సూపర్ కార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గోల్ఫ్ GTI, టిగువాన్ R-లైన్ రానున్నాయి!
ఆటోమొబైల్స్
- 1 year, 6 month, 17 days ago
అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలో కార్ల తయారీలో ప్రసిద్ధి చెంది ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) ఇప్పటికే పలు వాహనాలను విక్రయిస్తూ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. మరోసారి తమ హవాను కొనసాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రెండు ప్రీమియం మోడళ్లను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. జర్మన్ కార్ల తయారీదారు ఇటీవల గోల్ఫ్ GTI,టిగువాన్ R-లైన్ మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మోడళ్లను తన భారతీయ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసింది. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, టిగువాన్ R-లైన్ కారును ఏప్రిల్ 14న లాంచ్ చేయనుండగా, గోల్ఫ్ GTI కోసం అధికారికంగా విడుదల చేసే తేదీని ఇంకా వెల్లడించలేదు. లాంచ్‌కు ముందుగా ఈ కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.