ఈ కారులో లీటరు పోస్తే 28కిమీ వెళ్లొచ్చు

టయోటా(Toyota) నుంచి వచ్చిన కాంపాక్ట్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder) భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది. 2022లో అద్భుతమైన ఫీచర్లు, స్ట్రాంగ్ బాడీ, ముఖ్యంగా అత్యధిక మైలేజ్ తో లాంచ్ అయిన ఈ కారు, వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

48.58 కి.మీ మైలేజ్ ఇచ్చే రెట్రో స్టైల్ యమహా బైక్ లాంచ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR 155)బైక్ తాజాగా విడుదల అయింది. యమహా అభిమానులు, ప్రత్యేకంగా యువత, ఈ బైక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కొత్త మోడల్‌ను పూర్తిగా యువ కస్టమర్లకు, స్టైల్, ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దాన్ని ఒక్కసారి చూసినవారికి కూడా ఇది ఒక క్లాసిక్ బ్యూటీ‌గా కనిపిస్తుంది, ఇది రెట్రో లుక్‌తో పాటు ఆధునిక టచ్ కలయికగా ఉంటుంది. యమహా ఈ సారి డిజైన్ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. మోడర్న్ ట్యాంక్ షేప్, రౌండ్ హెడ్‌ల్యాంప్, వింటేజ్ స్టైలింగ్, ప్రీమియం మెటల్ ఫినిష్‌లు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణని తీసుకొచ్చాయి. ఇది కేవలం చూడటానికి బాగానే కాకుండా, రైడ్ చేసినప్పుడు కూడా శక్తివంతమైన అనుభూతినిస్తుంది.

రోజుకు 671 కార్లు అమ్మిన మారుతి

భారత మార్కెట్‌లో సెడాన్ (Sedan) సెగ్మెంట్‌లో మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అంటే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర, అద్భుతమైన ఫీచర్ల కారణంగా ఈ కారు వినియోగదారులకు బాగా నచ్చింది. దీనికి నిదర్శనంగా గత అక్టోబర్ నెలలో డిజైర్ అమ్మకాలు భారీగా పెరిగాయి.

ఢిల్లీ పేలుళ్లకు వాడిన కారు బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన కారణంగా హ్యుందాయ్ ఐ20 కారు వార్తల్లో నిలిచింది. ఈ సంఘటనలో ఇదే కారు ఉపయోగించారు.. ఈ సందర్భంగా 17 సంవత్సరాలుగా భారతీయ రోడ్లపై విజయవంతంగా నడుస్తున్న i20 కారు చరిత్ర, మార్పుల గురించి తెలుసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. 2008లో భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించబడిన i20 హ్యుందాయ్ గెట్జ్ స్థానంలో వచ్చి, కంపెనీని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోకి తీసుకెళ్లింది. తరాలు మారినా మార్కెట్‌లో దీని ఆధిపత్యం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం.
Advertisement

టక్సన్ డిస్కాంటిన్యూ… హ్యుందాయ్ ఇండియా మరో కీలక నిర్ణయం

హ్యుందాయ్ (Hyundai) భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్రాండ్. చిన్న హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అత్యాధునిక ఎలక్ట్రిక్ SUVల వరకు ప్రతీ సెగ్మెంట్‌లో తన ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చింది. సాంట్రో, ఐ20, క్రెటా, వెర్నా, ఐఓనీక్వ్ 5 వంటి హిట్ మోడళ్లను వరుసగా అందిస్తూ, కొత్త ట్రెండ్స్‌కి అనుగుణంగా ప్రతి ఏడాది తన లైనప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విజయవంతమైన ప్రస్థానంలో ఒక మోడల్ మాత్రం ఇండియన్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది, అదే హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson). తాజాగా హ్యుందాయ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ నుండి టక్సన్ మోడల్‌ను నిశ్శబ్దంగా తొలగించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో కంటే తక్కువ ధరలో ఆడి కారు కొనే ఛాన్స్

ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు కలిగిన జర్మన్ ఆటోమొబైల్ బ్రాండ్ ఆడి (Audi) ఇటీవల భారతీయ కార్ల మార్కెట్లో కొత్త హైప్‌ను సృష్టించింది. స్టైల్, కంఫర్ట్, టెక్నాలజీ అన్నీ కలగలిసి ఉండే SUV లుక్స్‌కి పేరుగాంచిన ఆడి, ఇప్పుడు Q3, Q5 మోడళ్లలో కొత్త Signature ఎడిషన్‌లు విడుదల చేసి మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఆడి ఈ సిగ్నేచర్ వేరియంట్‌లను డిజైన్ చేసే సమయంలో ప్రత్యేకమైన స్టైలింగ్, మరింత ప్రీమియమ్ ఫీల్, లిమిటెడ్ ఎడిషన్ టచ్‌ను ఇవ్వడంపై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఫలితంగా, సాధారణ Q3, Q5 మోడళ్ల కంటే ఈ సిగ్నేచర్ ఎడిషన్‌లు రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా తీర్చిదిద్దబడ్డాయి.

కారు టైర్ల స్పీడ్ లిమిట్ ఎంతో తెలుసా?

కారు, బైక్ లేదా స్కూటీ కొనేటప్పుడు మనం ఇంజిన్, డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్ల మీద దృష్టి పెడతాం. కానీ, అత్యంత ముఖ్యమైన భాగమైన టైర్ల (Tyres) గురించి మాత్రం పట్టించుకోము. అయితే, మీ కారు టైర్లకు కూడా స్పీడు లిమిట్(Speed Limit) ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ స్పీడ్ లిమిట్ తెలుసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కేవలం 31 రోజుల్లో 13 వేల మంది కొన్నారు

మారుతి సుజుకి (Maruti Suzuki) తాజాగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి దిగ్గజంగా అడుగుపెట్టిన మోడల్ విక్టోరిస్ (Victoris), భారతీయ ఆటో మార్కెట్లో తన ప్రభావాన్ని బలంగా చూపిస్తోంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీలు అన్నీ కలిపి విడుదలైన తొలి రోజునుంచే ఈ SUVపై వినియోగదారుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ధర పరంగా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం వల్ల, సెగ్మెంట్‌లో ఇప్పటికే ఉన్న పోటీని మరింత తీవ్రమైందిగా మార్చింది. తాజాగా విడుదలైన సేల్స్ గణాంకాలు ఈ SUV విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత నెలలో మాత్రమే మారుతి సుజుకి మొత్తం 13,496 యూనిట్ల విక్టోరిస్‌ను విక్రయించినట్లు వెల్లడించింది. ఇది ఈ సెగ్మెంట్‌లో కొత్తగా ప్రవేశించిన మోడల్‌కు గొప్ప విజయమే కాక, మార్కెట్లో దీని స్థిరమైన డిమాండ్‌కు నిదర్శనం.
Advertisement

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో విన్‌ఫాస్ట్ జోరు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్(VinFast) తొలి నెలలోనే సంచలనం సృష్టించింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) నివేదిక ప్రకారం.. విన్‌ఫాస్ట్ అక్టోబర్ 2025లో ఏకంగా 131 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసింది.

అతి తక్కువ ధరలో 7 సీటర్.. 27 కి.మీ మైలేజ్

మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రసిద్ధ MPV. సరళమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిసి ఎర్టిగాను అత్యంత నమ్మకమైన ఫ్యామిలీ కారుగా నిలబెట్టాయి. 2025 అక్టోబర్ నెలలో కూడా ఈ కారు తన అమ్మకాల శక్తిని మరోసారి నిరూపించింది. మొత్తం 20,087 యూనిట్లు డెలివరీ అవడం ద్వారా, గత ఏడాది ఇదే నెలలో నమోదైన 18,785 యూనిట్లను దాటుకుంది. ఏడాదికి ఇది మంచి అద్భుతమైన వృద్ధిగా నిలిచింది. ఎర్టిగా అమ్మకాలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒక సరిగ్గా సరిపడే ఫ్యామిలీ MPV కావడం ప్రధాన అంశం.

కొత్తగా ముస్తాబై వచ్చిన వెన్యూ రివ్యూ

కొత్త హ్యుందాయ్ వెన్యూ 2వ తరం భారతదేశంలో ప్రారంభించబడింది, దీని ధర రూ. 7.90 లక్షల నుండి ప్రారంభమవుతుంది. తాజా ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు మరియు స్టైలింగ్‌ను కనుగొనండి.

సీజన్‌లో నెక్సాన్ రికార్డ్! ఒక్క నెలలో 22 వేలు

టాటా నెక్సాన్ (tata nexon) భారతీయ మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్‌ను సొంతం చేసుకున్న SUV. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. పనితీరు, సేఫ్టీ, డిజైన్, ఎన్నో వేరియంట్ ఆప్షన్లు ఈ నాలుగు అంశాలు నెక్సాన్‌ను SUV అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధిస్తూ మేడిన్ ఇండియా వాహనాలకు గౌరవం తీసుకువచ్చిన మొదటి SUV ఇదే కావడం టాటాకు పెద్ద మైలురాయి. ఇలాంటి ఖ్యాతిని సంపాదించిన నెక్సాన్, అమ్మకాల పరంగా కూడా అదే రీతిలో దూసుకుపోతోంది. ప్రకటించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ఈ అక్టోబర్ నెలలో మొత్తం 22,083 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ చేయబడ్డాయి.
Advertisement

రోజూ ఆఫీసుకు వెళ్లే వాళ్లకు బెస్ట్ స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (EVs) మార్కెట్ ఇప్పుడు స్టార్టప్ బ్రాండ్ల నుంచి పెద్ద తయారీదారుల చేతుల్లోకి మళ్లింది. బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులతో మార్కెట్‌లో బలమైన పోటీని ఇస్తున్నాయి.

స్ప్లెండర్ అంతలా అమ్ముడుపోవడానికి అసలు సీక్రెట్ ఇదే!

భారతదేశంలో టూ వీలర్ల విక్రయాలలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ స్థానానికి కారణం ఆ కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్(Hero Splendor) మోటార్‌సైకిల్ సిరీస్. 1994లో మొదటిసారిగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్, మూడు దశాబ్దాలుగా అనేక మార్పులు, కొత్త మోడళ్లు వచ్చినా, భారతీయ రోడ్లపై తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతానికి Splendor+ XTEC 2.0 సహా 100cc నుంచి 125cc ఇంజన్‌లతో ఇది అందుబాటులో ఉంది. మరి ఈ బైక్‌ను దేశంలో నంబర్ 1 కమ్యూటర్ బైక్‌గా నిలబెట్టిన 5 కీలక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇండియాలో అందరి నోట ఈ కారు గురించే

టాటా మోటార్స్ (tata motors) ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టిన హారియర్ EV దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలతోనే ఈ కారు చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగి, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూలై 2న బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 10,000 బుకింగ్‌లు నమోదు కావడం హారియర్ EVపై ఉన్న ప్రజల అంచనాలు ఎంత ఎక్కువో స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం ప్రారంభంలోనే కాకుండా, బుకింగ్ వేగం ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగడం మరో విశేషం. టాటా ఈ కారులో మెరుగైన టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ప్యాకేజ్‌ను అందించింది. ఫలితంగా, కొనుగోలు దారుల్లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హై-స్పెక్ వేరియంట్‌లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉంది.

భారత్‌లోకి ఆఫ్రికన్ ఏనుగు సైజు కార్

భారత మార్కెట్‌లోకి కొత్త ఆటోమొబైల్ బ్రాండ్‌లు వరుస కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast), తన తొలి వాహనంతో ఇండియన్ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కంపెనీ తన నూతన లిమో గ్రీన్ (Limo Green) అనే 7-సీటర్ ఎంపీవీని (7-Seater MPV) భారత్‌లో సీక్రెట్‎గా టెస్ట్ చేసింది. ఇది మొదటిసారిగా ట్రయల్ రన్ జరుపుతున్నప్పుడు కెమెరా కంట పడింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ పెద్ద ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement

రోజూ 100 పెట్రోల్ కొట్టిస్తా అనే వారికి పర్ఫెక్ట్ బైక్స్

భారతదేశ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వాహనాల విషయంలో వారి జీవనశైలిని ప్రతిబింబించే ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. మెట్రో నగరాల మాదిరిగా స్మూత్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు లేని గ్రామీణ పరిస్థితుల్లో, వాహనం పర్ఫార్మెన్స్, మైలేజ్, బరువును మోయగలిగే సామర్థ్యం అన్నీ చాలా కీలకం. అక్కడి రోడ్ల పరిస్థితులు అనేక సవాళ్లు ఇస్తాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ నగర బైక్‌లు పనికిరాకపోవచ్చు. అందుకే గ్రామాల్లో బైక్ ఎంపికలో దృఢత్వం, నమ్మకమైన పనితీరు అందించే వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తక్కువ ధరలో లభించే, మంచి మైలేజ్ ఇస్తూ, ఏ రహదారినైనా తట్టుకుని ముందుకు సాగే బైక్‌లే గ్రామీణ ప్రజలకు నిజమైన మిత్రులు. అలాంటి బైకుల గురించి ఈ కథనంలో చూద్దాం.

150 Km రేంజ్‌తో సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, సుజుకి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయులకు అందించడానికి సిద్ధమవుతోంది. ఇ-యాక్సెస్ (e-access) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా, సుజుకి ఈ మోడల్ గురించి పలు కీలక వివరాలను బయటపెట్టింది. ప్రముఖంగా, ఇది ప్రస్తుతం భారత మార్కెట్‌ను ఆక్రమిస్తున్న ఓలా, ఈథర్, విడా, చేతక్ EV వంటి టాప్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. సుజుకి ఇప్పటికే ఇ-యాక్సెస్‌ను విస్తృతంగా పరీక్షిస్తోంది. టెస్ట్ మోడళ్లను రోడ్లపై పలుసార్లు చూస్తున్నట్లు ఆటో ప్రియులు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే, ఈ-యాక్సెస్‌ను డిసెంబర్ 2025లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆ లైట్లు తప్పుగా వాడి ప్రమాదాలు తెచ్చుకోవద్దు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం, తప్పుడు సిగ్నల్స్ వినియోగం ఒకటి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది డ్రైవర్లు హెజార్డ్ లైట్లను (Hazard Lights) అనవసరంగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల రోడ్డుపై గందరగోళం ఏర్పడటమే కాకుండా, ప్రమాదాల ప్రమాదం కూడా పెరుగుతుంది. సీటు బెల్టు ధరించడం లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించినంత ముఖ్యమైనది హెజార్డ్ లైట్ల సరైన ఉపయోగం కూడా. కాబట్టి వీటిని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.

ఇక ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారు కొనొచ్చు

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన సమస్యలను అధిగమించేందుకు పెద్ద ప్రణాళికతో ముందుకు వస్తోంది. మాస్ మార్కెట్ స్కూటర్లపై దృష్టి పెట్టడం కోసం తాత్కాలికంగా పక్కన పెట్టిన తమ ఎలక్ట్రిక్ కార్ల (Electric Car) ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేసింది
Advertisement

ఇండియా కార్ మార్కెట్లో తుఫాన్ రాబోతుంది

SUV మార్కెట్ నేడు ఎంత పెద్దదైపోయిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ సెగ్మెంట్‌కు భారతదేశంలో విత్తనం వేశారు జపాన్‌కు చెందిన హోండానే. మిగతా కంపెనీలు SUV లను వరుసగా విడుదల చేస్తుండగా, చాలా మందికి SUV అంటేనే గుర్తుకువచ్చే పేరు హోండా CR-V. ప్రస్తుతం రోడ్లపై చాలా అరుదుగా కనిపించినా, కారు ప్రేమికుల హృదయాల్లో మాత్రం ఈ మోడల్ శాశ్వత స్థానం సంపాదించింది. 1995లో ప్రపంచానికి పరిచయమైన CR-V, హోండా చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. దీని డిజైన్, కంఫర్ట్, పనితీరు, మూడు కలిసి SUV అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో, ముఖ్యంగా మోలీవుడ్ సెలబ్రిటీలలో ఈ కారుకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది.

తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో తనదైన స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ (Tata Motors) ప్రతి కొత్త మోడల్‌తో వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా టాటా వాహనాలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకం. ఆ వాహనాల్లో ముఖ్యంగా టాటా నెక్సాన్ చెప్పుకోదగ్గ పేరు. భారతీయ కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ SUV, స్టైలిష్ లుక్స్, మన్నికైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు ప్యాకేజ్‌గా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో, కొత్త వెర్షన్‌లతో నెక్సాన్ తనకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను మరింతగా పెంచుకుంటోంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది. నెక్సాన్‌ పెట్రోల్ నుంచి డీజిల్, ఈవీ వరకు వివిధ పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో కొనుగోలుదారులకు లభిస్తుంది.

ఆ కంపెనీ బండ్లే కావాలంటున్న ఫారినర్స్

అక్టోబర్ 2025లో భారతీయ టూ వీలర్ వెహికల్ రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India - SMIPL) కూడా ఈ విజయంలో భాగమైంది. ముఖ్యంగా ఎగుమతి (Exports) విభాగంలో అనూహ్యమైన వృద్ధిని సాధించడం ద్వారా, సుజుకి కంపెనీ తమ చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్‌తో పాటు, కొత్త జీఎస్టీ సంస్కరణలు (GST Reforms), ప్రపంచ మార్కెట్‌లో ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సుజుకి టూ-వీలర్లు విదేశాలకు భారీగా తరలి వెళ్లాయి.

హ్యుందాయ్ వెన్యూలో ఈ వేరియంట్ బెస్ట్

ఇటీవల విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) కార్లు ప్రస్తుతం షోరూమ్‌లకు రావడం మొదలుపెట్టాయి. సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చిన కొత్త హ్యుందాయ్ వెన్యూ పై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెన్యూ ఎస్‌యూవీ (Venue SUV) సిరీస్‌లో మధ్య శ్రేణి వేరియంట్‌గా (Mid-level Variant) ఉన్న HX5 వేరియంట్ గురించి ప్రస్తుతం కస్టమర్లలో చాలా ఆసక్తి నెలకొంది. తక్కువ ధరలో, డ్రైవింగ్‌కు అవసరమైన అన్ని ముఖ్యమైన టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్న ఈ HX5 వేరియంట్‌ను కొనడం సరైన నిర్ణయమని నిపుణులు అంటున్నారు. మరికొద్దిగా ఎక్కువ ధరలో లభించే ఈ HX5 వేరియంట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ఇంజిన్ ఆప్షన్స్ ఏమిటి? తెలుసుకుందాం.
Advertisement

హీరో, హోండా మధ్య భారీ యుద్ధం

భారతదేశంలో టూ-వీలర్ ఇండస్ట్రీ అక్టోబర్ 2025లో రికార్డు స్థాయిలో అమ్మకాలు (Record Sales) నమోదు చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పెరిగిన డిమాండ్‌తో పాటు, కొత్త జీఎస్టీ (GST) సంస్కరణల కారణంగా ఈసారి టూ వీలర్ రిటైల్ అమ్మకాలు భారీగా పెరిగాయి.