల్ ఎస్‌యూవీగా గత ఏడాది చివర్లో కర్వ్ విడుదలైంది. మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఇతర టాటా కార్లైన నెక్సాన్ (Nexon), పంచ్ (Punch) కంటే ఎక్కువ ధరతో విడుదలైనప్పటికీ, ఇప్పటివరకు కర్వ్ కారు అమ్మకాలు బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు టాటా కర్వ్ కారు ధరలు గణనీయంగా పెరిగాయి.

మారుతీ సుజుకీ కార్లలో ఇప్పుడు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు!

దేశీయ అతిపెతద్ద కార్ల తయారీకంపెనీ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) ఆటోమొబైల్ రంగంలో తన సేఫ్టీ ప్రమాణాలను మరింతగా బలోపేతం చేసే దిశగా మరో మైలురాయి దాటి ముందుకు సాగుతుంది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి తన బేస్ వేరియంట్ కార్లలో కూడా ఎయిర్‌బ్యాగులను అందించడానికి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దాని అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లు అయినటువంటి వ్యాగన్ R, ఆల్టో K10, సెలెరియో, ఈకో కార్లలో ఇప్పుడు స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చబడ్డాయి. గతంలో కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టోను కూడా విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తరువాత దాని బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో నాలుగు ఇప్పుడు స్టాండర్డ్‌‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది.

బైక్ ప్రేమికులకు పండుగ.. బ్రిటిష్ బ్రాండ్ నుంచి స్క్రాంబ్లర్ 400 XC వచ్చేసింది

బ్రిటిష్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ (triumph), భారత ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసేందుకు అసలు వెనుకాడలేదు. ఎంతో కాలంగా మిడ్-కెపాసిటీ సెగ్మెంటులో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బలమైన పోటీని ఇస్తుంది. కంపెనీ నుంచి విడుదలయ్యే బైకులు శక్తివంతమైన మెకానికల్ పనితీరుతోనే కాదు, ధరలోనూ మధ్యతరగతి యువతకు చేరువయ్యాయి. అందుబాటు ధరలో తన మోడళ్లను లాంచ్ చేయడం ద్వారా ట్రయంఫ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ట్రయంఫ్ కొత్తగా దేశీయ వినియోగదారుల కోసం కొత్తగా స్క్రాంబ్లర్ 400XC (Scrambler 400 xc) అనే సరికొత్త బైకును విడుదల చేసింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X లతో మంచి అమ్మకాలను సాధించిన కంపెనీ ఈ కొత్త దాన్ని తీసుకొచ్చింది.

4-స్టార్ సేఫ్టీ ఉన్న టాటా టియాగో ధర పెరిగిందా? సామాన్యులకు అందుబాటులో ఉండదా?

టాటా మోటార్స్ ఇండియాలో టాప్ కార్ల తయారీ కంపెనీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతీ నెల వేల సంఖ్యలో కార్లను టాటా కంపెనీ మార్కెట్‌లో అమ్ముతోంది. టాటా మోటార్స్ ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణమైన కార్లలో టియాగో (Tiago) ఒకటి. టాటా మోటార్స్ తక్కువ ధరలో అందించే హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, టాటాలోనే కాదు మొత్తం ఇండియాలోనే తక్కువ ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

ఈవీల దండయాత్ర మొదలైంది!.. కార్ల రేస్‌కి సిద్ధంగా ఉండండి!

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో బాధపడుతున్న వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో తయారీదారులు డిమాండ్‌ను తీర్చడానికి క్రమంగా ఎక్కువ ఈవీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆటో రంగాన్ని శాశ్వతంగా మార్చే ఈ ట్రెండ్‌లో, కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు తమ అత్యంత ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి పోటీ కేవలం ఒకే విభాగంలో కాదు, సెడాన్‌లు, SUVలు, MPVలు వంటి విభిన్న సెగ్మెంట్లను ఇది కవర్ చేస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టని మారుతీ సుజుకీ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో తమ తొలి EV మోడల్‌ను లాంచ్ చేయనుంది.