దారుణంగా పడిపోయిన పంచ్ ప్రత్యర్థి సేల్స్

భారత మార్కెట్‌లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒకటి. ముఖ్యంగా టాటా పంచ్ (Tata Punch) కారుతో ఇది గట్టి పోటీ ఇస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రారంభమై, కిలోకు 27 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు, అది కూడా ఎస్‌యూవీ లుక్‌తో కావాలనుకునే వారికి ఈ ఎక్స్‌టర్ ఒక మంచి ఆప్షన్. ఈ కారు ధరలు, ఫీచర్లు, అమ్మకాల వివరాలు ఇక్కడ చూద్దాం.

సేఫ్టీ కింగ్ పంచ్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది

టాటా పంచ్ (tata punch) గురించి మాట్లాడితే, భారతీయ వినియోగదారుల మనసుల్లో ఏర్పడిన విశ్వాసం, నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో చిన్న సైజ్‌లో వచ్చినప్పటికీ, భద్రత విషయంలో మాత్రం పెద్ద SUVలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం ఈ మోడల్‌కి ప్రధాన ఆకర్షణ. పంచ్‌ను రోడ్డుపై చూసిన చాలా మంది మొదట గుర్తుచేసేది అదే సేఫ్టీ. ప్రమాదాలు చోటుచేసుకునే సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను అతి ఉత్తమమైన రీతిలో రక్షించే మోడల్‌గా పంచ్ ప్రజాదరణ పొందింది. ఇది భారతీయ కుటుంబాల అవసరాలు, ముఖ్యంగా సేఫ్టీని ప్రాధాన్యతగా భావించే వారికి బాగా సరిపోయింది. ఈ నమ్మకం నేరుగా అమ్మకాల రూపంలో కూడా కనిపిస్తోంది. చక్కటి డిజైన్, ధర, చిన్నదైనా SUV ఫీలింగ్‌తో పంచ్ మార్కెట్‌లో విడుదలైనప్పటి నుంచి నిరంతరం మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తోంది.

ఫ్యామిలీ పెద్దదైనా జాలీగా టూర్లకు వెళ్లొచ్చు

మీరు మీ కుటుంబంతో కలిసి హిల్ స్టేషన్లకు సుదూర ప్రయాణాలు చేయాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, గ్రూప్ ట్రిప్‌లకు ఇన్నోవా వంటి ఖరీదైన ఎంపీవీలను కొని డబ్బు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రూ.15 లక్షల (ఆన్-రోడ్ అంచనా) బడ్జెట్‌లో, హైరేంజ్ కొండ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా దూసుకుపోయే కియా కారెన్స్ క్లావిస్ మోడల్‌ను మీరు ఎంచుకోవచ్చు.ఈ కియా కారెన్స్ క్లావిస్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

డాక్టర్లు, ఇంజనీర్లకు ఈ కారంటే చాలా ఇష్టం

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (maruti suzuki wagonr) గురించి చెప్తే, భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్ అని చెప్పే స్థాయిలో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. వైద్యులు, ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ నుంచి సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, గృహిణులు... ఇలా వివిధ వర్గాల వినియోగదారుల దృష్టిని ఒకే రకంగా ఆకర్షించగలిగిన అరుదైన మోడల్ ఇది. తక్కువ బడ్జెట్‌లో మంచి స్పేస్‌తో కూడిన, నమ్మదగిన కారును కోరుకునే వారి కోసం వ్యాగన్ఆర్ ఎప్పటి నుంచో సేఫ్ & సెన్సిబుల్ ఛాయిస్‌గా నిలుస్తోంది. చిన్న కుటుంబాల రోజువారీ అవసరాలకు, నగర డ్రైవింగ్‌కు, అలాగే కాస్తదూర ప్రయాణాలకు కూడా ఈ కారు సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది.
Advertisement

ఈ బైక్ ధరతో లగ్జరీ కారు కొనొచ్చు

ప్రముఖ మోటారు తయారీ సంస్థ కవాసాకి ఇండియా(Kawasaki India), భారత మార్కెట్లో తన కొత్త Z1100 సూపర్ బైక్‌ను (Z1100 Superbike) లేటెస్టుగా రిలీజ్ చేసింది. ఈ సూపర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఏకంగా రూ. 12.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరలో ఒక లగ్జరీ ఎస్యూవీ కారును కొనుగోలు చేయవచ్చు. మునుపటి మోడల్ కంటే మెరుగైన డిజైన్, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ 2026 కవాసాకి Z1100 లో 1,099 సీసీ లిక్విడ్-కూల్డ్ నాలుగు-సిలిండర్ ఇంజిన్ శక్తినిస్తుంది. మరి ఈ బైక్ ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, రైడర్‌కు సహాయపడే అధునాతన ఎలక్ట్రానిక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

వెన్యూ vs సోనెట్: రెండింటిలో ఏది మీకు బెస్ట్?

హ్యుందాయ్ (hyundai) తాజాగా విడుదల చేసిన 2025 వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కొత్తదనం తీసుకొచ్చింది. కియా సోనెట్‌తో తలపడే ఈ కొత్త వెర్షన్, స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో ప్రత్యేకతను సంతరించుకుంది. వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కొత్త టెక్నాలజీ, మెరుగైన రైడ్ క్వాలిటీ, కొత్త ఇంటీరియర్ ఫినిష్‌తో మరింత ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో, కియా సోనెట్ కూడా తన తాజా ఫేస్‌లిఫ్ట్ ద్వారా మరింత సేఫ్టీ ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసింది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలను ఒకసారి చూద్దాం.

దేశమంతా ఎదురుచూస్తున్న కారు ఆ రోజున వచ్చేస్తోంది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కొత్త టెక్నాలజీలతో ముందుకు వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారుతో ఆటో మార్కెట్లో కొత్త దిశను సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆ కారు పేరు మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki E-Vitara). ఈ ఎలక్ట్రిక్ కారు గురించి గత కొద్ది నెలలుగా ఆటో అభిమానులలో, కస్టమర్లలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారతీయ మార్కెట్లో ఇది మారుతి సుజుకి నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్ SUV కావడం విశేషం. ఇప్పటివరకు కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను మాత్రమే అందిస్తుండగా, ఈసారి మాత్రం పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అడుగుపెడుతోంది.
Advertisement

మార్కెట్లోకి దూసుకొచ్చిన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్

స్పోర్ట్స్ కార్ల ప్రపంచంలో పోర్స్చే అనే పేరు తప్పక వినిపిస్తుంది. ఇది కేవలం ఒక ఆటోమొబైల్ బ్రాండ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కార్ల అభిమానుల్లో ఒక భావోద్వేగం, ఒక కల, ఒక లెజెండ్‌. లగ్జరీ, పనితీరు మధ్య పరిపూర్ణత సాధించిన ఈ కంపెనీ, ప్రతి మోడల్‌లో కొత్తదనాన్ని, అధిక స్థాయి ఇంజినీరింగ్‌ను ప్రతిబింబిస్తుంది. అయితే, పోర్స్చే లైనప్‌లోని ప్రతి కారు అద్భుతమైనదే అయినప్పటికీ, 911 మోడల్‌కి ఉన్న గౌరవం మాత్రం మరెవ్వరికీ దక్కదు. ఇప్పుడు ఆ ప్రతీక మరో కొత్త అవతారంలో భారతీయ రోడ్లపైకి అడుగుపెడుతోంది, అదే 2025 పోర్స్చే 911 టర్బో ఎస్ (Porsche 911 Turbo s). ఈ కొత్త తరం 911 ధర రూ. 3.80 కోట్ల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది.

అమ్మకాలలో దూకుడు చూపిన బాలెనో

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) పేరు వినగానే, ఒకే మాట గుర్తుకు వస్తుంది నమ్మకమైన హ్యాచ్‌బ్యాక్ అని. ఈ కారు కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు, మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కి ఒక ఫ్లాగ్‌షిప్ ప్రతీక. బాలెనో తన సొగసైన రూపంతో, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో, ప్రాక్టికల్ ఫీచర్లతో, భారతీయ కుటుంబాలకు ఒక ఆప్షన్‌ కంటే ఎక్కువగా ఒక ఎమోషన్‌గా మారింది. మారుతి సుజుకి ఎప్పుడూ తన కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకుంటూ, మారుతున్న కాలానికి అనుగుణంగా తన వాహనాల్లో మార్పులు చేస్తూనే ఉంటుంది. అదే కారణంగా, బాలెనో మొదటి విడుదల నుంచే మార్కెట్లో అద్భుతమైన సక్సెస్ సాధించింది. 2025 అక్టోబర్ నెలలో కూడా బాలెనో తన విజయ పరంపరను కొనసాగిస్తూ మళ్లీ అమ్మకాలలో సత్తా చూపించింది.

ఏపీ, తెలంగాణలో 14 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

మీకు ఎలక్ట్రిక కారు ఉండి ఏపీ, తెలంగాణ హైవే రోడ్ల మీద ప్రయాణిస్తున్నారా.. అయితే, ఇకపై మీ కారు చార్జింగ్ మధ్యలో అయిపోతుందనే భయం అక్కర్లేదు. దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ అయిన టాటా.ఈవీ (TATA.ev), వోల్ట్రాన్ (Voltron) సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకంగా 14 భారీ ఫాస్ట్-చార్జింగ్ కేంద్రాలను (Fast-Charging Stations) ప్రారంభించింది.

మార్కెట్లో ఈ కారుకు ఉన్న డిమాండ్ వేరే లెవల్

భారతీయ ఆటోమొబైల్ రంగంలో SUV విభాగం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta). ఈ మోడల్ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. మార్కెట్లో ఎన్ని కొత్త SUVలు వచ్చినా, క్రెటా స్థాయిని చేరుకోవడం ఇప్పటికీ చాలా కష్టసాధ్యం. వినియోగదారుల మనసులో స్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ కారు, నిత్యం మారుతున్న పోటీ మధ్య కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ మోడల్, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. ఒక్కో నెలలో సగటున 15,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో, క్రెటా తన పోటీదారులందరికీ ఒక సవాల్‌గా మారింది.
Advertisement

కాలుష్యానికి కారణం డీజిల్ ఇంజిన్లేనా?

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు పెద్ద పెద్ద నగరాలు కూడా కాలుష్యం కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పట్టణాల్లో పెరిగిన వాహన రద్దీ ఈ కాలుష్యానికి ముఖ్య కారణాలలో ఒకటి. నగర కాలుష్యంలో దాదాపు 20-22 శాతం వాటా వాహనాలదే అని అంచనా. ఈ నేపథ్యంలో పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డీజిల్ ఇంజిన్‌లు ఎందుకు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది.

ఈ రెండు కార్ల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) తన ప్రత్యేకమైన దూకుడు, సాంకేతిక నైపుణ్యంతో ఎప్పటికప్పుడు వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. భారతీయ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకుని, కొత్త మార్పులకు అనుగుణంగా ఈ సంస్థ తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. కొత్త సాంకేతికత, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌లతో టాటా మోటార్స్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇటీవలి కాలంలో కంపెనీ తన సూపర్ హిట్ SUV మోడళ్లైన టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారీ (Tata Safari) లను మరింత శక్తివంతమైన అవతారంలో తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

హ్యుందాయ్ వెర్నా కొత్తగా ముస్తాబై వచ్చేస్తోంది

భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) ఒకటి. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, మంచి పెర్ఫార్మెన్స్‌కు ఇది పెట్టింది పేరు. తమ సెడాన్ విభాగంలో కొత్త స్థాయిని సృష్టించేందుకు లక్ష్యంగా, హ్యుందాయ్ సంస్థ 2026 వెర్నా ఫేస్‌లిఫ్ట్ (Verna Facelift) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

2025లో కూడా స్కార్పియో మ్యాజిక్ కొనసాగుతోంది!

మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) పేరు వినగానే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోడ్లపై ఆధిపత్యం గుర్తుకొస్తాయి. 2002లో తొలిసారిగా విడుదలైన ఈ SUV, రెండు దశాబ్దాలకుపైగా కాలం గడిచినా ఇప్పటికీ తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంది. స్కార్పియో కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అనేక కుటుంబాల కలల SUVగా, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ రోడ్ల వరకు తన సత్తా చాటిన మోడల్‌గా నిలిచింది. తాజాగా, అక్టోబర్ నెల మహీంద్రా కంపెనీకి మరో విజయవంతమైన అధ్యాయాన్ని రాసింది. ఈ నెలలో మహీంద్రా స్కార్పియో భారీ స్థాయిలో అమ్ముడవడం కంపెనీకి ఉత్సాహాన్ని కలిగించింది. మొత్తం 18,107 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడగా, గత ఏడాది అక్టోబర్‌లో అమ్ముడైన 15,877 యూనిట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది.
Advertisement

ఇది కదా మిడిల్ క్లాస్ బైక్ అంటే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Electric Scooters) పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ టూవీలర్ తయారీదారు యమహా (Yamaha) సంస్థ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 ని విడుదల చేసింది. ఏరాక్స్ ఇ (Aerox E) స్కూటర్‌తో పాటు లాంచ్ అయిన ఈ మోడల్, దాని స్టైల్, పెర్ఫార్మెన్స్, రేంజ్ తో మార్కెట్‌ను శాసిస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), బజాజ్ చేతక్ (Bajaj Chetak) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. సిమ్ బేస్డ్ కనెక్టివిటీ, 160 కి.మీ రేంజ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన యమహా EC-06 పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లగ్జరీ కార్లకు సవాల్ విసురుతున్న టాటా

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) తమ ఎస్‌యూవీ-కూపే శ్రేణిలో విడుదల చేసిన కర్వ్(Curvv) మోడల్‌కు సరికొత్త అప్‌డేట్‌ను అందించింది. అడ్వాన్సుడ్ ఎగ్జిక్యూటివ్ ఫీచర్లు, మెరుగైన ఇంజనీరింగ్ తో వచ్చిన ఈ కొత్త కర్వ్ (ICE, EV) వేరియంట్ల ఇంటీరియర్ స్పేస్ (Interior Space) గణనీయంగా పెరిగింది.

బైక్ లాగా 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు.. రూ.5.79 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) భారతీయ కార్ల మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా తన ప్రత్యేకస్థానాన్ని నిలబెట్టుకున్న హ్యాచ్‌బ్యాక్. స్టైలిష్ లుక్, నమ్మకమైన పనితీరు, నగర డ్రైవింగ్ అనుభవం కారణంగా స్విఫ్ట్ ఎప్పుడూ ఫేవరేట్ కారు గానే ఉంటుంది. ప్రస్తుతం కొత్త కారు కొనాలనుకునే వాళ్లలో కూడా ఈ మోడల్‌పై ఆసక్తి తగ్గలేదు. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత డ్రైవింగ్ అవసరాలు ఏవైనా సరే, స్విఫ్ట్ అద్భుతంగా సరిపోతుంది. ఈ కారు ధర పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కనీస ధర రూ. 5.79 లక్షలు ఉండగా, టాప్ వేరియంట్ రూ. 8.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.

పాత కారు అమ్మేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు

మీ పాత కారును అమ్మాలని అనుకుంటున్నారా? కేవలం డబ్బు తీసుకుని తాళం చెవులు ఇచ్చేయడం సులభమే, కానీ అది చట్టపరమైన చిక్కులకు (Legal Complications) దారితీయవచ్చు. కారు అమ్మిన తర్వాత కూడా యాక్సిడెంట్ జరిగినా, ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా లేదా మరేదైనా నేరంలో కారు ఉపయోగించినా, యాజమాన్య బదిలీ (Ownership Transfer) పూర్తి కానంతవరకు పాత యజమానిగానే మీరే బాధ్యులు అవుతారు. అందుకే, పాత కారును అమ్మే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడని ముఖ్యమైన చట్టపరమైన డాక్యుమెంట్లు, సేఫ్టీ చర్యలు ఏమిటో తెలుసుకుందాం.
Advertisement

యమహా నుండి మరో స్టైలిష్ బైక్ మార్కెట్లో అడుగుపెట్టింది

యమహా ఎప్పటినుంచో భారతదేశంలోని యువ బైక్ రైడర్ల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తన నాణ్యత, పనితీరు, ప్రత్యేకమైన డిజైన్ ఫిలాసఫీతో ఈ బ్రాండ్ బైక్ లవర్స్‌కి ఒక కలల పేరుగా నిలిచింది. తాజాగా యమహా కంపెనీ రెండు ఆకర్షణీయమైన బైక్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అవి, రెట్రో లుక్‌తో సొగసైన XSR 155, అలాగే మరింత స్పోర్టీ డిజైన్‌తో రూపొందించిన FZ రేవ్. ఈ కొత్త FZ రేవ్ మోడల్, ఇప్పటికే ఉన్న FZ సిరీస్‌కు ఒక ప్రత్యేక అప్‌డేట్‌గా నిలుస్తోంది. భారత మార్కెట్లో రూ. 1,17,218 (ఎక్స్-షోరూమ్) ప్రారంభధరతో విడుదలైన FZ రేవ్ బైక్, స్పోర్టీ యూత్ సెక్టార్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. జపాన్ కంపెనీకి సొంతమైన ఇంజినీరింగ్ టచ్, ఆధునిక స్టైలింగ్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఈ బైక్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.

పిల్లలున్న వాళ్లు కొనాల్సిన కార్లు ఇవే

కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా.. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే, కొన్ని సేఫ్టీ ఫీచర్ల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు ధరలో, ప్రమాదం జరిగినప్పుడు కార్ డోర్లు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ (Auto Unlock on Crash) అయ్యే సౌకర్యంతో లభించే కార్లు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ ఫీచర్ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను సురక్షితంగా బయటపడేయడానికి ఎంతో సహాయపడుతుంది.

న్యూమెరస్ N-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడింగ్ ఇంప్రెషన్స్

న్యూమరస్ N-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో విడుదలైంది. దీని ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి. | Numerous N-First electric scooter launched in India. Know its price, features and other details here.

టైర్లలో సెన్సార్లు, రియల్ టైమ్ అలర్ట్‌లు.. స్మార్ట్ టైర్స్ వచ్చేశాయ్

భారతదేశంలోని ప్రముఖ టైర్ల తయారీ సంస్థ JK టైర్ & ఇండస్ట్రీస్ మరోసారి తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఆటోమోటివ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఎప్పుడూ ముందుండే ఈ కంపెనీ, తాజాగా డిజిటల్ సెన్సార్లతో కూడిన లేటెస్ట్ కార్ టైర్లును విడుదల చేసింది. ఇది కేవలం ఒక కొత్త ఉత్పత్తి మాత్రమే కాదు, భవిష్యత్ మొబిలిటీ టెక్నాలజీ వైపు ఒక పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు.ఈ వినూత్న టైర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పాన్‌మోర్‌లో ఉన్న JK టైర్ ప్లాంట్‌లో తయారవుతున్నాయి. యాంత్రిక ఇంజినీరింగ్‌కి, స్మార్ట్ టెక్నాలజీకి, భద్రతా ప్రమాణాలకు మేళవింపుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
Advertisement

ఈ కారులో లీటరు పోస్తే 28కిమీ వెళ్లొచ్చు

టయోటా(Toyota) నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder) భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది. 2022లో అద్భుతమైన ఫీచర్లు, స్ట్రాంగ్ బాడీ, ముఖ్యంగా అత్యధిక మైలేజ్ తో లాంచ్ అయిన ఈ కారు, వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.