షోరూంకి వెళ్లక్కర్లేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేస్తే రూ. 50,000 డిస్కౌంట్

ఆన్‌లైన్ షాపింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ఫ్లిప్‌కార్ట్. కానీ, ఇకపై ఈ ప్లాట్‌ఫారమ్ కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే పరిమితం కాదు. రాయల్ ఎన్‌ఫీల్డ్, ఫ్లిప్‌కార్ట్ మధ్య కుదిరిన చారిత్రాత్మక భాగస్వామ్యం బైక్‌ల అమ్మకాలలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతోంది. ఇప్పుడు మీరు ఏ షోరూంకి వెళ్లకుండానే మీకు నచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

రూ.65 వేలకే అల్లాయ్ వీల్స్ బైక్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు!

టీవీఎస్ కంపెనీ తన ఎక్స్‌ఎల్ మోపెడ్‌లో ఎక్స్‌ఎల్ 100 హెచ్‌డి అలాయ్ అనే కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇందులో అడ్వాన్సుడ్ ఫీచర్లు, ఎక్కువ మైలేజ్, మెరుగైన ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ, కమర్షియల్ అవసరాలకు ఇది బాగా సరిపోతుంది. దీని గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

లేవన్నా వినకుండా టాటా కారు కోసం షోరూంల ముందు జనం క్యూ

టాటా నెక్సాన్ (Tata Nexon) కారు ప్రజల్లో చాలా చాలా పాపులారిటీ పొందింది. ఇది ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఆకర్షణీయమైన డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉంది. కస్టమర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఆగస్టు నెలలో నెక్సాన్ కారు భారీ సంఖ్యలో అమ్ముడైంది. ఈ నెలలో మొత్తం 14,004 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 14% పెరుగుదలను సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కేంద్ర ప్రభుత్వం కార్ల కొనుగోలుపై జీఎస్‌టీని సవరించినందున, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. అందుకే నెక్సాన్ ధర రూ. 1.55 లక్షల వరకు తగ్గింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.

మారుతి విక్టోరిస్ SUV.. సెప్టెంబర్ 22 నుండి డెలివరీలు స్టార్ట్!

ఇటీవల, మారుతి సుజుకి (Maruti Suzuki) తన కొత్త మిడ్-సైజ్ SUV విక్టోరిస్(victoris) ను భారత మార్కెట్లో ప్రారంభించింది. ఈ SUV ప్రత్యేకంగా ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఎక్స్‌టీరియర్ నుండి ఇంటీరియర్ డీటైల్స్ వరకు ప్రతీ అంశంలో ఆధునికత, సౌకర్యం అందిస్తుంది. ముఖ్యంగా కారు ప్రమాణికుల రక్షణ పరంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇంత మంచి కారును జనాలు బాగానే బుకింగ్ చేసుకుంటున్నారు. ఆసక్తిగల వినియోగదారులు కేవలం రూ.11,000 ముందస్తుగా చెల్లించడం ద్వారా ఆర్డర్ చేయవచ్చు. విశేషంగా, ప్రారంభ కొన్ని రోజుల్లోనే SUVకు ప్రతిరోజూ 1,000 బుకింగ్‌లు వస్తున్నాయి, ఇది మార్కెట్లో దీని డిమాండ్, ప్రజల ఆసక్తిని స్పష్టంగా చూపిస్తుంది.
Advertisement

మారుతి ఆల్టో K10 ధర కేవలం రూ.3.70 లక్షలు!

ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన GST కౌన్సిల్ సమావేశం ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక పెద్ద ఊపిరి పోసినట్లయింది. చాలా కాలంగా ఆటో కంపెనీలు, డీలర్లు, వినియోగదారులు ఎదురుచూస్తున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఆ సమావేశంలో వెలువడింది. ఇప్పటి వరకు వాహనాలపై 28 శాతం పన్ను విధించబడుతుండగా, తాజాగా దానిని 18 శాతం వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వాహన మార్కెట్‌లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. దీని ప్రభావం వెంటనే దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకిపై కనిపించింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న ఈ సంస్థ, కొత్త GST రేట్ల ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది.

హైదరాబాద్ నుంచి అమరావతి, బెంగళూరు, చెన్నైకి బుల్లెట్ రైళ్లు

భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తూ, దేశంలోని ప్రయాణికుల కోసం సౌకర్యాలను మరింత ఆధునికంగా మారుస్తోంది. కేవలం నగరాల మధ్య ట్రైన్ల సంఖ్యను పెంచడమే కాక, మోడ్రన్ రైళ్లు, హై-స్పీడ్ సర్వీసులు, ప్రత్యేక కార్గో రూట్లను కూడా అభివృద్ధి చేస్తూ ఉంది. ముఖ్యంగా, బుల్లెట్ రైళ్లు కొత్త రైలు సిస్టమ్‌లో కీలక పాత్ర పోషించడానికి త్వరలోనే పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడిన బుల్లెట్ రైళ్లు, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ, ప్రయాణికులకి మరింత దగ్గర అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్ ఎలివేటెడ్ రైలు కారిడార్లను దేశవ్యాప్తంగా నిర్మించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా ప్రధాన మెట్రో నగరాలను కలిపే ఈ కారిడార్ల ద్వారా, భవిష్యత్తులో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

రూ.5.52 లక్షలకే టాటా ఏస్ గోల్డ్+ లాంచ్

భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (Tata Motors) అనే పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేనిది. సాధారణ ప్రయాణికుల కార్ల నుంచి ప్రారంభించి, వాణిజ్య వాహనాల వరకు విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందిస్తూ దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సాధించింది. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ స్థానం మరింత బలంగా ఉంది. తేలికపాటి వాహనాల నుంచి హెవీ డ్యూటీ ట్రక్కుల వరకు అన్ని విభాగాల్లోనూ తమదైన ముద్ర వేసి, చిన్న వ్యాపారాలు చేసే వారిని, పెద్ద ఎంటర్‌ప్రైజ్‌లను సమానంగా ఆదరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో, వినియోగదారుల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చడానికి, చిన్న వ్యాపారాలు, సరకు రవాణాలో నిమగ్నమయ్యే వారికి సౌకర్యంగా ఉండేలా టాటా మోటార్స్ తన ప్రఖ్యాత ఏస్ (Ace) శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది.

రూ.3.50 లక్షలకే మారుతి ఫ్యామిలీ కారు.. మైలేజ్ కూడా అదరగొడుతుంది!

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఆటోమొబైల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. చాలా వాహన తయారీ కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు వరుసగా ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం, నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కంపెనీ తన అత్యధికంగా అమ్ముడయ్యే, డిమాండ్ ఉన్న మోడళ్లపై గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనంగా ఉన్న ఎస్-ప్రెస్సో ధరలో పెద్ద తగ్గింపును కంపెనీ అమలు చేయబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
Advertisement

కేవలం 5 ఏళ్లలోనే 5 లక్షల అమ్మకాల మైలురాయి

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఊహించని స్థాయికి చేరుకుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, పర్యావరణానికి అనుకూలంగా ఉండటం వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు ఆకర్షితులవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ పోటీలో బజాజ్ ఆటో కూడా వెనుకంజ వేయలేదు. సుదీర్ఘకాలం ద్విచక్ర వాహనాల తయారీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, 2020లో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఈవీ (Bajaj Chetak Ev)ను ఆవిష్కరించింది. అప్పట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన అంతగా లేకపోయినా, ఈ స్కూటర్ తన క్లాసిక్ డిజైన్, బలమైన బాడీ, నమ్మదగిన బ్యాటరీ పనితీరు, సులభమైన రైడింగ్ అనుభవంతో వినియోగదారుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.

ఫ్యామిలీతో వెళ్లాలంటే ఇదే బెస్ట్.. 10 లక్షల లోపే 7 సీటర్ కార్లు!

ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కొనడం చాలా కష్టం. కానీ, కొన్ని కంపెనీలు రూ. 10 లక్షల లోపు కూడా 7 సీటర్ కార్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో రేనాల్ట్ ట్రైబర్ (Renault Triber), మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు, మారుతి ఎర్టిగా, మహీంద్రా బొలెరో వంటి కార్ల గురించి కూడా వివరాలు తెలుసుకుందాం.

ఆగస్టులో కేవలం 1,505 యూనిట్లు మాత్రమే అమ్ముడైన సెలెరియో

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) దేశీయ మార్కెట్లో ఒక ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌గా గుర్తింపు పొందింది. సరళమైన డిజైన్, కాంపాక్ట్ సైజ్, సిటీ డ్రైవింగ్‌కి సరిగ్గా సరిపోయే ఫీచర్లతో ఇది చాలా మందికి ఫేవరెట్ కారుగా నిలిచింది. తక్కువ ధరలో లభిస్తూ, పేద, మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటులో ఉంది. చాలా కాలంగా ఇది మార్కెట్లో తన సత్తా చూపిస్తుంది. కానీ తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు మాత్రం ఈ కారు కోసం అంతగా అనుకూలంగా లేవు. 2025 ఆగస్టు నెలలో సెలెరియో మొత్తం 1,505 యూనిట్లు మాత్రమే డెలివరీ అయింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 3,181 యూనిట్లతో పోలిస్తే 53 శాతం తగ్గుదల. ఈ గణాంకాలు చూస్తే, వినియోగదారుల డిమాండ్‌లో గణనీయమైన తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది.

యూట్యూబ్ చూసి బైక్ తయారు చేశాడు.. ఇది నిజంగా షాకింగ్

ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది. దీంతో చాలా మంది యువకులు సొంతంగా వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేరళకు చెందిన 21 ఏళ్ల యువకుడు అతుల్ వినోద్ కూడా అలాంటి సాహసం చేసి, లక్ష రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాడు. ఈ బైక్ ఫీచర్లు, తయారీ వివరాలు తెలుసుకుందాం.
Advertisement

ఎయిర్‌పోర్ట్‌కి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో వచ్చిన సల్మాన్‌ ఖాన్

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ పేరు వినగానే దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం నిండిపోతుంది. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఎదుర్కొంటున్న బెదిరింపుల కారణంగా, ఆయన చుట్టూ భద్రతను మరింత బలోపేతం చేశారు. ముందే వై-ప్లస్ స్థాయి సెక్యూరిటీ కలిగిన సల్మాన్, తాజాగా వచ్చిన కొన్ని ముప్పుల కారణంగా ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సర్కిల్‌లోనే ఉంటున్నారు. ఆయన ఇంటికే దూసుకొచ్చి దాడి చేస్తానని ఒక గుర్తు తెలియని వ్యక్తి పంపిన బెదిరింపు సందేశం అందిన తర్వాత, భద్రతా వ్యవస్థ మరింత కఠినతరం చేయబడింది. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవన శైలిలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన ఉపయోగించే కార్లను అత్యాధునిక సాంకేతికతతో బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చారు.

సంవత్సరానికి 36% పెరిగిన ఇన్విక్టో డిమాండ్

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రీమియం MPV. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ రీబ్యాడ్జ్ వెర్షన్ తన స్టైలిష్ డిజైన్, ఆధునిక సాంకేతికత, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, అత్యాధునిక ఫీచర్లతో కుటుంబ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. ప్రాక్టికాలిటీతో పాటు లగ్జరీ టచ్‌ను అందించే వాహనంగా ఇది మరింత పాపులర్ అవుతోంది. గత ఆగస్టు నెలలో ఇన్విక్టో మంచి డిమాండ్‌ను రాబట్టింది. కంపెనీ అధికారిక గణాంకాల ప్రకారం, ఈ నెలలో 237 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంలో అమ్ముడైన యూనిట్ల సంఖ్య 174 మాత్రమే.

ఈ సైకిల్ చూస్తే షాక్ అవుతారు.. రేటు తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి, ఎలక్ట్రిక్ సైకిల్స్ మంచి పరిష్కారంగా మారాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఇమోటార్డ్ (EMotorad), యువతరం కోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ సౌకర్యంతో కూడిన డోప్(Dope) అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

సింగిల్ చార్జ్ చేస్తే 158 కి.మీ రేంజ్.. టీవీఎస్ నయా స్కూటర్ ఆగయా

TVS ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో విడుదలైంది. ధర, ఫీచర్లు, పరిధి మరియు పనితీరు గురించి తెలుసుకోండి. ఇది నగర ప్రయాణానికి అనుకూలమైనదా? | TVS Orbiter electric scooter launched in India. Know about price, features, range and performance. Is it suitable for city commute?
Advertisement

టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మారుతి విక్టోరిస్ పై రివ్యూ

కొత్త మారుతి విక్టోరిస్ SUV రివ్యూ చూడండి. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు మరియు డ్రైవింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. | Check out the review of the new Maruti Victoris SUV. Learn about price, features, specifications and driving experience.

మారుతి సుజుకి కార్ల ధరలు గణనీయంగా తగ్గించేసింది!

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుపొందిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) తన కస్టమర్లకు మరోసారి సంతోషకమైన వార్తను అందించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్ల కొనుగోలుపై జీఎస్టీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల లభించే పూర్తి ప్రయోజనాన్ని వినియోగదారులకే అందించాలని మారుతి సుజుకి నిర్ణయించింది. దాంతో తమ కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ మార్కెట్లో మరింత శక్తివంతంగా ముందుకు దూసుకెళ్లేందుకు కంపెనీ సిద్ధమైంది. కొత్త రేట్లు అధికారికంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సవరణలతో కలిపి మారుతి సుజుకి కార్ల ధరలు కనీసం రూ.46,400 వరకు తగ్గించబడ్డాయి. కొన్ని మోడళ్లలో గరిష్టంగా రూ.1.29 లక్షల వరకు తగ్గింపు వచ్చింది.

పెట్రోల్ ఖర్చుకు బైబై.. యాంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ వచ్చేసింది!

పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో బండి నడిపే వారికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన యాంపియర్, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాగ్నస్ గ్రాండ్‎ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ధర కేవలం రూ. 89,999 (ఎక్స్-షోరూమ్).

రూ. 10 లక్షల బడ్జెట్‌లో అత్యధికంగా సేల్ అయ్యే హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి వాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో ముందున్నాయి. ఆగస్టు నెలలో ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో వివరాలు చూద్దాం.
Advertisement

ఆగస్టులో కేవలం 68 యూనిట్లు మాత్రమే అమ్ముడైన రుమియన్

భారత మార్కెట్లో కుటుంబాలకు సరైన మల్టీ పర్పస్ వెహికల్ (MPV)గా పేరు తెచ్చుకున్న కార్లలో టయోటా రుమియన్ (Toyota Rumion) ఒకటి. రుమియన్ అనేది అసలు మారుతి సుజుకి ఎర్టిగా యొక్క రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్. అంటే టయోటా - సుజుకి కూటమి కింద రుమియన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. అదే డిజైన్, అదే ప్లాట్‌ఫామ్ ఉన్నప్పటికీ, టయోటా తన పేరుతో ఈ మోడల్‌ను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో రుమియన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అయితే, తాజాగా విడుదలైన ఆగస్టు 2025 సేల్స్ రిపోర్ట్ రుమియన్‌కు అంతగా సంతోషకరంగా లేదు. ఆగస్టు నెలలో టయోటా కేవలం 68 యూనిట్ల రుమియన్ కార్లను మాత్రమే విక్రయించింది. ఈ సంఖ్య నిజానికి చాలా తక్కువ.

రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌కు గుడ్‌బై.. సింపుల్ ఎనర్జీ విప్లవాత్మక మోటార్ తయారీ!

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో ఒక కీలక సవాల్‌గా నిలిచింది రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌ సమస్య. చైనా ఈ అయస్కాంతాల ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో గ్లోబల్ ఈవీ మార్కెట్ ఒక పెద్ద దెబ్బ తిన్నది. వాహనాల ఉత్పత్తి వ్యయాలు పెరగడం, సరఫరా గొలుసులో అంతరాయం కలగడం వంటి సమస్యలు అనేక దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్న ప్రముఖ కంపెనీ సింపుల్ ఎనర్జీ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌పై ఆధారపడకుండా కూడా వాణిజ్యపరంగా ఉపయోగించగలిగే ఎలక్ట్రిక్ మోటార్లను తయారు చేసిన మొదటి భారతీయ కంపెనీగా సింపుల్ ఎనర్జీ చరిత్ర సృష్టించింది.

తండ్రికి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ ప్లేయర్

టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ హైదరాబాద్ ప్లేయర్, తండ్రికి మహీంద్రా XEV 9e అనే సూపర్ హిట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ కారు విలువ రూ. 22 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. తిలక్ వర్మ క్రికెట్ కెరీర్2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ హైదరాబాద్ ఆల్‌రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను పేస్, స్పిన్ బౌలర్లను ఈజీ ఎదుర్కొనే కెపాసిటీ తనకు ఉంది. విరాట్ కోహ్లీ స్థానంలో భవిష్యత్తులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను టీ20 జట్టులో స్థిరమైన సభ్యుడిగా ఉన్నప్పటికీ, కోచ్ గౌతమ్ గంభీర్ అతనిని వన్డేలలో కూడా పరీక్షించడానికి ఆసక్తి చూపుతున్నారు.

రూ.7.89 లక్షల కారు బైక్ లాగా 28 కి.మీ మైలేజ్.. గత నెలలో 2500 మందికి పైగా కొన్నారు

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా SUV ప్రియులు కోరుకునే మోడల్‌గా ఇది పేరుపొందింది. అందుకు కారణం దీని అద్భుతమైన డిజైన్, రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపించే స్టైల్, అలాగే వినియోగదారులను ఆకర్షించే అనేక ఆధునిక ఫీచర్లు. కంఫర్ట్, సేఫ్టీ, మైలేజ్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో టైజర్ అమ్మకాల సంఖ్యలో కొంత వెనుకబాటు కనిపించింది. మొత్తం 2,683 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే సమయంలో 3,213 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ సారి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. గణాంకాలను పరిశీలిస్తే, టైజర్ అమ్మకాలలో దాదాపు 16 శాతం క్షీణత చోటుచేసుకున్నట్టు తేలింది.
Advertisement

జీఎస్టీ తగ్గిస్తే ఇలా అవుతుందని ప్రభుత్వానికి తెలియదా?

పెట్రోల్/డీజిల్ వాహనాలపై జీఎస్‌టీ (GST) తగ్గింపు ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కొత్త మార్పుకు దారితీసింది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలను గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల వాటి అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ మార్పు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది.