ఈ టాటా చిన్న కారు సొంతం చేసుకోండి

టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల కాలంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో పంచ్ మైక్రో ఎస్యూవీని మార్కెట్లోకి రిలీజ్ చేయడం ఒకటి. ఈ కారు మార్కెట్లో ఉన్న నెక్సాన్ (Nexon) వంటి వాటిని కూడా దాటి, చాలా నెలల్లో కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మామూలు ఫ్యామిలీ కార్లు (మారుతి వాగన్‌ఆర్, స్విఫ్ట్ వంటివి) కొనాలని అనుకున్న చాలా మంది, పంచ్ రాకతో ఎస్‌యూవీ యజమానులుగా మారిపోయారు. దీనికి కారణం దీని ఒద్దికైన రూపం, అందుబాటులో ఉండే ధర, అత్యంత ముఖ్యమైన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.

పెట్రోల్ ధరలకే ఈవీ కార్లు! నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ప్రజలు ఇక సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఈవీలు తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణహితం, సైలెంట్ డ్రైవింగ్ అనుభవం వంటి ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు చాలా మందిని వెనుకడగ వేయించిన అంశం మాత్రం వీటి అధిక ధర.ఇలాంటి పరిస్థితుల్లో, తాజాగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన ఈవీ కొనుగోలు దారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్‌గా మారింది. రాబోయే కొద్ది నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల స్థాయికి చేరుతాయని వెల్లడించారు.

టెస్లా నుంచి చౌక కారు వచ్చేసింది

ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా. ఈ కార్లు కొనాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలనే అపవాద ఉంది. దీంతో తన ఉత్పత్తులను ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే టెస్లా కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ అయిన మోడల్ Y(Model Y)లో మోడల్ Y స్టాండర్డ్ అనే కొత్త, చౌకైన వేరియంట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది.

నవంబర్ 4న కొత్త వెన్యూ రాబోతుంది

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో హ్యుందాయ్ వెన్యూ ఒకటి. 2019లో విడుదలైన హుంద్యాయ్ వెన్యూ, 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఒక చిన్న ఎస్యూవీ. ఈ కారు కొత్త మోడల్ విడుదల తేదీ బయటపడింది. ఆటోకార్ ఇండియా వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. కొత్త మోడల్ హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న రిలీజ్ కానుంది.
Advertisement

మధ్యతరగతి ఫేవరెట్ కారు ఇగ్నిస్‌కి భారీ ధర తగ్గింపు

మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) మధ్యతరగతి కుటుంబాలకు అనువైన, అందుబాటులో ఉండే, ఆకర్షణీయమైన కారు. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ భారతీయ రోడ్ల పరిస్థితులకు సరిపోయేలా రూపొందించబడింది. చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ, దీని డిజైన్, ప్రదర్శన, ఫీచర్లు అన్నీ పెద్ద కార్లను తలపించేలా ఉంటాయి. ముఖ్యంగా నగరాల్లో తరచుగా డ్రైవ్ చేసే వారికి ఇది ఒక సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల వస్తువులు, సేవల పన్ను(GST) రేట్లను ప్రభుత్వం సవరించిన తర్వాత ఈ కార్ ధరల్లో గణనీయమైన మార్పు వచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త GST రేట్లు అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ మార్పుతో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.71,300 వరకు భారీగా ధర తగ్గింది. అంటే, ఇప్పుడు ఇదే కారును ముందంటే కంటే మరింత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

మళ్లీ అదరగొట్టింది.. స్కార్పియో అమ్మకాలతో మార్కెట్ షేక్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) అనే పేరు వినగానే ఒక రగ్డ్ SUV, శక్తివంతమైన ఇంజిన్, క్లాస్ లుక్ గుర్తుకొస్తాయి. ఈ SUV కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తన ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. స్కార్పియో అంటే పవరుతో పాటు ప్రెస్టీజ్ కూడా, అందుకే దీనికి అభిమానులు ప్రతి తరగతిలోనూ ఉన్నారు. సెప్టెంబర్ 2025లో మహీంద్రా స్కార్పియో మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని రుజువు చేసింది. ఈ నెలలో మొత్తం 18,372 యూనిట్లు కొనుగోలుదారులకు డెలివరీ అయ్యాయి. ఇది కేవలం ఒక సంఖ్య కాదు , ఇది స్కార్పియో పెరుగుతున్న ప్రజాదరణకు, వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. స్కార్పియో అమ్మకాలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

9 రోజుల్లో 2500 కార్లు అమ్మిన బెంజ్ కంపెనీ

భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సంస్థ అద్భుతమైన అమ్మకాలతో రికార్డ్ క్రియేట్ చేసింది. గత సెప్టెంబర్ నెలలో కంపెనీ ఏకంగా 36 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 పన్నుల మార్పు తర్వాత ఈ వృద్ధి మరింత వేగం పుంజుకుంది. పండుగల సీజన్ (నవరాత్రి) సమయంలోనే జీఎస్‌టీ తగ్గింపు అమల్లోకి రావడంతో, మెర్సిడెస్ అమ్మకాలకు బాగా కలిసొచ్చింది.

ఐదు లక్షల స్కూటర్లు.. ఏథర్ ఎనర్జీ దూసుకుపోతోంది!

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ (Ather Energy Limited) మరోసారి తన సత్తా చాటుకుంది. సాంకేతికత, నాణ్యత, సస్టైనబిలిటీని ఒకే సారి సమతుల్యం చేస్తూ భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఏథర్ తనదైన స్థాయిని ఏర్పరుచుకుంది. తాజాగా కంపెనీ తన ప్రయాణంలో ఒక అత్యంత అరుదైన ఘనతను సాధించింది. తమిళనాడులోని హోసూర్ (Hosur) ఉత్పత్తి కేంద్రం నుండి ఏథర్ తన 5,00,000వ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసి విడుదల చేసింది. ఈ యూనిట్ కంపెనీకి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. కేవలం కొన్నేళ్లలోనే అర్ధ మిలియన్ వాహనాల ఉత్పత్తి అంటే అది ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అథర్ సాధించిన వేగం, దాని మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
Advertisement

క్రెటాకు చెక్ పెట్టేందుకు నిస్సాన్ మాస్టర్ ప్లాన్

ఇండియన్ మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా వెనుకబడిన నిస్సాన్ మోటార్ ఇండియా ఇప్పుడు సరికొత్త ఎస్యూవీతో గట్టిగా రీఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతుంది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సి-సెగ్మెంట్లోని ఫైవ్ సీటర్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) ను నేడు (అక్టోబర్ 7, 2025) అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ప్లాన్ చేసిన మూడు కొత్త మోడళ్లలో ఈ టెక్టాన్ కూడా ఒక భాగం. దీని ద్వారా నిస్సాన్ దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది.

టాటా పంచ్ మళ్లీ సత్తా చాటింది.. సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు!

టాటా మోటార్స్ (Tata Motors) ఎప్పటినుంచో భారత ఆటోమొబైల్ రంగంలో భద్రత, నాణ్యత, విశ్వసనీయత అనే మూడు ప్రధాన అంశాలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే ప్రతి వాహనం మంచి సేఫ్టీ రేటింగ్‌లు, బలమైన నిర్మాణం, ఆధునాతన టెక్నాలజీతో వినియోగదారుల మనసులను గెలుచుకుంటుంది. అలాంటి వాహనాల్లో ఒకటి టాటా పంచ్ (Tata Punch). టాటా పంచ్ భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి చిన్న SUV సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఇది మైక్రో SUVగా పిలవబడుతున్నప్పటికీ, దీని లుక్స్‌, గ్రౌండ్ క్లియరెన్స్‌, ఫీచర్లు పెద్ద SUVలకు ఏమాత్రం తగ్గవు. తాజాగా విడుదలైన సెప్టెంబర్ 2025 నెల సేల్స్ గణాంకాలు చూస్తే, టాటా పంచ్ విజయ గాధ కొనసాగుతున్నదని స్పష్టమవుతుంది.

మరో బాంబ్ వేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ బాంబులు ఆగడం లేదు. దీపావళి బాణసంచా మాదిరిగా ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటి టారిఫ్ బాంబులను పేలుస్తున్నారు. అమెరికా ఫస్ట్ అని వాదిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఇంకో కొత్త టారిఫ్‌లను ప్రకటించారు. నవంబర్ 1 నుండి అన్ని దిగుమతి చేసుకున్న ట్రక్కులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. విదేశీ పోటీ నుండి అమెరికాను రక్షించడానికి తాను ఈ టారిఫ్‌ను విధిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

భారత మార్కెట్లో కియా బంపర్ పెర్ఫార్మెన్స్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు కియా (Kia Motors) చాలా తక్కువ కాలంలోనే భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసింది. 2019లో మొదటిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ప్రజల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం కియా భారతీయ ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. కియా ప్రారంభంలో సేల్టోస్ SUVతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ మోడల్‌కు లభించిన విపరీతమైన ఆదరణతో కంపెనీకి మంచి బూస్ట్ లభించింది. తర్వాత సోనెట్, కేరెన్స్, EV6 వంటి వాహనాలను పరిచయం చేస్తూ విభిన్న సెగ్మెంట్లలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది.
Advertisement

చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఓలా

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఈవీల తయారీలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఒక చారిత్రక ఘనతను సాధించింది. ఈవీ మోటార్లలో తప్పనిసరిగా ఉపయోగించే రేర్ ఎర్త్ మాగ్నెట్లు లేకుండానే తయారు చేసిన ఫెర్రైట్ మోటార్‌‎కు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఈవీ తయారీలో చైనా ఆధిపత్యం తగ్గుతుందని తద్వారా భారత్ ఈ రంగంలో సాధికారత సాధిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఆవిష్కరణ రాబోయే రోజుల్లో ఈవీ ఇండస్ట్రీకి పెద్ద ఊతం ఇస్తుంది.

కొత్త లుక్‌లో మహీంద్రా పవర్ హౌస్

ఇండియాలోని అత్యంత ఐకానిక్ వెహికల్స్‎లో ఒకటైన మహీంద్రా బొలెరో సిరీస్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవల కొత్త 2025 థార్ రిలీజ్ అయిన వెంటనే మహీంద్రా సంస్థ బోలెరో, బోలెరో నియో మోడళ్లకు కూడా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్స్ తీసుకొచ్చింది. ఈ రెండు ఎస్యూవీలు చాలా కాలంగా ఒకే లుక్‌లో ఉన్నప్పటికీ, ప్రజలకు వాటి డిజైన్ ఇప్పటికీ నచ్చడం విశేషం. అయితే, మార్కెట్లో పోటీ పెరగడంతో ఈ వర్క్‌హోర్స్‌ మోడళ్లకు కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్ ఇవ్వడం ద్వారా అమ్మకాలకు బలాన్ని పెంచాలని కంపెనీ నిర్ణయించింది.

కొత్త TVS Raider డ్యూయల్ డిస్క్ మోడల్ లాంచ్

దేశీయ టూ-వీలర్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరుపొందిన టీవీఎస్ మోటార్ (Tvs Motor) కంపెనీ మరోసారి తన కొత్త ఆవిష్కరణతో బైక్ ప్రేమికులను ఆకట్టుకుంది. ఈసారి కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన TVS Raider మోడల్‌ను కొత్త రూపంలో, మరింత భద్రతతో, ఆధునిక ఫీచర్లతో అందించింది. తాజాగా కంపెనీ భారత మార్కెట్లోకి TVS Raider Dual Disc Brake (టీవీఎస్ రైడర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్) వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ డిజైన్ పరంగా, పనితీరు పరంగా, సేఫ్టీ పరంగా ఒక అడుగు ముందుకేసినట్లుగా చెప్పుకోవచ్చు. యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ మోడల్ రైడింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చే విధంగా టీవీఎస్ ఇంజినీర్లు పలు మార్పులు చేశారు.

టాప్ 5 కార్లలో రెండవ స్థానంలో మారుతి సుజుకి డిజైర్

ప్రతినెల చివరలో, భారతదేశంలోని కార్ల మార్కెట్ నుంచి సేల్స్ వివరాలు విడుదల అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరిగా మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తమ అమ్మకాల గణాంకాలను సమగ్రంగా వెల్లడించింది. ప్రత్యేకంగా, దేశీయంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సెడాన్ మోడల్ డిజైర్ (Dzire) మరోసారి వినియోగదారుల మన్ననను పొందింది. డిజైర్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే కాకుండా, వినియోగదారులకు అవసరమైన పలు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. అలాగే, ధర పరంగా కూడా ఇది సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తుంది. సెప్టెంబర్ 2025లో ఈ మోడల్ సుమారు 20,038 యూనిట్లు విక్రయించబడింది. దీని ఫలితంగా, దేశీయంగా అత్యధికంగా అమ్ముడైన కార్లలో డిజైర్ రెండవ స్థానంలో నిలిచింది.
Advertisement

అమ్మకాల్లో ఆటోమొబైల్ కంపెనీల రికార్డు

భారతదేశంలో వెహికల్ సేల్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 22 నుండి జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి రావడం, నవరాత్రి పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వాహనాల కొనుగోళ్లు అకస్మాత్తుగా పెరిగాయి. ఈ జోరు అక్టోబర్‌లో మరింత పెరిగి, వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కావచ్చని సిటీ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2025 లో ప్యాసింజర్ వెహికల్స్, టూ వీలర్ సేల్స్‎లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణం పండుగ డిమాండ్, జీఎస్టీ రేట్ల తగ్గింపు.

మహీంద్రా బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్ ధర, ఫీచర్లు

మహీంద్రా బొలెరో నియో ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో విడుదలైంది, దీని ధర ₹9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. నవీకరించబడిన స్టైలింగ్, సాంకేతికత మరియు సౌకర్యంతో, ఇది 7-సీటర్ SUV.

బొలేరో నయా మోడల్ వచ్చేసింది

The Mahindra Bolero B8 2025 is launched in India with updated features, design, and reliable performance. It is suitable for families and travel. | మహీంద్రా బొలెరో B8 2025 నవీకరించబడిన ఫీచర్లు, డిజైన్ మరియు నమ్మదగిన పనితీరుతో భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది కుటుంబాలకు మరియు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

ఇక ఫాస్ట్‌ట్యాగ్ లేని వారికి నో టెన్షన్

కారు ఉన్నవారందరికీ ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనేది సుపరిచితమైన పదం. వాహనం ముందు అద్దంపై అతికించి ఉండే ఈ సిస్టమ్ టోల్ ప్లాజా లావాదేవీల ప్రక్రియలను సులభతరం చేయడానికి, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడానికి అమలు చేశారు. అయితే, కొత్తగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్ వసూలు చేసే విధానంలో మార్పులు చేసింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
Advertisement

నెలకు రూ.9 వేలకే 6-సీటర్ కారు.. 27 కి.మీ మైలేజ్

భారత మార్కెట్లో ఫ్యామిలీ కార్ల విభాగంలో మారుతి సుజుకి ఎప్పటి నుంచో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి ఈకో (Maruri Suzuki Eeco). ఇప్పుడు ఈ MPV మోడల్ మళ్లీ చర్చలోకి వచ్చింది. కారణం ప్రభుత్వ కొత్త GST పన్ను రేట్ల సవరణ. ఈ మార్పు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రావడంతో, ఈకో ధరలు గణనీయంగా తగ్గాయి. తాజా వివరాల ప్రకారం, మారుతి సుజుకి ఈకోపై వినియోగదారులకు గరిష్టంగా రూ.68,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే, ఇది ఇప్పటికే అత్యంత విలువైన, అందుబాటులో ఉన్న మల్టీపర్పస్ వెహికిల్ (MPV)గా ఉన్న ఈకోను ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ధరలో పొందవచ్చు. GST తగ్గింపు తర్వాత ఈకో ధర రూ.5.21 లక్షల నుండి ప్రారంభమై, రూ.6.36 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.

టైర్ల మీద ఇంగ్లీష్ అక్షరాలకు అర్థం ఏంటి ?

సాధారణంగా మనం కొత్త కారు లేదా బైక్ కొనేటప్పుడు ఇంజిన్, మైలేజ్, డిజైన్, ఫీచర్ల మీద మాత్రమే దృష్టి పెడతాం. కానీ, చాలా మంది పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదే టైర్. టైర్ కేవలం బండిని రోడ్డు మీద నిలబెట్టడానికి మాత్రమే కాదు.. మీ కారు సేఫ్టీ, పర్ఫామెన్స్ రెండింటికీ ఇవే బాధ్యత వహిస్తాయి.

ట్రక్కులో బిజినెస్ క్లాస్ సీటు! ఇది సాధారణ సీటు కాదు

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లారీ డ్రైవర్ వీడియో తెగ వైరల్ అవుతోంది. కారణం, అతను తన లారీకి లక్ష రూపాయల ఖరీదైన ఎయిర్ సస్పెన్షన్ సీటును అమర్చుకున్నాడు. సాధారణంగా లారీ డ్రైవర్‌ల జీవితం కష్టసాధ్యం. గంటల తరబడి డ్రైవింగ్, గందరగోళమైన రోడ్లు, శారీరక ఒత్తిడి ఇవన్నీ వారి జీవితంలో సాధారణం. కానీ జార్ఖండ్‌కు చెందిన రాజేష్ రవణి అనే లారీ డ్రైవర్ మాత్రం ఈ దినచర్యకు కొత్త అర్ధం ఇచ్చాడు. రాజేష్ రవణి వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అయినా, అతని ఆలోచన మాత్రం భిన్నంగా ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూనే ఆయన తన ప్రయాణాన్ని, అనుభవాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, డ్రైవర్ జీవితంలోని అసలు వాస్తవాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. ఈ వీడియోలు ఆయనకు మంచి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.

అమ్మకాల్లో దుమ్ములేపిన హోండా

జపాన్ దేశానికి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా 2-వీలర్స్ (Honda 2-Wheelers) ఇండియన్ మార్కెట్‌లో తమ హవాను కొనసాగిస్తోంది. గత సెప్టెంబర్ నెలలో కంపెనీ దేశంలో, విదేశాలకు కలిపి మొత్తం 5,68,164 టూ వీలర్లను అమ్మింది. ఈ అమ్మకాలు 2024 సెప్టెంబర్ నెలలో నమోదైన 5,38,852 యూనిట్ల కంటే 5.44% ఎక్కువ కావడం విశేషం. నెలవారీ అమ్మకాల విషయంలో చూసినా ఆగస్టు 2025తో పోలిస్తే సెప్టెంబర్‌లో 6.23% వృద్ధిని సాధించింది.
Advertisement

భారత్‌లో ఎలక్ట్రిక్ బూమ్.. 1 మిలియన్ మార్క్ క్రాస్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు మరింత ఆర్థికమైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్, బివైడి వంటి దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తమ స్థానాన్ని బలపరుచుకున్నాయి. ఈ కంపెనీలు కొత్త మోడళ్లను, మెరుగైన రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయి. టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG ZS EV, బివైడి సీల్, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి మోడళ్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.