కేవలం 5 లక్షలలోనే కారు.. మారుతి సుజుకి సెలెరియో కొత్త ధర
ఆటోమొబైల్స్
- 1 year, 11 days ago
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో మంచి డిమాండ్‌ను సంపాదించిన మోడల్‌గా నిలిచింది. కానీ తాజాగా మార్కెట్ పరిస్థితులు మారడంతో, ఈ కారుకు అంతగా డిమాండ్ రాలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్ నుండి జూలై వరకు) సెలెరియో అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నాలుగు నెలల్లో కేవలం 6,765 యూనిట్లే అమ్ముడవ్వడం వల్ల, నెలకు సగటున 1,691 కార్లు మాత్రమే రోడ్ల మీదకు వచ్చాయి. ఈ సంఖ్య మారుతి సుజుకి లైనప్‌లో చాలా తక్కువ. బలమైన పోటీదారుల మధ్యలో నిలబడే ఇతర మోడళ్లతో పోలిస్తే, సెలెరియో అమ్మకాల పరంగా వెనుకబడిపోయినట్టే అనిపిస్తుంది. ఇకపోతే, ఇది మారుతి సుజుకి అత్యల్పంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా కూడా గుర్తించబడుతోంది.