నిమిషానికి 15 బండ్లు అమ్మి రికార్డ్

భారతీయ టూ వీలర్ మార్కెట్లో అతిపెద్ద సంస్థలలో ఒకటైన హోండా టూ వీలర్ కంపెనీ అక్టోబర్ 2025 నెల విక్రయాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. కేవలం 31 రోజుల్లోనే ఈ కంపెనీ ఏకంగా 6,50,596 వాహనాలను విక్రయించింది. అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల్లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, దేశీయంగా అమ్మకాలు భారీగా పెరగడం ద్వారా కంపెనీ మొత్తం వృద్ధిని బలంగా నిలబెట్టింది. ఈ విజయానికి కీలకమైన యాక్టివా (Activa) స్కూటర్ 3.5 కోట్ల యూనిట్ల ఎగుమతి మైలురాయిని చేరుకుంది. హోండా సాధించిన ఈ రికార్డు విజయం, అమ్మకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

హీరో నుంచి కొత్త బైక్‌లు.. రోడ్లపై రాకింగ్ లుక్‌తో అదరగొట్టబోతున్నాయ్

హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీ సంస్థలలో ఒకటి, తన కొత్త మోడళ్లతో మరోసారి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇటలీలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన ప్రదర్శన EICMA 2025 లో హీరో తన సత్తా చాటింది. ఈ అంతర్జాతీయ వేదికపై కంపెనీ తన ప్రధాన బ్రాండ్ కింద మాత్రమే కాకుండా, తన ఎలక్ట్రిక్ విభాగం విడా (VIDA) పేరుతో కూడా అనేక కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ సారి హీరో ప్రదర్శించిన మోడళ్లలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించినవి రెండు.. XPulse 210 Dakkar Edition (ఎక్స్‌పల్స్ 210 డాకర్ ఎడిషన్), Hunk 440 SX (హంక్ 440 ఎస్‌ఎక్స్). ఈ రెండు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. వీటి రాక కోసం ఆటో ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ బైక్స్ గురించిన వివరాలు ఈ కథనంలో చూద్దాం.

అక్టోబర్‌లో హోండా విక్రయాలు దూకుడు!

హోండా (Honda) భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో ఒకటి. ఈ కంపెనీ కేవలం దేశీయ మార్కెట్‌కే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా తన వాహనాలను సరఫరా చేస్తోంది. ప్రతీ నెలా అమ్మకాల గణాంకాలను ప్రకటించే ఈ సంస్థ, అక్టోబర్ నెలలో మంచి వృద్ధిని నమోదు చేసింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, అక్టోబర్ 2025లో హోండా టూ వీలర్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగి, మరోసారి తన మార్కెట్ బలాన్ని నిరూపించాయి. ఈ నెలలో హోండా మొత్తం 6,50,596 వాహనాలను విక్రయించింది. ఇందులో 5,98,952 యూనిట్లు దేశీయ మార్కెట్‌లో అమ్ముడవ్వగా, 51,644 వాహనాలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 5,97,711 యూనిట్లను విక్రయించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 8.85 శాతం వృద్ధి సాధించాయి.

ఇది 34 లక్షల కుటుంబాల నమ్మకం

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki WagonR) సరికొత్త మైలురాయిని చేరుకుంది. 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‎గా నిలిచిన ఈ టాల్-బాయ్ డిజైన్ కారు, దేశంలో ఏకంగా 34 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది.
Advertisement

మహిళా ప్రపంచకప్ విజేతలకు టాటా బిగ్ గిఫ్ట్

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచకప్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని, ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) మహిళా క్రికెట్ జట్టుకు భారీ బహుమతిని ప్రకటించింది.

ఈ స్పెషల్ బైక్ కొన్న వాళ్లకు నిజంగానే అదృష్టం

ప్రపంచ మోటార్‌సైకిల్ రంగంలో 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ.. తమ అద్భుతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేకమైన మోడల్‌ను విడుదల చేసింది. ఇటలీలో జరుగుతున్న EICMA 2025 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ప్రదర్శనలో క్లాసిక్ 650 125వ వార్షికోత్సవ ఎడిషన్ బైక్‌ను ఆవిష్కరించింది.

మారుతి చిన్న కార్లు దుమ్ము దులిపాయి.. SUVలను మించిపోయిన అమ్మకాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం కార్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) తగ్గింపు భారత ఆటోమొబైల్ రంగానికి ఊపిరి పోసింది. ఈ నిర్ణయం ప్రత్యేకించి చిన్న కారు విభాగానికి భారీ ఊతం ఇచ్చింది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగిన, చిన్న ఇంజిన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇప్పుడు కేవలం 18 శాతం GST మాత్రమే వర్తించనుంది. దీంతో చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా, దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఈ తగ్గింపును వెంటనే వినియోగదారులకు చేరవేసింది. కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలను రూ.36,000 నుండి రూ.1.06 లక్షల వరకు తగ్గించింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

డ్రైవింగ్‌లో చిన్న మార్పులు.. కానీ మైలేజ్‌లో పెద్ద మిరాకిల్!

ఇప్పటి పెట్రోల్ ధరల పెరుగుదల పరిస్థితుల్లో ప్రతి బైక్ రైడర్ మనసులో తారసపడే ప్రశ్న ఒక్కటే, నా బైక్ మైలేజ్ ఎలా పెంచుకోవాలి? అనేది. రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, లేదా ఇంటి అవసరాల కోసం ప్రయాణించే వారు అందరూ వీలైనంత వరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బైక్ కొనేటప్పుడు చాలా మంది మొదటగా కిలోమీటర్‌కు ఎంత ఇస్తుంది? అనే ప్రశ్న అడుగుతారు. కానీ ఒకసారి బైక్ కొనుగోలు చేసిన తర్వాత, దానిని సరైన విధంగా సంరక్షించకపోతే లేదా తప్పుగా నడిపితే, ఆ మైలేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా కొత్తగా కొన్న బైక్ కూడా కొన్ని నెలల్లోనే మైలేజ్ డ్రాప్ సమస్యతో బాధిస్తుంటుంది. నిపుణుల ప్రకారం, బైక్ మైలేజ్‌ పెరగాలంటే ఈ కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవెంటో ఒకసారి చూద్దాం.
Advertisement

సుజుకి మోటార్‌సైకిల్ అక్టోబర్ అమ్మకాలతో కొత్త రికార్డు!

ప్రఖ్యాత టూవీలర్ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) అక్టోబర్ 2025లో తమ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును సృష్టించింది. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతులను కలిపి మొత్తం 1,29,261 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో (అక్టోబర్ 2024) కంపెనీ 1,20,055 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి సుజుకి 8 శాతం వార్షిక వృద్ధిని సాధించడం విశేషం. ఈ అద్భుతమైన అమ్మకాలతో పాటు, సుజుకి మోటార్‌సైకిల్ అక్టోబర్ 2025లో తమ వ్యాపార విలువ రూ. 857 మిలియన్లకు పైగా చేరుకున్నట్లు పేర్కొంది. ఇది కంపెనీకి ఆర్థిక పరంగా కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

తగ్గిన అమ్మకాల తర్వాత తిరిగి దుమ్ము రేపిన రెనాల్ట్

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారతీయ విభాగం రెనాల్ట్ ఇండియా, అక్టోబర్ 2025 నెలలో నమోదు చేసిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెలలో మెరుగైన గణంకాలను నమోదు చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆ నెలలో మొత్తం 4,672 రెనాల్ట్ కార్లు భారత మార్కెట్లో అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 3,861 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గణనీయమైన వృద్ధి, అంటే 21% సంవత్సరాంతర వృద్ధి సాధించినట్లే. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి, కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త ట్రైబర్ (Triber), కైగర్ (Kiger) మోడళ్లకు లభించిన భారీ ఆదరణ.

మీ కారు అద్దాలు ఇలా కాపాడుకోండి

కారులో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులను గాలి, వర్షం, దుమ్ము, ఎగిరే రాళ్ల నుంచి కాపాడే అతి ముఖ్యమైన భాగం విండ్‌షీల్డ్ (Windshield). ఒక్కోసారి డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న రాయి తగలడం వల్ల కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ విండ్‌షీల్డ్ దెబ్బతింటే, అది ప్రయాణీకుల భద్రతకు ముప్పుగా మారుతుంది. చిన్న పగుళ్లను రిపేర్ చేయగలిగినప్పటికీ, అసలు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ కారు విండ్‌షీల్డ్‌ను పగుళ్లు లేదా గీతలు పడకుండా కాపాడుకోవడానికి డ్రైవింగ్‌లో తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటలీలో మెరిసిన టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ బైకులు

ఇటలీలో ప్రారంభమైన ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌సైకిల్ ఉత్సవం EICMA 2025 మోటార్‌సైకిల్ ప్రేమికులకు నిజమైన పండుగలా మారింది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ కొత్త సాంకేతికతలు, భవిష్యత్ మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాయి. ఈ వేదికపై భారతీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా తన ప్రతిభను మరోసారి నిరూపించింది. భారత మార్కెట్‌లోనే కాకుండా, ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో కూడా తన స్థానాన్ని బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న టీవీఎస్ పలు మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ వాహనాలు కేవలం రేంజ్ పరంగా మాత్రమే కాకుండా, స్మార్ట్ కనెక్టివిటీ, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, అధిక భద్రతా ప్రమాణాలతో కూడా ఆకట్టుకున్నాయి. వాటి గురించి ఈ కథణంలో చూద్దాం.
Advertisement

హెల్మెట్ బదులుగా ఫ్రైపాన్? బెంగళూరులో వైరల్ అయిన వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంత వేగంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడ జరిగినా, క్షణాల్లోనే వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నగరంలోని రూపేనా అగ్రహార సమీపంలో ఓ బైక్ రైడర్ చేసిన విచిత్ర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల జరిమానా నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి తలపై హెల్మెట్ బదులుగా ఒక పెద్ద ఫ్రై పాన్, అంటే కడాయిని ధరించి బైక్ వెనుక కూర్చున్నాడు. చూస్తేనే నవ్వొచ్చే ఈ సీన్‌ను ఎవరో మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

ఇటలీలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన EICMA 2025 (ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ అండ్ యాక్సెసరీస్ షో) ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రఖ్యాత వేదికపై ప్రతి సంవత్సరం మోటార్‌సైకిల్ దిగ్గజాలు తమ కొత్త ఆవిష్కరణలను, భవిష్యత్ దిశగా తీసుకెళ్లే సాంకేతిక మోడళ్లను ప్రదర్శిస్తారు. ఈసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నది మన దేశపు గర్వకారణమైన బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ బ్రాండ్, ఎలక్ట్రిక్ యుగంలోకి ప్రవేశిస్తూ ఫ్లయింగ్ ఫ్లీ S6 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఆవిష్కరించింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ భవిష్యత్తుకు దారి చూపే తరతరాల మోటార్‌సైకిల్ టెక్నాలజీకి సంకేతం. తేలికైన నిర్మాణం, ఆధునిక డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యంతో ఈ బైక్ వేరే స్థాయిలో ఉన్న రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపుదిద్దుకుంది.

రూ.7.50కోట్ల కారు కొన్న స్టార్ డైరెక్టర్

సెలబ్రిటీల లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రోల్స్ రాయిస్ (Rolls-Royce) కంపెనీకి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్(Spectre)ను కొనుగోలు చేసిన భారతదేశపు మొదటి దర్శకుడు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు.. తాను దర్శకత్వం వహించిన 5 సినిమాల్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు, ఇటీవల షారూఖ్ ఖాన్‌తో జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన అట్లీ కుమార్ (Atlee Kumar). దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లీ, తన వరుస విజయాలు, పాన్-ఇండియా రేంజ్ పెరగడం వలన ఆదాయం పెరిగి, తన వాహనాన్ని కూడా లగ్జరీగా అప్‌గ్రేడ్ చేసుకున్నాడు.

తక్కువ ధరకే అందరూ ఎదురూ చూస్తున్న కారు వచ్చేసింది

హ్యుందాయ్ వెన్యూ పేరు విన్నప్పుడు ఆటోమొబైల్ ప్రేమికులకు గుర్తొచ్చేది.. స్టైల్, సౌకర్యం, నమ్మకం. ఈ పేరును మరింత బలోపేతం చేస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త హ్యుందాయ్ వెన్యూను భారత మార్కెట్లో ఘనంగా లాంచ్ చేసింది. కొత్త వెన్యూ పాత మోడల్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు, కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు, ఆధునిక టెక్నాలజీలతో ముందుకు వచ్చింది. ఇదే సమయంలో, కంపెనీ వెన్యూ N లైన్ వేరియంట్‌ను కూడా ఆవిష్కరించింది, ఇది మరింత పవర్‌ఫుల్, స్పోర్టీ అనుభవాన్ని కోరుకునే యువ డ్రైవర్‌లను ఆకర్షించేలా రూపొందించబడింది. హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అయింది.
Advertisement

బైక్ ప్రేమికులకు పండుగ మొదలైంది.. మిలాన్‌లో EICMA 2025

ప్రతి సంవత్సరం టూవీలర్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఉంటుంది, అదే EICMA (Esposizione Internazionale Ciclo Motociclo e Accessori). ఇది ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ అభిమానులందరికీ ఇది ఒక పండుగలా ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఆటోమొబైల్ కంపెనీలు తమ తాజా టెక్నాలజీని, రాబోయే మోడళ్లను, భవిష్యత్ కాన్సెప్ట్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. సాధారణంగా మోటార్ షోలు అంటే కార్లు, బైక్‌లు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలు అన్నీ ఉంటాయి. కానీ EICMA మాత్రం పూర్తిగా టూవీలర్ వాహనాలకే అంకితమై ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లు.. హోండా, యమహా, సుజుకి, కవాసకి, డుకాటి, ట్రయంఫ్, KTM, బజాజ్, హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, TVS వంటి కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తాయి.

డుగ్గు..డుగ్గు బైకు మీద పోతుంటే అందరి చూపు మీమీదే

ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. కొత్త బైక్‌లు, రికార్డు అమ్మకాలతో మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ కంపెనీ కేవలం రూ.లక్ష రేంజ్‌లోనే ఒక సరికొత్త బైక్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు బైక్ ప్రియులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు ఈ బైక్ ఏకంగా లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అక్టోబర్ 2025 అమ్మకాల నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం కంపెనీ బంపర్ హిట్ సాధించింది. ఇంతకీ ఆ రేంజ్ బైక్ వివరాలు ఏంటి? కంపెనీ అమ్మకాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అందరూ ఈ కంపెనీ ఈవీ కార్లే కొంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి కొత్త ఊపును అందిస్తున్న JSW MG మోటార్ ఇండియా ఇప్పుడు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత మార్కెట్లో 1 లక్ష ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల మైలురాయిని దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం MG మోటార్‌కే కాదు, మొత్తం భారత ఆటోమొబైల్ పరిశ్రమకే ఒక కీలక ఘట్టం. ఎందుకంటే, ఇది దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఘనతతో MG మోటార్, టాటా మోటార్స్ తరువాత ఈ మైలురాయిని చేరుకున్న రెండవ ఆటోమేకర్‌గా నిలిచింది. MG మోటార్ ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా బలమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

మీ జాతకం బాగుంటేనే ఈ బైక్ కొంటారు

ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన బైక్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. మీ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నా సరే మీ జాతకం బాగుంటే మాత్రమే ఈ బైక్ మీ చేతికి వస్తుంది. సమయానికి స్పందించకపోతే ఈ బైక్‌ను కొనే అవకాశం కోల్పోతారు.
Advertisement

రూ.15.29 లక్షల ధరలో కొత్త హోండా ఎలివేట్ ADV ఎడిషన్

భారతదేశంలో హోండా (Honda) కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఎలివేట్. SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన తొలి జపనీస్ ఆటోమేకర్లలో ఒకటైన హోండా, ఈ కాంపాక్ట్ SUVతో తక్కువ సమయంలోనే భారత వినియోగదారుల మనసును గెలుచుకుంది. స్టైలిష్ లుక్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కారణంగా ఎలివేట్ ప్రారంభ దశలోనే భారీ అమ్మకాలను నమోదు చేసింది. అయితే గత కొంతకాలంగా మార్కెట్లో పోటీ పెరగడంతో ఈ SUV అమ్మకాలు కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. ఈ పరిణామాన్ని గమనించిన హోండా మళ్లీ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త వ్యూహాన్ని అవలంబించింది. కంపెనీ తాజాగా ఎలివేట్‌కు ఒక కొత్త రూపం ఇచ్చి, ప్రత్యేక ఆకర్షణలతో కూడిన Elevate ADV Editionను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది

ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేందుకు భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) సిద్ధమైంది. తమిళనాడులోని చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కాన్సెప్ట్ రూపంలో ఇటలీలోని మిలన్‌లో జరిగే EICMA 2025 అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ప్రపంచానికి పరిచయం చేయనుంది. తమిళనాడులోని హోసూరు (Hosur) ప్లాంట్‌లో తయారయ్యే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్, అంతర్జాతీయ మార్కెట్లో టీవీఎస్ బ్రాండ్‌ను మరో మెట్టు ఎక్కించనుంది. ఈ స్పోర్టీ నేకెడ్ మోటార్‌సైకిల్ వివరాలు, ఇతర కొత్త మోడల్స్‌ గురించి తెలుసుకుందాం.

రూ.7.55 లక్షల కారుపై కస్టమర్ల దండయాత్ర.

భారత మార్కెట్‌లో తన బ్రాండ్‌ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India), అక్టోబర్ 2025లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించింది. ఈ రికార్డు అమ్మకాలకు ప్రధాన కారణం రూ.7.55 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన స్కోడా మొదటి 4 మీటర్ల కంటే చిన్న ఎస్‌యూవీ అయిన కైలాక్(Kylaq). ఈ మోడల్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో, స్కోడా అమ్మకాల కౌంటర్ తొలిసారిగా అత్యధిక స్థాయికి చేరుకుంది.

హీరో నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp), తన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (VIDA)ను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటివరకు స్కూటర్లపై దృష్టి పెట్టిన హీరో, ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆటో షో EICMA 2025 (మిలన్)లో తొలిసారిగా ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఈ మోటార్‌సైకిల్‌ను హీరో ప్రాజెక్ట్ VXZ పేరుతో అభివృద్ధి చేస్తోంది. గతంలో కంపెనీ ఉబెక్స్ (UBEX) అనే కాన్సెప్ట్‌కు సంబంధించిన టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది, అయితే ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు.
Advertisement

టెస్లా నుంచి ఎగిరే కారు లాంచ్‌పై ఎలాన్ మస్క్ బిగ్ అప్‌డేట్!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా (Tesla) కంపెనీ, ఇప్పుడు మరొక అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elen Musk) మళ్లీ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సాంకేతిక రంగాన్ని కదిలించే ఈ వ్యాపారవేత్త, ఈసారి ఎగిరే కారు కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కంపెనీ 2025 చివరి నాటికి ఒక ఎగిరే కార్ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని వెల్లడించారు. ఆయన మాటల్లో ఇది ఇప్పటివరకు ఆవిష్కరించబడిన అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి అని పేర్కొనడం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న విశ్వాసాన్ని, సాంకేతిక శక్తిని స్పష్టంగా చూపిస్తోంది.