నవరాత్రి, జీఎస్టీ తగ్గింపు.. ఈ డబుల్ ధమాకాతో కార్ల రికార్డు సేల్స్!
ఆటోమొబైల్స్
- 11 month, 26 days ago
సాధారణంగా దసరా పండుగ సమయంలో కార్ల అమ్మకాలు అవి ఏ కంపెనీ అయినా ఎక్కువగానే ఉంటాయి. ఈసారి నవరాత్రి మొదటి రోజు (సెప్టెంబర్ 22) జీఎస్టీ రేట్ల తగ్గింపు కూడా తోడవడంతో కార్ సేల్స్ భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కార్లు అమ్ముడయ్యాయి. భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ భారీ అమ్మకాలను నమోదు చేశాయి.