డాక్టర్లు, ఇంజనీర్ల ఫేవరెట్ కారు.. రూ.5.79 లక్షలు, 34 కి.మీల మైలేజ్
ఆటోమొబైల్స్
- 1 year, 6 days ago
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ఎప్పటినుంచో భారతీయ మార్కెట్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు గడించింది. సాదాసీదా డిజైన్, విశాలమైన ఇంటీరియర్, మైలేజ్ ఫ్రెండ్లీ ఇంజిన్, విశ్వసనీయమైన మారుతి సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా ఈ కారు మిలియన్లాది కుటుంబాల ఫ్యామిలీ కార్గా నిలిచింది. దీని పెర్ఫామెన్స్‌కు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రధానంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కాలానికి అనుగుణంగా మారుతూ మరింత ఆధునిక రూపకల్పనతో, వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తున్నా, ఈసారి అమ్మకాల గ్రాఫ్‌లో మాత్రం కొంత వెనుకంజ వేసింది.