రూ.7.89 లక్షల కారు బైక్ లాగా 28 కి.మీ మైలేజ్.. గత నెలలో 2500 మందికి పైగా కొన్నారు

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా SUV ప్రియులు కోరుకునే మోడల్‌గా ఇది పేరుపొందింది. అందుకు కారణం దీని అద్భుతమైన డిజైన్, రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపించే స్టైల్, అలాగే వినియోగదారులను ఆకర్షించే అనేక ఆధునిక ఫీచర్లు. కంఫర్ట్, సేఫ్టీ, మైలేజ్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో టైజర్ అమ్మకాల సంఖ్యలో కొంత వెనుకబాటు కనిపించింది. మొత్తం 2,683 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే సమయంలో 3,213 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ సారి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. గణాంకాలను పరిశీలిస్తే, టైజర్ అమ్మకాలలో దాదాపు 16 శాతం క్షీణత చోటుచేసుకున్నట్టు తేలింది.

జీఎస్టీ తగ్గిస్తే ఇలా అవుతుందని ప్రభుత్వానికి తెలియదా?

పెట్రోల్/డీజిల్ వాహనాలపై జీఎస్‌టీ (GST) తగ్గింపు ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కొత్త మార్పుకు దారితీసింది. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలను గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల వాటి అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ మార్పు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది.

మళ్లీ తన భద్రతను నిరూపించుకున్న ఆల్ట్రోజ్.. BNCAPలో ఫుల్ 5 స్టార్ రేటింగ్!

టాటా మోటార్స్(Tata Motors) నుండి కొత్త కార్లను కొనుగోలు చేసే విషయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే అంశం భద్రత. అందుకే టాటా మోడళ్లు వినియోగదారులలో ఒక ప్రత్యేకమైన నమ్మకాన్ని కలిగించాయి. వీటిలో టాటా ఆల్ట్రోజ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. భారత మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన హాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. స్టైలిష్ డిజైన్, ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత పరంగా కూడా ఆల్ట్రోజ్ ఎప్పుడూ ఒక బెంచ్‌మార్క్‌గా గుర్తించబడింది. ఇటీవలే దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్‌డేటెడ్ లుక్, కొత్త ఫీచర్లు, మరింత బలమైన క్వాలిటీతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

టీవీఎస్ అద్బుతం.. ఇక స్మార్ట్ వాచ్‌తో స్కూటర్ నడపొచ్చు

ప్రస్తుతం భారతదేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో టీవీఎస్ ఐక్యూబ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సెగ్మెంట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతుండటంతో కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా, ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఒక వినూత్నమైన అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ అయిన నాయిస్ (Noise)తో చేతులు కలిపి ఒప్పందం కుదుర్చుకుంది.
Advertisement

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాప్ ప్లేయర్‌గా ఎదుగుతున్న గ్లాంజా

టయోటా (Toyota), సుజుకి (Suzuki) మధ్య భాగస్వామ్యం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఈ కలయిక ద్వారా టయోటా, మారుతి సుజుకి కార్లను తన పేరుతో రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. అందులో ఒకటి టయోటా గ్లాంజా (Toyota Glanza). ప్రధానంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి వచ్చే ఈ కారు, మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)కి రీ-బ్యాడ్జ్ వెర్షన్. టయోటా భారత మార్కెట్లో మొదటిసారి రీ-బ్యాడ్జ్ చేసి అమ్మిన మారుతి సుజుకి మోడల్ కూడా ఇదే కావడం గ్లాంజా ప్రాధాన్యతను మరింత పెంచింది.

టయోటా సెన్సేషన్.. ఉదయం బస్సు.. సాయంత్రం థియేటర్

టయోటా సంస్థ ఈ-పాలెట్ అనే ఒక కొత్త వాహనాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది సాధారణ వాహనం కాదు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది. ఈ వాహనాన్ని ఒకే సమయంలో అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఉదయం ప్రయాణికులను తీసుకెళ్లే బస్సుగా, సాయంత్రం సినిమా చూసే థియేటర్‌గా, రాత్రి భోజనం తయారు చేసే రెస్టారెంటుగా కూడా మార్చవచ్చు. ఈ వినూత్న వాహనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇక సెకండ్ హ్యాండ్ కార్లకు గడ్డు కాలం

కారు కొనడం అనేది చాలామంది కల. ఒకప్పుడు కారు ఒక విలాసవంతమైన వస్తువుగా పరిగణించబడినప్పటికీ, నేడు అది మనిషి జీవితంలో ఒక అవసరంగా మారింది. అయితే, కొత్త కారు కొనడం చాలామందికి కష్టమైన పని. అందుకే భారతదేశంలో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై ఆధారపడుతున్నారు. కొత్త కార్ల అధిక ధరల కారణంగా భారతదేశంలో వాడిన కార్లకు డిమాండ్ పెరిగింది. ప్రతి సంవత్సరం కార్ల ధరలు మూడు, నాలుగు సార్లు పెరగడం సాధారణంగా చూస్తుంటాం.

రోజుకు 1,000 మంది బుక్ చేస్తున్న కారు.. 5 స్టార్ సేఫ్టీ, 29 కి.మీల మైలేజ్

మారుతి సుజుకి కొత్త విక్టోరిస్ ఎస్‌యూవీ (Maruti Suzuki Victoris Suv) సోమవారం అధికారంగా లాంచ్ అయింది. ఈ కారు కోసం చాలా కాలంగా ఆటో ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ విటారా తర్వాత మారుతి సుజుకి విక్రయించే ప్యాసింజర్ వాహన విభాగంలో విక్టోరిస్ రెండవ మిడ్-సైజ్ SUV. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను కంపెనీ సెప్టెంబర్ 3 నుండి ప్రారంభించబడింది. వినియోగదారులు కేవలం రూ.11,000 ముందస్తు చెల్లింపుతో తమ ఆర్డర్‌ను ఖరారు చేసుకోవచ్చు. తాజాగా ప్రైవేట్ మీడియా నివేదికల ప్రకారం, ప్రతి రోజూ సగటున సుమారు 1,000 బుకింగ్‌లు ఈ కొత్త SUV కోసం వస్తున్నాయి. దీనిపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని ఆకట్టుకునే డిజైన్, పనితీరు అన్నీ కూడా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుండటం కారణంగా చాలా మంది దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
Advertisement

పెట్రోల్ బంకుల్లో ఇక మీదట అది లేని పెట్రోల్ అమ్మరట

దేశంలో ఇథనాల్ పెట్రోల్‌పై అనేక ఆరోపణలు, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇందులో నిజం ఎంత? మీ వాహనంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పోస్తే నష్టం జరుగుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఇందులో నిజం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రకటనలో స్పష్టం చేశారు.

వర్షం.. కొండచరియలు.. ప్రమాదాలు.. అన్నీ ఎదుర్కొని ఉమ్లింగ్ లా చేరిన హీరో

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. చిన్నప్పటి నుండి పెద్దవాళ్ల వరకు వీటికి ఉన్న అభిమానమే వేరుగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ బైక్‌లు కేవలం వాహనాలు మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, ఒక జీవనశైలి. వీటి ఇంజిన్ కెపాసిటీ బలంగా ఉండటం వల్ల నగర ప్రయాణాలకే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా ఇవి అద్భుతంగా సరిపోతాయి. ఎప్పుడూ కొత్త కొత్త అనుభవాలను వెతికే రైడర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ ఓ నమ్మకమైన తోడు. ఇలాంటి బైక్‌లను నడపడానికి కొంచెం ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది. మొదట్లో ఇవి కొంచెం హెవీగా అనిపించవచ్చు కానీ, అలవాటు పడిపోయాక మాత్రం ఈ బైక్‌పై ప్రయాణించడం ఒక మాంత్రిక అనుభవంలా ఉంటుంది.

ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ప్రముఖంగా పేరుగాంచిన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీకి చెందిన వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటనతో, ఎలక్ట్రిక్ వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.

రైడర్ బైక్ విక్రయాల్లో 1.60 మిలియన్ మార్క్ దాటేసింది

దేశీయ ద్విచక్రవాహన రంగంలో టీవీఎస్ (TVS) ఎప్పటినుంచో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ. దానికి కారణం నమ్మకమైన ఇంజిన్‌లు, అందుబాటులో ఉండే ధరలు, మైలేజ్ విషయంలో కస్టమర్లను నిరాశపరచని మోడళ్లే. వీటిలో టీవీఎస్ రైడర్ (TVS Raider) అనేది ఒక ప్రత్యేకమైన మోడల్. 2021లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బైక్, తక్కువ సమయంలోనే బైక్ ప్రియుల మనసు దోచుకుంది. రోజువారీ ఉద్యోగాలు, కాలేజీకి వెళ్లడం, షాపింగ్ లేదా చిన్నపాటి ట్రిప్‌లు వంటి ప్రతీ అవసరానికి ఇది సరైన ఎంపికగా మారింది. పెట్టిన ప్రతి రూపాయికి తగిన మైలేజ్ ఇచ్చే రైడర్, పెర్ఫామెన్స్ విషయంలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. యువతరానికి నచ్చే స్పోర్టీ డిజైన్, ఆధునిక ఫీచర్లు దీనిని మరింత డిమాండ్‌లో నిలిపాయి.
Advertisement

అదిరిపోయే ఫీచర్లున్నా కనీసం 500కార్లు కూడా అమ్ముడుపోలేదు

భారత మార్కెట్‌లో కొత్తగా అడుగుపెట్టిన విదేశీ కార్ల కంపెనీ సిట్రోన్. ఈ కంపెనీ కార్లకు మంచి డిజైన్, ఫీచర్లు ఉన్నప్పటికీ అమ్మకాల్లో మాత్రం వెనుకబడుతోంది. గత ఆగస్టు నెలలో కేవలం 403 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత రెండు నెలలుగా కంపెనీ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అన్నీ బాగానే ఉన్నప్పటికీ అమ్మకాలు ఎందుకు పడిపోతున్నాయి, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి బ్రెజ్జా సేల్స్‌కి గట్టి దెబ్బ

భారతదేశంలో కార్ల మార్కెట్‌కి మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు ప్రత్యేకమైన ఆదరణను పొందింది. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి వచ్చే మోడల్స్ సాధారణ వినియోగదారుల బడ్జెట్‌కు సరిపోయే విధంగా ఉండటమే కాకుండా, మైలేజ్‌, నాణ్యత, పనితీరు అన్నీ కలిపి అందిస్తాయి. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లోకి తీసుకొచ్చిన మారుతి సుజుకి బ్రెజ్జా (Brezza) అయితే, విడుదలైన రోజునుంచే విశేషమైన పాపులారిటీ సంపాదించింది. కాంపాక్ట్ SUVగా దీనికి ఉన్న డిమాండ్‌, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు ఇవన్నీ కలిపి బ్రెజ్జాను చాలా మందికి ఫ్యామిలీ కారుగా నిలిపాయి. అయితే, ఇటీవల వెలువడిన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, బ్రెజ్జా అమ్మకాలలో కొంత వెనుకంజ కనిపిస్తోంది.

ఒకప్పుడు నష్టాల్లో.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి!

భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ లభించింది. అపోలో టైర్స్ బీసీసీఐతో మూడేళ్ల కాలానికి 579 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు 2027 వరకు భారత క్రికెట్ జట్టు అపోలో టైర్ లోగో ఉన్న జెర్సీతో ఆడుతుంది.

కొత్త ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా?

ఆగస్టు 2025 నెల అమ్మకాల గణాంకాల ప్రకారం.. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో లభించే టాప్ ఎస్‌యూవీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటివి ముందున్నాయి.
Advertisement

25 ఏళ్ల బొలెరో రూల్స్ ది రోడ్.. 2025లో సేల్స్ గ్రాఫ్ టాప్‌లోనే!

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలో నడుస్తున్న మహీంద్రా (mahindra) కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన వాహనాలకు ఎప్పటిలాగే మంచి ఆదరణ లభిస్తోంది. అందులోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్ మహీంద్రా బొలెరో (bolero). ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు, కొత్త ఫీచర్లు మార్కెట్లోకి వచ్చినా, బొలెరోకి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ మార్కెట్లో బొలెరో తన సొంత ఇమేజ్‌తో నిలదొక్కుకుని, సాదాసీదా డిజైన్‌కి సరిపడే దృఢమైన పనితీరు, మన్నిక, నమ్మకంతో కస్టమర్ల మనసు గెలుచుకుంది. ఈ మోడల్ విడుదలై ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా అయినప్పటికీ, బొలెరోపై ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే కుటుంబ అవసరాలకు సరిపోయే వాహనం కావడంతో, చాలా మంది ఇప్పటికీ దీన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు.

7 సీట్లు ఉన్నా.. సఫారీకి సపోర్ట్ లేక షాక్ ఇచ్చిన మార్కెట్!

టాటా మోటార్స్‌ (Tata Motors) తాజాగా తన కార్ల విక్రయ గణాంకాలను బయటపెట్టింది. అందులో భాగంగా కంపెనీకి ప్రతిష్టాత్మకమైన SUV మోడల్ అయిన టాటా సఫారీ (Tata Safari) అమ్మకాలపై కూడా స్పష్టమైన వివరాలు వెల్లడయ్యాయి. ఒకప్పుడు కుటుంబ కార్ల విభాగంలో బలమైన స్థానం సంపాదించిన ఈ వాహనం, కొత్త తరం మోడల్‌గా మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మంచి స్పందనను సొంతం చేసుకుంది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రీమియం లుక్ వంటి ఎన్నో అంశాలు సఫారీని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం ఈ కారు అమ్మకాలలో కొంత వెనుకబాటు కనిపిస్తోంది. 2025 ఆగష్టు నెలలో టాటా సఫారీ కేవలం 1,489 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

యూరోపియన్ లుక్‌తో ఎంట్రీ ఇస్తున్న ఎయిర్‌క్రాస్ ఎక్స్

ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroën) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్రత్యేకమైన యూరోపియన్ స్టైల్ డిజైన్లతో ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకుంది. స్టైలిష్ డిజైన్, యూరోపియన్ ఫీల్, ప్రీమియం లుక్ అనే ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే ఈ కంపెనీకి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. సాధారణంగా భారతీయ కస్టమర్లు ఎక్కువగా మైలేజ్, బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, సిట్రోయెన్ మాత్రం తన కార్లలో అందించే సొగసుతో, క్లాసీ లుక్‌తో, కొత్త డిజైన్ భాషతో ఒక వేరే రేంజ్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇప్పుడు అదే ఇమేజ్‌ని మరింత బలోపేతం చేస్తూ, కంపెనీ తాజాగా సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ X (Citroën Aircross X) అనే మోడల్‌ను పరిచయం చేసింది.

బుల్లెట్ బైక్ ప్రియులకు దసరా ముందే వచ్చింది భయ్యో

భారతదేశంలో అగ్రగామి మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ప్రతి నెల వేలాది బైక్‌లను విక్రయించే ఈ సంస్థ, ఇతర కంపెనీల మాదిరిగానే తమ బైక్‌ల ధరలలో జీఎస్టీ 2.0 మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం కొన్ని బైక్‌ల ధరలు తగ్గాయి. మరికొన్నింటి ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 350సీసీ కంటే ఎక్కువ బైక్‌లకు జీఎస్టీ పన్నును 40శాతానికి పెంచడమే ఈ మార్పులకు కారణం. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.
Advertisement

29 kmpl మైలేజ్‌తో డబ్బు సేవ్.. 5 స్టార్ సేఫ్టీతో లైఫ్ సేవ్ చేసే SUV!

భారత మార్కెట్లో కార్ల భద్రతపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మారుతి సుజుకి కార్ల విషయంలో, ఇవి స్టైల్, మైలేజ్, ప్రాక్టికల్ యూజ్ విషయంలో ముందుంటాయి కానీ సేఫ్టీ విషయంలో మాత్రం వెనుకబడి ఉంటాయి అని చాలా మంది వినియోగదారులు ఆరోపిస్తూ వచ్చారు. ఇదే సమయంలో, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు మాత్రం సేఫ్టీపై దృష్టి పెట్టి 5-స్టార్ రేటింగ్ పొందిన మోడళ్లను వరుసగా మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో, మారుతి సుజుకి తాజాగా తీసుకొచ్చిన విక్టోరిస్ ఎస్‌యూవీ (victoris suv) అంచనాలను తలకిందులు చేసింది. ఈ కారు మొదట భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లోనే 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది.

మారుతి విక్టోరిస్ కారుకు ఆల్టర్నేటివ్స్ ఇవే

మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి కొత్త విక్టోరిస్(Victoris) కారు భారత మార్కెట్లో విడుదలైంది. మారుతి సుజుకి కొత్త, తక్కువ ధరల ఎస్‌యూవీ (SUV) అయిన విక్టోరిస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.50 లక్షలు. విక్టోరిస్ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్లు రూ.10 లక్షల బడ్జెట్‌ను కొద్దిగా దాటినా, రూ. 10 లక్షల లోపు ధరలో పోటీగా అనేక ప్రముఖ కార్లు మార్కెట్లో ఉన్నాయి.

ధరలు తగ్గిన మారుతి మోడళ్లు.. మార్కెట్లో డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు ఊపిరి పీల్చేలా మారిన కీలక పరిణామం ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాహనాలపై విధిస్తున్న పన్ను రేట్లను గణనీయంగా తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆటోమొబైల్ రంగంపై 28 శాతం జీఎస్టీ విధించబడుతున్నా, తాజా నిర్ణయం ప్రకారం అది కేవలం 18 శాతానికి తగ్గించబడింది. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి మరింత ఉత్సాహం చూపిస్తారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఇప్పటికే తమ ధరలను సవరించడం ప్రారంభించాయి.

మహీంద్రా అదిరిపోయే ఆఫర్..ఈ కారు కొంటే భారీగా ఆదా

విక్రయాల పరంగా హ్యుందాయ్, టాటా మోటార్స్‌ను అధిగమించి చాలా నెలలుగా భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ప్రజలకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం, మంచి మోడళ్లను విడుదల చేయడం.
Advertisement

యువత కలల బైక్ వచ్చేసింది.. రూ.1.95 లక్షల ప్రారంభ ధరతో కొత్త మీటియర్ 350

బైకుల రారాజు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మాత్రమే. ఈ పేరు వింటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక క్లాస్ ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి కంపెనీ నుంచి కొత్త మోడల్ వస్తే, బైక్ ప్రియులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అంచనాల నడుమ, భారతీయ మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా అప్‌డేట్ చేసి విడుదల చేసిన మరో అద్భుతం 2025 మీటియర్ 350 (2025 Meteor 350). ఈ బైక్ రూపకల్పనలో చేసిన మార్పులు, కొత్త తరహా ఫీచర్లు చూసినప్పుడు, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే ఆధునికతను ఎలా కలగలిపిందో స్పష్టంగా తెలుస్తుంది. యువతను ఆకట్టుకునేలా,అలాగే, అన్ని వయస్సుల వారికి సరిపోయేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని ప్రతి అంగుళం లోయల్టీ, స్టైల్, పవర్ కలయికగా కనిపిస్తుంది.