నెలకు రూ.3 వేలతో 90Km మైలేజ్ ఇచ్చే బైక్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగల సీజన్ మొదలైంది. దసరా, దీపావళి వంటి సందర్భాల్లో కొత్త వాహనం కొనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది. చాలామంది ఈ పండుగ కాలాన్ని శుభారంభంగా భావించి, కొత్త బైక్ లేదా కారును కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా బైకులు, రోజువారీ అవసరాలకు, ఉద్యోగానికి వెళ్లడానికి, షాపింగ్‌కి, కుటుంబ అవసరాలకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. అందుకే, తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు అందించే బైకులకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఇలాంటి బైకుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది బజాజ్ ప్లాటినా (Bajaj Platina). ఇది సాధారణ ప్రజల మనసుల్లో విశ్వసనీయమైన పేరు. 2006లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్ ఇప్పటికి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయ్యేలోపే, తన స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంది.

రూ.2.9 కోట్ల విలువైన మెర్సిడెస్ G 450d లాంచ్

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ (Mercedes Benz) ఎప్పుడూ తన ప్రత్యేకమైన డిజైన్‌, ఇంజనీరింగ్‌, లగ్జరీ ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటూనే ఉంది. భారత మార్కెట్లో కూడా ఈ బ్రాండ్‌కి ఉన్న క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మెర్సిడెస్ మరో మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది, అదే మెర్సిడెస్ బెంజ్ జీ 450డీ (Mercedes-Benz G 450d), ఇది ప్రసిద్ధమైన G-Class సిరీస్‌లో తాజా డీజిల్ వేరియంట్‌గా నిలుస్తోంది. ఈ కొత్త SUV ధరను కంపెనీ రూ.2.9 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ప్రకటించింది. ధర ఎక్కువగానే ఉన్నా, దానికి తగ్గ లగ్జరీ, పవర్‌, టెక్నాలజీని ఈ కారు అందిస్తుంది. G-Class అంటేనే బలం, ప్రీమియం లుక్‌, ఆఫ్‌రోడ్ సామర్థ్యం కలిగిన SUV అని చెప్పొచ్చు.

ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. రూ.6 లక్షల్లో లభించే మారుతి సుజుకి బెస్ట్ మైలేజ్ కార్లు!

పండుగల సమయంలో చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఈ సారి పండుగలు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం GST రేట్లను సవరించగా, అది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో వాహన తయారీదారులు తమ కార్ల ధరలను భారీగా తగ్గించారు. ఈ నేపథ్యంలో కొత్తగా తక్కువ ధరలో తమకు నచ్చిన కారును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడానికి జనాలు ఈ మధ్య రోజుల్లో షోరూమ్‌లకు ఎగబడుతున్నారు. కస్టమర్లు మంచి మైలేజ్, పనితీరు, తక్కువ ధర, ఫీచర్స్ అందించే వాటిని ఎక్కువగా సొంత చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మారుతి సుజుకి కంపెనీకి చెందిన మంచి మైలేజ్, పెర్ఫామెన్స్, తక్కువ ధరలో లభించే కార్ల గురించి ఈ కథణంలో మీ కోసం ఇస్తున్నాము.

నెలకు రూ.13 వేలతో కొత్త బొలెరో కారు

భారతీయ SUV మార్కెట్లో ఎప్పటినుంచో తనదైన స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన మహీంద్రా బొలెరో SUV తాజాగా విడుదలైంది. ఈసారి కంపెనీ డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, అన్నింటిలోనూ గణనీయమైన మార్పులు చేసింది. బొలెరో అనగానే మనసుకు వచ్చే దృఢమైన బాడీ, మస్క్యులర్ లుక్, గ్రామీణ రోడ్లను కూడా సులభంగా జయించే పవర్, ఇవన్నీ కొనసాగుతూనే, కొత్త వెర్షన్‌లో ఆధునిక టచ్ జోడించబడింది. ఇప్పుడు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి బొలెరో ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇది రూ.7.99 లక్షల నుండి రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ SUV వేరియంట్ల వారీగా ఆన్-రోడ్ ధర, EMI గురించి ఇక్కడ ఈ కథనంలో అందించడం జరిగింది.
Advertisement

మహీంద్రాకు తిరుగులేని ఆయుధం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవల ప్రకటించిన త్రైమాసిక, సెప్టెంబర్ నెల అమ్మకాల నివేదికల్లో మహీంద్రా డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాల జోరులో మహీంద్రా పాత మోడల్ అయిన స్కార్పియో కారు అగ్రస్థానంలో నిలవడం విశేషం. స్కార్పియో కారు కోసం కస్టమర్‌లు 20 ఏళ్లుగా క్యూ కడుతున్నారని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

రాజ్‌కుమార్ రావ్ గ్యారేజీలో కొత్త LM 350H

సినీ తారల లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి చెప్పాలంటే, ఎప్పటికీ ఆకర్షణీయంగా ఉంటుంది. వారు ఎక్కువగా ఖరీదైన, ప్రీమియం, సొగసైన కార్లలో తిరగడానికి ఇష్టపడతారు. ఈ కార్లు కేవలం వాహనాలుగా మాత్రమే ఉండక, వారి వ్యక్తిత్వానికి, స్థాయి, బ్రాండ్ గుర్తింపుకు ప్రతీకలుగా మారతాయి. స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ SUVలు, లిమోసిన్లు ప్రతి మోడల్ ఒక ప్రత్యేక స్టోరీని చెప్పే విధంగా ఉంటాయి. మార్కెట్‌లో ఏ కొత్త మోడల్ రిలీజ్ అయినా, ప్రముఖులు వెంటనే దానిని పరిశీలించి, తమ గ్యారేజీలోకి తీసుకునే పరిణామం ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియా, ఫ్యాషన్ మ్యాగజైన్లు, యూట్యూబ్ వీడియోలు ద్వారా ఈ వివరాలు తక్షణం వైరల్ అవుతాయి. ప్రేక్షకులు, అభిమానులు, కార్ ప్రేమికులు ఈ కంటెంట్‌ను ఆసక్తిగా ఫాలో అవుతారు.

డీలర్‌షిప్‌లకు భారంగా మారుతున్న కార్లు

సెప్టెంబర్ 2025లో జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి రావడంతో కార్ల ధరలు తగ్గాయి. దీనివల్ల చాలా మోడళ్ల అమ్మకాలు అమాంతం పెరిగాయి. కానీ, దీనికి విరుద్ధంగా కొన్ని కార్ల మోడళ్లు మాత్రం కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. మారుతి సుజుకి, నిస్సాన్, సిట్రోయెన్, కియా వంటి పెద్ద కంపెనీలకు చెందిన ఐదు మోడళ్లను సెప్టెంబర్ నెలలో ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయలేదు. అంటే, ఈ కార్లు డీలర్లకు, కంపెనీలకు భారంగా మారుతున్నాయి. అమ్ముడుపోని ఆ ఐదు కార్ల వివరాలు వాటికి డిమాండ్ తగ్గడానికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం

అత్యధికంగా కొనుగోలు చేసిన మారుతి కారు ఇదే

ప్రతినెల చివరలో భారతీయ వాహన పరిశ్రమలో అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీదారులు తమ నెలవారీ అమ్మకాల గణాంకాలను వెల్లడిస్తుంటారు, దీనివల్ల మార్కెట్‌లో ట్రెండ్స్, వినియోగదారుల ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ నేపథ్యలో, దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన తన అమ్మకాల వివరాలను ప్రకటించింది. సేల్స్ రిపోర్ట్ ప్రకారం, సెప్టెంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం 1,32,821 కార్లను విక్రయించింది. అయితే, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన అమ్మకాలు 1,44,904 యూనిట్లతో పోలిస్తే, ఇది దాదాపు 8.38% తగ్గుదలగా ఉంది. అమ్మకాలలో ఈ తగ్గుదల కేవలం సంఖ్యలో మాత్రమే కాకుండా, మార్కెట్ వాటా పరంగా కూడా ప్రతిఫలించింది.
Advertisement

34 కి.మీ మైలేజ్.. 3.70 లక్షలు.. గతనెల సేల్స్ రిపోర్ట్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కారు మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto k10). చాలా ఏళ్లుగా ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న నమ్మకమైన, సరసమైన, ఆర్థికంగా లాభదాయకమైన కారుగా పేరు తెచ్చుకుంది. ఇది చూడటానికి చిన్న కారులా ఉన్నప్పటికి ఆకర్షణీయమైన డిజైన్, అవసరమైన అన్ని ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన మైలేజ్, ఇవన్నీ కలిపి ఆల్టో K10ను భారత రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. అయితే, గత కొన్నేళ్లుగా మారుతున్న మార్కెట్ ధోరణులు, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, SUV లకు పెరిగిన డిమాండ్ కారణంగా ఆల్టో K10 అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

కేవలం రూ.3.5 లక్షలకే కొత్త కార్

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, కొత్త కారు కొనాలని కలలు కనే మధ్యతరగతి వారికి మారుతి సుజుకి ఒక బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించడంతో, మారుతి సుజుకి తమ వాహనాల ధరలను భారీగా తగ్గించింది. ఈ తగ్గింపుల వలన మారుతి పాపులర్ మోడల్ అయిన ఎస్-ప్రెస్సో ధర మరింత అందుబాటులోకి వచ్చింది.

పెట్రోల్ కాదు, విద్యుత్ కాదు.. హైడ్రోజన్‌తో నడిచే బర్గ్‌మాన్ వస్తోంది!

ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ప్రతి బ్రాండ్‌ కూడా తమదైన కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తూ ఈ రంగంలో ఆధిపత్యం సాధించాలనే పోటీ పడుతున్నాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో, సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ EV టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి, భవిష్యత్‌లో ఇంధనంగా హైడ్రోజన్ (Hydrogen) వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్‌మాన్ (burgman) స్కూటర్‌ను ఎంపిక చేసింది. అంటే, పెట్రోల్‌పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్‌ను హైడ్రోజన్ ఫ్యూయల్‌తో నడిచే మోడల్‌గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్ దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
Advertisement

ప్రజల మన్ననలు పొందిన బాలెనో అమ్మకాలు కాస్త తగ్గాయ్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మారుతి సుజుకి (maruti Suzuki) సంస్థకు చెందిన బాలెనో (Baleno) కారు భారతీయ మార్కెట్లో ఎంతో ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. పరిచయం అవసరం లేని ఈ హ్యాచ్‌బ్యాక్ కారు, తన శైలి, పనితీరు, మైలేజ్‌, విశ్వసనీయతతో కోట్లాది మంది వినియోగదారుల మనసులను గెలుచుకుంది. సరసమైన ధరలో లభించడమే కాకుండా, దీనిలో లభించే ఫీచర్లు ప్రీమియం సెగ్మెంట్ కార్లకు ఏమాత్రం తీసిపోనివి. అంతేకాక, బాలెనో రీసేల్ విలువ కూడా మంచి స్థాయిలో ఉండటంతో చాలా మంది వినియోగదారులు దీన్ని మొదటి ఎంపికగా ఎంచుకుంటుంటారు. మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, అందమైన డిజైన్, ఇవన్నీ కలగలసి బాలెనోను మధ్యతరగతి కుటుంబాలకు ఒక కలల కారులా నిలబెట్టాయి.

ఎర్టిగా రాజభోగం పోయింది

2025 సెప్టెంబర్ నెల భారతీయ వాహన మార్కెట్‌కు అత్యంత అద్భుతమైన నెలగా నిలిచింది. పండుగ ఆఫర్లు, జీఎస్టీ ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ల కారణంగా చాలా కంపెనీల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో, 7-సీటర్ ఫ్యామిలీ కార్ల విభాగంలో ఒక ఊహించని మార్పు కనిపించింది. ఎన్నో నెలలుగా అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా MPV తన రాజపట్టాన్ని కోల్పోయింది. ఎర్టిగాను వెనక్కి నెట్టి మరీ, దాని బిగ్ డాడీ అయిన మహీంద్రా స్కార్పియో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10, 7-సీటర్ కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

ఆ కారు పై ఏకంగా రూ.88వేలు డిస్కౌంట్

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు, కొత్త వస్తువులు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా దీపావళికి కొత్త కారు ఇంటికి తీసుకురావాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారి కలలను నిజం చేసేందుకు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది.

అమ్మకాల్లో తుఫాన్ సృష్టిస్తున్న మారుతి

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి మరోసారి సంచలనం సృష్టించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలిచేందుకు, సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో విక్టోరిస్ అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే అమ్మకాలలో ప్రభంజనం సృష్టిస్తూ, పోటీ కంపెనీలకు గట్టి సవాలు విసురుతోంది. కేవలం రూ.10.50 లక్షల ప్రారంభ ధరతో, అత్యధికంగా 28.65 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తున్న ఈ కారు విశేషాలేంటో వివరంగా చూద్దాం.
Advertisement

సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టెస్లా

ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla), భారత మార్కెట్‌లో ఇటీవల తన అమ్మకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి మోడల్‌గా విడుదలైన టెస్లా మోడల్ వై (Model Y) కార్లకు సరైన ఆదరణ లభించకపోవడంతో, సంస్థ కేవలం డెలివరీలు ప్రారంభించిన ఒక్క నెలలోనే ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

టాటా కార్లకు ఊహించని డిమాండ్

భారత మార్కెట్‌లో కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ (Tata Motors) దూసుకుపోతోంది. గత 2025 సెప్టెంబర్ నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించిన సంస్థల జాబితాలో మారుతి సుజుకి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. పండుగ సీజన్, జీఎస్టీ రేట్ల మార్పు కారణంగా టాటా కార్లకు డిమాండ్ అమాంతం పెరిగింది.

చిన్న ఫ్యామిలీ కారుపై రూ.75వేల తగ్గింపు

మారుతి సుజుకి నుంచి వచ్చిన రిట్జ్ కారుకు మంచి బిల్డ్ క్వాలిటీ, ఇంజన్ ఉన్నా... అమ్మకాల విషయంలో పెద్దగా విజయం సాధించలేకపోయింది. 2016లో రిట్జ్ ఉత్పత్తి ఆగిపోయిన తర్వాత, దాని స్థానంలో వచ్చిన మోడల్ ఇగ్నిస్ మాత్రం యూస్డ్ కార్ల మార్కెట్‌లో రిట్జ్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు మారుతి కంపెనీ ఇగ్నిస్ అమ్మకాలు పెంచడానికి ఏకంగా రూ. 75,000 వరకు భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. దీంతో పాత రిట్జ్ కార్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ధరలు, ఆఫర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

దీపావళి సమయంలో వాహనాలను సేఫ్‌గా ఉండేందుకు టాప్ టిప్స్

దీపావళి పండుగ వస్తే, ప్రతీ ఇంటి వద్దే ప్రత్యేక ఉత్సాహం, సందడి వాతావరణం కనిపిస్తుంది. పెద్దవారూ, చిన్నవారూ వయసు తేడా లేకుండా రంగురంగుల బాంబులు, రాత్రిపూట వెలిగే ఫైర్‌వర్క్స్ తో పండుగ ఆనందంతో మునిగిపోతారు. అయితే, ఈ ఉత్సాహంలో పొరపాటున అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బాంబులు కాల్చుతున్న సమయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఎదురుకావచ్చు. దీపావళి సమయంలో వాహనాలను రక్షించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, బాంబులు, ఫైర్‌వర్క్స్ అనుకోకుండా వాహనాలకు చేరితే మంటలు అంటి, కార్లకు, బైక్‌లకు, ఇతర వాహనాలకు భారీ నష్టం కలిగించవచ్చు. కాబట్టి దీపావళి రోజు వాహనాల యజమానులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

హీరో స్ప్లెండర్ ప్లస్ vs హోండా షైన్ 100: మైలేజ్ ఎంత, ఏది బెస్ట్?

భారతదేశంలో తక్కువ ధరలో మంచి మైలేజ్, విశ్వసనీయ పనితీరు కలిగిన బైకుల కోసం వినియోగదారుల డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈ విభాగంలో 100cc బైకులు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా, హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus), హోండా షైన్ 100 (Honda Shine 100) రెండు అత్యంత ప్రసిద్ధ బైకులు. వీటి మైలేజ్ అత్యంత సౌకర్యవంతంగా ఉండటం, అన్ని రకాల రోడ్ల పరిస్థితుల్లోనూ నిరంతరం నమ్మకమైన పనితీరు ఇవ్వడం కారణంగా వీటి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంచబడింది. రాష్ట్రాల వారీ విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్ ద్వారా వీటిని అన్ని ప్రదేశాల్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే, సర్వీసింగ్ కూడా సమీప కేంద్రాల ద్వారా త్వరగా అందుతుంది, కాబట్టి నిత్యజీవితంలో ఉపయోగించే వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే.. కార్ మార్కెట్ షేక్

టాటా మోటార్స్(tata motors) భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెండవ అతిపెద్ద ఆటోమేకర్‌గా తిరిగి స్థిరమైన స్థానాన్ని పొందింది. ఈ స్థాయిని కొనసాగించడానికి, వినియోగదారులలో తన ప్రత్యేకతను మరింతగా నింపడానికి, కంపెనీ త్వరలో కొత్త SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో టాటా సియెర్రా ఒక అత్యంత ఐకానిక్ SUVగా నిలిచింది. రెండు దశాబ్దాల విరామం తర్వాత, ఈ SUV ఇప్పుడు కొత్త, శక్తివంతమైన రూపంలో మార్కెట్లోకి తిరిగి రాబోతుంది. 21వ శతాబ్దానికి అనుగుణంగా రూపుదిద్దబడిన ఈ కొత్త మోడల్, రివొల్యూషనరీ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, బలమైన ఇంజిన్ పనితీరు కలిగి, SUV విభాగంలో తన సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే, జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో, టాటా సియెర్రా కొత్త డిజైన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

మారుతి ఎర్టిగా సెప్టెంబర్ 2025 సేల్స్ రిపోర్ట్

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) భారతదేశంలో చిన్న కుటుంబాల కోసం రూపొందించిన అత్యంత ఆదరణ పొందిన MPVగా నిలిచింది. ఇది రెండు కుటుంబాల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేపట్టగల సామర్థ్యంతో, మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన కారుగా మారింది. అంతేకాక, ఈ కారులోని ఇంటీరియర్ సౌకర్యాలు, సీటింగ్, ఉపయోగకరమైన క్యాబ్ డిజైన్ దీన్ని లాంగ్ ప్రయాణాలకూ, నగరంలో రోజువారీ ఉపయోగానికి కూడా తగినదిగా నిలిపాయి. ప్రతి నెలా, ఎర్టిగా స్మార్ట్ MPV కావడంతో, ఇది వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే కాక, టాక్సీ వాహనాలుగా కూడా కొనుగోలు చేయబడుతుంది. ఏడు సీట్లు కలిగిన ఈ వాహనంలో ఒకేసారి ఎక్కువ మంది కలిసి ప్రయాణించవచ్చు. అందుకే దీనికి ఇతర MPVలతో పోలిస్తే ఎక్కువగా ప్రాధాన్యత పొందింది.

వ్యాగన్‌ ఆర్‌లా కనిపించే సుజుకి కొత్త ఈవీ కారు

మారుతి సుజుకి మాతృసంస్థ అయిన సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈసారి భారీ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 29 నుండి ప్రారంభమయ్యే జపాన్ మొబిలిటీ షోలో ఈ సంస్థ తన తాజా ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ ప్రదర్శనలో సుజుకి పలు కొత్త కాన్సెప్ట్ కార్లు, భవిష్యత్‌కి అనుగుణంగా రూపుదిద్దుకున్న మోడళ్లను ఆవిష్కరించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ షో కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది, దాంతో ఆటోమొబైల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సారి సుజుకి స్టాల్‌ వద్ద ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నది విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ కారు. ఇది సుజుకి అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కీలకమైన హ్యాచ్‌బ్యాక్‌గా భావించబడుతోంది. వాస్తవానికి, విజన్ ఇ-స్కై మోడల్‌ను చాలా మంది వ్యాగన్‌ఆర్ EVగా పిలుస్తున్నారు.
Advertisement

తక్కువ ధర కారును కొనడానికి ఇష్టపడట్లే! కారణం ఏమిటి?

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) దేశీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తనదైన ముద్ర వేసుకుంది. చిన్న SUVల విభాగంలో ఇది నమ్మదగిన మోడల్‌గా, ఆకర్షణీయమైన డిజైన్‌తో, బలమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. స్టైల్, సౌకర్యం, భద్రత, ఈ మూడు అంశాలతో ఎక్స్‌టర్ ప్రత్యేకత సాధించింది. కుటుంబ ప్రయాణాలకు అనువైన కాంపాక్ట్ SUVగా, ఇది సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల చాలామంది మధ్యతరగతి కొనుగోలుదారులు దీనిని ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎక్స్‌టర్ అమ్మకాలలో కొంత తగ్గువదల కనిపించింది.