సీఎన్జీ కార్లు నిజంగా మంచివేనా ?

పెట్రోల్, డీజిల్ ధరలు సగటున లీటరుకు రూ.100కి అటూ ఇటూగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీఎన్‌జీ (CNG - Compressed Natural Gas) వెహికల్స్ భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు తమ పెట్రోల్ మోడల్స్‌తో పాటు సీఎన్‌జీ వెర్షన్‌లను కూడా అందిస్తున్నాయి.

ఇక మీద ఆ కలర్ నెక్సాన్ కారు దొరకదు

టాటా మోటార్స్ (Tata Motors) చరిత్రలో టియాగో (Tiago) తర్వాత అత్యంత విజయం సాధించిన మోడల్ ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Nexon Compact SUV) మాత్రమే. భద్రత (Safety) విషయంలో 5-స్టార్ రేటింగ్‌తో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ మోడల్, గత రెండు నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది.

రూ.3 కోట్లతో కొత్త కారు కొన్న స్టార్ హీరో

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), ఇటీవల కస్టమ్స్ వివాదంలో (Customs Dispute) చిక్కుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల క్రితం నకిలీ డాక్యుమెంట్లు, తక్కువ ధరలకు విదేశాల నుంచి అక్రమంగా కార్లను కొనుగోలు చేశారనే ఆరోపణల మేరకు కస్టమ్స్ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసి, కొన్ని కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే, దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు మరో కొత్త కారును జోడించి అందరి దృష్టిని ఆకర్షించారు.

బడ్జెట్ ధరలో మారుతి ఎలక్ట్రిక్ కారు

జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి అందరినీ ఆకట్టుకునే విధంగా తన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్ విజన్ ఇ-స్కై (Vision e-Sky)ను ఆవిష్కరించింది. సుజుకి ఎప్పటిలాగే చిన్న కార్ల విభాగంలో కొత్త దిశ చూపించే ప్రయత్నం చేస్తోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది పూర్తిగా సరిపోయే కారు అని చెప్పవచ్చు. చుట్టూ రద్దీగా ఉన్న వీధులలో సులభంగా నడపగల కాంపాక్ట్ సైజుతో పాటు, ఆర్థికంగా సౌకర్యవంతమైన ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఆధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణ పరంగా చూస్తే ఇది సుజుకి వ్యాగన్ R కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఫీచర్ల పరంగా మాత్రం మరింత అప్‌గ్రేడ్. ఈ కారు రోజూ ఆఫీస్‌కి వెళ్ళి రావాల్సిన వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
Advertisement

రెనాల్ట్ డస్టర్ మళ్లీ వస్తోంది.. ఆ స్పెషల్ తేదీన లాంచ్

రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పేరు వినగానే చాలా మందికి ఒక ప్రత్యేకమైన SUV అనుభూతి గుర్తుకు వస్తుంది. 2012లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, అప్పట్లో SUV సెగ్మెంట్‌లో ఒక రకమైన విప్లవాన్ని తెచ్చింది. అద్భుతమైన డిజైన్, సాలిడ్ బాడీ బిల్డ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం.. ఇవన్నీ కలిపి రెనాల్ట్ డస్టర్‌ను భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిపాయి. 10 సంవత్సరాల పాటు అమ్మకాల్లో నిలిచి, చివరకు 2022లో ఉత్పత్తి నిలిచిపోయినా, దాని అభిమానులు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే డస్టర్ మరలా రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. చాలా కాలంగా వచ్చిన రూమర్లకు ముగింపు పలుకుతూ, రెనాల్ట్ అధికారికంగా ధృవీకరించింది, కొత్త తరం రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశించబోతోంది.

66 కి.మీ మైలేజ్.. ఈ హీరో బైక్ కొత్త వేరియంట్ లాంచ్

హీరో మోటోకార్ప్ తన 125సీసీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపిస్తూ, కొత్తగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Hero Xtreme 125r) డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ట్రీమ్ 125R తన స్టైలిష్ డిజైన్, మైలేజ్, పనితీరుతో యువతలో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌తో, కంపెనీ సేఫ్టీ ఫీచర్లలో కూడా పెద్ద అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్). సాధారణంగా, ఈ ఫీచర్ ఎక్కువగా 200సీసీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి బైక్‌లలోనే లభిస్తుంది. కానీ హీరో ఈ ఫీచర్‌ను 125సీసీ కేటగిరీకి తీసుకురావడం వలన ఇది పెద్ద మార్పుగా భావించబడుతోంది.

భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ కారు

బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారు MINI తన ఎలక్ట్రిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ భారత మార్కెట్లోకి కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది. పెట్రోల్‌తో నడిచే కంట్రీమ్యాన్ JCW కంటే మరింత శక్తివంతమైన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ మినీ కంట్రీమ్యాన్ ఎస్‌ఈ ఏll4 (MINI Countryman SE All4) - ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో విడుదలైంది. ఈ కారు ధరను కంపెనీ రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ధరతో, ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించనుంది. మినీ బ్రాండ్‌కు ప్రత్యేకతైన స్టైల్‌, కాంపాక్ట్ లగ్జరీ, ఫన్ టు డ్రైవ్ అనుభూతి ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

చిన్న కారు.. కానీ భారీ చరిత్ర! 47 లక్షల అమ్మకాలు

మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది సాధారణ ప్రజల కలల కారు. ఒకప్పుడు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రారాజుగా నిలిచిన ఈ చిన్న కారు, భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక లెజెండ్‌గా గుర్తింపు పొందింది. మారుతి 800 తన కాలంలో ప్రజలకు చవకగా, నమ్మకంగా లభించే వాహనం అయితే, దాని స్థానంలోకి వచ్చిన ఆల్టో మరింత ఆధునికంగా, అందరికీ చేరువగా నిలిచింది. ఈ చిన్న కార్ ఆవిష్కరణతోనే మధ్యతరగతి కుటుంబాలు తమ సొంత కారు అనే కలను నిజం చేసుకున్నాయి. ఆల్టో విడుదలైన మొదటి రోజునుండి ప్రజలలో ఏదో ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించింది. కాంపాక్ట్ సైజ్, తేలికైన డిజైన్, తక్కువ ఇంధన వినియోగం, ఇవన్నీ ఈ కారును సాధారణ వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా తీర్చిదిద్దాయి.
Advertisement

మారుతి ఎస్-ప్రెస్సోపై 52 వేల రూపాయల వరకు ఆఫర్లు!

చిన్న కార్ల విభాగంలో కొత్త యుగాన్ని ప్రారంభించిన మోడల్‌గా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki Spresso)ను చెప్పుకోవచ్చు. తక్కువ ధరలో, మినీ SUV తరహా లుక్స్‌తో, మన్నికైన ఇంజిన్ పనితీరుతో ఈ మోడల్ దేశవ్యాప్తంగా చిన్న కుటుంబాల నుండి యువత వరకు అందరికీ ఆకర్షణీయంగా మారింది. నగర ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపే కాంపాక్ట్ డిజైన్‌, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్‌, స్పష్టమైన విజిబిలిటీ కారణంగా మహిళా డ్రైవర్స్‌కు కూడా ఈ కారు ప్రత్యేకంగా నచ్చింది. భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ అర్బన్ కార్ లిస్ట్‌లో ఎస్-ప్రెస్సో పేరు తప్పనిసరిగా ఉంటుంది. కారు సులభంగా మలుపులు తిరుగుతూ, పార్కింగ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది.

మార్కెట్లో మహీంద్రా ఈవీల దండయాత్ర

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాల్లో మహీంద్రా (Mahindra) సంస్థ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కేవలం ఏడు నెలల డెలివరీ పీరియడ్‌లోనే బీఈ 6 (BE 6), ఎక్స్‌ఈవీ 9ఈ (XEV 9e) అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను కలిపి ఏకంగా 30 వేల యూనిట్లకు పైగా విక్రయించి మహీంద్రా చరిత్ర సృష్టించింది.

కొన్నేళ్లలో రోడ్ల మీద అన్నీ ఈ కార్లే

ఇండియాలో టూ వీలర్లకు తిరుగులేని అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఇప్పుడు సరికొత్త మొబిలిటీ సెగ్మెంట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ఇటలీలో జరిగిన EICMA 2025 అంతర్జాతీయ మోటార్ షోలో హీరో తమ ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ అయిన విడా (VIDA) కింద పలు సెన్సేషన్ కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది.

అంచనాలను మించి రికార్డ్ బద్దలు కొట్టిన TVS

అక్టోబర్ నెల ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ ఆటో మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ కూడా తన 2025 అక్టోబర్ నెలలో సాధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఈసారి టీవీఎస్ నిజంగా తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కంపెనీ ప్రకారం, 2025 అక్టోబర్ నెలలో మొత్తం 5,25,150 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం అంటే 2024 అక్టోబర్‌లో విక్రయించిన 4,78,159 వాహనాలతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించినట్టే. ఈ పెరుగుదల కంపెనీకి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
Advertisement

ఈ సైకిల్‎ను పెడల్ తొక్కకుండానే 35కిమీ వెళ్లొచ్చు

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్‌లలో ఒకటైన ఈ-మోటోరాడ్ (EMotorad), తమ విశేష ప్రజాదరణ పొందిన X1 ఎలక్ట్రిక్ సైకిల్ (X1 Electric Cycle) అప్‌డేటెడ్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లలతో, కొత్త X1 భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన, విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ సైకిళ్లలో ఒకటిగా నిలిచింది. సస

70 కి.మీ మైలేజ్ బైక్ నెలకు రూ.2,400తో

భారతీయ మధ్యతరగతి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బైక్ అంటే హీరో స్ప్లెండర్ ప్లస్‌ (Hero Splendor Plus)కే చెందుతుంది. పనితీరు, మైలేజ్ పరంగా అత్యుత్తమ ఫలితాలు ఇవ్వడం వంటివి దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. నగరాలు, పట్టణాలు, గ్రామీణ రోడ్లపై సౌకర్యవంతమైన రైడింగ్ కోసం రూపొందించిన ఈ బైక్, రోజువారీ ప్రయాణాల కోసం అద్భుతమైన భాగస్వామి. దీని క్లాసిక్ లుక్ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తుంది, అదే సమయంలో మోడరన్ టచ్ కూడా ఇస్తుంది. హీరో కంపెనీ దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కేటగిరీలో అందుబాటులో ఉంచింది. దీని ధర రూ. 73,946 నుంచి రూ. 76,437 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ ఆన్-రోడ్ ధర, నెలవారీ EMI ఎంపికను ఇక్కడ మేము క్లుప్తంగా వివరించాము.

స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ ధరకే స్కూటర్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters)కు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మార్కెట్‌లో కొత్త మోడళ్లు వెల్లువెత్తుతున్న సమయంలో ఐఫోన్ కొనడానికి అయ్యేంత ఖర్చుతో కూడా ఒక కొత్త ఈవీని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా స్టార్టప్ బ్రాండ్‌లు తక్కువ ధరకే ఈవీలను అందిస్తున్నాయి. ఈ కోవలోనే మేక్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ జెలియో ఇ-మొబిలిటీ (Zelio E-Mobility), అతి తక్కువ ధరకు మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈవా (Eeva ) సిరీస్‌లో విడుదల చేసింది. కేవలం రూ.51,551 ప్రారంభ ధరతో, ఈ కొత్త స్కూటర్లు ఒకే ఛార్జ్‌పై 90 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తున్నాయి.

స్పోర్ట్స్ కార్ ఫీలింగ్ ఇచ్చే ఫ్యామిలీ కారు పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే

Skoda Octavia RS launched in India at ₹45.00 Lakh. Explore its design, engine, features, and more. | Skoda Octavia RS భారతదేశంలో ₹45.00 లక్షలకు విడుదలైంది. డిజైన్, ఇంజిన్, ఫీచర్లు మరియు మరిన్నింటిని చూడండి.
Advertisement

ఒక చిన్న మారుతి 800తో మొదలై మూడు కోట్ల కార్ల వరకూ

భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది, అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన పనితీరు, ప్రజల నిత్యజీవితంలో భాగమైన కార్లు. పేద, మధ్యతరగతి ప్రజలకు కార్లు కల కాదు అనే భావనను మార్చిన కంపెనీగా మారుతి సుజుకి ఎంతో కాలంగా పేరు గాంచింది. ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా వంటి మోడళ్లు ఒక్కో ఇంటికి చేరి దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించాయి. ఇప్పుడు ఈ కంపెనీ మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. దేశీయంగా 3 కోట్ల కార్ల విక్రయాలను పూర్తి చేసినట్లు మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 2025 నాటికి ఈ ఘనతను సాధించడం ద్వారా ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అత్యధికంగా వాహనాలు విక్రయించిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

హోండా కంపెనీ లోగో మారింది చూశారా

భారతదేశంలో హోండా టూ వీలర్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి నెలా అమ్మకాల విషయంలో మార్కెట్లో అగ్రస్థానంలో నిలబడుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు, కొత్త డిజైన్‌లను అందించడంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా బ్రాండ్ తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకునేందుకు లోగోలో కీలక మార్పులు చేసింది.

కూరగాయలు అమ్మే వ్యక్తికి Tvs Xl గిఫ్ట్‌గా ఇచ్చిన ఎమ్మెల్యే

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక హృదయానికి హత్తుకునే ఘటన వైరల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఒక అభిమానికి ఎమ్మెల్యే ఇచ్చిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల తన మద్దతుదారుడు బాలయ్యకు కొత్త TVS XL 100 మోపెడ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఎన్నికల సమయంలో గ్రామాలు తిరిగి తన విజయానికి ఎంతగానో సహకరించిన ఈ అభిమాని పట్ల కృతజ్ఞతగా ఆయన ఈ గిఫ్ట్ అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

180 కి.మీ. వేగంతో దూసుకుపోనున్న కొత్త రైలు!

భారతీయ రైల్వేలను ఆధునీకరించే క్రమంలో దూర ప్రయాణాలకు అత్యంత కీలకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కోటా డివిజన్ పరిధిలోని సవాయి మాధోపూర్-కోటా-నాగ్‌డా సెక్షన్‌లో జరిగిన టెస్టుల్లో రెండవ రేక్ గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని అంచనాలను మించిపోయింది.
Advertisement

భారత మార్కెట్లో తుఫాను రేపబోతున్న న్యూమెరోస్ N-ఫస్ట్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవం వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో, కొత్తగా ఆవిష్కృతమైన న్యూమెరోస్ మోటార్స్ n-ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్‌లలో ఒకటైన న్యూమెరోస్ మోటార్స్, తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ N-ఫస్ట్ లాంచ్ ద్వారా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. బెంగళూరులో అత్యంత గ్రాండ్‌గా నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా, కంపెనీ తన దృష్టిని స్పష్టంగా చూపించింది, స్మార్ట్ డిజైన్‌, సుస్థిర టెక్నాలజీ, అందరికీ అందుబాటులో ఉండే ధరతో దీనిని తెచ్చింది. ఈ స్కూటర్ ధరను మొదటి 1,000 మంది కస్టమర్లకు రూ.64,999 పరిచయ ధరగా నిర్ణయించడం ద్వారా, న్యూమెరోస్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింత చేరువ చేసింది.

FASTag పనిచేయడం లేదా?

మీ కారుకు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయిందా? అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి ప్రధాన కారణం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల తప్పనిసరి చేసిన KYV (Know Your Vehicle) ధృవీకరణ ప్రక్రియ.

ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన విభాగంలో కూడా తన సత్తా చాటిన మహీంద్రా

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి దారితీసిన మహీంద్రా (Mahindra) సంస్థ మరో విశేషమైన ఘనతను సాధించింది. ఇప్పటికే SUVల విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML) పేరుతో తన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల విభాగాన్ని విజయవంతంగా నడుపుతున్న ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ మహీంద్రా MLMML ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య భారత ఆటోమొబైల్ చరిత్రలో కొత్త పేజీని రాసిందని చెప్పాలి.

జనాలు ఈ కారును భారీగా కొంటున్నారు

ఒకప్పుడు, కార్ల మార్కెట్‌లో సెడాన్ (Sedan) అనే పేరు వినిపిస్తేనే ప్రజల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం ఉండేది. సొగసైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, క్లాసీ లుక్ కారణంగా, సెడాన్ కార్లు ప్రతి కుటుంబం కలల వాహనాలుగా నిలిచాయి. కానీ సమయం మారింది. SUVల యుగం మొదలైంది. పెద్ద సైజ్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రోడ్ ప్రెజెన్స్ ఇవన్నీ SUVలకు భారీ డిమాండ్ తెచ్చాయి. దాంతో, చాలా మంది కస్టమర్లు సెడాన్‌లను మర్చిపోయి SUVల వైపు మళ్లారు. అయినా సరే, సెడాన్‌లు పూర్తిగా వెనుకబడ్డాయనే చెప్పడం తప్పుడు. SUVలు మార్కెట్‌ను ఆధిపత్యం వహిస్తున్నా, సెడాన్‌లకు తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.
Advertisement

నిమిషానికి 15 బండ్లు అమ్మి రికార్డ్

భారతీయ టూ వీలర్ మార్కెట్లో అతిపెద్ద సంస్థలలో ఒకటైన హోండా టూ వీలర్ కంపెనీ అక్టోబర్ 2025 నెల విక్రయాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. కేవలం 31 రోజుల్లోనే ఈ కంపెనీ ఏకంగా 6,50,596 వాహనాలను విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, దేశీయంగా అమ్మకాలు భారీగా పెరగడం ద్వారా కంపెనీ మొత్తం వృద్ధిని బలంగా నిలబెట్టింది. ఈ విజయానికి కీలకమైన యాక్టివా (Activa) స్కూటర్ 3.5 కోట్ల యూనిట్ల ఎగుమతి మైలురాయిని చేరుకుంది. హోండా సాధించిన ఈ రికార్డు విజయం, అమ్మకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.