ఇంత మంచి బైక్‌ను ఒక్కరూ కూడా కొనలేదు

కవాసకి (Kawasaki) అనేది జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్. ఇది ప్రధానంగా స్పోర్ట్స్ బైక్‌లు, క్రూయిజర్‌లు, అడ్వెంచర్ బైక్‌లు, ఆఫ్-రోడ్ మోడళ్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. బలమైన ఇంజిన్ పనితీరు, అద్భుతమైన హ్యాండ్లింగ్, ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కవాసకి బైక్‌లకు విస్తృతమైన అభిమాన వర్గం ఉంది. భారత మార్కెట్‌లో కూడా కవాసకి తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్‌లు, అడ్వెంచర్ బైక్‌ల రంగంలో ఈ బ్రాండ్‌కి ఉన్న పేరు చెప్పక్కర్లేదు. Ninja, Z Series వంటి బైక్‌లు యువతలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. అదే సమయంలో, క్లాసిక్ లుక్‌ని ఇష్టపడే వారికి W Series ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదిరిపోయే 6 కార్లు రాబోతున్నాయ్

2025 సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ ఏడాది ఆటోమొబైల్ మార్కెట్‌కు ఒక ముఖ్యమైన సంవత్సరంగా నిలిచింది. జీఎస్‌టీ తగ్గింపు వంటి ప్రయోజనాలు కారు అమ్మకాలకు అద్భుతమైన మైలేజీని ఇచ్చాయి. సంవత్సరం చివరికి వస్తున్నప్పటికీ కొత్త కార్లు ఇంకా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన మోడళ్లతో సహా అద్భుతమైన కార్లు ఇండియాలో విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒక క్లాసిక్ ఎస్‌యూవీ తిరిగి రావడం కూడా 2025 నవంబర్ నెలలో చూడవచ్చు. వచ్చే నెలలో భారతీయులను ఆకర్షించనున్న కొత్త కార్లు ఏవో చూద్దాం.

టాటా పంచ్‌కు బలమైన ప్రత్యర్థి.. చిన్న కారు కావాలనుకునే వారికి బెస్ట్

ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న 2025 జపాన్ మొబిలిటీ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారులు తమ సరికొత్త ఆవిష్కరణలను, భవిష్యత్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ వేదికపై సుజుకి కూడా పలు ఆసక్తికరమైన మోడళ్లను ఆవిష్కరించింది. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మారుతి సుజుకి XBEE లేదా జపాన్ మార్కెట్‌లో ప్రసిద్ధిగా పిలిచే క్రాస్బీ (Crosby). ఈ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUV 2017లోనే జపాన్‌లో తొలి సారిగా పరిచయం అయి, చిన్న SUV విభాగంలో తన ప్రత్యేకమైన డిజైన్‌ద్వారా మంచి గుర్తింపును సంపాదించింది. ఇప్పుడు 2025లో సుజుకి దీనికి కొత్త రూపాన్ని, మరింత ఆధునికమైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువచ్చింది. కొత్త XBEE ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

మాకు ఆ కారే కావాలంటునున్న విదేశీయులు

నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం ఇండియాలో కేవలం ఒకే ఒక కారును అమ్ముతోంది. అదే నిస్సాన్ మాగ్నైట్. ఈ కారు భారత మార్కెట్‌లో హిట్‌ అయ్యి, మంచి అమ్మకాలను సాధిస్తున్నప్పటికీ ఈ సంస్థ ఇప్పుడు ఎగుమతులలో కొత్త రికార్డు సృష్టించింది. భారత ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ఈ కారును వెతికి వెతికి కొనుక్కుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
Advertisement

స్పోర్టీ లుక్ ఉన్నా… హోండా డియో అమ్మకాలలో డౌన్ ట్రెండ్!

దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో హోండా (Honda) పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది యాక్టివా. అయితే, అదే కంపెనీ మరో వైపు యువతలో సూపర్ హిట్ అయిన మోడల్ హోండా డియో (Honda Dio)తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. యాక్టివా కుటుంబాలకు సరిపోయే స్మూత్ స్కూటర్‌గా నిలిచినప్పటికీ, డియో మాత్రం తన స్పోర్టీ డిజైన్, స్టైలిష్ లుక్స్, ఆకట్టుకునే కలర్ ఆప్షన్లతో యువతను తన వైపుకు తిప్పుకుంది. ఒకప్పుడు కళాశాల విద్యార్థుల నుంచి యువ ఉద్యోగులు వరకు అందరి గ్యారేజ్‌లో డియో స్కూటర్ తప్పనిసరిగా కనిపించేది. అబ్బాయిలకు బైక్‌లకు ప్రత్యామ్నాయంగా, అమ్మాయిలకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా ఈ స్కూటర్ నిలిచింది. అయితే కాలం మారింది, మార్కెట్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, అధునాతన టెక్నాలజీ మోడళ్లు రావడంతో పోటీ పెరిగింది.

ఇది కారు కాదు... సూపర్ స్టార్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్యూవీ (Electric SUV) మార్కెట్‌ను శాసిస్తున్న మహీంద్రా సంస్థ నుంచి వస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కారు మహీంద్రా BE6. ఈ కారుకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ కారు హై-ఎండ్ వేరియంట్ల డెలివరీలు జరుగుతుండగా, ఇప్పుడు చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్న బేస్ వేరియంట్ (Base Variant) డెలివరీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ BE6 (ప్యాక్ 1) వేరియంట్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తుండటంతో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. డీలర్‌షిప్‌లకు చేరుకున్న ఈ కారు వివరాలు, ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఇప్పుడు మీ ఇంట్లో చెత్తతో కార్ నడపొచ్చు

భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఒకటి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-size SUV) సెగ్మెంట్‌కు చెందిన మారుతి సుజుకి విక్టోరిస్ కారు ఇటీవలనే భారత మార్కెట్‌లో విడుదలైంది.

చూడటానికి ఎంత ముద్దుగా ఉంది.. చిన్నదే కానీ పవర్‌ఫుల్

ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి దారితీసిన సంస్థల్లో ముందంజలో ఉన్నది బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD). ఈ చైనీస్ ఆటోమోటివ్ దిగ్గజం తక్కువ ధరలో అధునాతన సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ కార్లను అందించడం ద్వారా ప్రజల్లో EV అంటే ఖరీదైనది అనే భావనను పూర్తిగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా BYD తన స్థాయిని అద్భుతంగా పెంచుకుంది. ఇంతవరకు EV రంగంలో ఆధిపత్యం చూపిన టెస్లాను వెనక్కి నెట్టి మరి ప్రపంచంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీగా నిలిచింది. BYD విజయానికి కారణం కేవలం శక్తివంతమైన మార్కెటింగ్ కాదు, దాని వెనుక ఉన్న ఇంజినీరింగ్ సామర్థ్యం. బ్యాటరీ టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యం, వివిధ సెగ్మెంట్లలో అనువైన మోడళ్ల తయారీ అనే మూడు రంగాల్లో ఈ కంపెనీకి ఉన్న పట్టు అసాధారణం.
Advertisement

మధ్యతరగతి కుటుంబాల కోసం బెస్ట్ హ్యాచ్‌బ్యాక్!

భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, ఎక్కువ కాలం పాటు ప్రజల మనసుల్లో నిలిచిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) పేరు ముందువరుసలో ఉంటుంది. ఇది కేవలం ఒక కారు కాదు, కోట్లాది భారతీయ కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమైపోయిన వాహనం. వాడుకలో సులభం, మైలేజ్, మారుతి సుజుకి నాణ్యత కలయిక ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతుంది. ధర పరంగా వ్యాగన్ఆర్ అత్యంత పోటీగా ఉంది, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల మధ్య లభిస్తోంది. ఈ ధర పరిధిలో మైలేజ్, ఫీచర్లు అందించే కారు మార్కెట్లో చాలా అరుదు. కొత్తగా ఈ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి దీని EMI ఇతర ధర వివరాలు ఈ కథనంలో అందించడం జరిగింది.

బైబై పెట్రోల్.. వచ్చేదంతా సీఎన్జీ యుగమే

పెట్రోల్ ధరలతో విసిగిపోయారా.. అయితే మీకో గుడ్‎న్యూస్. ఇకపై టూ వీలర్స్ ప్రపంచంలోకి CNG స్కూటర్ల యుగం అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న TVS, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అదే TVS జూపిటర్ 125 CNG.

సామాన్యుడు కొనగలిగే ధరలో సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు

భారత ఆటోమొబైల్ రంగంలో నంబర్ వన్ స్థానాన్ని దశాబ్దాలుగా నిలబెట్టుకున్న కంపెనీగా మారుతి సుజుకి (Maruti Suzuki) పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారతీయుల అవసరాలు ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కనుగొంటూ, ఆ అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో ఉండే, నమ్మకమైన, ఆర్థికంగా లాభదాయకమైన వాహనాలను అందించడం మారుతి విజయ రహస్యం. దేశంలోని ప్రతి కుటుంబం, ప్రతి తరగతి ప్రజల జీవితంలో మారుతి కార్లు భాగమయ్యాయి. ఇప్పుడు ఆటోమొబైల్ రంగం మెల్లగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) దిశగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త విప్లవాన్ని కూడా మారుతి సుజుకి నిర్లక్ష్యం చేయడం లేదు. ఇంధన ఆధారిత వాహనాల ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

ఫార్చ్యూనర్ కంటే దీనికే ఎక్కువ డిమాండ్

ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌లో హోండా ఎలివేట్ (Honda Elevate) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ అమ్మకాలు మొదట్లో తక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక ఊహించని విజయాన్ని నమోదు చేసింది. తాజాగా సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) కంటే కూడా హోండా ఎలివేట్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈ గణాంకాలు హోండాకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, ఎలివేట్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చిన JNCAP క్రాష్ టెస్ట్ ఫలితాలను కూడా వెల్లడించింది.
Advertisement

భారత మార్కెట్లో దుమ్మురేపుతున్న ఏథర్ రిజ్టా సేల్స్

భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కంపెనీలలో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ఈ కంపెనీ స్థాపించినప్పటి నుండి నిరంతరంగా కొత్త సాంకేతికతలను, అధునాతన ఫీచర్లను అందిస్తూ, యువతరాన్ని ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా, ఈ కంపెనీ విడుదల చేసిన ఏథర్ రిజ్టా (Ather Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన, మోడల్‌గా గుర్తింపు పొందింది. ఏథర్ రిజ్టా ప్రస్తుతం రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, రోజువారీ ఉపయోగానికి కూడా చాలా అనుకూలంగా ఉండటంతో, వినియోగదారులు దీన్ని విస్తృతంగా స్వీకరిస్తున్నారు. దీని శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, నాణ్యతతో కూడిన నిర్మాణం కారణంగా, ఈ స్కూటర్ అమ్మకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

పాత ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా ?

ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, పర్యావరణంపై అవగాహన పెరగడం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇంకా ఖరీదైనవి కావడంతో చాలా మంది పాత ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

మనదేశం కారుకు జపాన్‌లో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) భారత మార్కెట్లో పెద్దగా హిట్టవకపోయినా, జపాన్‌లో మాత్రం అది సూపర్ హిట్‌గా నిలుస్తోంది. భారత్‌లో 5-డోర్ల ఆఫ్‌రోడ్ SUVగా లాంచ్ అయిన జిమ్నీకి ప్రారంభంలో మంచి ఆసక్తి ఉన్నా, తర్వాత క్రమంగా డిమాండ్ తగ్గిపోయింది. కానీ ఇదే కారు జపాన్‌లో సుజుకి నోమాడ్ (Suzuki Nomade) పేరుతో అమ్ముడవుతోంది, అక్కడి ప్రజలు దీనిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. భారతదేశంలో తయారు అయ్యే ఈ SUV, మన మార్కెట్లో పెద్దగా గుర్తింపు పొందకపోయినా, విదేశాల్లో మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. నిజానికి, జపాన్‌లో జిమ్నీ నోమాడ్‌కు అంతటి బుకింగ్స్ రావడంతో, కంపెనీ కొంత కాలం క్రితం కొత్త బుకింగ్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు, పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా బుకింగ్‌లు జనవరి 30, 2026 నుండి ప్రారంభించనున్నారు.

3.5కోట్ల మంది మనసులు కొల్లగొట్టిన స్కూటర్

హోండా యాక్టివా (Honda Activa) భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 3.5 కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. 2001లో ప్రారంభించబడిన ఈ స్కూటర్ (Scooter) నేటికీ భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ వీలర్లలో (Two-wheelers) ఒకటి. ప్రస్తుతం కంపెనీ యాక్టివా శ్రేణిలో యాక్టివా 110 (Activa 110), యాక్టివా 125 (Activa 125), యాక్టివా-ఐ (Activa-i), యాక్టివా ఇ (Activa e) మోడల్స్ ఉన్నాయి.
Advertisement

ఎలక్ట్రిక్ రంగంలో కొత్త యుద్దం

ఇండియన్ మార్కెట్‌లో హోండా (Honda) తన పాత వైభవాన్ని కోల్పోయి నిరాశలో ఉంది. అయినా తగ్గేదేలే అంటూ పోరాడానికి కాలు దువ్వుతోంది. అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లు అమ్మకాల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors), ఎంజీ (MG), మహీంద్రా (Mahindra) వంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) రంగంలోకి హోండా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా జపాన్ మొబిలిటీ షోలో హోండా కొత్త ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(Alpha Electric SUV) ప్రోటోటైప్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

వాహనదారుల ఇక్కట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ ప్రభావం

మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, గాలివానలు రవాణా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండటం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వలన వాహనదారులు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఏలూరు, డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. పలు ప్రాంతాల్లో రహదారులు వరద నీటిలో మునిగి, వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల బైకులు, కార్లు, ఆటోలు నీటిలో మునిగిపోయి చెడిపోయాయి. కొందరు వాహనదారులు తమ వాహనాలను రక్షించడానికి ప్రయత్నిస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు.

మీ వెహికల్ ఇన్సురెన్స్‎లో ఇవి ఉన్నాయా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్'(Montha Cyclone) బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, వరదల (Floods) కారణంగా వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి వర్షాకాలంలో వాహన యజమానులు తమ వాహనాలకు తగిన బీమా కవరేజ్ (Insurance Coverage) ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.

మైలేజ్ కింగ్ హోండా యూనికార్న్ సక్సెస్ జర్నీ

హోండా (Honda) పేరు వినగానే చాలా మందికి మొదట గుర్తుకు వచ్చేది యూనికార్న్ (Unicorn) అనే బైక్. ఇది కేవలం ఒక బైక్ కాదు, ఒక నమ్మకం, ఒక విశ్వసనీయమైన బ్రాండ్ గుర్తు. మార్కెట్లో ఎన్నో కొత్త మోడళ్లూ, ఫ్యాన్సీ ఫీచర్లతో కూడిన స్పోర్టీ బైక్‌లూ వచ్చినా కూడా, యూనికార్న్‌కి ఉన్న డిమాండ్ తగ్గలేదు. దాని ప్రత్యేకత సైలెంట్ పెర్ఫార్మెన్స్, కంఫర్ట్ రైడింగ్, క్లాసిక్ డిజైన్.. ఇవన్నీ కలిపి యూనికార్న్‌ను ఇప్పటికీ రోడ్లపై ఒక లెజెండరీ ప్రెజెన్స్‌లా నిలబెట్టాయి. ఈ బైక్ గురించి చెప్పాలంటే, దాని రైడింగ్ అనుభవమే ప్రత్యేకం. ఎటువంటి శబ్దం లేకుండా, హడావిడి లేకుండా స్మూత్‌గా నడిచే ఈ బైక్ చాలా మందికి ఒక సంతృప్తిని ఇస్తుంది.
Advertisement

కొండలు, గుట్టలు దీని ముందు బలాదూరే

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా తక్కువ మెయింటెనెన్స్, అద్భుతమైన సర్వీసింగ్‌తో భారత మార్కెట్‌లో ఎప్పుడూ నంబర్ వన్. దేశంలో అంతగా ప్రాచుర్యం లేని లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ విభాగంలోకి టయోటా ఏ మాత్రం ఆలోచించకుండా హైలక్స్ గ్లోబల్ మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన హైలక్స్, భారతదేశంలో పెద్ద విజయం సాధించకపోయినా చాలా మందికి ఇది డ్రీమ్ కారుగా మారింది. తాజాగా విడుదలైన 2025 సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదిక ప్రకారం.. ఈ పికప్ ట్రక్ విక్రయాలు 17.74 శాతం పెరిగి టయోటాకు ఊరటనిచ్చాయి.

226 కి.మీ మైలేజ్ స్కూటర్.. మార్కెట్లోకి కొత్త టీవీఎస్ జూపిటర్ రాక!

ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, అలాగే పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి కార్లకే పరిమితం కాకుండా, టూవీలర్ మార్కెట్‌లో కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఇంధనానికి భారీ డిమాండ్ పెరిగింది. ఇది తక్కువ ఖర్చుతో పాటు తక్కువ కాలుష్యం కలిగించడం వల్ల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో, టూవీలర్ రంగంలో అగ్రగామిగా ఉన్న TVS మోటార్ కంపెనీ ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతోంది. కంపెనీ త్వరలో దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.

నాన్న,తాతలు నడిపిన బండి

బజాజ్ చేతక్ (Bajaj Chetak)... ఈ పేరు వినగానే మన తాతలు, నాన్నలు నడిపిన పాత తరం స్కూటర్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు భారతీయ రోడ్లను ఏలిన ఈ స్కూటర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్ (Electric Avatar)లో మళ్లీ వచ్చింది. ఈ పాత పేరు, కొత్త టెక్నాలజీ కాంబినేషన్ కారణంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారతీయ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ నెలలో బజాజ్ చేతక్ అమ్మకాలు భారీగా పెరిగాయి. నెలవారీ సేల్స్ రిపోర్టు ముఖ్యంగా దాని అమ్మకాల వృద్ధి, వేరియంట్లు, ధరల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మధ్యతరగతి కుటుంబాల కోసం పర్ఫెక్ట్ హ్యాచ్‌బ్యాక్

మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ కారు తన స్టైలిష్ లుక్స్‌తో, ఫీచర్లతో, పనితీరుతో వినియోగదారుల మనసు దోచేసింది. డిజైన్ పరంగా చూస్తే, బాలెనో చాలా ఆధునికంగా, ఎలిగెంట్‌గా ఉంటుంది. ముందు భాగంలో ఉన్న ఆకర్షణీయమైన గ్రిల్, స్మార్ట్ హెడ్‌ల్యాంప్స్, క్రిస్ప్ లైన్స్ దీని రూపాన్ని మరింత స్పోర్టీగా చూపిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఉండే అలాయ్ వీల్స్, రియర్ టెయిల్ ల్యాంప్స్ కూడా ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మైలేజ్‌ విషయానికి వస్తే, బాలెనో తన క్లాస్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. కొత్తగా కారు కొనాలనుకునేవారికి ఇది ఒక ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. దీని గురించిన ఇతర వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.
Advertisement

ఊపందుకున్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సేల్స్

టయోటా (Toyota) అనే పేరు వినగానే మనసులో మొదటగా వచ్చే భావన నమ్మకం, దీర్ఘకాలికత. ప్రపంచవ్యాప్తంగా టయోటా బ్రాండ్ తన విశ్వసనీయతతో మిలియన్ల మంది కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించింది. ఈ జపనీస్ కంపెనీ తయారుచేసిన వాహనాలు కేవలం స్టైలిష్‌గానే కాకుండా, దృఢమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడా ప్రసిద్ధి పొందాయి. ఇలాంటి నమ్మకమైన వారసత్వానికి కొనసాగింపుగా, టయోటా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder) కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టించింది. ఈ SUV మొదటిసారిగా భారత రోడ్లపై కనిపించిన రోజునుంచే ఆటోమొబైల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం కేవలం టయోటా పేరు కాదు, ఈ కారులో ఉన్న ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్, మైలేజ్ సామర్థ్యం కూడా.