జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ధరలు భారీగా పడిపోయాయ్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్‌టీ పన్ను తగ్గింపు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుండగా, ఆటోమొబైల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన తయారీదారులు ఈ అవకాశాన్ని వినియోగదారులకు చేరవేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించినట్లు ప్రకటించగా, ఇప్పుడు జీప్ ఇండియా (Jeep India) కూడా అదే దారిలో నడిచింది. జీప్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి ప్రీమియం SUV మోడళ్లను విక్రయిస్తోంది. జీఎస్‌టీ తగ్గింపుతో వచ్చిన ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త ధరల వివరాలను అధికారికంగా ప్రకటించింది.

సెల్‎ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు

భారత మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ స్కూటర్లలో కొన్ని అయితే స్మార్ట్‌ఫోన్ ధర కంటే కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రొ ధర సుమారు రూ.1.44 లక్షల నుంచి రూ.1.84 లక్షల వరకు ఉండగా, అంతకంటే తక్కువ ధరకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి స్పెషాలిటీల గురించి వివరంగా తెలుసుకుందాం.

పండుగ గిఫ్ట్ ఇచ్చిన బజాజ్ ఆటో.. టూవీలర్స్, త్రీవీలర్స్ ధరలు కట్!

ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో వాహనాలపై GST రేటు తగ్గించబడింది. ఈ తగ్గింపును బజాజ్ ఆటో తక్షణమే తన వినియోగదారులకు అందించేందుకు ముందుకొచ్చింది. కంపెనీ తన మోటార్‌సైకిళ్లు, త్రీ-వీలర్ పోర్ట్‌ఫోలియో మొత్తం మీద ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా KTM మోడల్స్‌తో సహా బజాజ్ మోటార్‌సైకిళ్లపై గరిష్టంగా రూ.20,000 వరకు తగ్గింపు లభించనుండగా, త్రీ-వీలర్లపై రూ.24,000 వరకు ధరలు తగ్గనున్నాయి. ఈ తగ్గింపులు కేవలం కొన్ని మోడల్స్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌లలో వర్తిస్తాయి. అంటే పట్టణాలు, గ్రామాలు ఎక్కడ ఉన్నా బజాజ్ షోరూంలలో కొత్త ధరలతో వాహనాలు లభిస్తాయి. దీని ద్వారా వినియోగదారులు పండుగ సీజన్‌ను మరింత ఆనందంగా ప్రారంభించవచ్చని కంపెనీ ప్రకటించింది.

ఈ 5 కార్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి.. రూ.10లక్షల బడ్జెట్లో టాప్ కార్లు

భారత మార్కెట్లో పెట్రోల్ కార్ల సంఖ్య పెరిగిపోవడం, డీజిల్ కార్ల సంఖ్య తగ్గడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం బీఎస్6 నిబంధనలు. ఎందుకంటే డీజిల్ ఇంజిన్‌లను బీఎస్6 కు అప్‌గ్రేడ్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. కానీ డీజిల్ కార్లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు ఇప్పటికీ తక్కువ ధరకే డీజిల్ కార్లను అందిస్తున్నాయి. ఈ డీజిల్ కార్లు కేవలం రూ.10లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి.
Advertisement

కొత్త ఫీచర్స్‌తో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన ఆంపియర్, తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌‌ను మరింత అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త ఫీచర్లను విడుదల చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం, ఈ స్కూటర్ ఇప్పుడు అత్యాధునిక Nex.IO టెక్నాలజీ వేదికపై మరింత అభివృద్ధి చెందింది. దీని ప్రధాన ఆకర్షణ LFP బ్యాటరీతో పాటు స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు కలిగిన రైడింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడం. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రైడింగ్‌ను మరింత సులభంగా మార్చడానికి కంపెనీ అదిరిపోయే ఫీచర్స్, అత్యాధునిక సౌకర్యాలను ఈ స్కూటర్ అప్‌‌డేట్‌లో అందించడం జరిగింది. ఇకపై నెక్సస్ స్కూటర్‌ను రైడింగ్ చేసే వారు కొత్త అనుభూతిని పొందనున్నారు.

బండి కంటే నంబర్ ప్లేటే ఖరీదు.. దాంతో పది బండ్లు కొనొచ్చు

భారతదేశంలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు తీసుకోవడం ఒక ఫ్యాషన్, ఒక రకంగా పిచ్చిగా మారిపోయింది. చాలామంది తమ వాహనాలకు తమకు నచ్చిన నంబర్లను తీసుకోవడానికి వేలం పాటలో పాల్గొంటారు. కొన్నిసార్లు వాహనం ధర కంటే కూడా ఆ నంబర్‌కు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒకానొక నగరంలో ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చాలా జరిగాయి.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు అల్టర్నేటివ్.. ఎలక్ట్రిక్ వాహనాలే సొల్యూషన్!

ఈ రోజు ప్రత్యేకమైన రోజు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దినోత్సవం. ఈ రోజున ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం, వాటి వల్ల సమాజానికి, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం అనేది కేవలం ఒక కొత్త టెక్నాలజీని ఆహ్వానించడం మాత్రమే కాదు, అది ప్రకృతికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయాణం కూడా. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు దేశ రవాణా రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, పెట్రోల్-డీజిల్ వనరులపై ఆధారపడడం వల్ల కలిగే సమస్యలు, వాయు కాలుష్యం పెరుగుతుండడంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా, ఇప్పుడు నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

కార్ల ఇన్సూరెన్స్‌లో డెప్రిసియేషన్ అంటే ఏంటో తెలుసా?

ప్రస్తుత కాలంలో కారు కొనేవారు కేవలం మోడల్, ఫీచర్స్ గురించే కాదు, సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు చాలామంది జీరో డెప్రిసియేషన్ లేదా నార్మల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మధ్య తేడా తెలియక సతమతమవుతుంటారు. కొన్నిసార్లు ఏజెంట్లు కూడా ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా వివరించరు. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటి, ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
Advertisement

పండుగ సీజన్‌లో మారుతి సుజుకి కార్లకు క్యూలు ఖాయం!

జీఎస్టీ తగ్గింపుతో ఆటోమొబైల్ రంగం మొత్తం కదిలిపోయింది. దేశంలోని ప్రధాన బ్రాండ్లు తమ కొత్త ధరలను వరుసగా ప్రకటిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టాటా మోటార్స్ నుండి హ్యుందాయ్ వరకు, రెనాల్ట్, మహీంద్రా, టయోటా, స్కోడా, కియా, ఎంజీ వంటి కంపెనీలు తమ మోడళ్ల ధరల్లో గణనీయమైన తగ్గింపులు చేస్తూ మార్కెట్‌లో హంగామా సృష్టించాయి. అయితే, ఇంత హడావుడి జరుగుతున్న సమయంలో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు అయిన మారుతి సుజుకి కూడా ధర తగ్గింపును చేయడానికి సిద్దమైంది. ప్రతి నెలా లక్షల్లో కార్లను విక్రయించే స్థాయికి చేరిన మారుతి సుజుకి మోడళ్ల వారీగా ధరల్లో మార్పులు చేసి కస్టమర్లను ఆకర్షించనుంది.

కొత్త కారు బుక్ చేశారా? ఈ విషయం తప్పక తెల్సుకోండి

కొత్త కార్ల ధరలు తగ్గనున్నాయని భారీగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కారు కొందామని ఆలోచిస్తున్నారా ? అయితే, కొత్త జీఎస్టీ రేట్లు అనేది సెప్టెంబర్ 22 తర్వాతే అమల్లోకి వస్తుంది. కానీ, అంతకు ముందే కారు బుక్ చేసుకున్న వారికి కూడా ప్రయోజనం లభిస్తుందా ? లేదా ? అనే విషయం మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ప్రశ్నలతో గందరగోళానికి గురవుతున్నారా? అయితే ఈ వార్తలో వాటికి సమాధానం తెలుసుకోండి. భారత ప్రభుత్వం కార్లపై జీఎస్టీని తగ్గించి సామాన్య ప్రజలకు పెద్ద ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ప్రయోజనం లభిస్తుంది. చాలా కంపెనీలు ఇప్పటికే జీఎస్టీ 2.0 ప్రకారం తమ కొత్త ధరలను ప్రకటించాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

జిఎస్టీ ఎఫెక్ట్‌తో టీవీఎస్ బైక్స్, స్కూటర్లు ఏ మేరకు తగ్గాయంటే..

భారతదేశంలో 56వ GST కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి వరకు 28 శాతం పన్ను విధించబడుతున్న టూవీలర్ వాహనాలపై ఇకపై కేవలం 18 శాతం GST మాత్రమే అమలు కానుంది. అయితే ఈ తగ్గింపు ప్రత్యేకంగా 350 సిసి కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు, స్కూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. 350 సిసి పైబడిన వాహనాలకు మాత్రం కొత్తగా 40 శాతం పన్ను విధించనున్నారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. దీంతో వాహనాల ధరలు మరింత తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో బైకులు, స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది నిజమైన గుడ్ న్యూస్‌గా మారింది.

వేలు కాదు లక్షల్లో తగ్గిన కియా కార్ల ధరలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడంతో, ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్‌లలో ఒకటైన కియా ఇండియా తమ కార్ల ధరలను భారీగా తగ్గించింది. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలలు నెరవేరడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది. కియా కొన్ని మోడల్స్‌పై ఏకంగా రూ.4.48 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. ఈ వార్తలో ఏ కార్లపై ఎంత ధర తగ్గిందో, వాటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

విమర్శకుల నోళ్లు మూయించిన మారుతి ఈ-విటారా

మారుతి సుజుకి (maruti suzuki) పేరు వింటే చాలామంది మనసులో మొదట గుర్తుకు వచ్చేది అందుబాటు ధరలో కారు అనే మాటే. నిజానికి ఈ కంపెనీ దశాబ్దాలుగా భారతీయ కుటుంబాలకు బడ్జెట్‌ ఫ్రెండ్లీ కార్లను అందిస్తూ ఒక విశ్వాసాన్ని కల్పించింది. అయితే ఈ అందుబాటు ధరతో పాటు చాలా కాలంగా ఒక విమర్శ కూడా వెంటాడుతూనే వచ్చింది, మారుతి కార్లలో భద్రతా ప్రమాణాలు తక్కువ అని. రోడ్డుపై సౌకర్యం, మైలేజ్ బాగుండినా, క్రాష్ టెస్ట్‌లలో మాత్రం అంతగా రాణించలేకపోయాయని అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కాలం మారింది. ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీ పెరిగింది. వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజ్, లుక్‌ మాత్రమే కాకుండా, భద్రతను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు.

SUV కొనాలనుకుంటున్నారా? GST తగ్గింపుతో నిస్సాన్ మాగ్నైట్ బెస్ట్ ఆప్షన్

జీఎస్టీ రేట్ల తగ్గింపు భారత ఆటోమొబైల్ రంగానికి ఒక శుభవార్తగా మారింది. వాహనం కొనాలనుకునే వినియోగదారులందరికీ ఇది నిజంగా లాటరీ కొట్టినట్టే. ఎందుకంటే, గత కొంత కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమలో ధరల పెరుగుదల వాహనాలు కొనుగోలు చేయాలనుకునే సాధారణ కుటుంబాలకు పెద్ద అడ్డంకిగా మారింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి ఊపిరి పోసింది. తగ్గించిన GST రేట్లను వెంటనే వినియోగదారులకు అందించడంలో ఆటోమొబైల్ కంపెనీలు కీలకంగా అడుగులు వేస్తున్నాయి. రెనాల్ట్, మహీంద్రా, స్కోడా లాంటి బ్రాండ్లు ఒక్కొక్కటి తమ వాహనాల కొత్త ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను మరింత ఆకర్షించేలా చేశాయి. ఇప్పుడు అదే జాబితాలో నిస్సాన్ కూడా చేరింది. నిస్సాన్ మోటార్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన B-SUV మోడల్ మాగ్నైట్ ధరలను కొత్తగా ప్రకటించింది.

బైక్ కొనాలంటే ఇప్పుడు ఎక్కువే పెట్టాలి!

కొత్త జీఎస్టీ స్లాబ్‌లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో చాలా కార్లు, బైక్‌ల ధరలు తగ్గుతాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ఇది అన్ని వాహనాలకు వర్తించదు. ముఖ్యంగా 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ గల బైక్‌ల ధరలు పెరగనున్నాయి. ఈ కొత్త పన్ను విధానం బైక్ ప్రేమికులను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఏ మోడల్స్‌కు ధరలు పెరుగుతాయో తెలుసుకుందాం.

వర్షాకాలంలో కారులో ఈ ఫీచర్ పక్కాగా ఉండాల్సిందే

మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే కొన్ని ఫీచర్లను అస్సలు మిస్ కావద్దు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డుపై జారకుండా, ప్రమాదాలు జరగకుండా కాపాడే ఒక ముఖ్యమైన ఫీచర్ ఉంది. అది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ ఫీచర్ ఉన్న కార్లు డ్రైవర్లను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాయి. రూ.10 లక్షల లోపు ధరలోనే ఈ ఫీచర్ ఉన్న కొన్ని అద్భుతమైన కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Advertisement

పండుగ టైంలో కొత్త మాస్ బైకును ఇంటికి తెచ్చుకోండి!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీపై చేసిన కీలక సంస్కరణల వల్ల బైకు ప్రియులకు శుభవార్త అందింది. వాహనాలపై పన్ను తగ్గింపుతో జావా, YZD బ్రాండ్ బైక్‌లు మరింత సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ధరల కారణంగా కొంచెం వెనుకంజ వేసిన కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ ఇప్పటికే తమ మోడళ్ల ధరలను తగ్గిస్తూ కొత్త లిస్టును ప్రకటించింది. ఇప్పుడు చాలా వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2 లక్షల లోపలికే వచ్చాయి. GST 2.0 కింద తీసుకున్న నిర్ణయం ప్రకారం, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గించబడింది. ఈ మార్పు వల్ల 293cc, 334cc లిక్విడ్-కూల్డ్ ఆల్ఫా2 ఇంజిన్‌లతో వస్తున్న జావా, YZD మోడళ్లకు నేరుగా ప్రయోజనం చేకూరింది.

కొత్త కార్ల కోసం కస్టమర్లు వెయిటింగ్..కారణం ఇదే

ఆగస్టు నెలలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల పరంగా నిలకడగా ఉంది. కానీ ఇది ఆందోళన కలిగించే విషయం కాదు, శుభవార్తే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదిక ప్రకారం.. భారీ డిమాండ్ ఉన్నప్పటికీ కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి? కొత్త జీఎస్టీ రేట్లు ఎందుకు అమ్మకాలను నిలిపివేశాయి? ఈ విషయంపై పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

కోట్ల ల్యాండ్ క్రూయిజర్‌తో స్టార్ హీరో

మమ్ముట్టి (Mammootty) అంటే సినీప్రపంచానికి గర్వకారణం. ఆయన నటనలో ఒక ప్రత్యేకమైన శక్తి, సహజత్వం ఉంటుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానిలో పూర్తిగా మమేకమైపోయే అరుదైన ప్రతిభ ఆయనది. నాలుగు దశాబ్దాలకుపైగా సాగుతున్న తన సినీప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి, దేశవ్యాప్తంగా ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా మలయాళ సినీ లోకానికి గర్వకారణమైన మమ్ముట్టి, తెలుగు సినిమాలతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన చేసిన కొన్ని తెలుగు సినిమాలు ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆయన సినిమాలు చాలా వరకు తెలుగులో కూడా డబ్ అయి సక్సెస్ అవుతుంటాయి. ఆయన గురించి వచ్చిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్‌గా మారిపోతుంది. తాజాగా కూడా అలాంటి ఘటనే జరిగింది.

స్కోడా నుంచి ఊహించని ఆఫర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో మార్పులు చేసింది. దీనివల్ల కార్ల ధరలు తగ్గుతాయని అందరికీ తెలుసు. అయితే, ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో స్కోడా కంపెనీ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. ధరలు తగ్గేదాకా ఆగకుండా, ఇప్పుడే కార్లను కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఈ తాత్కాలిక తగ్గింపు వల్ల కస్టమర్లకు జీఎస్టీ తగ్గింపు కంటే ఎక్కువ లాభం కలగనుంది.
Advertisement

సన్‌రూఫ్‌లో సరదాగా బయటకి చూస్తే ప్రాణాలకే ప్రమాదం

ఈ రోజుల్లో కార్లలో సన్‌రూఫ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది సరదాగా సన్‌రూఫ్ ద్వారా తల బయట పెట్టి ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు ఇలా చేయడం చూస్తుంటాం. కానీ ఇలా చేయడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా నిలిచింది. కారు సన్‌రూఫ్ నుంచి బయటకు చూస్తున్న ఒక బాలుడి తలకు ఇనుప కడ్డీ బలంగా తగిలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం గురించి తెలుసుకుందాం. బెంగళూరులోని జేకేవీకే రోడ్డులో ఒక కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వీడియోలో ఒక ఎరుపు రంగు మహీంద్రా XUV 3XO కారు సన్‌రూఫ్ నుంచి ఒక చిన్న పిల్లాడు తల బయట పెట్టి చూస్తుంటాడు. కారు డ్రైవర్ రోడ్డుపై జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ, పిల్లాడి భద్రతను పట్టించుకోలేదు.

మార్కెట్లోకి కొత్త సెన్సేషన్ జూమ్ 160.. బైక్‌లా ఫీల్ ఇచ్చే స్కూటర్ రివ్యూ

Hero MotoCorp launches Xoom 160 in India, priced at ₹1,44,999. It features a 160 cc engine, adventure-ready design, and practical features. | హీరో మోటోకార్ప్ భారతదేశంలో Xoom 160ని విడుదల చేసింది, దీని ధర ₹1,44,999. ఇది 160 cc ఇంజిన్, అడ్వెంచర్-రెడీ డిజైన్ మరియు ఆచరణాత్మక ఫీచర్లను కలిగి ఉంది.

కోటి మందికి పైగా కొనేసిన కారు.. మీ ఇంట్లో ఉందా ఆ లెజెండ్?

మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) పేరు వినగానే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకమైన అనుబంధం గుర్తుకు వస్తుంది. కారు కొనాలనుకున్న మొదటి క్షణం నుంచే స్విఫ్ట్ ఒక కలల కారు లాగా నిలుస్తోంది. చిన్న కారు విభాగంలో సరసమైన ధర, స్టైలిష్ డిజైన్, విశ్వసనీయత, మైలేజ్ కలిపి స్విఫ్ట్‌ను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. అందుకే 20 ఏళ్లుగా భారతీయ రోడ్లపై ఈ కారు రాజ్యం చేస్తూ వస్తోంది. మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు వస్తున్నప్పటికీ, స్విఫ్ట్ ఆకర్షణ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఆధునిక ఫీచర్లు, అప్‌డేట్ చేసిన వెర్షన్లు, కొత్త తరం డిజైన్లతో మారుతి సుజుకి ఈ కారును కాలానికి తగ్గట్టు మార్చుకుంటూ వచ్చింది. అదే కారణంగా ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుని, తరతరాలుగా ఒకే కుటుంబంలో వరుసగా కొనుగోలు అవుతున్న కారు అన్న పేరు సంపాదించుకుంది.

కాస్త ఆగితే బెంజ్ కార్ల పై రూ.11 లక్షలు మిగిలే ఛాన్స్

కొత్త కారు కొనాలనుకునేవారికి పండుగ వాతావరణం నెలకొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కార్ల ధరలు కిందకు దిగొస్తున్నాయి. మామూలు కార్ల కంపెనీలే కాదు, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు కూడా తమ కార్ల ధరలను భారీగా తగ్గించాయి. మెర్సిడెస్ బెంజ్ ఏకంగా తమ కార్లపై రూ. 11 లక్షల వరకు ధర తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ఏ మోడల్‌పై ఎంత ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం
Advertisement

కేవలం 5 లక్షలలోనే కారు.. మారుతి సుజుకి సెలెరియో కొత్త ధర

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో మంచి డిమాండ్‌ను సంపాదించిన మోడల్‌గా నిలిచింది. కానీ తాజాగా మార్కెట్ పరిస్థితులు మారడంతో, ఈ కారుకు అంతగా డిమాండ్ రాలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్ నుండి జూలై వరకు) సెలెరియో అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నాలుగు నెలల్లో కేవలం 6,765 యూనిట్లే అమ్ముడవ్వడం వల్ల, నెలకు సగటున 1,691 కార్లు మాత్రమే రోడ్ల మీదకు వచ్చాయి. ఈ సంఖ్య మారుతి సుజుకి లైనప్‌లో చాలా తక్కువ. బలమైన పోటీదారుల మధ్యలో నిలబడే ఇతర మోడళ్లతో పోలిస్తే, సెలెరియో అమ్మకాల పరంగా వెనుకబడిపోయినట్టే అనిపిస్తుంది. ఇకపోతే, ఇది మారుతి సుజుకి అత్యల్పంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా కూడా గుర్తించబడుతోంది.