10 నిమిషాల ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ వాహనాల(EV) ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. మొన్నటి వరకు మనం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే చూసిన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, ఇప్పుడు ఏకంగా భారీ ఎలక్ట్రిక్ బైకుల్లోకి వచ్చేసింది. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో ఏకంగా 299 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే విప్లవాత్మక బైక్‌ను ఫిన్లాండ్‌ కంపెనీ సిద్ధం చేసింది.

మరో 2 లక్షలు రెడీ చేసుకోండి

హుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ (Creta EV) వేరియంట్లలో భారీ మార్పులు చేస్తూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. 2025 ఆటో ఎక్స్‌పోలో అట్టహాసంగా విడుదలైన ఈ కారు, ఇప్పుడు 2026 అప్‌డేట్‌లో భాగంగా కొన్ని చౌకైన వేరియంట్లను కోల్పోయింది. మీరు గనుక తక్కువ బడ్జెట్‌లో క్రెటా ఈవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, మీ ప్లాన్ మార్చుకోవాల్సిందే!

కియా స్మార్ట్ ఫీచర్ల ముందు ఏదైనా జుజూబీ

భారతీయ వాహన రంగంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు కారు ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‎లా మారిపోయింది. ఈ మార్పును ముందుగానే పసిగట్టిన సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియా ఇండియా (Kia India), ఇప్పుడు ఒక భారీ మైలురాయిని చేరుకుంది. భారత రోడ్లపై ప్రస్తుతం కైయాకు చెందిన 5 లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లు పరుగులు తీస్తున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 40 శాతం వాటా ఈ స్మార్ట్ కార్లదే కావడం విశేషం.

మిడిల్ క్లాస్ ఫేవరెట్ SUV.. డిసెంబర్‌లో టాటా పంచ్ సేల్స్ గ్రోత్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొంతకాలంగా SUVలపై మోజు భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే SUVలకు గ్రామీణ ప్రాంతాల నుంచీ మెట్రో నగరాల వరకు అన్ని వర్గాల వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రఫ్ అండ్ టఫ్ లుక్, ఫ్యామిలీకి సరిపడే స్పేస్ వంటి అంశాలు భారతీయ కస్టమర్లను SUVల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌ను తొలినాళ్లలోనే అర్థం చేసుకున్న సంస్థల్లో టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్స్ తక్కువ ధరలో SUV అనుభూతిని అందిస్తూ ఈ సెగ్మెంట్‌ను దాదాపు తన ఆధీనంలోకి తీసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం టాటా పంచ్.
Advertisement

ఇంత మంది కొనుగోలు చేస్తారని ఊహించలేదే.. టాటా టియాగో సేల్స్ షాక్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటినుంచో భారీ కస్టమర్ బేస్ ఉంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే కాంపాక్ట్ సైజ్, సరసమైన ధర, మంచి మైలేజీ వంటి లక్షణాలు హ్యాచ్‌బ్యాక్ కార్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునేలా ఉండటం, నగరాల్లోని రద్దీ రోడ్లపై కూడా సులభంగా నడపగలగడం వంటి అంశాలు ఈ సెగ్మెంట్‌కు ప్రధాన బలంగా మారాయి. అంతేకాదు, ఇతర సెగ్మెంట్ల కార్లతో పోలిస్తే హ్యాచ్‌బ్యాక్‌ల ధర తక్కువగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా నియంత్రణలో ఉండటం వల్ల మిడిల్ క్లాస్ కుటుంబాలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో, హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇంధన సామర్థ్యం పరంగానూ ముందుంటాయి.

పెట్రోల్ బంకులకు ఇక గుడ్ బై

టూవీలర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుజుకి సంస్థ, ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుజుకి ఇ-యాక్సెస్(Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ శుక్రవారం మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్సెస్ 125 ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే నమ్మకంతో, అదే స్టైల్‌తో ఎలక్ట్రిక్ అవతారంలో ఈ స్కూటర్ కస్టమర్లను పలకరించడానికి వచ్చేసింది.

లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లకు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

కొత్త ఏడాదిలో టాటా మోటార్స్ మరోసారి మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎంతో మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మైక్రో SUVను కంపెనీ జనవరి 13 (మంగళవారం) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే పంచ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించగా, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఆ క్రేజ్‌ను మరింత పెంచాలని టాటా ప్రయత్నిస్తోంది. ఈ కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా రిఫ్రెష్ చేసిన డిజైన్ కనిపించనుంది. ముందు భాగంలో మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్, ఆధునిక టచ్‌తో కూడిన ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల ఇది ఇప్పటి మోడల్ కంటే మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది. అంతేకాదు, ఈ కారులో డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లు జోడించడంతో, మైక్రో SUV సెగ్మెంట్‌లో ఇది మరింత బలమైన ప్రత్యర్థిగా మారనుంది.

ఇది కారు కాదు..డ్రైవింగ్ చేస్తూ గేమింగ్ ఆడేయచ్చు

టెక్నాలజీ దిగ్గజం సోనీ, ఆటోమొబైల్ దిగ్గజం హోండా చేతులు కలిపితే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూపిస్తోంది అఫీలా(Afeela). అమెరికాలో జరుగుతున్న సిఈఎస్ 2026 వేడుకల్లో సోనీ-హోండా మొబిలిటీ సంస్థ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) ప్రోటోటైప్‌ను ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం రోడ్డు మీద వెళ్లే కారు మాత్రమే కాదు, చక్రాల మీద నడిచే ఒక డిజిటల్ ప్రపంచం అని టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Advertisement

ఫ్యామిలీతో ట్రిప్స్ వేయడానికి సరైన టాటా కారు

టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరో కీలకమైన అడుగు వేసింది. చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన టాటా హారియర్ ను తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయం చేసింది. ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్‌కే పరిమితమైన హారియర్, ఇప్పుడు పెట్రోల్ ఆప్షన్ రావడంతో మరింత విస్తృతమైన కస్టమర్ వర్గాన్ని ఆకర్షించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ వినియోగం, తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఈ కొత్త పెట్రోల్ హారియర్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. వాస్తవానికి, టాటా హారియర్ 2019లో భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్‌తోనే అరంగేట్రం చేసింది. అయితే ఇప్పుడు కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్ హారియర్ లాంచ్‌ చేసింది. ఈ కారు గురించిన వివరాలు ఈ కథనంలో.

ఇండియాలో ప్రతి ఒక్కరూ కొంటున్న హ్యాచ్‌బ్యాక్‌లు ఇవే.. టాప్ 3 లిస్ట్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. సైజ్ పరంగా చిన్నవైనా, ఇవి అందించే స్టైల్, సౌకర్యం, ఉపయోగకరమైన ఫీచర్ల వల్ల పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉండడం, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. మీరు ఇప్పుడు ఒక సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మారుతి సుజుకి బ్రాండ్ నుంచి వచ్చే కొన్ని మోడళ్లు మీ జాబితాలో తప్పకుండా ఉండాలి. వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో కార్లు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

కోటి మైలురాయిని దాటేసిన జపాన్ టెక్నాలజీ

జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సుజుకి (Suzuki) భారతీయ రోడ్లపై సరికొత్త చరిత్ర సృష్టించింది. తన జైత్రయాత్రలో మైలురాయి లాంటి ఘనతను అందుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్ నుండి 10 మిలియన్ల (కోటి)వ వాహనాన్ని విడుదల చేసి, భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతీయులకు సుజుకి అంటే కేవలం ఒక బ్రాండ్ కాదు, అదొక నమ్మకం అని ఈ ఘనత మరోసారి నిరూపించింది.

2026లో ఇండియన్ రోడ్లపైకి ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R లైన్

జర్మన్ వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 2026 నూతన సంవత్సరాన్ని భారత మార్కెట్‌లో పెద్ద ఆశయాలతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా భారతదేశంలో తన మోడల్ లైనప్‌ను పరిమితంగా ఉంచిన ఫోక్స్‌వ్యాగన్, ఇప్పుడు మళ్లీ SUV విభాగంలో బలంగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ 7-సీట్ల SUV అయిన ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్ ను భారత్‌కు తీసుకురానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కొత్త టేరాన్ R-లైన్ SUV 2026 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా భావించవచ్చు.
Advertisement

ఎవర్రా ఇండియా పేద దేశం అన్నది

భారత్ పేద దేశమనే రోజులు పోయాయి. ఇక్కడి ప్రజల లైఫ్‎స్టైల్ మారుతోంది. అందుకు నిదర్శనమే లగ్జరీ కార్ల విపరీతమైన అమ్మకాలు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) 2025 సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయులు ఈ బ్రాండ్ కార్లపై విపరీతమైన మక్కువ చూపారు. గత ఏడాది బీఎండబ్ల్యూ షోరూమ్‌లు అమ్మకాలతో కిక్కిరిసిపోయాయి.

పెట్రోల్ బంకుల్లాగే ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడేవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఛార్జింగ్. ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసే దిశగా ఏథర్ ఒక భారీ అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఏథర్ వినియోగదారులు ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

రూ.55 వేల బైక్.. లీటరుకు 70 కి.మీ మైలేజ్

కొత్త ఏడాదిలో ఒక బడ్జెట్ కమ్యూటర్ బైక్ కొనాలనుకునే వారికి టీవీఎస్ నుంచి వచ్చే రేడియన్(Radeon) నిజంగా ఒక నమ్మకమైన ఎంపికగా నిలుస్తోంది. ధర, మైలేజ్, పనితీరు, నిర్వహణ ఈ నాలుగు అంశాల్ని సమతుల్యంగా కలిపిన బైక్ కావాలంటే, TVS Radeon పేరు తప్పకుండా లిస్ట్‌లో ముందుంటుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణం, చిన్న దూరాల ట్రావెల్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కోరుకునే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్, హోండా షైన్ లాంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, TVS Radeon వాటికి గట్టి పోటీ ఇస్తోంది. కేవలం ధర పరంగా మాత్రమే కాదు, మైలేజ్, లాంగ్‌టర్మ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ బైక్ చాలా వరకు వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఇది కారు కాదు కదిలే కోట

రియల్ ఎస్టేట్ రంగంలోనో, వ్యాపార రంగంలోనో కాదు.. ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అసలైన యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు 7 సీటర్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner)కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక కొత్త రాక్షసుడు సిద్ధమయ్యాడు. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), తన సరికొత్త భారీ ఎస్‌యూవీ టేరాన్ (Tayron)ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2026 ప్రారంభంలోనే ఈ కారు రాకతో ఫార్చ్యూనర్ పని అయిపోయినట్లేనని కార్ల ప్రేమికులు చర్చించుకుంటున్నారు.
Advertisement

mahindra xuv 7xo డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్

కొత్త మహీంద్రా XUV 7XO SUV సోమవారం విడుదలైంది. దీని ధర రూ.13.66 లక్షల నుండి రూ. 24.92 లక్షల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) మధ్య ఉంటుంది. ఇది AX, AX3, AX5, AX7, AX7T, AX7L వేరియంట్లలో లభిస్తుంది. జనవరి 14 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఆసక్తిగల కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 డిపాజిట్ చెల్లించడం ద్వారా తమ ఆర్డర్‌లను ఉంచవచ్చు. ఇటీవల, మా 'డ్రైవ్‌స్పార్క్' బృందానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కొత్త 'మహీంద్రా XUV7XO'ని టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఈ SUV డిజైన్, ఫీచర్లు, డ్రైవింగ్ సమయంలో కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి పూర్తి వివరాలను ఈ కింది కథణంలో తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఫస్ట్ లుక్ + ఫీచర్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో, టయోటా నుంచి వచ్చే ఒక కీలక అప్‌డేట్ కస్టమర్లలో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ EV కోసం ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ ఎదురుచూపులకు మరింత బలం చేకూర్చేలా టయోటా ఇండియా ఈ కారు మొదటి టీజర్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV అతి త్వరలోనే మార్కెట్లోకి రానుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు టయోటా ఇండియా హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతూ, అర్బన్ క్రూయిజర్ EVను తీసుకురావడం ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది.

రూ.12 లక్షలకే ఇంత పెద్ద SUVనా?

కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాలన్నా, సిటీ రోడ్ల మీద రాజసం ఉట్టిపడేలా తిరగాలన్నా అందరికీ గుర్తుకు వచ్చే పేరు MG హెక్టార్ (MG Hector). ఇండియాలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ కార్‎గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎస్‌యూవీ, ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది.

రెండు కుటుంబాలకు ఈజీగా సరిపోద్ది.. బడ్జెట్‌లో టాటా నుంచి

ఎంతోకాలంగా ఆటోమొబైల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం చివరకు వచ్చింది. టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన సఫారీ (Safari) ని పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటివరకు సఫారీ పేరు వినగానే డీజిల్ పవర్‌ట్రెయిన్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయానికి ముగింపు పలుకుతూ, పెట్రోల్ లవర్స్‌కూ సఫారీ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా. కొత్త సఫారీ పెట్రోల్ SUVను చూస్తే, ఇది కేవలం ఒక కొత్త ఇంజిన్‌తో వచ్చిన మోడల్ మాత్రమే కాదు, టాటా మారుతున్న వ్యూహానికి ప్రతిబింబంగా కూడా అనిపిస్తుంది. గొప్ప రోడ్ ప్రెజెన్స్, బలమైన బాడీ లుక్, ప్రీమియం ఫీల్ కలిగిన డిజైన్‌ను సఫారీ అలాగే కొనసాగించింది.
Advertisement

నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది

భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని, కాలుష్య రహితమైన హైడ్రోజన్ రైలు(Hydrogen Train)పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. చైనా, జర్మనీ వంటి దేశాల కంటే అడ్వాన్సుడ్ టెక్నాలజీతో, మన స్వదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యంతో రూపొందిన ఈ రైలు త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభించనుంది. భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గ్రీన్ మొబిలిటీ మిషన్ వివరాలు తెలుసుకుందాం.

రూ.12.8 లక్షలకే హారియర్ పెట్రోల్ లాంచ్.. SUV మార్కెట్ షేక్!

డీజిల్ SUVలకే ఎక్కువగా గుర్తింపు పొందిన టాటా మోటార్స్ ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో కీలకమైన వ్యూహాత్మక మార్పు చేసింది. చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న నిర్ణయంగా, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన హారియర్ (Harrier) తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ద్వారా టాటా మోటార్స్ తన కస్టమర్ బేస్‌ను మరింత విస్తరించడమే కాకుండా, పెట్రోల్ వాహనాలను ఇష్టపడే నగర వినియోగదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది. పెట్రోల్ వేరియంట్ లాంచ్‌తో, ఈ SUV మరింత విస్తృతమైన కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ వినియోగం, తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

రూ.75 లక్షలైనా జనాలు ఆగట్లేదు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అయితే కేవలం ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీలే కాదు.. ఇప్పుడు స్పోర్ట్స్ కార్లలో కూడా ఈవీలు దుమ్మురేపుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తీసుకొచ్చిన సైబర్‌స్టర్ (Cyberster) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ మోడల్‌గా అవతరించింది. అదిరిపోయే లుక్స్, మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ కారు.. ఇండియాలోని ధనవంతులను, స్పోర్ట్స్ కార్ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

క్రెటా, సెల్టోస్‌లకు మొగుడు వస్తున్నాడు

ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ(SUV) ట్రెండ్‌ను మొదలుపెట్టిందే అది.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా, ఇప్పుడు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైంది. అదే రెనో డస్టర్(Renault Duster). సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ నెక్స్ట్ జనరేషన్ డస్టర్ కోసం కార్ల ప్రేమికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ కారు, రాకముందే తన సత్తా ఏంటో నిరూపించుకుంది.
Advertisement

పట్టణాల్లో ఉండే వారు నడపడానికి బెస్ట్ కారు

పట్టణాల్లో రోజూ ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన, స్టైలిష్ వాహనం కావాలంటే కొత్త హ్యుందాయ్ వెన్యూ (VENUE) ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కాంపాక్ట్ SUV, బోల్డ్ డిజైన్‌తోనే కాకుండా ఆధునిక సాంకేతికత, ప్రాక్టికల్ ఫీచర్లతో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. చిన్న కుటుంబాల నుంచి యువత వరకు అందరికీ సరిపోయేలా హ్యుందాయ్ ఈ వెన్యూను డిజైన్ చేసింది. ధర విషయానికి వస్తే, కొత్త హ్యుందాయ్ VENUE ప్రారంభ ధర రూ.7,99,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలో స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరుతో ఇది అందుబాటులో ఉంటుంది.