పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. మైండ్‌బ్లోయింగ్ మైలేజ్ బైక్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టూవీలర్ ధరలు కొంత తగ్గడంతో, చాలా మంది కొత్త బైక్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బడ్జెట్ రేంజ్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన లుక్ ఉండే బైక్‌ను ఎంచుకోవాలని ప్రతి వినియోగదారు కోరుకుంటారు. అలాంటి వారికి టీవీఎస్ నుండి వచ్చిన రైడర్ 125 (TVS Raider 125) ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది. టీవీఎస్ రైడర్ 125ను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కంపెనీ యువతను లక్ష్యంగా పెట్టుకుంది. దీని డిజైన్, రైడింగ్ కంఫర్ట్, టెక్నాలజీ అన్నీ కూడా అద్బుతంగా ఉంటాయి. దీని అగ్రెసివ్ ఫ్రంట్ లుక్, LED హెడ్‌ల్యాంప్ డిజైన్, స్పోర్టీ ట్యాంక్ షేప్ చూసిన వెంటనే ప్రీమియమ్ బైక్ అనిపిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 ప్రస్తుతం 7 వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ల వారీగా ధరలు వేరు వేరుగా ఉంటాయి.

రూ.5 లక్షల్లోపే అదిరిపోయే కారు

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ మోడల్ తన ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ స్థాయి డిజైన్, విశేష ఫీచర్లు, సరసమైన ధర కాంబినేషన్ కారణంగా చిన్న కుటుంబాలు, మొదటి వాహనం కొనే యువత, సిటీ డ్రైవర్స్‌కు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెలెరియో స్టైలిష్ లుక్ తో రూపొందించబడింది. గత నెలలో జీఎస్టీ సవరణలు అమల్లోకి రావడం వల్ల, మారుతి తన కార్ల ధరలను తగ్గించింది. ఈ పరిణామంలో సెలెరియో కూడా ప్రత్యేకంగా సడలింపు పొందింది. ఇప్పుడు తక్కువ ధరలో, నాణ్యతను మించిన ఈ కారు, అందరికీ సులభంగా అందుబాటులో ఉంది. ఈ కారు గురించిన ఇతర వివరాలను ఈ కథనంలో చూద్దాం.

నీటితో నడిచే కారు.. ట్యాంక్ నింపితే 900 కి.మీ మైలేజ్!

ఏ వాహనం నడపాలన్నా మనకు ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఇంధనం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి, ఇది వాహన నిర్వాహణ ఖర్చును పెద్దగా పెంచేస్తుంది. అలాగే, పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలు పర్యావరణానికి కూడా హానికరం, గాలి కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇంతకీ, ఈ సమస్యలను పరిష్కరించేందుకు పరిశోధకులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాలు, శక్తి వనరుల మీద అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య, ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన వార్త తిరుగుతోంది. 2 సంవత్సరాల పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది, అందులో ఒక ఇరానియన్ శాస్త్రవేత్త సాధించిన అసాధారణ ఆవిష్కరణను చూపిస్తున్నారు.

భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు! ప్రాణాలకు పూర్తి భరోసా

పాత రోజుల్లో కారు కొంటే మొదటగా అడిగే ప్రశ్న, ఎంత మైలేజ్ ఇస్తుంది?, దాని ధర ఎంత?. ఆ కాలంలో వాహనం అంటే ఇంధనం తక్కువ తాగితే చాలు, అది మంచిదని భావించేవారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ, మొదటగా సేఫ్టీ రేటింగ్ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి మార్కెట్లో కేవలం మైలేజ్, డిజైన్, లేదా టెక్నాలజీ ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత (Safety) ఇప్పుడు ప్రధాన ప్రమాణంగా మారింది. భారతీయ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సంఖ్య, అవగాహన పెరగడం వలన సేఫ్టీపై దృష్టి మరింత పెరిగింది. అందుకే ఈ కథణంలో ఇండియా బెస్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు టాటా నెక్సాన్, పంచ్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, టాటా పంచ్ కార్ల గురించి ఇస్తున్నాము.
Advertisement

స్మార్ట్‌ఫోన్ ధరకే 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్

బజాజ్ ప్లాటినా (Bajaj Platina) పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది మైలేజ్ కింగ్ అనే పేరు. ఇది కేవలం ఒక బైక్ కాదు, మధ్యతరగతి ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయిన నమ్మకమైన స్నేహితుడు. ఆఫీసుకెళ్లే ఉద్యోగులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, చిన్న వ్యాపారాలు చూసుకునే వారు.. అందరికీ ఈ బైక్ సరిపోయేలా రూపుదిద్దుకుంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఇవన్నీ కలిపి ప్లాటినాను సామాన్య వినియోగదారుల హృదయాల్లో స్థిరపరిచాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో కూడా, ప్లాటినా యజమానులకు ఎటువంటి భారం లేకుండా 70 నుండి 90 కి.మీ. వరకు మైలేజ్ అందిస్తోంది. ఇంతటి పనితీరుతో, బజాజ్ ప్లాటినా నేడు భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే బైక్‌లలో ఒకటిగా మారింది.

కొత్త కారు కోసం వెతుకుతున్నవారికి బెస్ట్ ఆప్షన్ MG ఆస్టర్

దీపావళి పండుగ వెలుగుల వేళలో, భారతీయ కుటుంబాలందరికీ ఆనందం, ఆశీర్వాదాలు, కొత్త ప్రారంభాల సంకేతంగా నిలుస్తుంది. ఈ మహోత్సవం నిజానికి ధన్తేరస్‌తో మొదలవుతుంది, దీనిని మరొక పేరు ధనత్రయోదశి అని కూడా అంటారు. హిందూ సంప్రదాయంలో ఇది అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది సౌభాగ్యం, ఆరోగ్యం, సంపదకు నాంది పలుకుతుంది. అందుకే ఈ రోజున కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి, వాహనాలు వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇకపై పెట్రోల్ టెన్షన్ వద్దు

పెట్రోల్ ధరలు పెరగడం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరగడంతో భారతదేశంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మారుతి సుజుకితో పాటు హ్యుందాయ్, టాటా వంటి ప్రముఖ కంపెనీలు సీఎన్‌జీ విభాగంలో తమ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి.

మార్కెట్‌లో నిన్ను పడగొట్టే బండి ఇంకా పుట్టలేదు మామ

భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజల మనసును దోచుకున్న బైక్ ఏదైనా ఉందంటే, అది హీరో స్ప్లెండర్ (Hero Splendor) తప్ప మరొకటి కాదు. ఈ బైక్ గురించి మైలేజ్ కింగ్ అని చెబితే అతిశయోక్తి కాదు. తక్కువ ధరలో లభిస్తూ, లీటర్ పెట్రోల్‌కు అద్భుతమైన మైలేజ్ ఇచ్చే ఈ బైక్, దాదాపు మూడు దశాబ్దాలుగా సాధారణ భారతీయుడి జీవితంలో భాగమైపోయింది. రోజువారీ ప్రయాణాలకు సరైన ఎంపికగా భావించబడే హీరో స్ప్లెండర్, తన నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన సౌకర్యాలతో ప్రత్యేక స్థానం సంపాదించింది. నగర రోడ్లపై గానీ, గ్రామీణ ప్రాంతాల దారులపై గానీ.. ఈ బైక్ సమానంగా పనితీరును ఇస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కనీసం ఒక్క హీరో స్ప్లెండర్ కనిపించడం అసాధారణం కాదు.
Advertisement

అందరూ ఎదురుచూస్తున్న కారు బుకింగ్స్ స్టార్ట్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ (Hyundai) అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త హ్యుందాయ్ వెన్యూ (Venue) గురించి తాజా శుభవార్త వచ్చింది. ఆధునిక డిజైన్‌తో, మెరుగైన ఇన్‌టీరియర్, సౌకర్యాలను కలిగి ఈ మోడల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, భారతదేశంలో ఏదైనా హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో రూ. 25,000 ప్రారంభ బుకింగ్‌తో కొత్త వెన్యూ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా, హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త వెన్యూ లో అనేక లేటెస్ట్ మార్పులు చేశారు. ఇంటీరియర్ స్పేస్, సీటింగ్ కంఫర్ట్, ఇంటీరియర్ ఫినిషింగ్ లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు, తద్వారా వినియోగదారులు షోరూమ్‌లో వాహనాన్ని మొదటగా చూడగానే ఆకర్షితులవుతారు.

ఏ బైక్ ఎక్కువ అమ్ముడుపోయిందో తెలుసా ?

భారతదేశంలో టూ వీలర్ సేల్స్ 2025 సెప్టెంబర్ నెలలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. పండుగల సీజన్ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఈ సానుకూల వృద్ధికి ప్రధాన కారణాలు. ఈ మొత్తం అమ్మకాల్లో ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి, ఒక్క నెలలోనే 3.8 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. అయితే, ఇదే సమయంలో స్కూటర్ సెగ్మెంట్లో టాప్ పొజిషన్లో ఉండే హోండా యాక్టివా అమ్మకాలు మాత్రం తగ్గడం గమనార్హం. సెప్టెంబర్ నెలలో టూ వీలర్ సేల్స్ పూర్తి వివరాలు చూద్దాం.

బడ్జెట్ కారు కోసం స్మార్ట్ ఎంపిక.. గ్లాంజా ధర, EMI, మైలేజ్ వివరాలు

టయోటా గ్లాంజా (Toyota Glanza) పేరు చెప్పగానే ఒక క్లాస్, ప్రీమియం టచ్ గుర్తుకు వస్తుంది. భారత మార్కెట్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తన ప్రత్యేకమైన డిజైన్‌, నాణ్యతతో మంచి పేరు సంపాదించింది. టయోటా బ్రాండ్‌కి ఉన్న ప్రతిష్ఠ, దీని పనితీరుతో కలిపి గ్లాంజాను ఈ కేటగిరీలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు‌గా నిలబెట్టాయి. ధర పరంగా గ్లాంజా బడ్జెట్, ప్రీమియం మధ్య సమానత్వం సాధించింది. దీని ధర కనీసం రూ. 6.39 లక్షలు, గరిష్టంగా రూ. 9.15 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ధరలో ఇంత ఫీచర్-రిచ్‌, ప్రీమియం లుక్‌ కలిగిన హ్యాచ్‌బ్యాక్ దొరకడం చాలా అరుదు. ఈ కారు కొనాలనుకునేవారి కోసం వేరియంట్ల వారీగా ఈ కారు ఆన్-రోడ్ ధర, EMI గురించి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

ఈ స్కూటర్ కొంటే పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేదు

భారత టూవీలర్ మార్కెట్లో హోండా యాక్టివా (Honda Activa) అనే పేరు వినగానే అందరికీ ఒక నమ్మకం గుర్తుకు వస్తుంది. ప్రతి ఇంటి గ్యారేజీలో కనీసం ఒక యాక్టివా కనిపించేంతగా ఇది ప్రజాదరణ పొందింది. సౌకర్యం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం వంటివి దీన్ని దేశంలోని నంబర్ 1 స్కూటర్‌గా నిలబెట్టాయి. అయితే, గత కొంతకాలంగా ఈ అగ్రస్థానం కొంచెం కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 2025 నెలలో హోండా యాక్టివా అమ్మకాలు కొంతమేర తగ్గాయి. ఆ నెలలో కంపెనీ మొత్తం 2,37,716 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేసింది. ఈ సంఖ్య పెద్దదిగా కనిపించినా, గత సంవత్సరంలోని అదే నెలతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల.
Advertisement

స్కోడా కైలాక్ వర్సెస్ కియా సైరస్

భారతదేశంలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం తీవ్రమైన కాంపిటేషన్ నడుస్తోంది. స్పోర్టీ లుక్, అద్భుతమైన ఫీచర్లు, మంచి మైలేజీ ఉన్నప్పటికీ కొన్ని మోడళ్లు మాత్రం అమ్మకాల్లో చాలా వెనుకబడుతున్నాయి. ఈ విభాగంలోకి కొత్తగా వచ్చి బాగా అమ్ముడవుతున్న స్కోడా కైలాక్ కారుకు గట్టి పోటీ ఇవ్వడంలో కియా సైరస్ ఫెయిల్ అయింది.

ఆగస్టులో సైలెంట్.. సెప్టెంబర్‌లో బ్లాస్ట్!

భారత మార్కెట్లో తక్కువ ధరలో కొత్త కారు కొనాలని అనుకున్నప్పుడు, చాలామంది వినియోగదారుల మనసులో గుర్తుకు వచ్చే మోడళ్లలో ఒకటి రెనాల్ట్ క్విడ్ (Renault Kwid). ఈ కారు రూపకల్పన, ఫీచర్లు, ధర అన్నీ కలిపి దీన్ని చిన్న కుటుంబాలకు సరైన కాంపాక్ట్ కారు‌గా నిలబెట్టాయి. SUV లుక్‌తో, సిటీ డ్రైవింగ్‌కి సరిపడే సైజుతో వచ్చిన ఈ కారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ అందిస్తుందనే పేరును సంపాదించింది. తాజాగా విడుదలైన సెప్టెంబర్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం, రెనాల్ట్ క్విడ్ తన అమ్మకాలలో బాగా పుంజుకుంది. ఆ నెలలో మొత్తం 512 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత నెలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఎందుకంటే ఆగస్టు 2025లో కేవలం 235 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.

కోట్ల కారులో పృథ్వీరాజ్ స్టైలిష్ ఎంట్రీ

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కువ ట్రెండింగ్ అవుతున్న విషయాల్లో ట్రోలింగ్ ఒకటి. పొగడ్తలకైనా, విమర్శలకైనా ట్రోల్స్ బాగా పనిచేస్తున్నాయి. అయితే, మలయాళ సూపర్ స్టార్, నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల తన పాత సినిమాల సన్నివేశాల కారణంగా నెట్టింట బాగా ట్రోల్ అవుతున్నారు. ఆయనకు యాక్టింగే రాదంటూ, చదువు లేదంటూ కొందరు ట్రోలర్స్ విమర్శలు చేస్తున్నారు.

మారుతి సెలెరియో పరిస్థితి ఒకప్పుడు హిట్.. ఇప్పుడు సైలెంట్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు అంటే ఒక నమ్మకం. ఈ బ్రాండ్ కార్లు ఎప్పటినుంచో భారత కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ నుంచి ప్రీమియం సడాన్‌, SUV వరకు.. మారుతి సుజుకి ప్రతి విభాగంలో తన ఉనికిని చూపిస్తుంది. అయితే ప్రతి విజయవంతమైన బ్రాండ్‌కీ కొన్ని బలహీన అమ్మకాలు చేసే కార్లు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో మారుతి సుజుకి సెలెరియో ఒకటి. ఒకప్పుడు చిన్న కారు సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలెరియో, ఇప్పుడు మాత్రం అమ్మకాల పరంగా వెనుకబడింది. భారత మార్కెట్లో ఈ కారు అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రతి నెలా అమ్ముడవుతున్న యూనిట్ల సంఖ్య చూస్తే, ఇది స్పష్టంగా అర్థమవుతుంది.
Advertisement

ఇక్కడ ప్లాప్.. అక్కడ బంపర్ హిట్

మన దేశంలో మహీంద్రా థార్ (Mahindra Thar) ముందు నిలబడలేక, పెద్దగా అమ్ముడుపోని మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) ఎస్‌యూవీ, ఇప్పుడు విదేశీ మార్కెట్లలో మాత్రం దుమ్ము రేపుతోంది. ఒకప్పుడు జీప్సీకి ప్రత్యామ్నాయంగా 5-డోర్ల వెర్షన్‌లో భారతదేశంలో లాంచ్ అయిన జిమ్నీ, ఎక్కువ ధర, చిన్న సైజు కారణంగా భారతీయ కస్టమర్లను అంతగా ఆకర్షించలేకపోయింది.

క్రెటా పాలిట విలన్ వచ్చేస్తున్నాడు

విన్‌ఫాస్ట్ సంస్థ భారతదేశంలో తన వీఎఫ్6, వీఎఫ్7 కార్ల డెలివరీలను ప్రారంభించింది. ఈ కార్లకు భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి కర్మాగారంలో తయారైన కార్ల డెలివరీలు ఇప్పుడు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మధ్యతరగతి కోసం బెస్ట్ స్కూటర్‌గా సుజుకి యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) స్కూటర్‌కి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రేమ అంతా మాటల్లో చెప్పలేనిది. ఈ స్కూటర్ తన నమ్మకమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకోవడంతో ప్రతిరోజు ప్రయాణాలకు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తోంది. సాఫ్ట్ సస్పెన్షన్, విస్తృతమైన సీటింగ్‌, శక్తివంతమైన ఇంజిన్ కలయికతో యాక్సెస్ 125 స్కూటర్ వినియోగదారుల మనసును దోచుకుంది. ఇది చాలా మందికి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అందుకే ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో యాక్సెస్ 125 అమ్మకాలు బాగా రాణించాయి. ఆ నెలలోనే మొత్తం 72,238 యూనిట్లు వినియోగదారుల చేతికి వెళ్లాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన 53,715 యూనిట్లతో పోలిస్తే సుమారు 34.48 శాతం వృద్ధి సాధించింది.

మన వాహనాలు అంటే పడిచచ్చిపోతున్న విదేశీయులు

భారత వాహన పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తన దుమ్మురేపుతున్న రికార్డుల ద్వారా గర్వపడుతోంది. దేశీయంగా మాత్రమే కాకుండా, విదేశాలలో కూడా భారతదేశంలో తయారైన వాహనాలపై విపరీతమైన డిమాండ్ నెలకొంది. మన దగ్గర తయారైన వాహనాలను ఎంతో ఉత్సాహంగా ఇతర దేశాల వారు కొనుగోలు చేస్తున్నారు. గత ఆరు నెలలుగా భారత వాహన పరిశ్రమ నిరంతరం మెరుగైన ఎగుమతుల గణంకాలను నమోదు చేస్తుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, అంటే ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో, వాహన ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. కేవలం ఒక ప్రత్యేక విభాగానికి పరిమితం కాకుండా, అన్ని విభాగాల్లోనూ పాజిటివ్ వృద్ధి కనిపించింది. టూవీలర్ వాహనాలు, త్రీవీలర్ వాహనాలు, సబ్‌కాంపాక్ట్ కార్లు, సీడాన్‌లు, SUVలు, వాణిజ్య వాహనాలు, ప్రతి విభాగంలోనూ విదేశీ మార్కెట్లలో దాని స్థానం మరింత బలపడింది.
Advertisement

బిగ్ బాస్ ఫేమ్ బిన్నీ సెబాస్టియన్ కొత్త కారు కొనేసింది

మలయాళ టెలివిజన్ ప్రపంచంలో తన సొంత గుర్తింపును సృష్టించుకున్న నటి జోసెఫిన్ బిన్నీ సెబాస్టియన్ మరోసారి వార్తల్లో నిలిచారు. గీత గోవిందం సీరియల్‌లో గీతాంజలి పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఈ అందగత్తె, 2025లో ప్రసారమైన బిగ్ బాస్ మలయాళ సీజన్ 7 ద్వారా మరింత ప్రజాదరణను సంపాదించారు. బిగ్ బాస్ ఇంట్లో ఆమె చూపించిన సెన్సిబుల్ ఆట్టిట్యూడ్, హ్యూమర్, నేరుగా మాట్లాడే ధోరణి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా చంగనస్సేరి ప్రాంతంలో పుట్టి పెరిగిన బిన్నీ, ఒక సంప్రదాయవాద క్రైస్తవ కుటుంబంకి చెందినవారు. బాల్యంలోనే చదువుపై ఆసక్తి చూపిన ఆమె, వైద్య రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా ముందుకు వెళ్లి చైనాలో MBBS పూర్తి చేశారు.

ఇక కార్లకు 5 స్టార్ రేటింగ్ కష్టమే

వాహన రంగంలో భద్రతకు సంబంధించి అతిపెద్ద మార్పు రాబోతోంది. 5 స్టార్ రేటింగ్‌తో కారు సేఫ్టీకి చిహ్నంగా నిలిచే యూరో ఎన్‌క్యాప్ సంస్థ, 2026 నాటికి కొత్త టెస్టింగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ కొత్త నియమాలు కార్ల డిజైన్, టెక్నాలజీ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణీకులను కాపాడటంతో పాటు, కారు నడిపే వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని, ముందే ప్రమాదాన్ని నివారించగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ కొత్త రూల్స్ వల్ల వాహన తయారీ సంస్థలు, వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడనుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యూందాయ్ వెన్యూ పై రూ.1.73 లక్షల ఆఫర్

పండుగల సీజన్ అంటే మన దేశంలో కొత్త వాహనాల కొనుగోళ్లకు అద్భుతమైన సమయం. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు కొత్త కార్ లేదా బైక్ తీసుకురావాలని ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఆటోమొబైల్ షోరూమ్‌లు కస్టమర్లతో కిక్కిరిసిపోతాయి. GST మినహాయింపులు, బ్యాంకుల తక్కువ వడ్డీ రేట్లు, కంపెనీల ప్రత్యేక పండుగ ఆఫర్లతో ఈ కాలం వాహన మార్కెట్‌కి బంగారు కాలం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్స్ ఇండియా వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన సబ్‌కాంపాక్ట్ SUV మోడల్ అయిన హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue)పై ఇప్పుడు రూ.1.73 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

కార్ సర్వీసింగ్ ఎక్కడ చేయిస్తే బెటర్

భారతదేశంలో కార్లు, బైక్‌ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, వాహనాల సర్వీసింగ్ ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. వాహనం ఎక్కువ కాలం మన్నాలన్నా, మంచి పర్ఫామెన్స్ కనబరచాలన్నా క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.
Advertisement

మధ్యతరగతి కుటుంబాల కలల కారు! తక్కువ ధరకే

భారతదేశం అంటే మధ్యతరగతి ప్రజల దేశం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు ఎన్నోసార్లు ఆలోచిస్తారు, ధర ఎంత? మైలేజ్ ఎంత వస్తుంది? మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుందా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగల బ్రాండ్ ఏదైనా ఉంటే, అది మారుతి సుజుకి తప్ప మరేదీ కాదు. ఈ కంపెనీ భారతీయుల మనసులో చాలా కాలంగా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కారణం, మారుతి సుజుకి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా, అందుబాటు ధరలో, విశ్వసనీయమైన, మైలేజ్‌లో మేటి కార్లను అందిస్తోంది. ఒకవైపు సిటీ డ్రైవ్‌కి సౌకర్యంగా ఉండే సైజ్‌, మరోవైపు రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చు, ఈ రెండింటినీ సమతుల్యం చేసే డిజైన్ తత్త్వం మారుతి కార్లలో స్పష్టంగా కనిపిస్తుంది.