దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కార్లు

భారతదేశంలో SUV లకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేసిన విభాగం SUV సెగ్మెంట్. ప్రతి వయసు వర్గం, ప్రతి నగరం, గ్రామం.. ఎక్కడ చూసినా SUVలే రోడ్లను ఆక్రమిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందంటే, SUVలు అందించే స్టైల్, రోడ్ ప్రెజెన్స్, సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలు భారతీయ ప్రయాణికుల అభిరుచులకు పర్ఫెక్ట్‌గా సరిపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలకు చెందిన SUV లు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ పెట్రోల్ SUV గురించి తెలుసుకుందాం.

టయోటా నవంబర్ సేల్స్ దూసుకుపోయాయి!

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) భారత ఆటో మార్కెట్లో తనదైన గౌరవాన్ని కొనసాగిస్తోంది. ఈ కంపెనీకి ఉన్న నమ్మకం, వాటి వాహనాల నాణ్యత, దీర్ఘకాలిక పనితీరు అన్నీ కలిసి కస్టమర్లను టయోటా వైపు లాక్కెళ్తున్నాయి. ప్రతి నెలా టయోటా అమ్మకాల గ్రాఫ్ ఎలా ఉంటుందో అన్నదే ఆటో ఇండస్ట్రీలోని మిగతా కంపెనీలు కూడా ఆసక్తిగా చూస్తుంటాయి. ఇలాంటి సమయంలో నవంబర్ 2025 నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడంతో, టయోటా కార్లకు దేశంలో ఎంత పెద్ద డిమాండ్ ఉందో మరొకసారి స్పష్టమైంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక్క నవంబర్ నెలలోనే టయోటా మొత్తం 33,752 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ విక్రయాలు, విదేశాలకు జరిపిన ఎగుమతులన్నీ కలిసి ఉన్నాయి.

ట్రాఫిక్ చలాన్‌లతో విసిగిపోయారా?

మీరు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌ల గురించి ఆందోళన చెందుతున్నారా.. అయితే మీ క్యాలెండర్‌లో డిసెంబర్ 13, 2025 తేదీని తప్పకుండా గుర్తించుకోండి. ఎందుకంటే ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) లేటెస్ట్ సెషన్ జరుగనుంది.

మహీంద్రా నవంబర్ బ్లాస్ట్… 56,336 SUVలు రోడ్లపైకి!

నవంబర్ 2025 నెల ముగిసిన సందర్భంలో, భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రముఖ స్థానం కలిగిన మహీంద్రా & మహీంద్రా (M&M) లిమిటెడ్ వారి నెలవారీ అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఈ నెలలో, కంపెనీ మొత్తం 92,670 వాహనాల అమ్మకాలు నమోదుచేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంటే 19% వృద్ధి సాధించింది. ఈ లెక్కల్లో ఎగుమతులు కూడా కలపబడ్డాయి. యుటిలిటీ వాహనాల సెగ్మెంట్‌లో, మహీంద్రా దేశీయ మార్కెట్లో 56,336 వాహనాలు విక్రయించింది, ఇది గత సంవత్సరానికంటే 22% వృద్ధిని సూచిస్తుంది. ఎగుమతులను కలిపి మొత్తం యుటిలిటీ వాహనాలు 57,598 కి చేరాయి. ఎగుమతులు కూడా వృద్ధికి తోడ్పడుతూ, అంతర్జాతీయ మార్కెట్‌లో మహీంద్రా బ్రాండ్ స్థిరమైన స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
Advertisement

ఎగిరెగిరి పడ్డ ఓలా పాతాళంలోకి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల, ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌లకు అనుగుణంగా, వాహన తయారీదారుల మధ్య పోటీ కూడా తీవ్రమవుతోంది. అయితే, కొన్ని నెలల క్రితం మార్కెట్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తాజాగా విడుదలైన 2025 నవంబర్ నెల విక్రయాల గణాంకాలు ఈ మార్పును స్పష్టం చేశాయి.

330 కి.మీ మైలేజ్ బైక్.. ధర రూ. 90 వేలు

బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన మోడల్‌గా నిలిచింది. దేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా రూపుదిద్దుకున్న ఈ బైక్, తన వినూత్న సాంకేతికతతో పాటు ఆర్థిక ప్రయోజనాలను అందించడం వల్ల విభిన్న వర్గాల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రయాణం కోరుకునే వారికి ఫ్రీడమ్ 125 నిజంగా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే విధంగా బజాజ్ ఫ్రీడమ్ 125ను రూపుదిద్దడం వల్ల, ఇది నగర రోడ్ల నుంచి హైవేల వరకు ఎక్కడైనా సులభంగా నడుపుకోవచ్చు. ఫ్రీడమ్ 125పై కస్టమర్ల స్పందన కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రతి నెలా ఇది మంచి స్థాయిలో అమ్ముడవుతుంది. దీని గురించిన మరిన్ని వివరాలను ఈ కథణంలో చూద్దాం.

కొరియా పవర్ చూపించేందుకు కియా సిద్ధం

భారతీయ కారు మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ భారతదేశంలో 2019లో మొదటగా విడుదల చేసిన కారు ఇదే. అప్పటినుంచీ ఈ సెగ్మెంట్‌లో సెల్టోస్ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కియా సంస్థ సెల్టోస్ యొక్క కొత్త తరం మోడల్ (Next-Generation) తయారీలో చాలా చురుగ్గా ఉంది.

2026 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయా?

నూతన సంవత్సరంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో జరిగే మార్పులు ఎప్పుడూ కొనుగోలుదారుల ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రత్యేకంగా కార్ల కంపెనీలు డిసెంబర్ చివరి వారాల్లో భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇదే సమయంలో ప్రతి సంవత్సరం జనవరి నెల రాగానే ధరల పెంపు అనే పదం వాహన యజమానుల మెదళ్లలో తిరుగుతుంటుంది. కొత్త సంవత్సరంతో పాటు తయారీ వ్యయాలు పెరిగాయని చూపించి, ఎక్కువ కంపెనీలు తమ కార్లు, బైక్‌లపై ధరల పెంపును అమలు చేస్తుంటాయి. ఇది ఆటోమొబైల్ రంగంలో ఒక రకమైన సంవత్సరాది సంప్రదాయంలా మారిపోయింది. అయితే, ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది.
Advertisement

ఈ స్కూటర్ పక్కా పేదవాళ్ల కోసమే

భారత టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అపాచీ (Apache), జుపిటర్ (Jupiter) వంటి మోడల్స్ ఇప్పటికే వినియోగదారుల గుండెల్లో నిలిచిపోగా, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టీవీఎస్ వేసిన కొత్త అడుగు టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ (TVS Orbiter EV).

రూ.60,000 ధరకే 75కిమీ మైలేజ్ ఇచ్చే బైక్స్

ఈ రోజుల్లో స్కూటర్ల హవా నడుస్తున్నప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు, ముఖ్యంగా మన దేశంలోని రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బైక్‌లే ఇప్పటికీ బెస్ట్. ఎక్కువ వీల్స్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కారణంగా స్కూటర్ల కంటే బైక్‌లే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్ లేదా చిన్నచిన్న ప్రయాణాల కోసం, తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది.

వలం ఫస్ట్ 999 మందికే ఈ ఛాన్స్

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కూడా తమ సత్తా చాటాలని నిరూపించుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, తాజాగా తమ BE (Born Electric) ప్లాట్‌ఫామ్‌పై మూడవ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీనితో పాటు మార్కెట్‌లో ట్రెండీగా ఉన్న BE 6 EVకి ఫార్ములా E ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది.

రూ.30,000 జీతం వాళ్లు కొనగలిగే కార్లు ఇవే

భారతదేశంలో కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మార్కెట్‌లో లక్షల నుంచి కోట్ల వరకు విలువ చేసే కొత్త మోడళ్లు విడుదలవుతున్నప్పటికీ, దేశంలో కార్లు కొనుగోలు చేసే అతిపెద్ద వర్గం మిడిల్ క్లాస్ కుటుంబాలే. ఈ వర్గం ప్రజలు తమ కుటుంబ అవసరాల కోసం 5-సీటర్ సెగ్మెంట్‌లో ఉత్తమమైన, సరసమైన ధరలో లభించే కారు కోసం చూస్తారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న అత్యంత చౌకైన 5-సీటర్ కారు వివరాలు, ఇతర బడ్జెట్ కార్ల వివరాలు, తక్కువ జీతంతో కారు ఎలా సొంతం చేసుకోవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Advertisement

కారు కీతో చేయగలిగే 5 పనులివే

నేటి ఆధునిక కార్లలో ఫీచర్లు ఎంతగా అప్‌డేట్ అవుతున్నాయో, వాటి కార్ కీలు (Car Keys) కూడా అంతే స్మార్ట్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు కారును స్టార్ట్ చేయడం, లాక్-అన్‌లాక్ చేయడం వరకే కీ పని పరిమితమయ్యేది. కానీ ఇప్పుడున్న స్మార్ట్ కీలు (Smart Keys) అనేక కొత్త ఫంక్షన్లను నిర్వహిస్తున్నాయి.

కారు కొనాలంటే కొద్ది రోజులు ఆగండి

భారతదేశంలో SUV మార్కెట్ రోజురోజుకూ బలంగా మారుతోంది. ఒకప్పుడు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి, లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా ఉండే SUV మోడల్స్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉంది.

కరెంట్ స్కూటర్లను ఎడాపెడా కొనేస్తున్నారు

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కాలంగా ఈవీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ల సెగ్మెంట్ మంచి వృద్ధిని నమోదు చేసింది.

బైక్ ధరకే కారు! కేవలం రూ.3.50 లక్షలు, 33 కి.మీ మైలేజ్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-presso) భారతీయ మార్కెట్లో ఒక ప్రధాన ఎంట్రీ-లెవల్ కారు. ఇది తక్కువ బడ్జెట్‌లో కుటుంబాల కోసం రూపొందించబడింది, అందుకే ఈ కారు సాధారణ వినియోగదారుల కోసం అత్యంత ఆకర్షణీయంగా మారింది. పేద వర్గం నుండి మధ్యతరగతి వర్గం వరకు ఉన్న కుటుంబాలు తమ అవసరాలను, బడ్జెట్ పరిమాణాలను దృష్టిలో పెట్టుకొని ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. నగరాల్లో రోజు ప్రయాణానికి అనువుగా ఉండటం, పార్కింగ్ సులభంగా చేయగలిగే సైజు, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఈ కారును మరింత వినియోగదారులకు నమ్మకమైన ఎంపికగా నిలిపాయి. పైగా ఒక ప్రీమియం బైక్ ధరలోనే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్-ప్రెస్సో గురించిన ఇతర పూర్తి వివరాలు ఈ కింది కథనంలో చూద్దాం.
Advertisement

మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ SUV పూర్తి రివ్యూ

మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ SUV రివ్యూ: ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, డ్రైవింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. ఇది కుటుంబాలకు మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులకు అనుకూలంగా ఉంటుందా?

రూ.65 వేలకే 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్!

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఏ బైక్ అయినా విజయాన్ని సాధించాలంటే ఒక విషయం మాత్రం ఖాయం.. తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో పెద్దఎత్తున పనిచేసే జనాభా రోజూ దూర ప్రయాణాలు చేస్తుంటారు. పెరుగుతున్న ఇంధన ధరలను చూసి చాలామందికి ప్రతిరోజూ పెట్రోల్ ఖర్చు భారంగా అనిపిస్తోంది. అలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో నడిచే, లీటరుకు ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చే బైక్‌కి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇదే సందర్భంలో బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా (Bajaj Platina) ఎప్పటినుంచో వినియోగదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచి మైలేజ్ కింగ్ అనే పేరును గట్టిగా నిలబెట్టుకుంది.

ఇంతకన్నా పవర్‌‌ఫుల్ డస్టర్ ఎప్పుడూ రాలేదు!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ (Renault Duster) మరోసారి భారత రోడ్లపై అడుగుపెట్టేందుకు సమయం దగ్గరపడింది. ఒకప్పుడు దేశీయ SUV మార్కెట్‌ను ఒంటిచేత్తో కుదిపేసిన ఈ మోడల్ తిరిగి రావడం అంటే అభిమానుల్లో ఉత్సాహం సహజమే. 2012లో మొదటిసారి భారత్‌లో ప్రవేశించి, రఫ్-అండ్-టఫ్ లుక్‌తో, ఆఫ్-రోడ్ క్యారెక్టర్‌తో, డ్రైవింగ్ కంఫర్ట్‌తో వేలాదిమందిని తనవైపు తిప్పుకున్న ఈ SUV కొన్ని వ్యూహాత్మక కారణాలతో 2022లో నిలిపివేయబడింది. అయితే, దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కొత్త రూపంలో మళ్లీ రంగంలోకి వస్తుండటంతో డస్టర్ ఫ్యాన్స్‌కి ఇది ఒక పెద్ద గుడ్‌న్యూస్. కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఆవిష్కరణకు గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తేదీని ఖరారు చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది.

7 మంది కలిసి వెళ్లొచ్చు.. ఒక కి.మీ వెళ్లడానికి కేవలం రూ.1.2 చాలు!

ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు సాధారణ కుటుంబాలపై పెద్ద భారం అయ్యాయి. రోజూ ఆఫీస్‌కి వెళ్లేవారైనా, పిల్లలను స్కూల్‌కి తీసుకెళ్లేవారైనా... ప్రతి కిలోమీటర్‌కి ఫ్యూయల్ ఖర్చు పెరిగిపోతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందించే తక్కువ రన్నింగ్ ఖర్చు, సులభమైన నిర్వహణ, మినిమమ్ మెయింటెనెన్స్ ప్రజలను సహజంగానే ఈవీల వైపు తిప్పుతోంది. ఈ మార్పును స్పష్టంగా గమనించిన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ ఎలక్ట్రిక్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఫ్యామిలీ సెగ్మెంట్‌కి సరిపోయే మోడళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీదారైన మహీంద్రా కూడా ఇదే దారిలో ముందడుగు వేసి కొత్తగా XEV 9S అనే ప్రీమియం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
Advertisement

46,000 మంది హృదయాలను దోచిన బైక్!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) మరోసారి తన దమ్మును నిరూపించింది. తాజాగా విడుదలైన అక్టోబర్ 2025 అమ్మకాల గణాంకాలు ఈ బైక్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే క్లాసిక్ 350 మొత్తం 46,573 యూనిట్లు అమ్ముడవడం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పెద్ద విజయంగా నిలిచింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగుదల మరింత ఆసక్తికరంగా ఉంది. అక్టోబర్ 2024లో ఈ మోడల్ 38,297 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక ఏడాదిలోనే అమ్మకాలు భారీగా పెరిగి, అదనంగా 8,276 బైక్‌లు మార్కెట్లో విక్రయించబడ్డాయి.

అన్న ముందు తలొంచిన తమ్ముడు

భారతదేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇటీవలే కొత్త టాటా సియెర్రా (Tata Sierra) మోడల్‌ను విడుదల చేయడంతో, ఎస్‌యూవీ మార్కెట్‌లో నాలుగో వంతు వాటాను దక్కించుకోవాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం టాటా పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్లు టాటా పంచ్, దాని అన్నయ్య టాటా నెక్సాన్.

పేదవాడికి టీవీఎస్ ఇచ్చిన పెద్ద బహుమతి

భారతదేశంలో స్కూటర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). స్కూటర్ కొనాలనుకునే వారి మొదటి ఎంపిక ఇప్పటికీ యాక్టివానే. అయితే ప్రస్తుతం స్కూటర్ సెగ్మెంట్‌లో యాక్టివాకు గట్టి పోటీ ఇచ్చే అనేక మోడళ్లు వచ్చాయి. అందులో ముఖ్యమైనది టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter).

భారత్ NCAPలో 5-స్టార్.. మీ బడ్జెట్‌లోనే వచ్చే సేఫ్టీ కార్ ఇదే

హోండా అమేజ్ (Honda Amaze) మూడవ తరం వెర్షన్ తన భద్రతా ప్రమాణాలతో భారత మార్కెట్లో మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది. ఇటీవల భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ కారు అద్భుతమైన ఫలితాలను సాధించింది. ప్రయాణికుల రక్షణను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని రూపొందించిన ఈ కొత్త జనరేషన్ అమేజ్, టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది అందరినీ ఆకట్టుకుంది. భారతదేశంలో ఈ మూడవ తరం అమేజ్ 2024 డిసెంబరులో విక్రయాలకు వచ్చినప్పటి నుంచి కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పుడు క్రాష్ టెస్ట్ ఫలితాలు రావడంతో ఈ కారుకు మరింత విశ్వసనీయత పెరిగింది.
Advertisement

దేశమంతా ఎదురుచూస్తోన్న కారు వచ్చేస్తుంది

కొత్త మారుతి సుజుకి (Maruti Suzuki) ఇ-విటారా (e Vitara) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ SUVల విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఈ మోడల్‌ను డిసెంబర్ 2న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం, దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. మారుతి దీనిని తన అత్యంత కీలక EVగా మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లీకులు, టీజర్లు, రిపోర్ట్లు చూసినప్పుడే ప్రజల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ SUV ధరను సాధ్యమైనంత పోటీగా ఉంచే ప్రయత్నం చేస్తోంది మారుతి. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా ఎక్కువ ఖరీదైనవిగా భావించినప్పటికీ, ఇ-విటారా ధరను సుమారు రూ.17 లక్షల నుంచి రూ.22.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యగా నిర్ణయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.