మిడిల్-క్లాస్ కుటుంబాల కోసం టాప్ హ్యాచ్‌బ్యాక్‌లు

రోజు వారీ ప్రయాణాలకు, పట్టణాల్లో సులభ డ్రైవింగ్‌కి, ఇంధన పొదుపు కోసం, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే వాహనాలను కోరుకునే కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారికి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు బాగా సెట్ అవుతాయి. మీరు కొత్త కారు కొనాలని భావిస్తుంటే, మార్కెట్‌లో ప్రస్తుతం బెస్ట్ ఆకర్షణీయమైన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి ఇగ్నిస్, మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ i20 వంటి కార్లు బెస్ట్. ఈ కార్లు రోజు వారీ ప్రయాణాలకు, పట్టణాల్లో సులభ డ్రైవింగ్‌కి, ఇంధన పొదుపు కోసం, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండే వాహనాలను కోరుకునే కస్టమర్లకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఈ కింది కథనంలో చూద్దాం.

20ఏళ్లుగా మార్కెట్లో తిరుగులేని కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా ఇన్నోవా (Toyota Innova) అనేది కేవలం ఒక కారు కాదు, అది విశ్వసనీయతకు, నాణ్యతకు ఒక బ్రాండ్ నేమ్. 2005లో ఒకప్పటి క్వాలిస్ (Qualis) స్థానంలో ఈ కారును తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పవరకు ఇన్నోవా పేరుతోనే ఈ కారు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

200 కి.మీ. ప్రయాణించడానికి రూ.20 చాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లే మార్కెట్‌ను ఆధిపత్యం చలాయించినా, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వినియోగదారులు మరింత శక్తివంతమైన, స్టైలిష్‌గా కనిపించే, మోటార్‌సైకిల్ అనుభూతిని ఇచ్చే ఎలక్ట్రిక్ బైకుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వచ్చిన కొన్ని బ్రాండ్‌లు ఇప్పటికీ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. వాటిలో కోమాకి (Komaki) ఒక ముఖ్యమైన పేరు. ఓలా, ఏథర్ వంటి కొత్త తరహా EV బ్రాండ్‌లు రాకముందే ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్య ప్రజల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన కంపెనీ కోమాకి. పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తన ఉత్పత్తులను విస్తరించి సాధారణ ప్రజలకు EVలను దగ్గర చేసింది.

కేవలం రూ.6.39లక్షలకే.. 30కిమీ మైలేజ్

టయోటా నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు గ్లాంజా(Toyota Glanza) ప్రస్తుతం మార్కెట్లో దుమ్ము లేపుతోంది. చూడటానికి చాలా స్టైలిష్‌గా, మంచి ఫీచర్లతో ఉన్న ఈ కారును కొనేందుకు జనం ఎగబడుతున్నారు. దీనికి నిదర్శనం.. అక్టోబర్ నెలలో ఈ కారు భారీ స్థాయిలో అమ్ముడైంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇది ఒకటి. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్ల కారణంగా ఈ కారును కొనుగోలుదారులు పోటీపడి కొంటున్నారు. అక్టోబర్ 2025 నెలలో గ్లాంజా విక్రయాలు భారీగా పెరిగాయి. టయోటా గ్లాంజా అమ్మకాల గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తోంది. గత నెలలో గ్లాంజా 6,162 యూనిట్లు అమ్ముడైంది. 2024 అక్టోబర్‌లో కేవలం 4,273 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 44% పెరిగాయి.
Advertisement

రాజు వచ్చేశాడు! కొత్త 2025 టాటా సియెర్రా SUVలో ఏమున్నాయో తెలుసా?

టాటా మోటార్స్ (Tata Motors) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిపిన సియెర్రా బ్రాండ్ డేలో కొత్త టాటా సియెర్రా ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌ను ఆవిష్కరించడం నిజంగా ఒక భావోద్వేగ క్షణంలా మారింది. ఒరిజినల్ 1991 సియెర్రా భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలు రాయి. ఆ ఐకానిక్ SUVను మళ్లీ పూర్తిగా కొత్త రూపంలో, కొత్త టెక్నాలజీలతో, ఆధునిక డిజైన్‌తో మన ముందుకు తీసుకురావడం టాటా కంపెనీ ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందో చెప్పకనే చెబుతుంది. కొత్త యుగానికి నాంది పలుకుతున్నట్టే ఈ సరికొత్త సియెర్రా కనిపిస్తుంది. పాతది గుర్తు చేస్తూనే, నేటి యువత కోరుకునే ఫ్యూచరిస్టిక్ లుక్‌ను కూడా అందిస్తుంది. బయట నుండి చూసిన క్షణం నుంచే కొత్త సియెర్రా ఎంత క్లాసీగా, ఎంత మస్క్యులర్‌గా రూపుదిద్దుకుందో స్పష్టంగా తెలుస్తుంది.

సెడాన్ మార్కెట్‌లో ఒక్కడే కింగ్.

భారత మార్కెట్‌లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) హవా నడుస్తున్నప్పటికీ సెడాన్ కార్ల విభాగంలో మాత్రం ఒకే ఒక్క కారు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ కారే మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). రూ. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన సెడాన్ కార్ల అమ్మకాలలో అక్టోబర్ 2025 నెలలో డిజైర్ భారీ విజయాన్ని సాధించింది.

83 కి.మీ మైలేజ్ బైక్ రూ.72,000.. పేదవాడి బండి

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ని ఒకసారి దగ్గరగా గమనిస్తే, ఇది ఎందుకు రోజువారీ ప్రయాణికులకి ఫేవరెట్‌గా మారిందో వెంటనే అర్థమవుతుంది. సింపుల్‌గా కనిపించే ఈ మోటార్‌సైకిల్‌లో అసలు స్టైల్, మైలేజ్, పనితీరు అన్నీ సమతుల్యంగా ఉంటాయి. రోజూ ఆఫీస్‌కి వెళ్లేవారు, చిన్నపాటి ప్రయాణాలు చేసే వారు, ఫ్యూయల్ ఆదా చేయాలనుకునేవారు, ప్రతి ఒక్కరికీ ఇది వరంగా అనిపించేలా TVS ఈ బైక్‌ను తీర్చిదిద్దింది.బైక్‌ మీద మొదటి చూపులోనే దాని డిజైన్ క్లీన్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది. చాలా ఆర్భాటం లేకుండా కూడా ఆకర్షణీయంగా కనిపించడం స్టార్ సిటీ ప్లస్ ప్రత్యేకత. ట్యాంక్ ష్రౌడ్స్, స్లీక్ గ్రాఫిక్స్, కంపాక్ట్ సైజ్.. అన్నీ కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. నడిపే వారికే కాదు, వెనుక కూర్చునే వ్యక్తికీ మంచి సీటింగ్ కంఫర్ట్‌ను ఇవ్వడంలో TVS కాస్త కూడా రాజీపడలేదు.

దీని మీద వెళ్తుంటే అమ్మాయిలు వెంటపడతారు

యమహా (Yamaha) కంపెనీ నుంచి బైక్ లవర్స్ ఎంతోమంది ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న కొత్త బైక్ XSR 155 డెలివరీలు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. బైక్‌ను డెలివరీ తీసుకుంటున్న కస్టమర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బైక్‌ను యమహా రూ.1.5 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350), టీవీఎస్ రోనిన్ (TVS Ronin) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయిన ఈ మోడల్, R15 మోడల్‌ను ఆధారంగా చేసుకుని తయారైంది.
Advertisement

వ్యాగన్ఆర్ గురించి తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్

మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీలో ఏళ్ల తరబడి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో వ్యాగన్ఆర్ (WagonR) అగ్రస్థానంలో ఉంది. దీని టాల్‌బాయ్ (Tall-boy) డిజైన్ సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీ అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే భారతీయ మార్కెట్‌లో ఈ మోడల్ అంటే ప్రజలకు అంత ప్రేమ. మరి ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ఎక్కువ మంది కొనడానికి గల 5 ముఖ్య కారణాలు ఏమిటి? మీరు కొత్త వ్యాగన్ఆర్ కొనాలనుకుంటే, బుక్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన ఆ 5 పాయింట్స్ ఇక్కడ చూద్దాం. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

చౌకైన 7 సీటర్ కారు వచ్చేస్తోంది

భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన రెనో డస్టర్ (Renault Duster) మళ్లీ కొత్త అవతారంలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. కారు లవర్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ డస్టర్ ఎస్‌యూవీ (SUV) వచ్చే ఏడాది జనవరి 26న అధికారికంగా ఆవిష్కరించబడుతుందని రెనో సంస్థ ప్రకటించింది. డస్టర్ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత, ఇదే ప్లాట్‌ఫామ్‌పై 7-సీటర్ కారుతో పాటు, తక్కువ బడ్జెట్‌లో ఒక ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురావాలని రెనో ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కార్ల ప్లాన్‌లో డస్టర్ తొలి అడుగు. భారత మార్కెట్‌లో 2012లో డస్టర్ మొదటి తరం మోడల్ విడుదలైంది. దాని అద్భుతమైన ఫీచర్లు, బలమైన డిజైన్ కారణంగా ఈ కారు దాదాపు 2 లక్షలకు పైగా అమ్ముడైంది. అంతర్జాతీయంగా కూడా 18 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. డస్టర్ అమ్మకాలు నిలిచిపోయిన తర్వాత, ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ మరింత పెరిగింది.

కియా లగ్జరీ కార్లను ఒక్కరు కూడా కొనలేదా ?

భారతీయ మార్కెట్‌లో కియా (Kia) మోటార్స్ నుంచి సోనెట్, సెల్టోస్ వంటి కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఆ కంపెనీ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల (e-SUVs) పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. కియా విడుదల చేసిన అక్టోబర్ నెల సేల్స్ బ్రేకప్‌లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

ఈ కారును అక్టోబర్లో కేవలం ఇద్దరే కొన్నారు

ఫ్రాన్స్‌కు చెందిన సిట్రోయెన్ (Citroen) సంస్థ ఎన్నో ఆశలతో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం తమ లోపాలను సరిదిద్దుకుని, కొత్తగా వచ్చిన కూపే ఎస్‌యూవీ బసాల్ట్ (Basalt) వంటి మోడళ్లతో తమ బ్రాండ్ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, కంపెనీ మొదట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్‌యూవీ... సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అది అద్భుతమైన సస్పెన్షన్, మైలేజ్ ఇచ్చినా, దాని అమ్మకాలు మాత్రం నిరాశపరిచాయి.
Advertisement

దేశం మొత్తం ఎదురు చూస్తున్న కారు ఇదే

ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా మారడానికి మహీంద్రా కంపెనీ (Mahindra) దూకుడు పెంచింది. ఈ క్రమంలో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అదే మహీంద్రా XEV 9S (ఎక్స్‌ఈవీ 9ఎస్). దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అత్యంత భారీ డిమాండ్ ఉన్న ఈ కారు ఈ నెల 27న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.

వెంటనే మీ కారును షోరూంకు తీసుకెళ్లండి

మారుతి సుజుకికి (Maruti Suzuki) అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ అయిన గ్రాండ్ విటారా (Grand Vitara)కు ఇప్పుడు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. రికార్డు అమ్మకాలతో కంపెనీ సంతోషంగా ఉన్న సమయంలో ఏకంగా 39,000 యూనిట్లను వెనక్కి పిలవాల్సిన (Recall) పరిస్థితి వచ్చింది. 2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారు చేసిన యూనిట్లలో ఈ సమస్య తలెత్తింది. ఇంతకీ వాహనదారులకు భయాన్ని కలిగిస్తున్న ఆ సమస్య ఏంటో, మీ కారు రీకాల్ జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం.

బైక్ కంటే తక్కువ ధరకే హీరో కొత్త ఎలక్ట్రిక్ కారు!

హీరో మోటోకార్ప్ (hero motocorp) గురించి చెప్పుకుంటే, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నో దశాబ్దాలుగా పెట్రోల్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్లు అందిస్తూ లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన ఈ బ్రాండ్, ఇప్పుడు కొత్త యుగానికి సరిపోయేలా తన పాదాన్ని ఎలక్ట్రిక్ విభాగంలో కూడా బలంగా మోపుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో, హీరో మోటోకార్ప్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. అయితే, ఎలక్ట్రిక్ మోడళ్లను తన ప్రధాన బ్రాండ్ కింద కాకుండా, ప్రత్యేక గుర్తింపుతో విడుదల చేయడానికి VIDA అనే ప్రత్యేక EV బ్రాండ్‌ను రూపొందించింది.

దేశంలో సంచలనం సృష్టించబోయే కొత్త టాటా సియెర్రా ఇదే

దేశవ్యాప్తంగా ఆటోప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సియెర్రా బ్రాండ్ డేలో, ప్రతిష్టాత్మక టాటా సియెర్రా (sierra) ప్రొడక్షన్-రెడీ వేరియంట్‌ను ఘనంగా ఆవిష్కరించింది. భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ ఐకానిక్ SUV ఇక కొత్త యుగానికి నాంది పలుకుతోంది. కొత్త తరానికి అనుగుణంగా పునర్ ఆవిష్కరించబడిన టాటా సియెర్రా, తన ఒరిజినల్ లెగసీ, ప్రత్యేకమైన డిజైన్ గుర్తింపును అలాగే కొనసాగిస్తూ మరింత కొత్తగా ముస్తాబై వచ్చింది. దీని రాకతో ఇతర కార్ల తయారీ కంపెనీలకు బలమైన పోటీ ఏర్పడినట్లయింది. 1991లో వచ్చిన ఒరిజినల్ టాటా సియెర్రా నుంచి పూర్తిగా కొత్త అవతారానికి చేరుకున్న ప్రయాణంలో, ఈ SUV డిజైన్ అభివృద్ధి, సాంకేతిక, దేశంలో కార్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Advertisement

రూ.5.76 లక్షలకే 7 మంది ప్రయాణించగల కారు

భారతీయ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో 7 సీట్ల కారును కొనాలంటే ముందుగా గుర్తుకు వచ్చే మోడల్ రెనాల్ట్ ట్రైబర్. 2019లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, ప్రారంభం నుంచి బెస్ట్-వాల్యూ 7-సీటర్‌గా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కాలక్రమేణా పోటీ పెరగడం, పాత లుక్ కారణంగా ట్రైబర్ అమ్మకాలు కొంత మందగించడం ప్రారంభమైంది. కానీ పరిస్థితి చాలా వేగంగా మారింది. గత జూలైలో రెనాల్ట్ ట్రైబర్‌కి పూర్తిగా అప్డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఈ MPV మళ్లీ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, ఇంటీరియర్ మెరుగుదలలతో పాటు ఆకర్షణీయమైన ధర శ్రేణి పట్ల కస్టమర్ల స్పందన బాగానే వచ్చింది.

టాటా కంపెనీకి బంగారు గుడ్డులా మారిన కారు

టాటా మోటార్స్‌ (tata motors) లైనప్‌లో హారియర్ (harrier) ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం సంపాదించిన SUV. దీని బలమైన డిజైన్, నమ్మకమైన పనితీరు,ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ ఇప్పటికే వినియోగదారుల మన్ననలు పొందాయి. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, హారియర్‌ మీద ఉన్న ఈ క్రేజ్ ఎంతగానో పెరుగుతోందని స్పష్టమవుతోంది. అక్టోబర్ 2025లో టాటా హారియర్ 4,483 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఈ సంఖ్య చూస్తే సాధారణ పెరుగుదల కాదు, గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 1,947 యూనిట్లతో పోలిస్తే 130% వృద్ధి. ఒకే సంవత్సరంలో రాబడిన ఈ భారీ పెరుగుదల హారియర్‌ మార్కెట్లో మళ్లీ తన దమ్ము చూపించిందనే చెప్పాలి.

మహీంద్రా కార్ల షోరూమ్‌లకు పోటెత్తిన జనం

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన శక్తివంతమైన స్థిరత్వాన్ని చూపించింది. పండుగ సీజన్ ప్రారంభమైన దశలోనే కంపెనీ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తూ మార్కెట్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకుంది. ముఖ్యంగా, అక్టోబర్ 2025 మహీంద్రా కోసం చరిత్రలో నిలిచిపోయే నెలగా మారింది. మారుతి సుజుకి తర్వాత దేశంలో రెండవ అతిపెద్ద ప్యాసింజర్ కార్ తయారీదారుగా నిలిచిన మహీంద్రా, SUV సెగ్మెంట్‌లో తన అస్తిత్వాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లింది. అక్టోబర్ నెలలో మహీంద్రా 71,624 యూనిట్ల దేశీయ అమ్మకాలు నమోదు చేయడం కంపెనీకి ఇప్పటివరకు వచ్చిన అత్యధిక నెలవారీ సంఖ్య. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నెలవారీ అమ్మకాలు ఈ స్థాయికి చేరడం అరుదు.

మారుతి బ్రెజ్జాను దాటేసిన మహీంద్రా కారు.. ఒక్క నెలలో 12,237

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా & మహీంద్రా (M&M) మరోసారి తన దూకుడు శైలిని నిరూపించింది. ఇప్పటికే కఠినమైన పోటీ ఉన్న SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీ తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ఆధునిక ఫీచర్లు, అత్యుత్తమ భద్రత ఈ కారణాల వల్లే మహీంద్రా బ్రాండ్‌కు వచ్చిన విశ్వసనీయత రోజురోజుకు మరింత బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీకి గర్వకారణంగా మారిన మోడల్ XUV 3XO. మార్కెట్లోకి వచ్చిన కొద్దికాలంలోనే ఈ కాంపాక్ట్ SUV వినియోగదారుల హృదయాలను దోచుకుంది. ప్రీమియం లుక్, ఆధునిక టెక్నాలజీలు, సేఫ్టీ స్టాండర్డ్స్ ఈ వాహనాన్ని తన సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా, అమ్మకాల పరంగా ఇది ఇప్పుడు నిజంగా గేమ్-చేంజర్‌గా మారింది.
Advertisement

ఈ కారును సెల్‌ఫోన్లు కొన్నట్టు కొంటున్నారు

మనం ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం. కానీ మహీంద్రా వారి బొలెరో కారును మాత్రం జనం సెల్‌ఫోన్ కొన్నంత ఈజీగా కొనేస్తున్నారు. పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు ఎలా ఉన్నా దూసుకుపోయే ఈ మాస్ కింగ్ కారు... మార్కెట్‌లో రిలీజ్ అయ్యి పాతిక సంవత్సరాలు దాటినా దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.

దేశంలోనే చౌకైన కారు..మైలేజ్ ఏకంగా 33కిమీ

మారుతి సుజుకి అక్టోబర్ 2025లో 2 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలతో రికార్డులు సృష్టించింది. ఈ విజయంలో ఒకప్పటి అత్యంత చౌకైన కార్ల స్థానంలోకి వచ్చి, అందరి దృష్టిని ఆకర్షించిన కారు మారుతి ఎస్-ప్రెస్సో (S-Presso). కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమలు చేయడంతో చిన్న కార్లపై పన్ను తగ్గి, ఎస్-ప్రెస్సో ధర అమాంతం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కొత్త కారు ధర, మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్ స్విఫ్ట్ కారు ధరకే లభిస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభిస్తున్న ఈ ఎస్‌యూవీష్ కారు ధర, మైలేజ్, అక్టోబర్ అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చిన్న కార్ల పై జీఎస్‌టీని 28% నుంచి 18%కి తగ్గించింది. ఈ జీఎస్‌టీ 2.0 నిర్ణయం వల్ల మారుతి ఎస్-ప్రెస్సో ధర అమాంతం తగ్గింది. గతంలో రూ. 4.27 లక్షలు ఉన్న స్టాండర్డ్ (O) వేరియంట్ ధరలో ఏకంగా రూ. 77,000 తగ్గింపు వచ్చింది. బేస్ వేరియంట్ ధర ఇప్పుడు కేవలం రూ. 3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. దీనితో ఇది దేశంలోనే అత్యంత చవకైన కారుగా మారుతి ఆల్టో K10 స్థానాన్ని భర్తీ చేసింది.

ఫుల్ ట్యాంక్‌తో 1000కిమీ రేంజ్ ఇచ్చే కారు

భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్, పెట్రోల్ కార్ల హవా నడుస్తున్నప్పటికీ, డీజిల్ కార్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే శక్తివంతమైన పర్ఫార్మెన్స్, అద్భుతమైన మైలేజ్ రెండూ ఒకేసారి కావాలనుకునే డ్రైవర్లకు డీజిల్ ఇంజన్లే బెస్ట్ ఆప్షన్. మన దేశంలో ఉన్న గుంతల రోడ్లపైనా, ట్రాఫిక్‌లోనూ నమ్మకంగా దూసుకుపోవాలంటే, డీజిల్ కార్లంటేనే ఎక్కువమందికి కంపరం. అందుకే ప్రస్తుతం మార్కెట్లో మైలేజ్, పవర్ రెండూ అందించే టాప్ 5 డీజిల్ కార్ల వివరాలను వివరంగా తెలుసుకుందాం.

టాటా నుంచి బ్రహ్మాస్త్రం వస్తోంది

టాటా మోటార్స్ (Tata Motors) తమ లెజెండరీ SUVను మళ్లీ భారతీయ రోడ్లపైకి తీసుకురావడానికి సిద్ధమైంది. 1990లలో మార్కెట్‌లో అడుగుపెట్టిన మొదటి టాటా సియెర్రా అప్పటి తరానికే కాకుండా, ఇప్పటికీ గుర్తున్న ఐకానిక్ మోడళ్లలో ఒకటి. బలమైన బాడీ, వెనుక భాగంలో ఉన్న ప్రత్యేకమైన గ్లాస్ డిజైన్, అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్... ఇవన్నీ కలిపి సియెర్రాను ఆ కాలంలో ఓ ప్రత్యేకమైన SUVగా నిలబెట్టాయి. ఇప్పుడు అదే మోడల్‌ను ఆధునిక కాలానికి అనుగుణంగా, పూర్తిగా కొత్త రూపంలో పునర్నిర్మించి టాటా మరోసారి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. రేట్రో స్టైల్‌కు మోడర్న్ టచ్ ఇచ్చి రూపొందించిన ఈ కొత్త సియెర్రా, టాటా BSUV లైనప్‌లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
Advertisement

దారుణంగా పడిపోయిన పంచ్ ప్రత్యర్థి సేల్స్

భారత మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒకటి. ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch) కారుతో ఇది గట్టి పోటీ ఇస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రారంభమై, కిలోకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు, అది కూడా ఎస్‌యూవీ లుక్‌తో కావాలనుకునే వారికి ఈ ఎక్స్‌టర్ ఒక మంచి ఆప్షన్. ఈ కారు ధరలు, ఫీచర్లు, అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం.