30 రోజుల్లో 32,000 కార్లు

భారతదేశంలో టాటా మోటార్స్ కార్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ దీపావళి పండుగ సీజన్ టాటా మోటార్స్‌కు జాక్‌పాట్ అనే చెప్పాలి. నవరాత్రి నుంచి దీపావళి వరకు కేవలం 30 రోజుల వ్యవధిలో కంపెనీ లక్ష కార్లను విక్రయించింది. ఈ అమ్మకాల విజయంలో టాటా ప్రసిద్ధ మైక్రో ఎస్‌యూవీ అయిన పంచ్ కారు కీలక పాత్ర పోషించింది.

ఆరు నెలల్లో లక్ష దాటిన డిజైర్‌ విక్రయాలు!

భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం ముగిసిన నేపథ్యంలో, ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను ప్రకటించాయి. ఈ గణాంకాలు చూస్తే, దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అయితే, ఈ పోటీలో అన్ని కంపెనీలను వెనక్కు నెట్టుతూ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నది మారుతి సుజుకి యొక్క ప్రముఖ సెడాన్ డిజైర్ (Dzire). ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు, అంటే ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి ఆరు నెలల్లో, మారుతి డిజైర్ మొత్తం 1,08,006 యూనిట్లు అమ్ముడవడం ద్వారా అసాధారణ విజయాన్ని సాధించింది. ఈ సంఖ్య కేవలం విక్రయ పరిమాణం మాత్రమే కాదు, కస్టమర్ల విశ్వాసానికి ప్రతీక కూడా.

ఆ కారుకు నిమిషానికి 25వేల బుకింగ్స్

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N) ఒకటి. ఇది అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ ఎస్యూవీ రకం కార్లలో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాకుండా ఇది ముందస్తు బుకింగ్‌లలో అనేక రికార్డులను క్రియేట్ చేసిన మోడల్.

యమహా దెబ్బకు వణుకుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

భారతదేశంలో రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా, జావా వంటి సంస్థలు దూసుకుపోతుంటే జపాన్‎కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) మాత్రం దూరం నుండే చూస్తోంది. ఒకప్పుడు ఆర్ఎక్స్100 (RX100) వంటి అద్భుతమైన బైక్‌లతో దేశాన్ని ఏలిన ఈ సంస్థ, ఇప్పుడు యువతను మాత్రమే టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది. ఆర్15, ఎమ్‎టి15, ఎఫ్‎జెడ్ వంటి పవర్ఫుల్ మోడల్స్ కంపెనీకి ప్రధాన ఆయుధాలు. అయితే, త్వరలోనే యమహా ఒక కొత్త ఆయుధాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకోవడానికి సిద్ధమవుతోంది.
Advertisement

రూ.19 వేల తగ్గింపుతో కొత్త కవాసకి సూపర్‌స్పోర్ట్ బైక్ లాంచ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం కవాసకి (kawasaki), ప్రతి సంవత్సరం కొత్త టెక్నాలజీ, మెరుగైన పనితీరు, స్పోర్టీ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. కంపెనీ, ఇప్పుడు భారత బైక్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నేకెడ్ సూపర్‌స్పోర్ట్ బైక్ Z900 (2026 Kawasaki Z900) కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. 2026 మోడల్ సంవత్సరానికి వచ్చిన ఈ బైక్ కొత్తగా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. 2026 కవాసకి Z900 సూపర్‌బైక్ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఇది గత మోడల్‌తో పోలిస్తే సుమారు రూ. 19,000 తక్కువ. అంటే, కవాసకి తమ కొత్త వెర్షన్‌ను మరింత అందుబాటులోకి తెచ్చింది.

కొత్త బజాజ్ చేతక్ EV భారత మార్కెట్‌లో ఎంట్రీకి రెడీ!

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బజాజ్ చేతక్ (Bajaj Chetak) తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచిన చేతక్, దేశీయంగా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతూ వినియోగదారుల హృదయాలను దక్కించుకుంది. ఈ స్కూటర్ తన వినియోగదారులకు స్థిరత్వం, ఆధునిక టెక్నాలజీతో నింపబడిన అనుభవాన్ని అందిస్తోంది. చేతక్ తన ప్రస్తుతం చేతక్ 3501, 3502, 3503, 3001 మోడళ్లలో అందుబాటులో ఉంది. వీటికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఈవీ స్కూటర్ల విభాగంలో ఇవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ డిమాండ్‌ను కొనసాగించడానికి ఇటీవల, బజాజ్ కంపెనీ చేతక్‌ను కొత్త రూపంలో మార్కెట్లో తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో భాగంగా, కొత్త తరం బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది.

హీరోయిన్‎కు 78లక్షల కారు గిఫ్టు

బీఎండబ్ల్యూ సంస్థ ప్రముఖుల అభిమాన వాహన తయారీ సంస్థ. సాధారణ ఇంజిన్ వాహనాలైనా లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా, అమ్మకాలు, గిరాకీ విషయంలో అస్సలు వెనుకబడదు. మలయాళ చిత్రసీమలో పాపులర్ హీరోయిన్‎గా పేరు తెచ్చుకున్న సుందరి సురభి సంతోష్. 'కుట్టనాడన్ మార్పాప్పా' చిత్రంలో కుంచాకో పక్కన హీరోయిన్‎గా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు ఈమె జీవితంలోకి ఒక కొత్త సంతోషం వచ్చింది. ఆమె భర్త ప్రణవ్ తనకు సరికొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్1 ను బహుమతిగా ఇచ్చారు. ప్రణవ్ స్వయంగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

భారత మార్కెట్లో స్కోడా కైలాక్ డిమాండ్ ఇంకా పెరుగుతోంది

ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చౌకైన స్కోడా కారు ఏది అని అడిగితే, చాలామంది కైలాక్ (Skoda kylaq) అని చెప్పే అవకాశమే ఎక్కువ. దీనికి కారణం కేవలం ధర తక్కువగా ఉండటం మాత్రమే కాదు, స్కోడా లైన్‌అప్‌లో ఇతర మోడళ్లతో పోలిస్తే, ఈ కారు అందించే ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కూడా వినియోగదారులను గట్టిగా ఆకట్టుకుంటాయి. కాబట్టి, ఇది మార్కెట్లో మంచి ఆదరణను పొందుతోంది. ఇటీవలి సెప్టెంబర్ 2025 అమ్మకాలు కూడా ఈ డిమాండ్‌ను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో స్కోడా కైలాక్ 4,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీని ఫలితంగా, ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన స్కోడా కారుగా కైలాక్ నిలిచింది.
Advertisement

323 Km రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ స్టార్ట్

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ అల్ట్రావయోలెట్ (ultraviolette) ఆటోమోటివ్ తాజాగా భారత మార్కెట్లో మరోసారి సత్తా చాటింది. కంపెనీ X47 క్రాస్ఓవర్ EV అడ్వెంచర్ బైక్‌ను గత నెలలో విడుదల చేసింది. ఇది కేవలం ఒక కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మాత్రమే కాదు, వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్ అనుభవం ఇవ్వడానికి రూపొందించబడిన ఒక శక్తివంతమైన, ఆధునిక సాంకేతికతతో నింపిన బైక్. కంపెనీ దీని డెలివరీలను ప్రారంభించింది. వినియోగదారులు ఎదురుచూస్తున్న ఈ కాంపాక్ట్ అడ్వెంచర్ EV బైక్ ఫ్యాక్టరీ నుండి బయలుదేరిన సందర్భాలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపించడం మొదలుపెట్టింది. అల్ట్రావయోలెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిట్ల ఫోటోలు, వీడియోలను పంచుతూ, ఉత్పత్తి నాణ్యత, అసెంబ్లింగ్ ప్రాసెస్ తీరును అందించింది.

10 లక్షల లోపు రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఫీచర్‌ కార్లు ఇవే

ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది కారు కొనేటప్పుడు కేవలం ధర, మైలేజ్ మాత్రమే కాకుండా, అందులో ఉండే అడ్వాన్సుడ్ ఫీచర్లను కూడా చూస్తున్నారు. ముఖ్యంగా రిమోట్ ఇంజిన్ స్టార్ట్ (Remote Engine Start) ఫీచర్ చాలా సౌకర్యాన్ని ఇస్తుంది. కారులో కూర్చోకముందే, బయటి నుంచే ఏసీ ఆన్ చేసి, క్యాబిన్‌ను చల్లబరచడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

ADAS అంటే ఏమిటి? అది కార్లలో ఎలా పనిచేస్తుంది!

రోడ్లపై కార్లను డైవింగ్ చేసే సమయంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంలో కీలక పాత్ర పోషిస్తుంది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS). ఇది ఒక ఆధునిక టెక్నాలజీ. ఇది వాహనాన్ని నడిపే సమయంలో డ్రైవర్‌కు సాయం చేసే ఆధునిక సాంకేతిక వ్యవస్థ. సులభంగా చెప్పాలంటే, ఇది డ్రైవర్‌కు, కళ్లు, చెవుల మాదిరిగా అదనంగా ఉపయోగపడుతుంది. రోడ్డు పరిస్థితులు, వాహనాల దూరం, ప్రమాద అవకాశాలు వంటి అంశాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరించడం లేదా కొన్ని సందర్భాల్లో వాహన నియంత్రణను స్వయంగా చేపట్టడం దీని ముఖ్య లక్ష్యం. దీని కారణంగా రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గుతున్నాయి. కారు లోపల కూర్చున్న వారికి ఇది ఒక భరోసాను ఇస్తుంది. ప్రస్తుతం ADAS ఫీచర్లకు అనుగుణంగా చాలా కార్లు అప్‌డేట్ అవుతున్నాయి.

దుమ్ములేపిన రతన్ టాటా కంపెనీ

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్(Tata Motors) సంచలనం సృష్టిస్తోంది. సేఫ్టీ, క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్‎గా నిలుస్తున్న టాటా కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడుతున్నారు. ఈ పండుగ సీజన్ (నవరాత్రి నుంచి దీపావళి వరకు) టాటా మోటార్స్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ కాలంలో కంపెనీ దేశవ్యాప్తంగా ఏకంగా 1,00,000 (లక్ష) యూనిట్లకు పైగా కార్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.
Advertisement

రూ.6.29 లక్షల కారు ఎక్కువగా కొంటున్నారు

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్‌కు భారతీయ మార్కెట్‌తో ఉన్న అనుబంధం చాలాకాలంగా కొనసాగుతోంది. క్విడ్‌తో చిన్న కారు సెగ్మెంట్‌లో, డస్టర్‌తో SUV విభాగంలో కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. అయితే, భారతదేశంలో కాంపాక్ట్ SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన రెనాల్ట్, ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంది. అందుకే 2021లో రెనాల్ట్ కైగర్ అనే కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఇది డిజైన్, ఫీచర్స్, పనితీరు అన్నింటినీ సమతూకంగా కలిపిన మోడల్‌గా నిలిచింది. ప్రారంభంలో క్విడ్‌ను కొందరు చిన్న SUV అంటూ ఎగతాళి చేసినప్పటికీ, కైగర్ మాత్రం సాధారణ వినియోగదారుల అవసరాలకు పూర్తిగా సరిపోయే విధంగా రూపుదిద్దుకుంది. అందమైన స్పోర్టీ డిజైన్, ఆధునిక ఇంటీరియర్, విస్తారమైన కేబిన్ స్పేస్, ఆకర్షణీయమైన ధర కారణంగా ఇది యువత నుంచి కుటుంబాల వరకూ అందరినీ ఆకట్టుకుంది.

ఫాస్ట్‌ట్యాగ్ వాడే వాళ్లకు గుడ్‎న్యూస్

భారతదేశంలో టోల్ గేట్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్(FASTag) సిస్టమ్‎ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరింత సరళీకృతం చేసింది. ఇటీవల ప్రారంభించిన ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ (Annual Pass) ఇప్పుడు బహుమతిగా ఇవ్వడం మరింత ఈజీ అయింది.

పెట్రోల్ కార్ల కంటే ఈవీలే ఎందుకు బెటర్

ప్రస్తుత కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. పెరుగుతున్న ఇంధన ధరలతో వాహన యజమానులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంధన ధరల భారం, కార్ల మెయింటెనెన్స్ ఖర్చులతో వారి బడ్జెట్ తలకిందులవుతోంది. అయితే, దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఎలక్ట్రిక్ కార్లు.

రోజూ ఆఫీస్ వెళ్లే వాళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్! బెస్ట్ మైలేజ్ బైక్‌లు ఇవే!

భారత మార్కెట్లో బైక్ కొనాలనుకునే వారు ఎక్కువగా చూసే అంశం, ధర తక్కువగా ఉండాలి, మైలేజ్ ఎక్కువగా రావాలి. ఎందుకంటే మన దేశంలో బైక్ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ప్రతిరోజూ ఉద్యోగానికి, చదువుకు, ఇంటి పనులకు వెళ్లే వారికి జీవిత భాగస్వామిలాంటిది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే బైక్‌నే ఎక్కువ మంది కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ఫ్రీడమ్ 125, హీరో HF 100, హోండా షైన్ 100 ల బెస్ట్. ఇవి తక్కువ సర్వీస్ ఖర్చు, చవకైన మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ సులభంగా దొరకడం వంటి కారణాల వల్ల ప్రజల మనసును గెలుచుకున్నాయి. ఈ పండుగ సమయంలో కొత్త బైక్ కొనే వారికి వీటి గురించిన వివరాలు ఈ కథనంలో చూద్దాం.
Advertisement

పేదల థార్ అంటూ వైరల్ అవుతోంది! మారుతి 800కి SUV లుక్

మారుతి 800 (Maruti 800) భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, ప్రజాదరణ పొందిన చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఫేవరెట్ మోడల్‌గా ఇది ప్రతి ఇంటికి చేరింది. 80ల, 90ల నుండి ఇప్పటివరకు మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ కలిగిన మారుతి 800, తక్కువ ధర, తక్కువ మైంటెనెన్స్, సౌకర్యవంతమైన డిజైన్ వల్ల ప్రతీ వర్గానికి అనువైన కారు. ఇప్పటికే ఈ చిన్న SUV స్థాయి హ్యాచ్‌బ్యాక్ తన సింపుల్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా, మహారాష్ట్రలో ఈ మారుతి 800 పై ఒక అద్భుతమైన మోడిఫికేషన్ ట్రెండ్ వైరల్ అవుతోంది. మారుతి 800 కారును మహీంద్రా థార్ లాంటి ఆకారంలో మార్చారు. ఇటీవల ఈ కారు రోడ్డుపై కనిపించింది.

టాటా మోటార్స్ అంటే ఇంత కంటే ప్రూఫ్ కావాలా ?

గత ఎనిమిది ఏళ్లలో ఒకే కుటుంబం 6 టాటా కార్లను కొనుగోలు చేసింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆ కుటుంబం ఎందుకు టాటా మోటార్స్ వాహనాలను ఎక్కువగా ఇష్టపడుతుందో.. ఈ కొనుగోలు వెనుక ఉన్న కారణాలను వివరంగా ఈ కథనంలో చూద్దాం.

నెలకు రూ.21 వేలతో అదిరిపోయే కారు

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్(Toyota Urban Cruiser Hyryder) భారత SUV మార్కెట్‌లో ఒక ప్రసిద్ధ వాహనం. ఈ SUV ఆకర్షణీయమైన డిజైన్, బలమైన బాడీ స్ట్రక్చర్‌తో ప్రతి నెలా అమ్ముడవుతూ మంచి గణంకాలను సాధిస్తుంది. నగరాల్లో, హైవే రోడ్లలో లేదా ఆఫ్-రోడ్ పరిస్థితుల్లోనైనా, హైరైడర్ బెస్ట్. దీని ధర రూ.10.95 లక్షల నుండి రూ.19.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. అంటే, వినియోగదారుల బడ్జెట్, అవసరాలు, వేరియంట్ల ఆధారంగా సరైన ఎంపికను చేసుకోవచ్చు. కొత్త కారు కొనడానికి ఆలోచిస్తున్న వారు, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒక ప్రత్యేక ఎంపిక అవుతుంది. ఈ SUV లో ఉన్న శక్తివంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, సాంకేతికత మీ ప్రయాణాన్ని భద్రతగా చేస్తుంది. ఈ కారు EMI ఆప్షన్లను ఒకసారి ఈ కింది కథణంలో చూద్దాం.

మారుతి బయోగ్యాస్ ఎస్‌యూవీ పై ఓ లుక్కేయండి

ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి విక్టోరిస్ కారు ఒక తెలివైన ఆప్షన్‎గా నిలుస్తోంది. గ్రాండ్ విటారా తర్వాత ఇదే విభాగంలో వస్తున్న రెండో మోడల్ అయినప్పటికీ, విటారాతో దీనికి ఎలాంటి పోలిక లేదు. అందుకే ప్రజలు విక్టోరిస్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. మార్కెట్లోకి వచ్చిన మొదటి నెలలోనే దాదాపు 5,000 యూనిట్లను అమ్మి ఈ కారు అద్భుతమైన ప్రారంభాన్ని సొంతం చేసుకుంది.
Advertisement

భారత్ NCAP ప్రకారం అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కార్లు!

ఇప్పటి కాలంలో కారు కొనడం అంటే కేవలం మైలేజ్, డిజైన్ లేదా టెక్నాలజీ మాత్రమే కాదు, భద్రత (Safety) కూడా అత్యంత కీలక అంశంగా మారిపోయింది. పాత కాలంలో కారు అంటే ఎంత తక్కువ పెట్రోల్ తాగుతుందో అనే ప్రశ్న మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కుటుంబం కోసం కారు కొనుగోలు చేసే వారు, యువత, లేదా ఆఫీస్ కమ్యూటింగ్ కోసం వాహనం తీసుకునే వారు, అందరూ ముందుగా క్రాష్ టెస్ట్ రేటింగ్ చూస్తున్నారు. ఒక కారు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, దానిలో కూర్చున్నవారి ప్రాణాలు సురక్షితంగా ఉండాలంటే దానికి బలమైన నిర్మాణం, సరైన ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడే సేఫ్టీ ఫీచర్లు ఉండాలి.

ఈ బైక్ ఖరీదులో ఎస్యూవీనే కొనొచ్చు

భారతదేశంలో హార్డ్‌కోర్ అభిమానులు ఉన్న సూపర్‌బైక్ తయారీదారులలో కవాసాకి (Kawasaki) ఒకటి. ఈ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి, ట్రయంఫ్, బీఎండబ్ల్యూ వంటి బ్రాండ్‌లతో పోటీ పడుతూ వైవిధ్యభరితమైన బైక్ సిరీసును కలిగి ఉంది. నిరంతరం తమ మోడల్ సిరీసులో అప్ డేట్స్ తీసుకురావడం కవాసాకీ ప్రత్యేకత. ఈ క్రమంలోనే కంపెనీ ఇప్పుడు 2026 మోడల్ వెర్సిస్ 1100ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సూపర్ బైక్ ప్రారంభ ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరతో మంచి పెద్ద ఎస్‌యూవీని కొనుగోలు చేయవచ్చు.

స్వీట్స్ కాదు… కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన బాస్!

దీపావళి, భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసే పండుగ. వెలుగుల ఈ వేళలో కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కష్టానికి గౌరవంగా బహుమతులు ఇస్తూ ఆనందాన్ని పంచుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. అయితే ఈసారి సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. కొందరు కంపెనీలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, లగ్జరీ వస్తువులు ఇవ్వగా, మరికొందరికి మాత్రం స్వీట్ బాక్స్ కూడా అందలేదు. ఆ వీడియోలు చూసి చాలా మంది ఉద్యోగులు, మనకేమీ దక్కదే! అని నవ్వుతూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధను రెట్టింపు చేసే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాటా టపాసులు వచ్చేస్తున్నాయ్

భారతదేశంలో టాటా మోటార్స్ (Tata Motors) అంటే కేవలం కార్ల తయారీ సంస్థ మాత్రమే కాదు.. భద్రతకు, వినూత్నతకు మరో పేరు. టియాగో, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడళ్లతో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేని స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ కంపెనీ త్వరలో మరో మూడు కొత్త కార్లను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా భద్రత, ఎలక్ట్రిక్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ రాబోతున్న ఈ మూడు కార్లు టాటా అవిన్య ఎక్స్, టాటా సఫారీ ఈవీ, టాటా సియెర్రా ఆటో రంగంలో సంచలనం సృష్టించనున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు, విడుదల తేదీల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1. టాటా అవిన్య (Tata Avinya X)కొత్త అవిన్య ఒక విద్యుత్ ఆధారిత ఎస్‌యూవీ. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించారు. అక్కడ చూపిన నమూనా చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టి ఆకృతికి పోలిన ఎల్‌ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, గ్రిల్, టైల్ లైట్లను ఇది కలిగి ఉంది.
Advertisement

27కి.మీ మైలేజ్ ఇచ్చే 7సీటర్ కారు

ప్రస్తుతం ఇండియా మార్కెట్లో మల్టీ పర్పస్ వెహికల్స్‎కు అధిక డిమాండ్ ఉంది. ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి ఈ బాడీ స్టైల్ వెహికల్స్ అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా. ఈ మారుతి ఎంపీవీని టయోటా కంపెనీ రీబ్యాడ్జ్ చేసి రూమియన్ పేరుతో విక్రయిస్తుంది. జపనీస్ బ్రాండ్‌లైన సుజుకి, టయోటా మధ్య ఉన్న గ్లోబల్ పార్టనర్ షిప్‎లో భాగంగా కార్లు, టెక్నాలజీ మార్పిడి జరుగుతుంది. అందులో భాగంగా టయోటా రీబ్యాడ్జ్ చేసిన మారుతి కార్లలో రూమియన్ కూడా ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి టయోటా రూమియన్ అమ్మకాల్లో క్రమంగా తగ్గుదల కనిపించింది. 2025 ఏప్రిల్ నెలలో 2462 యూనిట్లు అమ్ముడయ్యాయి. మే, జూన్ నెలల్లో అమ్మకాలు వరుసగా 1917, 1415 యూనిట్లకు పడిపోయాయి. జూలైలో 576 యూనిట్లకు చేరగా, ఆగస్టులో అది మూడంకెలను కూడా తాకలేదు. ఆగస్టు నెలలో ఈ ఎంపీవీ సేల్స్ కేవలం 68 యూనిట్లు మాత్రమే.