సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు కొంటున్న కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా ప్రజాదరణ సంపాదించుకున్న కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. స్టైలిష్ డిజైన్, క్రాస్ఓవర్ SUV లుక్, మారుతి విశ్వసనీయత కలయికతో ఈ మోడల్ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆదరణ పొందుతోంది. తాజాగా నవంబర్ 2025 నెలకు సంబంధించిన అమ్మకాల నివేదిక విడుదల కావడంతో, ఫ్రాంక్స్ మార్కెట్‌లో ఎలా రాణించిందో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, నవంబర్ 2025లో మొత్తం 15,058 మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే స్వల్పమైనా కానీ సానుకూల వృద్ధిని సూచిస్తోంది. నవంబర్ 2024లో 14,882 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ప్రస్తుత నవంబర్ 2025లో ఆ సంఖ్య 176 యూనిట్లు పెరిగింది.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా క్రేజ్ కొనసాగుతోంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా ఇన్నోవాకు (Toyota Innova) ఉన్న ప్రత్యేక అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ అవసరాలు, దూర ప్రయాణాలు, కమర్షియల్ వాడకానికి అన్ని విభాగాల్లోనూ నమ్మకమైన MPVగా ఇన్నోవా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. అవి టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్. ఈ రెండు మోడళ్లు కలిపి బ్రాండ్‌కు స్థిరమైన అమ్మకాలను అందిస్తున్నాయి. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం, ఈ నెలలో టయోటా మొత్తం 9,295 ఇన్నోవా కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది.

టెస్లాకే టెన్షన్? 1.5 కోట్ల కార్లు అమ్మిన చైనా EV బ్రాండ్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD (Build Your Dreams) ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. కంపెనీ తాజాగా 15 మిలియన్ల (1.5 కోట్ల) వాహనాల ఉత్పత్తి మైలురాయిని విజయవంతంగా చేరుకోవడం ద్వారా, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. ముఖ్యంగా టెస్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నప్పటికీ, BYD ప్రపంచ స్థాయిలో అగ్రగామి సంస్థగా నిలబడటం విశేషం. ఈ మైలురాయి BYD విజయమే కాకుండా, గ్లోబల్ EV మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

రూ.10 లక్షల లోపు టయోటా బెస్ట్ కార్లు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) నవంబర్ 2025లో గణనీయమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేస్తూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలమైన స్థితిని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు ధర శ్రేణిలో లభిస్తున్న రెండు కీలక మోడళ్లు టయోటా గ్లాంజా, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఈ సేల్స్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ రెండు కార్లు భారత మార్కెట్లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డిజైన్, మైలేజ్, విశ్వసనీయత, ధర పరంగా మంచి సమతుల్యతను అందించడం వల్ల కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా, నవంబర్ నెలలో వీటి అమ్మకాలు టయోటా మొత్తం సేల్స్‌లో కీలక వాటాను అందించి, కంపెనీకి స్థిరమైన వృద్ధి దిశగా బలమైన ఊపును ఇచ్చాయి. ఈ కార్ల గురించిన వివరాలు ఒకసారి చూద్దాం.
Advertisement

ఈ కారును కేవలం 5 మంది మాత్రమే కొన్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్స్ (MG Motors) ప్రస్తుత పనితీరు అమ్మకాల పరంగా నెమ్మదిగా తన పనితీరును చూపిస్తోంది. ఒకవైపు బ్రాండ్ నుంచి వచ్చిన విండ్సర్ EV ఆశించినదానికంటే మెరుగైన స్పందనను పొందుతూ అమ్మకాల పరంగా నిలకడగా రాణిస్తుండగా, మరోవైపు కంపెనీకి చెందిన ప్రీమియం SUV - MG గ్లోస్టర్ మాత్రం మార్కెట్లో తీవ్రంగా వెనుకబడుతోంది. ఇటీవలి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గ్లోస్టర్‌పై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం MG మోటార్స్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా నవంబర్ నెలలో కేవలం 5 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదు కావడం, గత ఆరు నెలల కాలంలో గ్లోస్టర్‌కు ఇదే అత్యంత దారుణమైన ప్రదర్శనగా నిలిచింది.

బాలనో కారు కూడా పాలిటిక్స్ చేస్తోందా ఏంటి?

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న మారుతి సుజుకి బాలనో (Maruti Suzuki Baleno) గురించి ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒకవైపు సేఫ్టీ రేటింగ్‌ల విషయంలో వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుంటే, మరోవైపు బాలనో కారుకు వచ్చిన భిన్నమైన ఫలితాలు కస్టమర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

పెట్రోల్, అణు ప్రాజెక్టులపై కేంద్రాన్ని వణికించిన కమల్!

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ వెండితెరపైనే కాదు, పార్లమెంట్‌లోనూ తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. గత జూలైలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్, ఈ వారంలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తన తొలి ప్రశ్నలను సంధించారు. ప్రజా సమస్యల పట్ల తనకున్న అవగాహనను చాటుకుంటూ, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇంధన మార్పులు (E20 పెట్రోల్), అణు విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వాన్ని రాతపూర్వక ప్రశ్నలతో నిలదీశారు.

సెడాన్ లవర్స్‌కు శుభవార్త 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్ స్పాటెడ్

భారత సెడాన్ మార్కెట్‌లో మళ్లీ చర్చకు రావడానికి 2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ (Hyundai Verna Facelift) సిద్ధమవుతోంది. ఒకప్పుడు మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో బలమైన గుర్తింపును సంపాదించుకున్న వెర్నా, ఎస్యూవీల ఆధిపత్యం పెరిగిన ఈ సమయంలో కూడా సెడాన్ అభిమానులను తిరిగి ఆకర్షించాలనే లక్ష్యంతో హ్యుందాయ్ కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై షాట్‌లు ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. అవి వెర్నాకు రానున్న కొత్త డిజైన్ టచ్‌లు, అప్‌డేటెడ్ ఫీచర్లపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ వెర్నా నాల్గవ తరం మోడల్. దీనిని అధికారికంగా మార్చి 2023లో భారత మార్కెట్లో విడుదల చేశారు. అప్పట్లో పూర్తిగా కొత్త డిజైన్, ఆధునిక ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వెర్నా మంచి స్పందననే పొందింది.
Advertisement

కొత్త రంగులు కొత్త ఫీచర్లతో పల్సర్ 220F రీ లాంచ్

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto Limited) మరోసారి తన లెజెండరీ మోటార్‌సైకిల్‌ను భారత రోడ్లపైకి తీసుకొచ్చింది. తాజాగా 2026 పల్సర్ (pulsar) 220F ను అధికారికంగా విడుదల చేసిన బజాజ్, ఒకప్పుడు యువత గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ బైక్ వారసత్వాన్ని కొనసాగించేందుకు కొత్త అప్‌డేట్‌లతో మళ్లీ పరిచయం చేసింది. పనితీరు, స్టైల్, స్పోర్టీ ఇమేజ్‌కు ప్రతీకగా నిలిచిన పల్సర్ 220F, ఈ కొత్త అవతార్‌లో కూడా అదే క్రేజ్‌ను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. పల్సర్ బ్రాండ్ అనగానే భారతీయ రైడర్లకు గుర్తొచ్చేది పవర్, దూకుడు డిజైన్. అందులోనూ పల్సర్ 220F అనేది ఒక ప్రత్యేక అధ్యాయం.

ఆటోమొబైల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్

90వ దశకంలో భారతీయ రోడ్ల మీద ఒక వెలుగు వెలిగిన ఐకానిక్ కారు టాటా సీయెరా(Tata Sierra) మళ్ళీ వచ్చేసింది. అప్పట్లో ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే సంచలనాన్ని మళ్ళీ సృష్టిస్తూ, టాటా మోటార్స్ ఈ కారును సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువచ్చింది.

MG మోటార్ ఇండియా నవంబర్ అమ్మకాల రిపోర్ట్

JSW MG మోటార్ ఇండియా భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో తన బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాలు చూస్తే, MG ఎలక్ట్రిక్ వ్యూహం ఎంతగా ఫలితాలు ఇస్తోందో అర్థమవుతుంది. ముఖ్యంగా MG విండ్సర్ EV ఈ నెలలో కంపెనీకి ప్రధాన అమ్మకాల ఇంజిన్‌గా మారింది. స్టైలిష్ డిజైన్, ప్రాక్టికల్ రేంజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై పెరుగుతున్న నమ్మకంతో, విండ్సర్ EV వినియోగదారుల మనసు గెలుచుకుంటోంది. నవంబర్ 2025లో MG విండ్సర్ EV మొత్తం 4,025 యూనిట్ల అమ్మకాలతో అద్భుత ప్రదర్శన చేసింది. ఇది MG మోటార్ ఇండియా మొత్తం నెలవారీ అమ్మకాలలో దాదాపు 70 శాతం వాటాను అందుకోవడం విశేషం.

ఈ రెండు బైక్స్ మధ్య పోరు మామూలుగా లేదు

భారతదేశంలో 350సీసీ రెట్రో బైకులంటే కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విభాగంలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. జపాన్ టెక్నాలజీతో దూసుకొచ్చిన హోండా CB350 (Honda CB350) ఇప్పుడు ఎన్‌ఫీల్డ్ కోటను బద్దలు కొట్టడానికి సిద్ధమైంది. లుక్ పరంగా రెండూ అదిరిపోయినా, ఇంజిన్ పనితీరు, ఫీచర్లలో వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మీ వ్యక్తిత్వానికి, మీ అవసరాలకు ఏ బైక్ సెట్ అవుతుందో వివరంగా చూద్దాం.
Advertisement

మారుతి ఎలక్ట్రిక్ SUV ఈ విటారా స్పెసిఫికేషన్స్ రివ్యూ

మారుతి సుజుకి e విటారా రివ్యూ: ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, డ్రైవింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి అడుగుపెట్టింది.

కారు కాదు ఇది ఒక మినీ ఇల్లు

సెవెన్ సీటర్ ఎంపీవీ (MPV) విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కియా కారెన్స్ (Kia Carens) భారత మార్కెట్లో విజయవంతంగా దూసుకుపోతోంది. తక్కువ కాలంలోనే ఈ మోడల్ టొయోటా ఇన్నోవాకు కూడా గట్టి పోటీనిస్తూ విభాగంలో తనదైన ముద్ర వేసింది. మంచి ఫీచర్లు, ఆధునిక డిజైన్ మరియు శక్తివంతమైన ఇంజన్ ఎంపికలతో కస్టమర్‌లను ఆకట్టుకున్న కారెన్స్, అమ్మకాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది.

కొత్త చరిత్రను సృష్టించిన రూ.4.99 లక్షల కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagonr) భారత ఆటోమొబైల్ రంగంలో ఒక సాధారణ హ్యాచ్‌బ్యాక్ మాత్రమే కాదు, కోట్లాది భారతీయ కుటుంబాల జీవితాల్లో భాగమైన నమ్మకమైన పేరు. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కీలకమైన స్థానం దక్కించుకున్న ఈ కారు, తాజాగా దేశంలోనే 3.5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇది వ్యాగన్ఆర్‌పై భారతీయ వినియోగదారులు చూపుతున్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం. కాలానుగుణంగా మారుతూ, వినియోగదారుల అవసరాలను గుర్తించి, మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను ప్రతి తరం మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తూ వచ్చింది. డిజైన్‌లో సరళతను కాపాడుకుంటూనే, ఇంటీరియర్ స్పేస్, కంఫర్ట్, మైలేజ్, భద్రత వంటి అంశాల్లో అనేక నవీకరణలను అందించింది.

ఒక్కసారిగా రేసు గుర్రమైపోయిన ఇగ్నిస్

మారుతి సుజుకి కార్లలో ఒకప్పుడు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న కారు ఇగ్నిస్(Ignis). పెద్ద పెద్ద ఎస్‌యూవీల హవా నడుస్తున్నా కూడా, ఈ చిన్న కారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా విడుదలైన 2024 నవంబర్ నెల అమ్మకాల గణాంకాల్లో ఇగ్నిస్ అదరగొట్టింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 2,316 యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించింది. గత ఏడాది నవంబర్‌లో అమ్ముడైన 2,023 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల్లో 5.13 శాతం వృద్ధి కనిపించింది. తక్కువ ధరలో మినీ ఎస్‌యూవీ లాంటి లుక్ ఉండటమే ఈ కారు సక్సెస్‌కు సీక్రెట్.
Advertisement

ఆ కంపెనీ ఏం షాకిచ్చింది భయ్యా

కొత్త ఏడాదిలో కొత్త కారు కొని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్! ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోతున్న ఈ సంస్థ, తన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతోంది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డిసెంబర్ నెలాఖరు లోపు కొంటేనే పాత ధరలకు లభిస్తాయి. దంటే వచ్చే ఏడాది నుంచి అదనపు భారం తప్పదు.

డోర్ తీయండి..సీటు మీద కూర్చోండి

భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ విశ్వసనీయమైన వాహనంగా పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్(WagonR) లో కంపెనీ ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. భారతీయ వినియోగదారుల అవసరాలను, ముఖ్యంగా కుటుంబ సభ్యుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి ఇప్పుడు స్వివెల్ సీటు(Swivel Seat) ఆప్షన్‌ను పరిచయం చేసింది. వృద్ధులు (సీనియర్ సిటిజన్స్), దివ్యాంగులు కారులో సులభంగా ఎక్కడానికి, దిగడానికి పడే ఇబ్బందులను ఇది పూర్తిగా తొలగిస్తుంది.

ఇది ఉంటే ఊరంతా ఒకే కారులో వెళ్లొచ్చు

భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలోకి జపాన్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) అడుగుపెడుతోంది. కంపెనీ తన కొత్త సబ్-4 మీటర్ (4 మీటర్ల కంటే తక్కువ పొడవు) MPV మోడల్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీనికి అధికారికంగా నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేశారు.

33కిమీ మైలేజ్ చూసి జనాలకు మైండ్ బ్లాక్

భారతదేశంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ పేరు వింటే వచ్చే కిక్కు వేరు. తాజాగా విడుదలైన 2025 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి ఘనంగా చాటిచెప్పాయి. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 19,733 స్విఫ్ట్ కార్లు అమ్ముడై రికార్డు సృష్టించాయి.
Advertisement

22 ఏళ్లుగా ఈ కారు కోసం ఎదురు చూశారు

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వాహనాలలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. 1991 నుంచి 2003 వరకు విక్రయించబడిన ఈ లెజెండరీ ఎస్‌యూవీ, మారుతి 800, హిందుస్థాన్ అంబాసడర్ మాదిరిగానే వినియోగదారులలో ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకుంది.

మాట నిలబెట్టుకున్న టాటా మోటార్స్

ఐసీసీ 2025 మహిళా క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ అభిమానాన్ని పంచుకుంది. గతంలో చేసిన ప్రకటన మేరకు చారిత్రక విజయాన్ని సాధించిన జట్టులోని ప్రతి సభ్యురాలికీ, కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐకానిక్ టాటా సియెర్రా ఎస్‌యూవీని (Tata Sierra SUV) బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇక రోడ్ల మీద టోల్ గేట్‌కు గుడ్ బై

జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. దేశంలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ నిరీక్షణ సమస్యకు 2026 చివరి నాటికి పూర్తిగా తెరపడనుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చేసిన కీలక ప్రకటన ప్రకారం.. అత్యాధునిక మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హైవే నిర్వహణను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా పూర్తి చేస్తారు. ఈ కొత్త టెక్నాలజీ అమలైన తర్వాత, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూడాల్సిన సమయం జీరో మినిట్స్‎కు చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఇది ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనుంది. నూతనంగా రాబోయే ఈ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ పూర్తిగా AI, శాటిలైట్ ఆధారంగా పనిచేయనుంది. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతమున్న ఫాస్ట్‌ట్యాగ్ (FastTag) స్థానంలో, వాహనాలు గంటకు గరిష్టంగా 80 కి.మీ. వేగంతో టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ AI టెక్నాలజీతో అనుసంధానించబడిన శాటిలైట్ ద్వారా నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తుంది.

450 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక్ పోలో!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్న ఆటోమొబైల్ రంగంలో భాగంగా, సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండే సరసమైన EVను తీసుకురావాలని జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) బ్రాండ్ గట్టి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే, సంవత్సరాలుగా నమ్మకానికి, నాణ్యతకు, డ్రైవింగ్ ఆనందానికి ప్రతీకగా నిలిచిన పోలో (Polo) పేరును ఎలక్ట్రిక్ యుగంలోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. 2026 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా విడుదల కానున్న ఈ కొత్త మోడల్‌ను 'ID.Polo'గా పిలవనున్నారు. ఇది కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు ప్రతినిధిగా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి.
Advertisement

సెలబ్రిటీలకు నచ్చే ఫీచర్లతో వచ్చిన కారును మిడిల్‌క్లాస్ వారు కొనచ్చు!

JSW MG మోటార్ ఇండియా మరోసారి భారత SUV మార్కెట్‌లో తన ప్రభావాన్ని చాటుతూ, కొత్త MG హెక్టర్ SUVను అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ నుంచే బిగ్, బోల్డ్ అండ్ స్మార్ట్ అనే గుర్తింపును సంపాదించుకున్న హెక్టర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ కొత్త హెక్టర్ SUV డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించబడిందని కంపెనీ చెబుతోంది. రోడ్డుపై బలమైన ప్రెజెన్స్‌తో పాటు, SUV విభాగంలో డైనమిక్ పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను రూపొందించారు. ధరల పరంగా చూస్తే, కొత్త MG హెక్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.