అక్టోబర్‌లో స్ప్లెండర్ అమ్మకాలు గట్టిగా తగ్గాయి
ఆటోమొబైల్స్
- 9 month, 23 days ago
హీరో స్ప్లెండర్ (hero Splendor) ను ఎందుకు నంబర్ 1 బైక్‌గా పిలుస్తారో కారణం చాలా సింపుల్.. ఇది భారతదేశ పేద, మధ్యతరగతికి సరిపోయే మోడల్. ఈ కుటుంబాలకు ఇది ఒక నమ్మకమైన భాగస్వామిలా ఉంటుంది. తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ అనే మూడు ముఖ్యమైన గుణాలు ఈ బైక్‌ను లక్షలాది మంది రోజువారీ ప్రయాణికుల మొదటి ఎంపికగా మారుస్తాయి. పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఒకేలా ప్రదర్శన ఇవ్వగలిగే బైక్ ఇది. ఏ పరిస్థితుల్లోనైనా సులభంగా నడపవచ్చు. ఇంధనం ఖర్చు తగ్గించాలనుకునే వారికి స్ప్లెండర్ ఒక వరం లాంటిది. అయితే, ఈ అక్టోబర్ నెలలో హీరో స్ప్లెండర్ అమ్మకాల్లో కొద్దిగా వెనుకడుగు పడింది. సాధారణంగా ప్రతి నెలా లక్షల సంఖ్యలో అమ్ముడయ్యే ఈ బైక్‌కు ఈసారి డిమాండ్ కొంత తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.