ఈ సారి కొడితే దెబ్బ మామూలుగా ఉండదు

మారుతి సుజుకి నుంచి మార్కెట్లో దూసుకుపోతున్న ప్రముఖ SUV లలో బ్రెజా (Maruti Suzuki Brezza) ఒకటి. దీని ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నప్పటికీ, ప్రతినెలా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ వినియోగదారుల ఫేవరెట్ కార్‌గా నిలిచింది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026లో ఈ బ్రెజా సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే రహస్యంగా టెస్టింగ్‌లు ప్రారంభించింది. కొత్త బ్రెజా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

MG విండ్సర్ EV కేవలం 400 రోజుల్లోనే 50,000 సేల్స్!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో టాటా మోటార్స్ ఒక్కదాని ఆధిపత్యం నడిపితే, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా రంగంలోకి వచ్చిన కంపెనీలు, ముఖ్యంగా JSW MG మోటార్ ఇండియా, కేవలం ఒకే మోడల్‌తో మార్కెట్‌ వ్యవస్థనే తారుమారు చేస్తున్నాయి. ఆ మోడల్‌ మరెవరో కాదు... ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా EV కొనుగోలుదారుల మనసుల్ని గెలుచుకున్న MG విండ్సర్ EV. ఇండియన్ మార్కెట్‌లో EV సెగ్మెంట్‌ను రీడిఫైన్ చేసిన ఈ క్రాస్‌ఓవర్ యుటిలిటీ వాహనం అమ్మకాల విషయంలో నిజంగా కొత్త చరిత్ర రాసింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లు అమ్ముడవడం భారతీయ ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో అరుదైన ఘనత సాధించింది.

పేరు మార్చుకుంటున్న మహీంద్రా 7-సీటర్ కారు

మహీంద్రా కంపెనీ చరిత్రలోనే ఒకప్పుడు XUV500 సృష్టించిన సంచలనాన్ని నెక్ట్స్ లెవల్‎కు తీసుకెళ్లిన మోడల్ XUV700. పాత మోడల్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది, కంఫర్ట్, సేఫ్టీని రెట్టింపు చేసి మార్కెట్‌లోకి వచ్చిన ఈ 7-సీటర్ ఎస్‌యూవీ టయోటా ఇన్నోవా (Toyota Innova) కొనాలనుకున్న చాలా మందిని కూడా తన వైపు లాక్కుంది. అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్, సౌకర్యాన్ని అందించి ఈ మోడల్ చాలా త్వరగా ఇండియాలో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం భారత రోడ్లపై 3 లక్షలకు పైగా XUV700 కార్లు దూసుకుపోతున్నాయి.

ఆ కారు కొంటే 10ఏళ్లు టెన్షన్ పడాల్సిన పనిలేదు

సబ్-4 మీటర్ల సెడాన్ సెగ్మెంట్‌లో ఎప్పుడూ మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) హవానే ఉంటుంది. అయితే ఆ డిజైర్‌కు గట్టి పోటీ ఇచ్చే మోడల్‌గా హోండా అమేజ్ (Honda Amaze) పేరు తెచ్చుకుంది. పాత రోజుల్లో ఉన్నంత జోరు లేకపోయినా, ఇటీవల కొత్త జనరేషన్‌గా (న్యూజెన్) మార్కెట్‌లోకి వచ్చిన అమేజ్‌ను కొనుగోలుదారులు బాగా ఆదరిస్తున్నారు. ప్రముఖ మోడల్ సిటీ అమ్మకాలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హోండా కంపెనీకి అమేజ్ అమ్మకాలు ఒక పెద్ద ఊరటగా నిలిచాయి.
Advertisement

అందరూ ఇష్టంగా కొంటున్న కారు.. రూ. 8 లక్షల్లో వస్తోంది!

టయోటా (Toyota) భారత మార్కెట్లో తిరిగి వేగం అందుకుంటున్న సమయంలో, కంపెనీ అమ్మకాల పెరుగుదలకు కీలక కారణంగా రీబ్యాడ్జ్ స్ట్రాటజీ నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా టయోటా మారుతి సుజుకితో కలిసి పనిచేసి, పరస్పరం కార్లు, టెక్నాలజీని పంచుకునే భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ వ్యూహం ఫలితం భారత మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రీబ్యాడ్జ్ చేయబడిన మోడళ్లే టయోటా మొత్తం అమ్మకాలలో దాదాపు సగం వాటాను అందిస్తున్నాయి. మారుతి సుజుకి పాపులర్ క్రాస్ఓవర్ SUV ఫ్రాంక్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న టయోటా టైజర్ (Toyota Taisor) ఈ జాబితాలో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే టయోటా గత నెలలో టైజర్ 1469 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది.

తక్కువ బడ్జెట్‌లో సేఫ్టీ సూపర్.. టాటా టిగోర్ 2025 హైలైట్స్

సెడాన్ కార్లంటే ప్రత్యేకమైన అందం, క్లాస్, కంఫర్ట్ అన్నీ కలిసి ఉండటం వల్ల చాలామందికి అవి మొదటి ఎంపికగా ఉంటాయి. అలాంటి సెడాన్ శ్రేణిలో బడ్జెట్‌కి తగ్గ ధరలో మంచి లుక్, మన్నిక, ఫీచర్లు ఆల్‌రౌండ్ ప్యాకేజ్‌గా కనిపించేది 2025 టాటా టిగోర్ (tigor). కొత్త టిగోర్‌ను ఒక్కసారి చూస్తేనే ఈ ధరలో ఇంత మంచి కారు ఎలా ఇచ్చారు? అని అనిపించేట్టుగా టాటా మోటార్స్ డిజైన్‌ నుండి ఫీచర్ల వరకు ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టింది. కొత్త తరం టాటా టిగోర్ తన క్లాస్‌లో అత్యంత విలువను అందించే కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది పలు వేరియంట్‌లలో లభించడం వల్ల, మీ బడ్జెట్‌కి, అవసరాలకి సరిపోయే ఆప్షన్‌ను ఎంచుకోవడం మరింత సులభం. టాటా కంపెనీకి ప్రత్యేకతైన ఘనమైన నిర్మాణ నాణ్యత టిగోర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

నీ కష్టాలు పగోడికి కూడా రావొద్దు

భారత మార్కెట్‌లో తమకంటూ ఒక పటిష్టమైన స్థానం దక్కించుకోవడానికి విదేశీ కార్ల కంపెనీలైన రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గత కొన్నేళ్లుగా చాలా కష్టపడుతున్నాయి. అక్టోబర్ 2025 కార్ల విక్రయాల జాబితాలో రెనాల్ట్ పదో స్థానంలో, నిస్సాన్ పన్నెండో స్థానంలో నిలిచాయి.

టాటా-మారుతికి షాక్.. హ్యూందాయ్ నుంచి బ్రహ్మాస్త్రం వస్తోంది

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో హ్యుందాయ్ ఒక్కటే కాదు, ఒక ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న బ్రాండ్. భారతీయ కస్టమర్‌కు ఏమి కావాలో, ఏ ట్రెండ్ ఏ సమయంలో హిట్ అవుతుందో అద్భుతంగా అంచనా వేసే సామర్థ్యం ఈ కంపెనీకి ఉంది. ఇదే కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా హ్యుందాయ్ తన మోడళ్లను మరింత ఆధునికంగా మార్చి, మార్కెట్లో తన ప్రభావాన్ని ఇంకా పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ, భారత కస్టమర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ అడుగు వేసింది, యూరప్‌లో మంచి క్రేజ్ సాధించిన కాంపాక్ట్ క్రాస్ఓవర్ Hyundai Bayon ను భారత్‌కు తీసుకురావడం. హ్యుందాయ్ బయోన్ భారత రోడ్లపై ఎప్పుడు దూసుకెళ్తుందా అనే ఆసక్తి చాలా నెలలుగా ఉంది. చివరికి, లాంచ్ టైమ్‌లైన్ బయటికొచ్చింది.
Advertisement

మీ ఆవిడకు ఈ స్కూటర్ కొనివ్వండి

మీరు మీ భార్యకు లేదా ఇంట్లో మహిళలకు సరికొత్త స్కూటర్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే, టీవీఎస్ జెస్ట్ 110 (TVS Zest 110) అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటి. తక్కువ బరువు కలిగి, మహిళలు సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల మహిళలు దీనిని సులభంగా నడపవచ్చు.కేవలం రూ.70,000 ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ జెస్ట్ 110 స్కూటర్ ధర ఎంత, దీని ప్రత్యేకతలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నయనతారకు ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్‌

దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా నిలిచిన అరుదైన నటి నయనతార (Nayanathara). తన అందం, నటన, కరిస్మా ఈ మూడు కలిసి తెరపై కనిపించగానే ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఆమెకుంది. మలయాళంలో కెరీర్ ప్రారంభించిన ఆమె, కొద్దికాలంలోనే తెలుగు-తమిళ పరిశ్రమల్లోనూ స్టార్‌డమ్ అందుకుంది. చంద్రముఖి, తులసి, అదుర్స్, శ్రీరామరాజ్యం, సింహ, సీమారాజు వంటి సినిమాల్లో ఆమె నటనకు ఎప్పటికప్పుడు ప్రశంసలు లభించాయి. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పరిశ్రమ ప్రముఖులు నుంచి అభిమానుల వరకు అందరూ ఆమెకు ప్రేమతో, అభిమానంతో శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపించింది.

ఈ కారులో కూర్చుంటే విమానంలో ఎక్కిన ఫీలింగ్

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోంది. దీనికి నిదర్శనంగా 2025 అక్టోబర్ నెల కార్ల అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఆ సంస్థ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

రూ.10 లక్షల్లో దుమ్ము రేపుతున్న బెస్ట్ MPV కార్లు

ఇండియాలో కుటుంబంతో చేసే ప్రయాణాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. చిన్నా-పెద్దా అందరూ ఒకే కారులో కలిసి ప్రయాణిస్తే వచ్చే ఆనందం, కలిసికట్టుగా గడిపే ఆ క్షణాల విలువ చెప్పలేనిదే. అలాంటి ఫ్యామిలీ ట్రిప్స్‌కి వెళ్తుంటే స్పేస్‌ ఉన్న కారు ఎంత అవసరం అవుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే మార్కెట్‌లో 7-సీటర్ లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్‌ ఆప్షన్‌తో వచ్చే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. కంఫర్ట్, స్పేస్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనుభవం ఇవన్నీ కలిపి ఇలాంటి కార్లను చాలా మంది మొదటి ఎంపికగా తీసుకుంటున్నారు. అక్టోబర్ నెలలో కూడా ఎంపీవీ కార్లు మెరుగైన గణంకాలను నమోదు చేశాయి. గత నెలలో అమ్మకాల్లో టాప్‌లో నిలిచిన రూ. 10 లక్షల లోపు ధరలో అత్యధికంగా అమ్ముడైన MPV మోడళ్లను ఈ కింది కథనంలో చూద్దాం.
Advertisement

ఫ్రెండ్‎కు కారు గిఫ్టుగా ఇచ్చిన హీరో

కోలీవుడ్‌లో కేవలం తన టాలెంట్, కష్టంతో అతి తక్కువ సమయంలోనే యూత్ సెన్సేషన్‌గా మారిన స్టార్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). దర్శకుడిగా కోమాలి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్, ఆ తర్వాత లవ్ టుడే, డ్రాగన్, ఇటీవల దీపావళికి విడుదలైన డ్యూడ్ (Dude) వంటి సినిమాలతో నటుడిగా కూడా మెప్పించారు.

5 నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడు పోలేదు

ప్రపంచవ్యాప్తంగా నిస్సాన్ (Nissan) కంపెనీకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. భారతదేశంలో మాత్రం మాగ్నైట్ (Magnite) ఎస్‌యూవీతో మళ్లీ ఊపిరి పోసుకుంది. మాగ్నైట్ సక్సెస్ తర్వాత నిస్సాన్ భారతదేశంలో మరింత బలపడాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఒకప్పుడు విఫలమైన ఎక్స్-ట్రైల్ (X-Trail) అనే భారీ ఎస్‌యూవీని టయోటా ఫార్చ్యూనర్‌(Toyota Fortuner) వంటి దిగ్గజాలు ఉన్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి మళ్లీ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్ అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. గత కొన్ని నెలలుగా ఎక్స్-ట్రైల్ అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ కారు కోసం దేశవ్యాప్తంగా కస్టమర్లు టాటా షోరూమ్‌లకు ఎగబడ్డారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. SUVలు ఎంత పాపులర్ అయినా, జనం రోజువారీ అవసరాలకు సరిపోయే చిన్న, చవక, మైలేజీ బాగుండే హ్యాచ్‌బ్యాక్‌ల వైపు ఎప్పుడూ ఆకర్షితులవుతూనే ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్, సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే సౌకర్యం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు.. అన్ని ప్రయోజనాల వల్ల హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో బలంగా నిలబడి ఉంది. ఇటీవల భారత్‌లో జరిగిన GST 2.0 సంస్కరణలు ఈ విభాగానికి మళ్లీ ఊపిరి పోశాయి. SUVల మోత తగ్గి వినియోగదారులు మళ్లీ విలువ కోసం చూస్తున్న సమయంలో, హ్యాచ్‌బ్యాక్ మార్కెట్ మరోసారి ఫోకస్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అత్యధిక లాభం పొందిన మోడళ్లలో ఒకటి టాటా టియాగో.

ఈ కారు లేకపోతే కంపెనీ పరిస్థితి ఏమయ్యేదో

JSW MG మోటార్ ఇండియా అక్టోబర్ 2025 నెల అమ్మకాల వివరాలను పరిశీలిస్తే, మార్కెట్లో ఈ బ్రాండ్‌కు కస్టమర్లు ఎలా స్పందిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి అమ్మకాల పట్టికలో కంపెనీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే, నెలవారీ, వార్షిక అమ్మకాల గణాంకాలను పోలిస్తే కంపెనీకి కొన్ని ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2025లో JSW MG మొత్తం 6,397 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 7,045 యూనిట్లతో పోలిస్తే 9% తగ్గుదల‌గా నమోదు అయింది. అమ్మకాల్లో ఈ వార్షిక తగ్గుదల MG మోటార్‌కు చిన్న షాక్ కాదు, భారత మార్కెట్లో పోటీ పెరిగిపోవడం, కొత్త బ్రాండ్ల ప్రవేశం, అలాగే SUV డిమాండ్‌లో వచ్చిన మార్పులు ఈ ప్రభావానికి ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.
Advertisement

డబ్బుల్లేవని అస్సలు బాధపడకండి

కొత్త ఎస్‌యూవీ (SUV) కొనాలని అనుకునేవారు, తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న కార్లు దొరుకుతాయా అని ఆలోచిస్తుంటారు. ఈ రోజుల్లో కారు ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల, తక్కువ ధరలో మంచి కార్లను ఎంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం రూ.15 లక్షల లోపు ధరలో లభించే, అద్భుతమైన ఫీచర్లతో కూడిన టాప్ 7 ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం.

ఇది పేదవాడి కారు.. 34 కి.మీ మైలేజ్, 4.70 లక్షలు

మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) దేశీయ మార్కెట్లో ఒకప్పుడు మంచి డిమాండ్‌ను సొంతం చేసుకున్న ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరొందింది. కాంపాక్ట్ సైజ్, ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లు, విశ్వసనీయత కోసం ఈ కారు అనేక కుటుంబాల మొదటి ఎంపికగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా సెలెరియో అమ్మకాల ధోరణి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా 2024 చివరి త్రైమాసికం నుంచి ఈ కారు అమ్ముడయ్యే సంఖ్యలో గణనీయమైన పడిపోవడం గమనార్హం. అక్టోబర్ నెలలో పరిస్థితి మరింత బలహీనంగా కనిపించింది. కంపెనీ దేశవ్యాప్తంగా కేవలం 1,322 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 3,044 యూనిట్లతో పోలిస్తే చాలా తక్కువ.

సబ్సిడీ ఇస్తున్నా ఈవీ సేల్స్ ఎందుకు పడిపోతున్నాయి

వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ హితమైన బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అయితే ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల అమ్మకాలు మాత్రం బాగా వెనుకబడిపోతున్నాయి.

ఇండియాలో టాప్ 3 ఫ్యామిలీ స్కూటర్లు

స్కూటర్లు భారతీయ రవాణాలో భాగంగా మారిపోయాయి. నగరాల్లో ట్రాఫిక్‌తో పోరాడే ఉద్యోగులు కావచ్చు, గ్రామీణ రోడ్లపై ప్రతిరోజూ ప్రయాణించే కుటుంబాలు కావచ్చు. ప్రతి ఒక్కరికీ స్కూటర్‌లు అత్యంత సౌకర్యవంతమైన వాహనాలుగా నిలుస్తున్నాయి. తేలికైన బాడీ, ఎవరికైనా సులభంగా నడపగలిగే డిజైన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే అద్భుతమైన ఇంధన సామర్థ్యం వల్ల ఇవి ఇంట్లో ఉన్న యువత నుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడే కుటుంబ వాహనంగా గుర్తింపు పొందాయి. ప్రత్యేకంగా మహిళలకు, కాలేజీ స్టూడెంట్లకు, ఉద్యోగులకు స్కూటర్ ఒక బెస్ట్ డైలీ కమ్యూట్ సొల్యూషన్‌గా మారింది. రూ. 1 లక్ష లోపు స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో ఇప్పుడు ఎన్నో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ స్కూటర్ల గురించి ఈ కింది కథనంలో చూద్దాం.
Advertisement

ఈ రెట్రో బైకుల్లో ఏది కొంటే కిక్కు వస్తుంది

భారతదేశంలో నియో-రెట్రో (Neo-Retro) మోటార్‌సైకిళ్ల సెగ్మెంట్‌లోకి తాజాగా యమహా XSR155 ప్రవేశించడంతో పోటీ మరింత పెరిగింది. ఇప్పటి వరకు టీవీఎస్ రోనిన్ (TVS Ronin), రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ (Royal Enfield Hunter) మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు మూడో బైక్ రావడంతో బైక్ కొనాలనుకునేవారు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు.

టాటా మోటార్స్‌కు భారీ దెబ్బ

భారతీయ SUV మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందనే నమ్మకంతో టాటా మోటార్స్ (Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకంగా కూపే-స్టైల్ SUV టాటా కర్వ్(Tata Curvv)ను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్‌, బోల్డ్ రోడ్ ప్రెజెన్స్‌, ఎలక్ట్రిక్, ఐసీఈ టెక్నాలజీ ఎంపికలతో కర్వ్‌పై మొదట భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ మోడల్‌కి మార్కెట్లో స్పందన రాలేదని తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు స్పష్టమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో టాటా కర్వ్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడం కంపెనీకి పెద్ద షాక్‌గా మారింది. ముఖ్యంగా వార్షిక గణాంకాలు చూస్తే కర్వ్ 73% వరకు నష్టాన్ని చవిచూసిన మోడల్‌గా నిలిచింది.

మారుతి ఒంట్లో వణుకు మొదలైంది

భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన టాటా సియెర్రా (Tata Sierra) తిరిగి రాబోతోంది. 1991 నుంచి 2003 వరకు అమ్ముడుపోయిన ఈ మోడల్ 22 ఏళ్ల విరామం తర్వాత పూర్తిగా కొత్త రూపురేఖలతో, ఆధునిక ఫీచర్లతో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. కొత్త తరం టాటా సియెర్రా కోసం కస్టమర్లలో భారీ అంచనాలు ఉన్నాయి.

మాట తప్పి సైలెంటుగా షాకిచ్చిన కేటీఎం

భారతీయ టూ వీలర్ మార్కెట్ ఈ ఏడాది మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇటీవల 350 సీసీ కంటే తక్కువ బైక్‌లకు జీఎస్‌టీ తగ్గింపు లభించడంతో వాటి ధరలు భారీగా తగ్గాయి. అయితే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి బ్రాండ్లు ధరలను పెంచినప్పటికీ కేటీఎం, ట్రయంఫ్ వంటి పెద్ద బ్రాండ్లు పాత ధరలకే మోడళ్లను విక్రయిస్తామని ప్రకటించి కస్టమర్లను సంతోషపెట్టాయి. కానీ ఆ మాట నిలబడలేదు.
Advertisement

ఈ కారు ఉంటే బస్సులు, రైళ్లు అవసరం లేదు.. 26 కి.మీ మైలేజ్

టయోటా రూమియన్ (Toyota Rumion) గురించి మాట్లాడితే, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న 7-సీటర్ MPVలలో ఇది ఒక ముఖ్యమైన పేరు. మారుతి సుజుకి ఎర్టిగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి, టయోటా ప్రత్యేక టచ్‌తో రీ-బ్యాడ్జ్ చేసి విడుదల చేసిన ఈ మోడల్, కుటుంబాలు, ట్రావెల్ యూజర్ల మధ్య భారీ ప్రజాదరణను సంపాదిస్తోంది. ఈ కారు ఎంత క్రేజ్‌లో ఉందో తెలియాలంటే, అక్టోబర్ 2025 అమ్మకాలు చూస్తే సరిపోతుంది. తాజా సేల్స్ డేటా ప్రకారం, రూమియన్ కేవలం ఒక్క నెలలోనే 3,075 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ సంఖ్య టయోటాకు MPV సెగ్మెంట్‌లో మరింత బలమైన స్థానం తీసుకొచ్చింది.