జనాలందరూ ఆ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ ఏర్పడిన ఉత్సాహం రోజురోజుకూ కొత్త ఎత్తులకు చేరుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సహక చర్యలు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన.. ఈ మూడు కలిసి భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను మెల్లగా కానీ బలంగా ఎలక్ట్రిక్ మోడ్‌కి తిప్పేస్తున్నాయి. దీనివల్ల గత కొన్నేళ్లలో EVల డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు కన్పించడం సాధారణమైపోయింది. కస్టమర్లలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ దృష్టిని వేగంగా ఎలక్ట్రిక్ విభాగంపై కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, గత నవంబర్‌లో ఏ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాయో వివరాలను చూద్దాం.

చలికాలంలో ఈ పొరపాట్లు చేస్తే బ్యాటరీ లైఫ్ ఖతం

చలికాలం అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక పెద్ద సవాలును తీసుకొస్తుంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు, ఈవీ బ్యాటరీల పనితీరుపై ప్రభావం చూపడం సహజం. ఈ సమయంలో సరైన అవగాహన లేని డ్రైవర్లు చేసే కొన్ని సాధారణ పొరపాట్ల వల్ల బ్యాటరీ సామర్థ్యం, లైఫ్ స్పాన్ రెండూ తగ్గుతాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నట్లయితే, చలికాలంలో ఛార్జింగ్ సమయంలో కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఛార్జింగ్ అలవాట్లు దీర్ఘకాలంలో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు.

అందరి ఫేవరెట్ స్విఫ్ట్ ఇప్పుడు మరింత చీప్!

మారుతి సుజుకి స్విఫ్ట్‌ (Maruti Suzuki Swift)... పేరు వినగానే భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఓ ఐకాన్ గుర్తుకువస్తుంది. దాదాపు కొన్ని లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, ఏళ్ల తరబడి హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతూ వస్తున్న ఈ కారు, ఇప్పుడు GST తగ్గింపు లాభాలతో మరింత రణరంగం సృష్టిస్తోంది. ధరలు తగ్గడంతో మారుతి షోరూమ్‌ల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగిపోయింది. కొత్తగా కస్టమర్లు మాత్రమే కాదు, ఇప్పటికే కారు కొనాలని చూసిన వారు కూడా ధరల తగ్గింపును సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వేళ, సంవత్సరాంతం కావడంతో ఉన్న స్టాక్‌ను త్వరగా క్లియర్ చేసుకోవడానికి మారుతి సుజుకి భారీ ఆఫర్ల దిశగా అడుగుపెట్టింది. డిసెంబర్ 2025ను లక్ష్యంగా చేసుకుని, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్‌పై కంపెనీ అగ్రెసివ్‌గా డీల్స్ ప్రకటించింది.

మనోళ్లంతా డబ్బులు ఉన్నోళ్లు అయిపోయారు

భారతదేశంలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ వృద్ధి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా వంటి ప్రధాన బ్రాండ్‌లు నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
Advertisement

కస్టమర్ల నమ్మకమే లక్ష దాటించింది

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) సంస్థ 2025 నవంబర్ నెలలో అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ నవంబర్ నెలలో మొత్తం 1,22,300 టూ వీలర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం 2024 నవంబర్‌లో అమ్ముడైన 94,370 యూనిట్లతో పోలిస్తే, ఏకంగా 29.60 శాతం (27,930 యూనిట్లు) అధికం కావడం విశేషం. దీని ద్వారా సుజుకి ఇండియన్ మార్కెట్‌లో లక్షకు పైగా టూ వీలర్లను విక్రయించే ప్రముఖ కంపెనీల సరసన నిలిచింది. సుజుకి ద్విచక్ర వాహనాల కోసం భారతీయ మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. దేశీయ మార్కెట్‌లో 96,360 యూనిట్ల విక్రయాలు జరగగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 23.01 శాతం వృద్ధిని సూచిస్తుంది. అదేవిధంగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. 2024 నవంబర్‌లో 16,037 యూనిట్లుగా ఉన్న ఎగుమతులు, 2025 నవంబర్‌లో 61.75 శాతం పెరిగి 25,940 యూనిట్లకు చేరుకున్నాయి.

కేవలం ఒక నెలలో 2,064 ట్రైబర్లు! మధ్యతరగతి అడిగేదీ ఇదే!

ఫ్రెంచ్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) ఇండియా నవంబర్ 2025 నెలను చాలా సానుకూలమైన అమ్మకాలతో ముగించింది. ప్రత్యేకించి భారత కుటుంబాల మధ్య మంచి క్రేజ్ ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Triber) ఈసారి ఆశించిన దానికంటే మెరుగైన స్పందనను సొంతం చేసుకుంది. తాజాగా వెలువడిన నెలవారీ సేల్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రైబర్ నవంబర్‌లో 2,064 యూనిట్లు అమ్ముడవుతూ మంచి దూకుడు చూపించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ MPV 1,486 యూనిట్ల వద్ద నిలిచింది. అంటే, సంవత్సరం వ్యవధిలో ట్రైబర్ డిమాండ్ గణనీయంగా పెరిగి, 578 అదనపు యూనిట్ల వృద్ధిని నమోదు చేసింది. ట్రైబర్‌ సేల్స్‌లో కనిపించిన ఈ పెరుగుదల, ఈ మోడల్‌పై కస్టమర్ నమ్మకం ఎంత పెరిగిందో మరోసారి నిరూపించింది.

30 రోజుల్లో 6 లక్షల సేల్స్! మార్కెట్లో ఊచకోత

భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు నవంబర్ 2025 నిజంగా పండుగ నెలగా మారింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీదారైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఈ నెలను అద్భుతమైన పనితీరుతో ముగించింది. తాజాగా విడుదలైన అధికారిక అమ్మకాల గణాంకాలు పరిశ్రమలో తిరిగి విశ్వాసాన్ని నింపాయి. ప్రజలు తిరిగి బైక్‌ల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైంది. నవంబర్ 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 6,04,490 యూనిట్లను మార్కెట్లోకి పంపింది. ఇందులో దేశీయ విక్రయాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎగుమతులు కూడా ఉన్నాయి. ఏకంగా యూనిట్ల సంఖ్యను చూస్తేనే కంపెనీపై తిరిగి ప్రజల నమ్మకం ఎంత బలమైనదో తెలుస్తుంది.

ఎక్కువ మైలేజ్, సేఫ్టీ.. రూ.5 లక్షల్లోనే 5 సీట్ల కారు

భారతీయ మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే బడ్జెట్‌కు అనుకూలమైన అనేక 5-సీట్ల ఫ్యామిలీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు కేవలం తక్కువ ధరకే కాకుండా ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు అద్భుతమైన మైలేజ్‌ను కూడా అందిస్తున్నాయి. మీరు గనుక ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబం కోసం, సౌకర్యవంతమైన, సరసమైన కారును వెతుకుతున్నట్లయితే మారుతి సుజుకి (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ (Hyundai) వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఈ మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు రూ.4.92 లక్షల నుంచే ప్రారంభమవుతాయి.
Advertisement

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు

టాటా మోటార్స్ నెక్సాన్ (Tata Motors Nexon) నవంబర్ నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగా సంచలనం సృష్టించింది. సంవత్సరాల తరబడి మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తోన్న అత్యంత పోటీభరితమైన సెగ్మెంట్‌లో, నెక్సాన్ వరుసగా మూడో నెల కూడా టాప్ స్థానాన్ని కాపాడుకోవడం చిన్న విషయం కాదు. భారతీయ కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు, మార్కెట్ దిశ ఏమిటి, నమ్మకం ఎక్కడికి మారుతోంది అన్న ప్రశ్నలకు నెక్సాన్ అమ్మకాలు స్పష్టమైన సమాధానమే ఇచ్చాయి. తాజాగా విడుదలైన సేల్స్ గణంకాల ప్రకారం, నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఇది అక్టోబర్‌లో నమోదైన 22,083 యూనిట్లతో పోలిస్తే వృద్ధిగా చెప్పవచ్చు.

ఢీ అంటే ఢీ..టాటా సియెరా vs మారుతి గ్రాండ్ విటారా

భారతీయ మార్కెట్‌లో టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా తమ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ టాటా సియెరా (Tata Sierra)ను లాంచ్ చేసింది. మార్కెట్‌లోకి రాగానే దీనిని నేరుగా మారుతి సుజుకి పాపులర్ గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)కి గట్టి పోటీదారుగా భావిస్తున్నారు. ఈ రెండు ఎస్‌యూవీలు కూడా మంచి ఫీచర్లు, విభిన్న ఇంజన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. అయితే, మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ, ధర వంటి అంశాలలో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది చాలా మంది కొనుగోలుదారుల సందేహం. ఆ వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

పల్సర్ కొనేవాళ్లకు ఇప్పుడే 23 వేల వరకూ సేవింగ్!

పండుగ సీజన్‌లో బజాజ్ పల్సర్ (bajaj pulsar) సిరీస్ ఎలా అమ్ముడుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోరూంల ముందు భారీగా క్యూలు, డెలివరీల కోసం ఎదురుచూసే కస్టమర్లు, డిమాండ్‌ను ఏ క్షణానైనా ఛేదించేలా ఉన్న మార్కెట్ ఉత్సాహం.. ఇవన్నీ కలిసి పల్సర్ బ్రాండ్‌కు మరోసారి తన సత్తాను చాటించాయి. ఈ వేడిని కొనసాగించాలనుకున్న బజాజ్ ఆటో ఇప్పుడు కస్టమర్ల కోసం నిజంగా రుచికరమైన వార్తను ప్రకటించింది. పల్సర్ అభిమానులు ఎంతో ఇష్టపడే పల్సర్ హ్యాట్రిక్ ఆఫర్ (Pulsar Hattrick Offer) ను కంపెనీ మళ్లీ తీసుకొస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇది సాధారణ ఆఫర్ కాదు... సంవత్సరాంతానికి ముందే బైక్ కొనాలనుకునే వారికి పూర్తిగా అదనపు విలువను అందించే ప్రత్యేక పథకం.

డిసెంబర్‌లో హ్యుందాయ్ ఆఫర్ల సునామీ

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డిసెంబర్ నెల కోసం ప్రత్యేకంగా డిసెంబర్ డిలైట్ అనే భారీ ఆఫర్ల ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై వినియోగదారులు ఏకంగా రూ.1,00,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఇయర్ ఎండ్ వేడుకలను మరింత ఉత్సాహంగా, లాభదాయకంగా మార్చడానికి కంపెనీ అందిస్తున్న బంపర్ ఆఫర్.
Advertisement

మారుతి తొలి EV అదరగొట్టింది! లాంచ్‌కు ముందే 5 స్టార్ సేఫ్టీ సెన్సేషన్!

మారుతి సుజుకి (Maruti Suzuki) చాలా ఆలస్యంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది అనిపించినా... తొలి ప్రయత్నంతోనే ఆటో మార్కెట్ మొత్తాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఎన్నో అంచనాలు, ఊహాగానాల నడుమ ఎంతోకాలం ఎదురుచూపులకు తెరదిస్తూ ఇ-విటారా (e-vitara)ను భారత మార్కెట్లోకి నిన్న అధికారికంగా విడుదల చేసింది. కానీ ఈ లాంచ్‌లో అసలు కథ ఏమిటంటే, కారు షోరూమ్‌కి చేరుకునేలోపే, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5-స్టార్ భద్రతా రేటింగ్ అందుకోవడం. ఇది మారుతి కోసం సాధారణ విషయం కాదు... భారత మార్కెట్‌లో చాలా సంవత్సరాలుగా మారుతి అంటే మైలేజ్, కానీ భద్రత అంత బాగుండదు అనే భావన ప్రజల్లో బలంగా ఉండేది. ఆ మాటకారులు కూడా ఇప్పుడు ఈ ఫలితాన్ని చూసి ఒక్కసారిగా ఆలోచించే పరిస్థితి వచ్చింది.

ఒక్కసారే పెట్టుబడి..జీవితాంతం ఫ్రీ జర్నీ

భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఊపందుకుంటున్న తరుణంలో దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ అయిన ఎమోటోరాడ్ (EMotorad) ఒక విప్లవాత్మక మోడల్‌ను విడుదల చేసింది. అదే టి-రెక్స్ స్మార్ట్(T-Rex Smart). ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్, దైనందిన ప్రయాణాలను మరింత సులభతరం చేయడంతో పాటు, టెక్నాలజీ, క్వాలిటీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ముఖ్యంగా బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీతో మార్కెట్‌లోకి వచ్చిన భారతదేశపు మొట్టమొదటి ఈ-సైకిల్ ఇదే. స్పీడుతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఆధునిక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని టి-రెక్స్ స్మార్ట్ను అభివృద్ధి చేశారు.

సేల్స్ లో దుమ్ము దులుపుతున్న ఓమ్ని వారసుడు

భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు తిరుగులేని స్థానం సంపాదించుకున్న మారుతి సుజుకి ఓమ్నికి అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలిచిన కారు మారుతి సుజుకి ఈకో. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం వంటి మూడు ప్రధాన కారణాల వల్ల ఈకో భారతీయ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది.

దేశమంతా ఎదురుచూసిన మారుతి ఇ-విటారా లాంచ్

మారుతి సుజుకి (Maruti Suzuki) భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికే విధంగా ఇ-విటారా (e-vitara)ను డిసెంబర్ 2న గురుగ్రామ్‌లో ఘనంగా ఆవిష్కరించింది. ఎన్నో నెలలుగా ఆటో లవర్స్ ఎదురు చూసిన ఈ కారు, దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న మారుతి నుండి వచ్చిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV కావడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారత ఎలక్ట్రిక్ కార్ల ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ మోడల్, డిజైన్ నుంచి టెక్నాలజీ వరకు ప్రతీ అంశంలో వినియోగదారుల అంచనాలకు మించి అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. కొత్త తరం సుజుకి అంతర్జాతీయ EV ప్లాట్‌ఫామ్ అయిన HEARTECT-e ఛాసిస్‌పై తయారైన ఇ-విటారా, ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బలమైన నిర్మాణం, తక్కువ బరువు, మెరుగైన ఎనర్జీ ఎఫిషెన్సీని అందిస్తుంది.
Advertisement

దేశంలో చౌకన కార్లకు జనాలు మంగళహారతులు

ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ బ్రాండ్ రెనాల్ట్ (Renault) మరోసారి భారత మార్కెట్లో తన సత్తాను చాటుకుంది. దేశంలో క్విడ్, కిగర్, ట్రైబర్ వంటి బడ్జెట్-ఫ్రెండ్లీ, ప్రాక్టికల్ కార్లను అందిస్తూ, ఈ కంపెనీ మధ్య తరగతి కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ రెనాల్ట్ కార్లకు మంచి ఆదరణ ఉంది. కారణం.. సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్, స్టైలిష్ డిజైన్, కుటుంబ అవసరాలను తీర్చే స్పేస్. తాజాగా విడుదలైన నవంబర్ నెల విక్రయ గణాంకాలు రెనాల్ట్‌కి మరో మైలురాయిగా నిలిచాయి. ఈ నెలలో కంపెనీ మొత్తం 3,662 యూనిట్లను కొనుగోలుదారులకు డెలివరీ చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో 2,811 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

స్టేటస్ సింబల్‎గా మారిపోయిన రాయల్ ఎన్ ఫీల్డ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉండే గౌరవం, ప్రత్యేకమైన స్థానం అందరికీ తెలిసిందే. చాలామంది భారతీయులు ఈ బైక్‌లను స్టేటస్ కోసమే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నవంబర్ 2025 నెలలో ఏకంగా లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి కొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సంవత్సరం అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. మొత్తం అమ్మకాల గణాంకాలు, గత సంవత్సరం నవంబర్, ఈ సంవత్సరం అక్టోబర్‌తో పోలిక వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

పేద-మధ్యతరగతి జనాల కోసం దేవుడిచ్చిన వరం ఈ బైక్!

భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు రోజువారి ప్రయాణాల్లో ఖర్చు తగ్గించుకోవడానికి చిన్న ఇంజిన్‌ విభాగంలో వచ్చే, అధిక మైలేజ్ ఇచ్చే టూవీలర్లునే ఎక్కువగా ఎంచుకుంటాయి. పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజూ ఆఫీసు, స్కూల్, మార్కెట్, చిన్న చిన్న పనుల కోసం అధిక మైలేజ్ ఇచ్చే బైక్ తప్ప మిగతా ప్రత్యామ్నాయం కనిపించదు. అందుకే 100cc-110cc సెగ్మెంట్ ఇప్పటికీ దేశంలో టాప్ డిమాండ్ ఉన్న విభాగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, భారతీయ టూవీలర్ మార్కెట్లో హోండా షైన్ 100 (Honda Shine 100) తనకు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హోండా కంపెనీ ఇప్పటికే విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మైలేజ్ విషయంలో మంచి పేరొందింది. ఈ నమ్మకం ఆధారంగా భారతీయ వినియోగదారులు షైన్ 100 వైపు ఆకర్షితులవుతున్నారు.

దేశాన్ని షేక్ చేయడానికి దిగుతున్న మొనగాడు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఒక పెద్ద వార్త. ఈ సంస్థ తన తయారీ కర్మాగారాన్ని తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ విన్‌ఫాస్ట్ VF 6, VF 7 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) లను ఉత్పత్తి చేసి, భారత మార్కెట్లో విక్రయిస్తోంది.
Advertisement

పండుగ సీజన్‌లో గర్జించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ (Tata Motors) ఈసారి పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంది. మార్కెట్ నెమ్మదిస్తున్నా, పోటీ పెరుగుతున్నా, టాటా మాత్రం తన సేల్స్‌తో మరొకసారి ఎందుకు దేశంలోని అత్యంత నమ్మకమైన ఆటో బ్రాండ్‌గా నిలుస్తుందో నిరూపించింది. తాజాగా వచ్చిన నవంబర్ 2025 సేల్స్ గణాంకాలు చూస్తే, కంపెనీ ప్రదర్శన కేవలం బాగుంది అనడం సరిపోదు, ఇది ఈ ఏడాది అత్యంత బలమైన నెలలలో ఒకటిగా నిలిచింది. దేశీయంగా అయినా, ఎగుమతులలో అయినా, ప్రతి విభాగంలోనూ టాటా వృద్ధిని సాధించింది. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో ముందెన్నడూ లేని రీతిలో డిమాండ్ పెరిగింది. పండుగ సీజన్ కొనుగోళ్లు, టాటా కార్ల భద్రతా ప్రమాణాలపై ఉన్న నమ్మకం, కొత్త మోడళ్ల స్వాగతం అన్నీ కలిసి కంపెనీకి మంచి ఊపునిచ్చాయి.

ఈ కంపెనీ కార్లంటే పిచ్చెక్కి పోతున్న జనాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటింది. నవంబర్ 2025లో కంపెనీ మొత్తం 66,840 యూనిట్ల(దేశీయ + ఎగుమతులు)ను కొనుగోలుదారులకు విక్రయించింది. 2024 నవంబర్‌లో విక్రయించిన 61,252 యూనిట్లతో పోలిస్తే, ఇది 9.12% వృద్ధిని నమోదు చేసింది.

హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.47 చాలు!

భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (mahindra) ఎప్పటి నుంచో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ. అయితే ప్రస్తుతం ఇది పూర్తిగా కొత్త దారిని ఎంచుకుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల యుగానికి తగినట్లుగా, మహీంద్రా తన సాంకేతికతను, తన శైలిని, తన దృష్టిని మొత్తం EV భవిష్యత్తుపై కేంద్రీకరించింది. ఆ ప్రయాణంలోనే తాజాగా వచ్చిన గొప్ప అడుగు కొత్త మహీంద్రా XEV 9S. ఈ 7 సీట్ల ఎలక్ట్రిక్ SUV కేవలం ఒక కొత్త మోడల్ మాత్రమే కాదు, కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఎంత ఇష్టంగా పనిచేస్తోంది అనేది బలంగా చూపిస్తుంది. దూర ప్రయాణాల్లో EVలు సాధ్యం కాదనే పాత అభిప్రాయాలను చెరిపేసే విధంగా, XEV 9S ఒకే ఛార్జ్‌పై అందించే దూరం అసలు ఈ వాహనానికి ప్రధాన ఆకర్షణ.

నాన్న.. సింహమే సింగిల్ గా వస్తుంది

2025 నవంబర్ నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ విక్రయాల గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించాయి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ, మారుతి సుజుకి షోరూమ్‌లలో అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గలేదని విక్రయాల నివేదిక స్పష్టం చేస్తోంది. కాంపాక్ట్ కార్లు, యూటిలిటీ వాహనాలకు (SUV/MPV) బలమైన డిమాండ్ కారణంగా, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) నవంబర్ 2025లో బలమైన విక్రయాలను నమోదు చేసింది.
Advertisement

ఈ ఆటో కొంటే డ్రైవర్ అవసరం లేదు

ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ తయారీదారు ఒమేగా సైకి మొబిలిటీ (Omega Seiki Mobility - OSM) ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మక అడుగు వేసింది. భారతదేశపు మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ స్వయంగతి కార్గోను ఈ సంస్థ రిలీజ్ చేసింది. ఈ వెహికల్ డ్రైవర్ అవసరం లేకుండానే సరుకులను రవాణా చేయగలదు.