తక్కువ జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 125సీసీ బైక్స్ ఇవే

జీఎస్టీ తగ్గింపు తర్వాత భారతదేశంలో 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లను కొనుగోలు చేయడం గతంలో కంటే మరింత చౌకగా మారింది. తక్కువ జీతం ఉన్నవారు కూడా సులభంగా కొనగలిగేలా ధర తక్కువగా ఉండి, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉండే 5 అద్భుతమైన 125సీసీ బైక్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇవి మంచి మైలేజీని కూడా ఇస్తాయి. టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125)ఈ జాబితాలో మొదటి బైక్ టీవీఎస్ రైడర్. స్పోర్టీ డిజైన్‎తో పాటు మోడ్రన్ ఫీచర్స్ ఇష్టపడేవారికి ఈ బైక్ బాగా నచ్చుతుంది. టీవీఎస్ రైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,500 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో 124.8సీసీ, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 11.2 బీహెచ్‌పీ పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

4 ఏళ్ల తర్వాత డస్టర్ రీఎంట్రీ కన్ఫర్మ్

కొత్త డస్టర్ భారతదేశంలో 2026 జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం రోజున వస్తుందని రెనాల్ట్ ఇండియా(Renault India) ధృవీకరించింది. ఇది కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. దీని రాక కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో దీని ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయిన సుమారు 4 సంవత్సరాల తర్వాత కొత్త డస్టర్ లాంచ్ అవుతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ ఎస్‌యూవీ టీజర్‌ను విడుదల చేసింది.

ఈ పొట్టి ఎలక్ట్రిక్‌ కారు చాలా గట్టిదీ.. త్వరలో లాంచ్!

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగం విశ్వవ్యాప్తంగా ఆకర్షణగా మారింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) కూడా భారత మార్కెట్లో తన సత్తా చాటడానికి రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కంపెనీ సెప్టెంబర్ నెలలో తన తొలి రెండు ఎలక్ట్రిక్ SUVలను VF6, VF7 అధికారికంగా ఆవిష్కరించింది. ఇవి ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, గట్టి బ్యాటరీ పనితీరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను అందుకుంటున్నాయి.

చలాన్ కట్టినా ఆన్‌లైన్‌లో పెండింగ్‌? కనిపించకుండా ఉండాలంటే ఇలా చేయండి

మీ వాహనం మీద పడిన చలాన్‌ను లోక్ అదాలత్‌లో కట్టేసినా, ఆ జరిమానా ఇప్పటికీ ఆన్‌లైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ లేదా ఈ-చలాన్ పోర్టల్‌లో పెండింగ్‌లో కనిపిస్తుంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. డేటా అప్‌డేట్ కావడంలో ఆలస్యం లేదా టెక్నికల్ సమస్యల కారణంగా ఇలా జరగడం సహజం. అయితే చలాన్ కట్టిన తర్వాత కూడా అది ఆన్‌లైన్‌లో కనిపిస్తే, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రికార్డును సరిదిద్దడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన ఈజీ చర్యలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

నెలకు రూ.9,600తో మారుతి డిజైర్ కారు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పుడు చూసినా పోటీ తీవ్రంగానే ఉంటుంది. కానీ ఆ పోటీని మట్టికరిపిస్తూ, నిరంతరం అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన కంపెనీ మారుతి సుజుకి. ఈ బ్రాండ్‌కి ఉన్న ప్రజాదరణ అంతా దాని నమ్మకమైన కార్ల ద్వారానే వచ్చింది. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) మధ్యతరగతి కుటుంబాల కలల కారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సరసమైన ధరలో, సొగసైన లుక్‌తో పాటు, అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరపు తొలి ఆరు నెలల్లోనే డిజైర్ తన సత్తాను చాటింది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మొత్తం 1,08,006 యూనిట్లు అమ్ముడవడంతో ఇది మరోసారి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని రుజువు చేసింది.

కియా కారెన్స్ ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో

కియా ఇండియా (Kia India) తాజాగా తన ప్రముఖ MPV అయిన కారెన్స్ (Kia Carens)లో కొత్త CNG వేరియంట్‌‌ను పరిచయం చేసింది. ఈ వేరియంట్‌ను ప్రత్యేకంగా ఫ్యాక్టరీ నుంచి కాకుండా, డీలర్ లెవల్ ఫిట్టింగ్‌గా అందిస్తున్నారు. అంటే కస్టమర్ కారెన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత డీలర్‌షిప్‌ వద్దే ఈ సిఎన్‌జీ కిట్ అమర్చబడుతుంది. ఈ కిట్‌ను ప్రఖ్యాత లోవాటో (Lovato) కంపెనీ అభివృద్ధి చేసింది, ఇది భారత ప్రభుత్వ అధికారిక ఆమోదం పొందినది. ధర విషయానికి వస్తే, కారెన్స్ CNG వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.77 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రీమియం (ఐచ్ఛికం) పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కంటే సుమారు రూ. 77,900 ఎక్కువ.

దీనిని గుద్దినా ఎదుటి వాళ్లకే డేంజర్

టాటా మోటార్స్ నుంచి వచ్చిన కూపే ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్, డిజైన్, ఫీచర్ల పరంగా ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తే ఒక కారుబండలా కనిపిస్తుంది. కానీ, ఈ అద్భుతమైన ఎస్‌యూవీ అమ్మకాలు మాత్రం ఇటీవల భారీగా పడిపోయాయి. సెప్టెంబర్ నెలలో కేవలం 1,566 యూనిట్లు మాత్రమే అమ్ముడవడంతో గతేడాదితో పోలిస్తే సేల్స్ ఏకంగా 67.12 శాతం తగ్గాయి. రూ. 9.66 లక్షల ప్రారంభ ధరతో అట్రాక్టివ్ లుక్, పవర్‌ట్రైన్‌లు ఉన్నప్పటికీ, ఈ కారును కొనడానికి వినియోగదారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ఈ కూపే ఎస్‌యూవీ అమ్మకాలు పడిపోవడానికి కారణాలు, దాని ఫీచర్లు వివరంగా తెలుసుకుందాం.

550 కిలోమీటర్ల రేంజ్‌తో ఎంట్రీకి సిద్ధమైన టయోటా కారు

ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) ఇప్పుడు భారత మార్కెట్ల ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. టయోటా ఇప్పటివరకు హైబ్రిడ్, పేట్రోల్ కార్ల విభాగంలో విజయవంతమైన మోడళ్లను అందించింది. కానీ ఇప్పుడు కంపెనీ దృష్టి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విభాగంపై పడింది. భారతదేశంలో పెరుగుతున్న EV డిమాండ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వినియోగదారుల ఆసక్తిని గమనించి, టయోటా ఇప్పుడు కొత్త అర్బన్ క్రూయిజర్ ఈవీ (Urban Cruiser EV)ను లాంచ్ చేయబోతోంది. ఈ కారు రూపకల్పన, పనితీరు, సౌకర్య పరంగా పూర్తి స్థాయి ప్రీమియం ఫీలింగ్‌ను అందించడానికి రూపొందించబడింది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా విశాలమైన కేబిన్ స్పేస్‌ను అందిస్తారు.
Advertisement

కారు డీలర్‌షిప్ ప్లాన్ చేస్తున్నారా?

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వాహన మార్కెట్ అయిన మన భారతదేశంలో కార్ల బిజినెస్‎కు అపారమైన డిమాండ్ ఉంది. కొత్త కార్లతో పాటు, టయోటా ఇన్నోవా లాంటి యూజ్డ్ కార్లకు కూడా ఇక్కడ మంచి గిరాకీ ఉంది. అందుకే కారు డీలర్‌షిప్ పెట్టడం అనేది మంచి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది.

బుల్లెట్‌కి బ్రేక్‌లు లేవు! అమ్మకాల్లో రికార్డు బ్రేక్ చేసింది

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అనే పేరు వినగానే చాలా మంది మోటార్‌సైకిల్ ప్రేమికుల గుండెల్లో ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బ్రాండ్‌కు ఉన్న ఫాలోయింగ్ మరెవరికి లేదంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో చాలా కాలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక దిగ్గజ టూవీలర్ తయారీదారుగా తన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది. ఈ బ్రాండ్‌కు వయస్సు అనే అడ్డుకట్టే లేదు, యువతరానికి ఇది అడ్వెంచర్ సింబల్ అయితే, పెద్దవారికి ఇది గౌరవ ప్రతీక. వీధుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సవారీ వస్తే, ఆ రిథమ్‌ శబ్దం వినగానే ప్రతి ఒక్కరి చూపు తారసపడకుండా ఉండదు.

అప్పుడే ఆ బైక్ ధర పెంచేసిన టీవీఎస్

ఇండియన్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను ఒక్కసారిగా షాక్ చేస్తూ టీవీఎస్ (TVS) తమ సరికొత్త 300 సీసీ అడ్వెంచర్ టూరర్‌ను కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. వాస్తవానికి అపాచీ RTX 300 అనే పేరుతో వచ్చిన ఈ అడ్వెంచర్ బైక్‌కు అతిపెద్ద హైలైట్ దాని ధర. ఈ క్లాస్‌లో దొరకనన్ని ఫీచర్లతో నిండిన ఈ మోడల్ ఒక పెద్ద ట్రెండ్‌ను సృష్టించింది.

ఈ బైక్ కొనాలంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిందే

లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి ఇండియా యువతతో పాటు అడ్వెంచర్ టూరింగ్ ఇష్టపడే రైడర్లను టార్గెట్ చేసుకుని 2025 మల్టిస్ట్రాడా V2(Multistrada V2) ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ను గతంలో కంటే మరింత లేటెస్ట్‎గా లైట్ వెయిట్ ఉండేలా తయారు చేశారు. ట్విన్-సిలిండర్ ఇంజిన్ పవర్ కోరుకునే వారికి, ఈ బైక్ ఎలాంటి రోడ్డు మీద అయినా సులువుగా ఉత్సాహభరితమైన రైడింగ్‌ను అందిస్తుంది.
Advertisement

ఇలాంటి స్కూటర్ కోసం దేశం ఎదురు చూస్తోంది

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ భారతీయ టూవీలర్ మార్కెట్‌లో తనదైన స్థానం సంపాదించుకుంది. పెరుగుతున్న పోటీ, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్‌లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటో ఎగ్జిబిషన్ EICMA 2025లో టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ ఎం1 ఎస్(M1-S)ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ కొత్త మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ ఆసక్తి నెలకొంది. టీవీఎస్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ఈ స్కూటర్‌కు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేసింది, దీని ద్వారా స్కూటర్‌ డిజైన్, ప్రీమియం లుక్‌, ఆధునిక టెక్నాలజీ గురించి ఒక గ్లింప్స్‌ ఇచ్చింది.

లక్షల్లోనే లగ్జరీ ఫీచర్లు ఉన్న కారు ఇదే

దేశీయ వాహన మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. డిజైన్, ఇంటీరియర్, పర్ఫామెన్స్, ఇంధన సామర్థ్యం వంటి అనేక ఫీచర్లతో నిండిన కార్లను రోడ్లపైకి తీసుకొచ్చే కంపెనీ ఇదే. హ్యుందాయ్, మహీంద్రా, టాటా వంటి కంపెనీలతో ఒంటరిగా తలపడే ధైర్యం మారుతికి తప్ప మరెవరికీ భారతదేశంలో లేదని చెప్పవచ్చు. కాంపాక్ట్ SUV కొనాలని కోరుకునే వారిని నిరాశపరచని మారుతి అద్భుతమైన మోడల్ ఫ్రాంక్స్. ఈ కారును సొంతం చేసుకోవాలని కోరుకునే వారు షోరూమ్‌కి వెళ్ళే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.

రోజూ రోడ్లపై దూసుకెళ్తున్న హోండా షైన్

హోండా (Honda) కంపెనీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నాణ్యత, సులభమైన రైడింగ్ అనుభవం. ఆ అంశాలను కలిగి ఉన్న బైక్‌నే హోండా షైన్ (Honda Shine) అని చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా పట్టణాల నుండి గ్రామాల దాకా ప్రతిఒక్కరికీ తెలిసిన, విశ్వసనీయమైన బైక్‌గా నిలిచింది. నగరాల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నుంచి గ్రామీణ రైతుల దాకా, అన్ని వర్గాల ప్రజలకీ ఈ బైక్ రోజువారి వాహనంగా మారింది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ బైక్‌కి దేశవ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో మరోసారి నిరూపించాయి. 2025 సెప్టెంబర్ నెలలో హోండా షైన్ మొత్తం 1,85,059 యూనిట్లు విక్రయించబడింది. గత ఏడాది ఇదే నెలలో 1,81,835 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అమ్మకాలు 1.77% మేర పెరిగాయి.

ఇలా చేయండి.. మీ బైక్ మెరిసిపోద్ది

ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ కామన్ అయిపోయింది. చాలా మంది తమ బైక్‌ను ఫ్యామిలీ మెంబర్ మాదిరి భావిస్తారు. అది ఆఫీసుకు వెళ్లే రోజు వారి వాహనం కావొచ్చు. వీకెండ్‌లో షికారుకు తీసుకెళ్లే ఫ్రెండ్ కావొచ్చు, లేదా మీ ఫస్ట్ డ్రీమ్ బైక్ కావచ్చు. ఎండలో మెరిసిపోతున్న బైక్‌ను చూడటం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అయితే, భారతదేశంలోని దుమ్ముధూళితో నిండిన రోడ్లు, వర్షాల మధ్య బైక్‌ను శుభ్రంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు.
Advertisement

ఒకప్పుడు నిలిపేస్తారని అనుకున్నారు… ఇప్పుడు టాప్ 10లో మహీంద్రా మరాజ్జో

మహీంద్రా (Mahindra) ఆటోమొబైల్స్‌ పేరు వినగానే నమ్మకం, మన్నిక, పనితీరు అన్నీ మనసులోకి వస్తాయి. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. బొలెరో, థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లు మార్కెట్లో దూసుకుపోతుండగా, మహీంద్రా మరాజ్జో మాత్రం గత కొంతకాలంగా అమ్మకాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒక దశలో ఈ MPV మోడల్ ఉత్పత్తి నిలిపేస్తారని కూడా ఆటోమొబైల్ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఆరు నెలల్లో మహీంద్రా మరాజ్జో అమ్మకాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. కంపెనీ తాజాగా ప్రకటించిన ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగ గణాంకాల ప్రకారం, మరాజ్జో కారు విక్రయాలు 227 శాతం వరకు పెరిగాయి.

72కిమీ మైలేజ్ బైక్.. రూ.81వేలు మాత్రమే

యమహా ఇండియన్ ఆటో మార్కెట్లో తన అనేక ప్రోడక్ట్స్ విక్రయిస్తోంది.. అంతేకాకుండా, కంపెనీ ఇక్కడ తయారుచేసిన మోడళ్లను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి కూడా చేస్తుంది. అందుకే ఇండియాలో యమహా బైకులంటే యూత్‎కు క్రేజ్ ఎక్కువ. ఇటీవల అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 తర్వాత గత నెలలో కంపెనీ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఒకవైపు యమహా రేజెడ్ఆర్ (Yamaha RayZR) కంపెనీ బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్‌గా నిలిచింది. మరోవైపు, యమహా ఎఫ్‌జెడ్‌, ఏరాక్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో యమహా రేజెడ్ఆర్ ఉంది. గత నెలలో దీనికి మొత్తం 27,280 మంది కొత్త కస్టమర్లు లభించారు. ఇది సెప్టెంబర్ 2025లో అమ్ముడైన 16,542 యూనిట్ల కంటే సంవత్సరవారీగా 10,7238 యూనిట్లు అంటే 64.91 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

మళ్లీ మార్కెట్లో రాజుగా నిలిచిన హీరో HF డీలక్స్

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు ఎక్కువగా సరిపోయే బైకులు ఎప్పుడూ మంచి డిమాండ్‌లో ఉంటాయి. తక్కువ ధరలో, అధిక మైలేజీతో, తక్కువ నిర్వహణ ఖర్చుతో లభించే ఈ బైకులు సాధారణ ప్రజలకు ఎంతో అనుకూలంగా మారాయి. అందులో హీరో మోటోకార్ప్ (Hero Motocorp) కంపెనీకి చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. హీరో HF డీలక్స్ గురించి చెప్పుకోవాలంటే, ఇది సాధారణ ప్రయాణికులకు, ఆఫీసుకు వెళ్లేవారికి, లేదా రోజూ పట్టణంలో రైడ్ చేసే వారికి ఒక అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. దాని తేలికైన బాడీ, మైలేజీ, ధర.. ఈ బైక్‌ను మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలబెట్టాయి.

టాటా పంచ్ CNG వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG.. ఏది బెస్ట్ ?

భారత మార్కెట్‌లో తక్కువ ధరతో పాటు మంచి మైలేజీ ఇచ్చే కార్లు చాలా ఉన్నాయి. కొత్త కారు కొనే ప్లాన్ చేసినప్పుడు మన ముందు చాలా మంచి ఆప్షన్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం రెండు కార్ల మధ్య తేడా తెలియక అయోమయానికి గురవుతాం. అలాంటి అయోమయం ప్రస్తుతం సీఎన్‌జీ విభాగంలో ఉన్న రెండు పాపులర్ కార్లు.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ విషయంలో ఉంది.
Advertisement

కేవలం రూ.1.37 లక్షలకే భారీ మైలేజ్ ఇచ్చే బైక్

భారత మార్కెట్‌లో అత్యంత సరసమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ (Royal Enfield Bike)‌గా పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అమ్మకాల్లో దూసుకుపోతోంది. కేవలం రూ.1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ మోడల్, ప్రతి నెలా మంచి విక్రయాలను నమోదు చేస్తోంది. అంతేకాకుండా, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ బరువు కలిగిన బైక్ కావడంతో, సిటీ రోడ్లపై రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. ఈ బైక్ అద్భుతమైన విక్రయ గణాంకాలు, మైలేజ్ వివరాలు, ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

స్కూటర్ల అమ్మకాల్లో రికార్డు.. లేడీస్ ఫేవరెట్ ఇదే!

మన దేశంలో గేర్లు లేని స్కూటర్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఊరి చివర్లలో, పల్లెటూళ్లలో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఈ స్కూటర్లు కనిపిస్తాయి. దీనికి ఒకే ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే, బైక్‌లతో పోలిస్తే, స్కూటర్లు వాడటం చాలా సులువు.

ఫుల్ ట్యాంక్ డీజిల్‌తో 2,831 కిలోమీటర్లు

కొత్తగా కారు కొనే వారికి, ఇప్పటికే కారు వాడే వారికి మైలేజ్ అనేది పెద్ద ఆందోళన. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనేది అందరి కోరిక. అందుకే ఎక్కువ మైలేజీ ఉన్న కార్లను వెతికి మరీ కొనుగోలు చేయడం భారతీయుల సాధారణ అలవాటు. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు అప్పటికీ, ఇప్పటికీ ఎక్కువగా డీజిల్ మోడళ్లను కొంటారు.

మారుతి కొత్త కార్ల జాతర

భారతదేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్ల తయారీ సంస్థలలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఒకటి. ఇప్పుడు ఈ బ్రాండ్ తన అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ ఏకంగా ఐదు కొత్త కార్లను రెడీ చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మారుతి మార్కెట్లోకి eWX నుండి ఫ్రాంక్స్ హైబ్రిడ్ (Fronx Hybrid) వరకు కొత్త కాంపాక్ట్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Advertisement

ఫ్యామిలీ టూర్లకు బెస్ట్ కారు

ఫ్యామిలీ టూర్లకు, లాంగ్ డ్రైవ్‌లకు ఎప్పుడూ ఎంపీవీ సెగ్మెంట్ వాహనాలే బెస్ట్ ఆప్షన్. టయోటా నుండి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ స్టార్.. ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross). ఈ మోడల్ కేవలం సౌకర్యం, ఫీచర్స్ మాత్రమే కాకుండా, ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా మార్కెట్‌లో భారీ డిమాండ్‌ క్రియేట్ చేసింది. మనం పెట్టే ప్రతి రూపాయికి తగ్గ లగ్జరీ, నమ్మకం ఈ కారు సొంతం. అంతేకాకుండా, ఇటీవల జీఎస్‌టీ తగ్గింపు కారణంగా దీని ధర మరింత తగ్గింది. అందుకే హైక్రాస్ భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఎంపీవీలలో ఒకటిగా నిలిచింది.