ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన ఈవీలివే

ఇటీవల కాలంలో కొత్తగా వాహనం కొనేవారు చూసే ప్రధాన అంశం సేఫ్టీ. ముఖ్యంగా కారు క్రాష్ టెస్ట్‌లో ఎన్ని స్టార్ రేటింగ్ వచ్చిందనే దానిపై వినియోగదారులు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా సేఫ్టీ విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశీయంగా నిర్వహించే సేఫ్టీ టెస్ట్ సంస్థ భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో అత్యధిక ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్‌లో ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors), మహీంద్రా (Mahindra) కంపెనీల నుంచి వచ్చిన మోడళ్లు ఉన్నాయి.

బూమ్.. ఒక్క రోజులో లక్ష కార్లు

భారతదేశంలో పండుగ సీజన్ అంటే కొనుగోళ్ల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా ధంతేరాస్ రోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈసారి ధంతేరాస్ పండుగ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం ఒక్క రోజులోనే 1,00,000 (లక్ష) కార్లకు పైగా డెలివరీలు జరిగాయి.

రెండు కుటుంబాలకు సరిపోయే కారును కొనడానికి కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు

మారుతి సుజుకి (Maruti Suzuki) కంపెనీ నుంచి వచ్చిన XL6 ఎప్పటి నుంచో ఒక నమ్మకమైన, ప్రీమియం MPVగా గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన డిజైన్‌, విశాలమైన ఇంటీరియర్‌, ఆధునిక ఫీచర్లు, అలాగే స్మూత్ హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీతో XL6 వినియోగదారుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. కుటుంబ ప్రయాణాల కోసం, లగ్జరీ ఫీలింగ్‌తో కూడిన సౌకర్యం కావాలనుకునే వారికి ఇది ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. అయితే, ఇటీవల అమ్మకాల పరంగా XL6 కొంత వెనుకబడి కనిపిస్తోంది. సెప్టెంబర్ 2025 నెలలో ఈ MPV మొత్తం 2,170 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 3,734 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ. అంటే, అమ్మకాలు దాదాపు 41.89 శాతం తగ్గినట్లుగా అర్థమవుతోంది.

ఫ్యామిలీకి సరైన కారు.. రూ.5.47 లక్షలకే అందుబాటులో

హ్యుందాయ్ ఐ10 (Hyundai I10) ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. చిన్న కుటుంబాల అవసరాలకు సరిపోయే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, ఈ మూడు అంశాల కలయికతో ఐ10 అనేకమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తన కాలంలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి పాపులర్ మోడల్స్‌తో సవాల్ చేస్తూ, హ్యుందాయ్ బ్రాండ్‌కి మంచి గుర్తింపు తెచ్చిన మోడల్ ఇదే. మార్కెట్‌లో పోటీ ఎంత పెరిగినా, ఐ10 మాత్రం తన స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. తరువాత కాలంలో ఈ మోడల్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని గ్రాండ్ i10 నియోస్ పేరుతో మూడవ తరం వెర్షన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది.
Advertisement

పాపులారిటీలో ఫ్రాంక్స్‌కి ఎవరూ సాటిరారు

హ్యుందాయ్ ఐ10 (Hyundai I10) ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. చిన్న కుటుంబాల అవసరాలకు సరిపోయే పరిమాణం, ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, ఈ మూడు అంశాల కలయికతో ఐ10 అనేకమంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. తన కాలంలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి పాపులర్ మోడల్స్‌తో సవాల్ చేస్తూ, హ్యుందాయ్ బ్రాండ్‌కి మంచి గుర్తింపు తెచ్చిన మోడల్ ఇదే. మార్కెట్‌లో పోటీ ఎంత పెరిగినా, ఐ10 మాత్రం తన స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది. తరువాత కాలంలో ఈ మోడల్ మరింత ఆధునికంగా రూపుదిద్దుకుని గ్రాండ్ i10 నియోస్ పేరుతో మూడవ తరం వెర్షన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది.

జీఎస్టీ తగ్గింపుతో వాహనాల డిమాండ్ బూస్ట్ అయింది

గత నెల భారత ఆటోమొబైల్ మార్కెట్ పండుగ వాతావరణం, ఆర్థిక ఉత్సాహం, GST మినహాయింపులతో కలగలిపి నిజంగా జోరుగా సాగింది. పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆటోమొబైల్ షోరూమ్‌లు వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. కొత్త వాహనాల కొనుగోలును శుభప్రదంగా భావించే భారతీయుల మనస్తత్వం కారణంగా, సెప్టెంబర్ నెలలో అన్ని ప్రధాన బ్రాండ్లు తమ డీలర్‌షిప్‌ల వద్ద ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, ప్రకటనలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈ పండుగ ఉత్సాహం మధ్య, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన తాజా గణాంకాలు భారత ఆటో రంగం యొక్క స్థితిగతులను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఒక్కసారి డ్రైవ్ చేస్తే మర్చిపోలేరు.. apache rtx రివ్యూ

TVS Apache RTX launched in India, priced at ₹1.99 lakh. Features rally-inspired design, new engine, and revised chassis. | TVS Apache RTX భారతదేశంలో ప్రారంభించబడింది, ధర ₹1.99 లక్షలు. ర్యాలీ-ప్రేరేపిత డిజైన్, కొత్త ఇంజిన్ మరియు సవరించిన చట్రం ఫీచర్లు ఉన్నాయి.

లాంచ్‌కు సిద్ధంగా మినీ ఫార్చ్యూనర్

ఎంతో కాలంగా ఆటో ప్రేమికులు ఎదురుచూస్తున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ (Toyota Land Cruiser FJ) SUV త్వరలో ప్రపంచానికి పరిచయం కానుందని వార్తలు వస్తున్నాయి. జపాన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ కొత్త SUVను అక్టోబర్ 20న ఒక ప్రైవేట్ మీడియా ప్రివ్యూలో ఆవిష్కరించనున్నారు. ఈ ప్రివ్యూ ప్రత్యేకంగా ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే అందనుందని, జపాన్ మాగ్జైన్ అవుట్‌లెట్ మాగ్ఎక్స్ తెలిపింది. కొత్త మోడల్‌కు మినీ ఫార్చ్యూనర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు, ఇది దీని సైజు, స్థిరమైన SUV మార్కెట్‌లో ఉన్న స్థానాన్ని సూచిస్తోంది. ప్రైవేట్ మీడియా ప్రివ్యూ పూర్తైన తర్వాత, ఈ SUVను 2025 జపాన్ మొబిలిటీ షోలో ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగనుంది.
Advertisement

టయోటా గ్లాంజా సేల్స్‌లో సత్తా చూపింది

టయోటా (Toyota) భారత మార్కెట్లో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడంలో మారుతి సుజుకితో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, టయోటా కొన్ని మారుతి మోడళ్లను రీ-బ్యాడ్జింగ్ (Rebadging) చేసి తన సొంత బ్రాండ్ కింద విక్రయిస్తోంది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ టయోటా గ్లాంజా (Toyota Glanza). ఇది అసలు మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno) రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్ అయినప్పటికీ, టయోటా తన ప్రత్యేక శైలి, బ్రాండ్ విలువ, సేల్స్ సపోర్ట్ ద్వారా ఈ కారును ప్రత్యేకంగా నిలబెట్టింది. టయోటా గ్లాంజా మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే యువత, ఫ్యామిలీ యూజర్స్ మధ్య విశేష ఆదరణ పొందింది.

రూ.6 లక్షల లోపు బడ్జెట్‌లో బెస్ట్ కార్లు

పండుగ సీజన్ ఎప్పుడూ భారతదేశంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా ధనతేరస్, దీపావళి సందర్భంగా లక్షలాది మంది ప్రజలు కొత్త కార్లు కొంటారు. మీ బడ్జెట్ రూ.6 లక్షల వరకు ఉంటే కొత్త కారు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ ఏడాది అనేక కంపెనీలు తమ సరసమైన 5 సీటర్ ఎస్యూవీలు, 7 సీటర్ ఫ్యామిలీ కార్లను మెరుగైన ఫీచర్లతో, అప్‌డేట్ చేసిన డిజైన్‌తో విడుదల చేశాయి.

అదిరిపోయే అప్‌డేట్స్‌తో బజాజ్ పల్సర్

బజాజ్ ఆటో తమ అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ సిరీస్‌లో భాగంగా 2025 బజాజ్ పల్సర్ NS125 ABS బైక్‌ను సరికొత్త అప్‌డేట్‌లతో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ రైన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు డిఫరెంట్ రైడ్ మోడ్‌లతో వస్తుంది. అంతేకాదు కొత్త పర్ల్ మెటాలిక్ వైట్ కలర్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బైక్ ధర రూ.98,400 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ అప్‌డేట్‌లతో 125సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, హోండా SP125 వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త రైడ్ మోడ్‌లు రైడర్‌లకు వివిధ రైడింగ్ పరిస్థితులకు తగ్గట్టుగా బైక్ పర్ఫామెన్స్‎ను, ట్రాక్షన్‌ను మెరుగుపరచడానికి సహాయపడతాయి. రోడ్ మోడ్ సాధారణంగా పట్టణాలు, హైవేలలో ప్రయాణించడానికి ఉద్దేశించబడింది.

హ్యుందాయ్ వెన్యూలో అంతగా ఏముంది?

మారుతి బ్రెజా, కియా సోనెట్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, భారతదేశంలో హ్యుందాయ్ (Hyundai) కంపెనీ అమ్మకాలలో వెన్యూ (Venue) కాంపాక్ట్ ఎస్‌యూవీ సత్తా చాటుతోంది. హ్యుందాయ్ విడుదల చేసిన గత ఆరు నెలల (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు) అమ్మకాల వివరాల ప్రకారం.. క్రియేటివ్ డిజైన్, మంచి మైలేజ్, అనేక ఫీచర్లతో కూడిన ఈ వెన్యూ కారును దాదాపు 50,000 మంది కస్టమర్లు కొనుగోలు చేశారు.
Advertisement

టాప్ 10 లో లేని ఫోక్స్‌వ్యాగన్

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్ల మార్కెట్‌ను ఏలిన దిగ్గజ బ్రాండ్లలో ఒకటైన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కంపెనీకి భారతీయ మార్కెట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో మంచి మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఈ కంపెనీ, తాజాగా విడుదలైన సెప్టెంబర్ నెల అమ్మకాల గణాంకాలలో పెద్ద క్షీణతను చూసింది.

కేవలం రూ.6లక్షలకే 7 సీటర్ ఎంపీవీ

ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి నిస్సాన్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మాగ్నైట్ ఎస్‌యూవీ అమ్మకాలపైనే ఆధారపడిన నిస్సాన్, తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మరిన్ని మాస్ మార్కెట్ కార్లను తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, తక్కువ ధరలో ఉండే ఒక కొత్త 7-సీటర్ ఎంపీవీని త్వరలో విడుదల చేయబోతోంది.

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న బ్రెజా

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza) ఎస్‌యూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విడుదలైనప్పటి నుంచి భారతీయ కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్న ఈ కారు, చాలా నెలలు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

అమేజ్, ఎలివేట్, సిటీ మోడళ్లపై రూ. 1.51 లక్షల వరకు ఆఫర్లు

భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుల్లో ఒకటైన హోండా (Honda) కార్స్ ఇండియా, పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చే వార్తను తన కస్టమర్లకు అందించింది. దీపావళి సందర్భంగా కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది, ఈ అక్టోబర్ నెలలో హోండా కార్లు కొనుగోలు చేసే వారికి ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు లభించనున్నాయి. హోండా ఎప్పటినుంచీ నాణ్యత, విశ్వసనీయత, మరియు శుద్ధమైన ఇంజనీరింగ్‌కి పేరొందిన బ్రాండ్‌. ఇప్పుడు పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, కంపెనీ తమ మోడల్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది. ఈ కింది కథనంలో ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
Advertisement

భారీగా తగ్గిన స్కోడా కైలాక్ ధర

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా మారి, బ్రాండ్ విక్రయాలలో 60 శాతానికి పైగా వాటాను అందిస్తున్న స్కోడా కైలాక్ ఎస్‌యూవీని కొనేవారికి గుడ్ న్యూస్. సాధారణంగా బాగా అమ్ముడయ్యే మోడళ్లకు కంపెనీలు ఆఫర్లు ఇవ్వవు.. కానీ ఈ దీపావళి పండుగ సీజన్‌లో స్కోడా ఇండియా, కైలాక్ ఎస్‌యూవీపై ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది.

అదిరిపోయే కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్లు వచ్చేశాయ్

ఇండియాలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే, దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ (Kia Motors) తమ ప్రత్యేక స్థానం సంపాదించింది. కంపెనీ తక్కువ సమయంలోనే భారతీయ SUV, EV మార్కెట్లలో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రధాన ఆటోమొబైల్ బ్రాండ్లకు ధీటుగా ఎదుర్కొని నిలబడింది. వినియోగదారుల వద్ద తన ఉత్పత్తులను త్వరగా ఆహ్వానించుకోవడం, మార్కెట్‌లో వేగంగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న విజయాన్ని మరింత పెంచడానికి, కియా తన కారెన్స్ క్లావిస్ EV కోసం రెండు ప్రత్యేక వేరియంట్లను HDX E, HDX E (ER) ఇండియాలో ప్రవేశపెట్టింది. క్లావిస్ EV కొత్త వేరియంట్లు వినియోగదారుల కోసం సౌకర్యం, శక్తి, రేంజ్ పరంగా విభిన్న ఎంపికలను అందిస్తున్నాయి.

కారు రేంజ్ ధరతో కవాసకి బైక్

బైక్ రైడర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కవాసకి మోటార్స్ (ఇండియా) నుండి సరికొత్త MY26 Z900 మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ ప్రసిద్ధ Z-సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ మరింత దూకుడుగా ఉండే సుగోమి డిజైన్‌తో పాటు, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఈ బైక్‌లో పొందుపరిచారు.

విడుదలకు ముందే ఈ కారు కోసం ఎగబడ్డారు.. ఇప్పుడు లాంచ్

చెక్ ఆటోమేకర్ స్కోడా మళ్లీ మార్కెట్లో దుమ్ము రేపేలా తన సరికొత్త మోడల్‌ ఆక్టేవియా RS (Skoda Octavia Rs)‌ను ఆవిష్కరించింది. ఈ కారు ఆటోమొబైల్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. స్పోర్టీ డిజైన్, అధునాతన సాంకేతికత, ట్రాక్-బ్రెడ్ ఇంజనీరింగ్ ఈ మూడు అంశాల సమ్మేళనంగా ఈ కొత్త ఆక్టేవియా RS రూపొందించబడింది. దీనిని చూసినప్పుడే ఆకర్షణ కలిసిన ఒక స్పోర్ట్స్ మెషీన్ అనిపిస్తుంది. స్కోడా ఆక్టేవియా RS ధరను రూ.49.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధర ప్రకటించకముందే ఈ కారుమొదటి బ్యాచ్‌లోని 100 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. అంటే, ఈ మోడల్‌పై ఉన్న డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement

బస్సు మోడిఫికేషన్ అంత ప్రమాదమా ?

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒక మోడిఫై చేసిన ఏసీ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై, 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 19 మంది బస్సులోనే దగ్ధమయ్యారు. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

టాటా కార్లపై బంపర్ దీపావళి ఆఫర్

భారతీయ కార్ల ప్రియులకు, ఈ దీపావళికి సొంతంగా కారు కొనాలని కలలు కంటున్న వారికి టాటా మోటార్స్ (Tata Motors) ఒక శుభవార్త అందించింది. ఈ పండుగ సీజన్‌ను అద్భుతంగా చేసుకోవడానికి కంపెనీ 2025 అక్టోబర్‌లో తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సందర్భంగా వినియోగదారులు తమకు నచ్చిన టాటా కార్లపై ఏకంగా రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు, ప్రయోజనాలను పొందవచ్చు.

సేల్స్‌లో నంబర్ 1 కారు.. భారీగా కొనుగోలు చేస్తున్నారు

భారత ఆటోమొబైల్ రంగంలో తన ప్రత్యేక స్థానం సంపాదించిన టాటా మోటార్స్ (Tata Motors), మళ్లీ ఒకసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV టాటా నెక్సాన్ (Nexon) సిరీస్‌లో కొత్త మైలురాయిని చేరుకుంది. దేశంలో భద్రతకు కొత్త ప్రమాణాలు సృష్టించిన ఈ SUV, ఇప్పుడు మరింత ఆధునికతతో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) అనే అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. టాటా మోటార్స్ తెలిపిన ప్రకారం, నెక్సాన్‌లో జోడించబడిన ఈ ADAS టెక్నాలజీ డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా మారుస్తుంది. ఈ సిస్టమ్‌లో లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ అలర్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

మాగ్నైట్ కార్లలో సిఎన్‌జి కిట్ రిలీజ్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఖర్చును కూడా అదుపులో ఉంచుకునేందుకు చాలా మంది కస్టమర్‌లు ఇప్పుడు సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచే సీఎన్‌జీ మోడళ్లను అందిస్తున్నాయి.
Advertisement

ప్రీమియం లుక్‌లో టయోటా హైరైడర్ ఏరో ఎడిషన్

టయోటా భారత మార్కెట్లో తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌‌కు కొత్త చాప్టర్‌ను ప్రారంభించింది. సంస్థ తాజాగా హైరైడర్ ఏరో ఎడిషన్ (Hyryder Aero Edition) పేరుతో ఒక ప్రత్యేక మోడల్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్, సాధారణ హైరైడర్‌కి మరింత స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీలింగ్‌‌ను తీసుకురావడమే కాకుండా, టయోటా బ్రాండ్‌కి ఉన్న ఆదరణను మరింత బలపరుస్తుంది. టయోటా తెలిపినట్లుగా, హైరైడర్ ఏరో ఎడిషన్ రూపకల్పనలో ఆధునికత, ప్రత్యేకత, స్టైలింగ్ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. రోడ్డుపై SUV ఉనికిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ వేరియంట్‌ను డిజైన్ చేశారు. దీని ప్రతి లైన్, ప్రతి కోణం సొగసుతో నిండిపోయి, నగర జీవితానికి తగ్గట్టుగా స్టైలిష్ అర్బన్ SUV ఇమేజ్‌‌ను అందిస్తుంది.