టెస్లా నుంచి ఎగిరే కారు లాంచ్‌పై ఎలాన్ మస్క్ బిగ్ అప్‌డేట్!
ఆటోమొబైల్స్
- 10 month, 15 days ago
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా (Tesla) కంపెనీ, ఇప్పుడు మరొక అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elen Musk) మళ్లీ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సాంకేతిక రంగాన్ని కదిలించే ఈ వ్యాపారవేత్త, ఈసారి ఎగిరే కారు కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కంపెనీ 2025 చివరి నాటికి ఒక ఎగిరే కార్ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని వెల్లడించారు. ఆయన మాటల్లో ఇది ఇప్పటివరకు ఆవిష్కరించబడిన అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి అని పేర్కొనడం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న విశ్వాసాన్ని, సాంకేతిక శక్తిని స్పష్టంగా చూపిస్తోంది.