కొత్త ఎలక్ట్రిక్ కారును పరీక్షిస్తున్నారా.. రూ.5 లక్షలకే అమ్మకానికి?

రెనాల్ట్ భారత మార్కెట్లో తన నమ్మకాన్ని మళ్లీ నిరూపిస్తోంది. దేశీయంగా ఇప్పటికే క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. పర్యావరణహిత వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, రెనాల్ట్ తన మొదటి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలో ఇప్పటికే డాసియా స్ప్రింగ్ EV పేరుతో అమ్ముడవుతున్న ఈ కారు, భారత మార్కెట్లో క్విడ్ ఈవీ (Kwid Ev) గా రాబోతోందని సమాచారం. ఇటీవల ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ రోడ్డు పరీక్షల సమయంలో కెమెరాలో చిక్కుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్.. ఇంత తక్కువ ధరలోనా?

హీరో స్ప్లెండర్ (Hero Splendor) పేరు వింటేనే మనసుకు వచ్చే నమ్మకం, సౌకర్యం, సరసమైన ధర అనే మూడు మాటలు. భారతదేశంలోని ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో ఈ బైక్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు; లక్షలాది కుటుంబాల జీవన భాగస్వామి. దశబ్దకాల క్రితం మార్కెట్లోకి అడుగు పెట్టిన హీరో స్ప్లెండర్ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాదరణలో ఏ మాత్రం తగ్గలేదు. పట్టణాల్లో ఇది ఆఫీస్ ఉద్యోగుల దినచర్యలో భాగమైపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ ఫుడ్ డెలివరీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు వంటి అనేక వర్గాల ప్రజల జీవితాల్లో ముఖ్యమైన సాధనంగా మారింది.

పండుగ సీజన్ కలయికతో సుజుకి సేల్ బాంబ్ పేలింది!

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) ఇప్పుడు దేశంలోని అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీదారులలో ఒకటిగా ఎదిగింది. ఈ బ్రాండ్ స్కూటర్లు, బైక్‌ల విభాగంలో తమకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను, నాణ్యమైన ఇంజినీరింగ్‌ను, విశ్వసనీయమైన పనితీరును అందించడం వల్ల వినియోగదారులు సుజుకిపై నమ్మకం పెంచుకున్నారు. ఇటీవలి సెప్టెంబర్‌ నెలలో కూడా ఈ నమ్మకం మరోసారి సుజుకి అమ్మకాల రూపంలో బయటపడింది. కంపెనీ ఈ నెలలో మొత్తం 1,23,550 టూవీలర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 99,185 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాలు సుమారు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది సుజుకి కోసం ఒక గణనీయమైన విజయంగా చెప్పుకోవచ్చు.

కొత్త వాహనానికి ముందు టైరు కింద నిమ్మకాయ ఎందుకు ఉంచుతారో తెలుసా?

కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు టైర్ల కింద నిమ్మకాయలను ఉంచి తొక్కించడం, ఇది మన భారతీయ సంస్కృతిలో ఎంత సాధారణంగా కనిపించే ఆచారమో అందరికీ తెలుసు. కానీ ఈ అలవాటుకు ఉన్న మూలం, దాని వెనుక దాగి ఉన్న భావం చాలామందికి తెలియదు. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు; ఇది శాస్త్రం, విశ్వాసం, జ్యోతిష్యం కలిసిన ఆధ్యాత్మిక ఆచారం. పురాతన కాలం నుంచే భారతీయులు కొత్త ప్రారంభం అంటే దానిలో దేవతా అనుగ్రహం ఉండాలని నమ్మారు. కొత్తగా బైక్, కారు లేదా ఏ వాహనాన్నైనా కొనుగోలు చేసినప్పుడు, దాన్ని మొదటిసారి నడిపే ముందు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి తొక్కించడం ఆ విశ్వాసానికి ప్రతీక. ఇది దురదృష్టాన్ని తొలగించి, ఆ వాహనానికి శుభఫలితాలు కలగాలని ఆకాంక్షించే ఒక పద్ధతి.
Advertisement

భారత SUV మార్కెట్లో నెక్సాన్ దుమ్మురేపుతోంది

భారతీయులకు సేఫ్టీ అనే పదం వినగానే, టాటా మోటార్స్ (Tata Motors) పేరు వెంటనే గుర్తుకు వస్తుంది. ఈ కంపెనీ చాలా కాలంగా నాణ్యత, భద్రత, వినియోగదారుల నమ్మకాన్ని కేంద్రంగా ఉంచుతూ వాహనాలను తయారు చేస్తోంది. టాటా లైనప్‌లో ఏ మోడల్ అత్యంత ప్రజాదరణ పొందిందని అడిగితే, చాలామంది నెక్సాన్ (Nexon)ని సూచిస్తారు. ఇది కాంపాక్ట్ SUV విభాగంలో ఒక విప్లవాత్మక పరిష్కారంగా నిలిచింది. నెక్సాన్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. మొదట, కంపెనీ ఈ SUVని సమయానికి అప్‌డేట్ చేస్తూ, వినియోగదారుల అవసరాలను అనుసరించి వేరియంట్‌లను అందించడం, సరసమైన ధర, డీజిల్ ఇంజిన్ ఆప్షన్, ఆధునిక భద్రతా సౌకర్యాలు అందించడం వలన ఇది చాలా ప్రత్యేకంగా మారింది.

33 kmpl మైలేజ్‌తో దుమ్మురేపుతున్న మారుతి కార్లు ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 22, 2025 నుండి ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. అదే సవరించిన వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు అమలులోకి రావడం. ఈ మార్పు వాహనాల ధరలపై నేరుగా ప్రభావం చూపింది, ముఖ్యంగా చిన్న ఇంజిన్‌ కార్ల విభాగంలో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. మునుపటివరకు, 1200cc వరకు పెట్రోల్, LPG, CNG, డీజిల్ ఇంజిన్‌లు కలిగిన కార్లపై 28% GST రేటు విధించబడేది. అయితే, కొత్త సవరణ ప్రకారం ఈ రేటును 18%కి తగ్గించారు. ఈ పన్ను తగ్గింపుతో ఆటోమొబైల్ కంపెనీలు భారీగా లాభపడ్డాయి. కానీ, ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే ఈ లాభాన్ని వారు పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేశారు. అంటే, కొత్త GST రేట్లు అమలులోకి వచ్చిన వెంటనే మార్కెట్లో చాలా కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి.

బెస్ట్ 7సీటర్ డీజిల్ ఎస్యూవీలు ఇవే

ఫ్యామిలీతో లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించాలని అనుకుంటే ఒక 7-సీటర్ వెహికల్ చేతిలో ఉంటే ఇంకేమీ ఆలోచించాల్సిన పనిలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రాక్టికాలిటీ, మైలేజ్, లేటెస్ట్ ఫీచర్లను సరసమైన ధరలో అందించే అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైన పని.

సండే కూడా కార్లు తయారు చేస్తున్న మారుతి

మారుతి సుజుకి కంపెనీకి జీఎస్‌టీ తగ్గించిన తర్వాత ఆర్డర్లు భారీగా పెరిగాయి. వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆర్డర్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ పెరిగిన డిమాండ్‌ను అందుకోవడానికి, ఎక్కువ సంఖ్యలో కార్లను ఉత్పత్తి చేయడానికి కంపెనీ ఇప్పుడు ఆదివారం కూడా సెలవు లేకుండా వాహనాలను తయారు చేస్తోంది.
Advertisement

స్టేటస్ సింబల్‎గా మారిన బైక్

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ బైక్‌లకు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ కస్టమర్ బేస్ ఉంది. అందుకే ప్రతినెలా రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, భారతదేశంలో జీఎస్‌టీ తగ్గడం, రెండోది, పండుగ సీజన్ కావడం. ఈ విజయం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

చారిత్రక ఘనత సాధించిన మారుతి సుజుకి

భారత వాహన మార్కెట్‌లో అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేసిన సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki). దేశ ప్రజల అవసరాలను, అభిరుచులను తెలుసుకుని సరైన రీతిలో పనిచేసే మరో బ్రాండ్ ఉందా అనిపించేలా మారుతి సుజుకి పని చేస్తోంది. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. కశ్మీర్ లోయకు రైలు మార్గం ద్వారా వాహనాలను చేరవేసిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి తన పేరును లిఖించుకుంది. హర్యానాలోని మనేసర్ ప్లాంట్ రైల్వే సైడింగ్ నుండి జమ్మూ కశ్మీర్‌లోని కొత్తగా ప్రారంభించిన అనంత్‌నాగ్ రైల్వే టెర్మినల్‌కు ఈ కార్లు రైలులో చేరుకున్నాయి.

మారుతి, టాటా గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన క్రెటా

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. ఇది మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి వస్తుంది. తాజాగా, సెప్టెంబర్ 2025 నెలవారీ అమ్మకాల నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం.. హ్యుందాయ్ క్రెటా అమ్మకాలలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కేవలం 30 రోజుల్లోనే వేల సంఖ్యలో యూనిట్లను విక్రయించి, మారుతి, టాటా వంటి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలకు సవాలు విసిరింది. క్రెటా సాధించిన ఈ అద్భుతమైన అమ్మకాల వివరాలను, మార్కెట్‌లో దాని స్థానాన్ని, పోటీని, భవిష్యత్తు ప్రణాళికలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.

6 నెలల్లో 2.47 లక్షల ట్రాక్టర్లు

జీఎస్‌టీ తగ్గింపు ఎవరికి లాభం తెచ్చిందో లేదో కానీ, మహీంద్రా గ్రూప్‎లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సంస్థకు మాత్రం లాభాల పంట పండుతోంది. ముఖ్యంగా దాని వ్యవసాయ పరికరాల వ్యాపార విభాగం సెప్టెంబర్ 2025లో జరిగిన ట్రాక్టర్ల అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాల్లో అనూహ్యమైన వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు డబుల్ అయ్యాయి. ఈ అద్భుతమైన వృద్ధికి గల కారణాలను, దాని పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
Advertisement

ఇదే క్రేజ్ గురూ.. 30 రోజుల్లో 6.8 లక్షల మంది కొన్నారు

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా పేరొందిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన శక్తిని మరోసారి చాటుకుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెలలోనే హీరో మొత్తం 6.87 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య గడచిన ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 6.37 లక్షల యూనిట్లతో పోలిస్తే దాదాపు 7.88 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒకే నెలలో 6 లక్షలకు పైగా వాహనాలు విక్రయించడం చిన్న విషయం కాదు. ఇది హీరో బ్రాండ్‌కి మార్కెట్లో ఉన్న విశ్వసనీయత, వినియోగదారుల నమ్మకం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో ఉన్న భీకరమైన పోటీని దాటుకుని ఇంత పెద్ద సంఖ్యలో అమ్మకాలు సాధించడం హీరోకి ప్రత్యేకమైన విజయంగా చెప్పుకోవాలి.

సిట్రోయెన్ ఇండియా కొత్త ఎయిర్‌క్రాస్ X SUV విడుదల

సిట్రోయెన్ (citroen) కొత్త కారుతో మళ్లీ భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించింది. తాజాగా విడుదలైన ఎయిర్‌క్రాస్ X (Aircross X) అనే కారును విడుదల చేసింది. ఇది ఆధునిక భారతీయ కుటుంబాల కోసం తయారు చేయబడింది. డిజైన్‌లో నూతనత, సౌకర్యంలో ఆధునికత, టెక్నాలజీలో ఆవిష్కరణలు అన్నింటినీ కలిపి ఈ కారు వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ కొత్త ఎయిర్‌క్రాస్ X యొక్క ముఖ్య విశేషం దాని పొడవైన వీల్‌బేస్, దీని వల్ల ఇంటీరియర్ మరింత విస్తృతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా, విశాలమైన షోల్డర్ రూమ్ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ మోడల్‌ను 7-సీటర్, 5-సీటర్ లేఅవుట్‌లలో అందుబాటులోకి తెచ్చారు.

మహీంద్రా థార్ 2025: ధర, ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌లు

Mahindra Thar 3-Door Facelift (2025) విడుదలైంది. డిజైన్, ఫీచర్లు మరియు ధర వివరాలు తెలుసుకోండి. ప్రారంభ ధర ₹12 లక్షలు. | మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ (2025) విడుదలైంది. డిజైన్, ఫీచర్లు మరియు ధర వివరాలు తెలుసుకోండి. ప్రారంభ ధర ₹12 లక్షలు.

రూ.30లక్షల బైక్‌కు భారీ డిమాండ్

భారతదేశంలో బైకుల సంస్కృతి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ప్రజలు ఏ రకం బైక్‌లకైనా, ఎంత ఖరీదైనవైనా సరే, వాటిని కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ధరతో సంబంధం లేకుండా, ప్రజలు తమకు నచ్చిన వాహనాలను హాట్ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ, హోండా కంపెనీ తన సరికొత్త సూపర్ బైక్ 2025 CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP (2025 CBR1000RR-R Fireblade SP) డెలివరీలను ప్రారంభించడం.
Advertisement

మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ SUV లాంచ్

దేశీయ ప్రముఖ కార్ల కంపెనీ మహీంద్రా (Mahindra) తన సత్తాను చాటడానికి కొత్తగా 2025 అప్‌డేటెడ్ థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Thar 3 Door Facelift) SUV, భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఆఫ్-రోడ్ SUV సెగ్మెంట్‌లో ఇది వినియోగదారుల ముందుంచి నిలిచేలా డిజైన్, ఫీచర్లలో అనేక మార్పులను పొందింది. ఎక్స్‌టీరియర్ రూపకల్పన కొత్తతనం, స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మార్చబడింది, అలాగే ఇంటీరియర్‌లోని అప్‌డేట్స్ కూడా ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రీమియం లుక్‌తో మార్చాయి. కొత్త మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుండి రూ.16.25 లక్షల వరకు ఉంటుంది.

ఓలాకు టీవీఎస్ భారీ ఝలక్

ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయాల్లో ఓలా కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత సెప్టెంబర్ నెల విక్రయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో తిరుగులేని రాజుగా వెలుగొందిన ఓలాను వెనక్కి నెట్టి, టీవీఎస్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. అంతేకాదు, తొలిసారిగా ఏథర్ కంపెనీ ఓలాను అధిగమించి 3వ స్థానానికి చేరుకుంది. ఈ పరిణామం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో కీలక మార్పులకు సంకేతం.

ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టిన రివర్ ఇండి జెన్ 3

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్‌లో ఈవీలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణహితం వంటి అంశాలు వినియోగదారులను ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మరింత ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ రివర్ (River) తన అప్‌డేటెడ్ తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండి జెన్ 3 (Indie Gen 3) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెంగళూరులో రూ.1.46 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయిన ఈ కొత్త మోడల్, డిజైన్ పరంగా ఆధునికంగా ఉండటంతో పాటు, టెక్నాలజీ పరంగా కూడా ఎన్నో కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

కంపెనీ కార్లను 90 రోజుల్లో 17,161 మంది కొన్నారు

స్కోడా ఇండియా (Skoda India) తాజాగా విడుదల చేసిన అమ్మకాల గణాంకాలు కంపెనీకి శుభసూచకంగా నిలిచాయి. సెప్టెంబర్ నెలలోనే సంస్థ మొత్తం 6,636 వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరపు సెప్టెంబర్ 2021లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే దాదాపు రెట్టింపు వృద్ధి సాధించింది. అప్పుడు కేవలం 3,282 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఈసారి 101 శాతం పెరుగుదలతో స్కోడా అమ్మకాలలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, మూడునెలల వ్యవధిలోనే కంపెనీ 17,161 వాహనాలను విక్రయించడం గమనార్హం. ఈ విజయానికి ప్రధాన కారణం స్కోడా ఫ్లాగ్‌షిప్‌ మోడల్ కైలాక్ (Kylaq) అని చెప్పాలి. ధర పరంగా అందుబాటులో ఉండటం, ప్రీమియం లుక్‌తోపాటు ఫీచర్లు ఆకట్టుకోవడంతో ఈ కారు వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Advertisement

కార్ లవర్స్ గెట్ రెడీ

భారతదేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (SUV) సెగ్మెంట్లో టాప్ పొజిషన్ దక్కించుకోవాలన్న లక్ష్యంతో మారుతి సుజుకి(Maruti Suzuki) రెడీ అయింది. దేశంలోనే నంబర్ 1 కార్ల తయారీ సంస్థ అయిన మారుతి ఎప్పటికప్పుడూ తమ వాహనాల్లో ప్రాక్టికాలిటీ, ఫ్యూయెల్ కెపాసిటీ, అడ్వాన్సుడ్ ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తుంది.

సేల్స్‎లో దుమ్మురేపుతున్న టాటా కంపెనీ

టాటా మోటార్స్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. ఇటీవల జీఎస్టీ రేట్లు సవరించిన తర్వాత టాటా కార్లకు మరింత మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా, ఈ సెప్టెంబర్ నెలలో టాటా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ మొత్తం 60,907 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 47% పెరిగాయి. ఈ అమ్మకాలలో అత్యధికంగా అమ్ముడైన SUV ఏదైనా ఉందంటే, అది టాటా నెక్సాన్ (Tata Nexon). ఈ కారుకు రికార్డు స్థాయిలో డిమాండ్ ఉంది. 24 కి.మీ మైలేజ్, రూ.7 లక్షల ప్రారంభ ధరకే వస్తుంది. టాటా మోటార్స్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ఇటీవల జీఎస్టీ రేట్ల సవరణ తర్వాత కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ సెప్టెంబర్ నెలలో కంపెనీ మొత్తం 60,907 యూనిట్లను విక్రయించింది. 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే, అమ్మకాల పరిమాణం ఏడాదికి ఏడాది 47% పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలోనూ టాటా కంపెనీ పెద్ద పురోగతి సాధించింది.

క్రెటా హవాకు బ్రేక్ పడ్డట్టేనా

మారుతి సుజుకి (Maruti Suzuki) అంటేనే కస్టమర్ల దృష్టిలో నమ్మకానికి పర్యాయపదంగా మారిపోయింది. అందుకేనేమో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో దాదాపు 50 శాతం అమ్మకాలు మారుతి సుజుకి చేతిలోనే ఉన్నాయి. మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతిదే అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కొత్తగా విడుదల చేసిన విక్టోరిస్ (Victoris) మోడల్‌కు భారీ స్పందన లభిస్తోంది.

మారుతికి మాత్రమే సాధ్యమైన రికార్డు

భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి 2025 సెప్టెంబర్ నెలకు సంబంధించిన విక్రయాల వివరాలతో రికార్డులు సృష్టించింది. ఈ సంస్థ సెప్టెంబర్‌లో మొత్తం 1,85,665 వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య గత ఏడాది సెప్టెంబర్ నెల విక్రయాల కంటే 3 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ అమ్మకాలలో దేశీయ విక్రయాలతో పాటు, ఎగుమతులు కూడా మారుతి చరిత్రలోనే సరికొత్త మైలురాయిని దాటాయి. ఈ గణాంకాలు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ బలంగా పుంజుకుంటోందని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

రికార్డ్ సేల్స్‌తో హ్యుందాయ్ దూకుడు

ప్రస్తుతం 2025 అక్టోబర్ నెల మొదలైంది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ నెలకు సంబంధించిన వాహన కంపెనీల సేల్స్ రిపోర్ట్‌లు వరుసగా విడుదల అవుతున్నాయి. సాధారణంగా ప్రతి నెల మొదటి రోజు సేల్స్ రిపోర్ట్‌లు రావడం మామూలే. కానీ, ఈసారి వాహన కంపెనీల సేల్స్ రిపోర్ట్‌లు భారీ అంచనాలను పెంచాయి. దీనికి కారణం సెప్టెంబర్ 22వ తేదీ నుండి వస్తు సేవల పన్ను తగ్గించడం.