రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఆప్షన్.. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC ధర, ఫీచర్స్

భారతదేశంలో టూవీలర్ మార్కెట్‌కి ఎప్పటికీ ఒక స్థిరమైన డిమాండ్ ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా ఉపయోగించుకునే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను జనాలు బాగా ఇష్టపడుతుంటారు. ఈ తరహా బైకులు కేవలం రవాణా అవసరాలకే కాదు, కుటుంబం, ఉద్యోగం, వ్యవసాయ పనులు వంటి అనేక రోజువారి పనుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, తక్కువ ఫ్యూయల్ వినియోగంతో ఎక్కువ ప్రయాణం చేయగలిగే బైక్‌లు అందరికి బాగా నచ్చుతాయి. ఈ నేపథ్యంలోనే హీరో మోటోకార్ప్ అందించిన సూపర్ స్ప్లెండర్ XTEC మోడల్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది సాధారణ మోటార్‌సైకిల్ మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతను గ్రామీణ రోడ్లపై కూడా నమ్మకంగా నడిచేలా రూపొందించిన మోడల్.

జూలైలో టాప్-5లో స్థానం దక్కించుకున్న మారుతి స్విఫ్ట్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే వినియోగదారుల్లో ఓ నమ్మకం కనిపిస్తుంది. సంవత్సరాలుగా ప్రజల మనసులో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఈ బ్రాండ్, ప్రత్యేకించి మారుతి స్విఫ్ట్ (Swift) వంటి మోడళ్లతో మరింతగా ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రతి నెలా కార్ల సేల్స్ జాబితాల్లో మారుతి స్విఫ్ట్ పేరు మెరుగైన గణంకాలతో కనిపించటం సాధారణమే. శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అత్యుత్తమ మైలేజీ, చక్కని డిజైన్, సురక్షితమైన ఫీచర్లు ఇవన్నీ కలగలిపి అద్భుతమైన కారుగా ఇది అందరి చేత ఆదరణను పొందుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకుంటూ, మారుతి సుజుకి సంస్థ మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. తాజాగా విడుదలైన గణంకాలను చూసినట్లయితే ఈ కారు డిమాండ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది.

రేర్ ఎర్త్ మాగ్నెట్ దెబ్బకు చిత్తైన బజాజ్.. ఈవీ అమ్మకాలలో భారీ పతనం

ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చని చాలామంది నమ్ముతారు. అందుకే, ఓలా, ఏథర్ వంటి కంపెనీలు మంచి రేంజ్, ఫీచర్లతో స్కూటర్లు విడుదల చేసి మార్కెట్‌ను పాలిస్తున్నాయి. ఈ పోటీలోకి ఎలక్ట్రిక్ స్కూటర్లతో వచ్చిన బజాజ్ కూడా వాటికి గట్టి పోటీనిచ్చింది.

స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే 100కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌లలో జెలియో ఎలక్ట్రిక్ (Zelio Electric) ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అత్యంత సరసమైన ధరలో కొత్త నైట్+(Knight+) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
Advertisement

టీవీఎస్ నుంచి కొత్త మ్యాక్సీ స్టైల్ స్కూటర్ వచ్చేస్తుంది

TVS మోటార్స్ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో ఆసక్తికరమైన అడుగువేసింది. ఇది సాంప్రదాయిక స్కూటర్లతో కాకుండా, మ్యాక్సీ-స్టైల్ లో రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో పరిచయం చేస్తోంది. M1-S అనే పేరుతో పిలవబడే ఈ కొత్త మోడల్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వస్తుందని తెలుస్తుంది. ఈ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రస్తుతానికి తీసుకురావడం లేదని సమాచారం. కానీ భవిష్యత్తులో ఇది ఇండియాలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్న iQube సిరీస్‌కు ఇది ఒక శక్తివంతమైన భాగస్వామిగా నిలవవచ్చు. మ్యాక్సీ-స్కూటర్ డిజైన్ అనేది పెద్దగా స్పేస్, లాంగ్ రైడింగ్ కమ్ఫర్ట్‌ను కోరుకునే వినియోగదారులకు తగిన ఎంపిక అవుతుంది.

40 ఏళ్ల చరిత్ర.. జీ-క్లాస్ సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?

లగ్జరీ కార్లు అనగానే మనకు గుర్తొచ్చే పేరు మెర్సిడెస్ బెంజ్. ఈ కంపెనీకి చెందిన జీ-క్లాస్ మోడల్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ కారు ధర చాలా ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ధనవంతుల మనసులను గెలుచుకుంది. ఇప్పటివరకు ఈ కారు ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయి? దీని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రాంక్స్ ఫైర్‌.. ఒక్క నెలలో 12,900 యూనిట్ల విక్రయాలు!

భారతీయ ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన ఫ్రాంక్స్ (Fronx) SUV విభాగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరు ఈ కారుకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్టైలిష్‌గా ఉండే బాడీ లైన్లు, స్మార్ట్ LED లైటింగ్, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ అన్ని కలిసి దీనికి ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇది నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతోపాటు దూర ప్రయాణాల్లోనూ సౌకర్యంగా ఉండేలా రూపొందించబడింది. అందుకే ఈ కారుకు డిమాండ్ సానుకూలంగా ఉంటుంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, మార్కెట్‌లో దీనిపై ఉన్న డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ SUV ని కొనుగోలు చేయాలనే ఆసక్తి గల వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదీ స్పష్టంగా అర్థం అవుతుంది.

టెస్లా ఇండియాలో మూడు షోరూమ్‌లు.. ఎక్కడెక్కడో తెలుసా?

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న టెస్లా ఇప్పుడు భారత్‌లో వేగంగా తన అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఢిల్లీలో రెండో షోరూమ్ తెరవడానికి సిద్ధంగా ఉంది.. ఇక ఇప్పుడు మూడో షోరూమ్‌కు కూడా స్థలాన్ని ఎంపిక చేసుకుంది. ఈ కొత్త షోరూమ్ ఎక్కడ వస్తుంది, దానికి అద్దె ఎంత అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

లీటరుకు 30 కిమీ మైలేజ్! బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే..!

భారతీయ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుండటం, జీవన వ్యయాలు పెరగడం వంటివి వినియోగదారులను ఖర్చు పై శ్రద్ధ పెట్టేలా చేస్తాయి. అంతేకాదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువ పొందాలనే ఆలోచన మరింత పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో తక్కువ ధర, మంచి మైలేజ్, అందమైన డ్రైవింగ్ అనుభూతి కలిగించే కార్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కుటుంబ ప్రయాణాలకు సరిపోయేంత స్థలం, ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ధర, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలే చాలామంది ఎంపికను ప్రభావితం చేస్తాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి సెలెరియో, ఆల్టో K10, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వంటి కార్లు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న మోడల్స్. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

మార్కెట్లోకి ట్రయంఫ్ త్రక్స్‌టన్ 400.. కొత్త కేఫ్ రేసర్ బైక్ లాంచ్!

కొత్తగా బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ట్రయంఫ్ నుంచి సరికొత్త త్రక్స్టన్ 400 కఫే రేసర్ మార్కెట్లోకి వచ్చేసింది. కేవలం రూ. 2.74 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభించే ఈ బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఒక్క జూలైలో 12 వేల కార్లు.. బాలెనో అంటేనే నమ్మకం అంటున్నారు

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించడంలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడూ ముందుంటుంది. అటువంటి బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ - బాలెనో (Baleno), ఇప్పుడు భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కారులలో ఒకటిగా నిలిచింది. దాదాపు ప్రతి నెలా, ఈ కారుకు గల డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్టైలిష్ లుక్, విస్తృతమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో బాలెనో అనేది ఒక మంచి ఆప్షన్‌గా మారింది. ప్రత్యేకించి నగరాల్లో ఉండే యువత నుంచి, చిన్న కుటుంబాల వరకు ఇది ఒక పర్ఫెక్ట్ కారుగా పేరు తెచ్చుకుంది. ఫ్యూయల్ సామర్థ్యం పరంగా బాలెనో నిరూపించుకున్న మోడల్. పెట్రోల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, మంచి మైలేజీ అందించడంతో ఇది వినియోగదారుల మనసు దోచుకుంది.

జస్ట్ 10 లక్షలు.. ఈ SUVల స్టైల్ చూస్తే ఫ్యామిలీ మొత్తం ఫిదా అవుతుంది!

ఇప్పుడు కారుల ఎంపికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రజలు తక్కువ సైజు సెడాన్ల వైపు మొగ్గు చూపేవారు. అందుబాటులో ఉండే ధర, మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకునేవారు. అయితే, ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. స్టైల్, రోడ్ ప్రెజెన్స్, ఇంటీరియర్ స్థలం వంటి అంశాలను ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో ఇది SUVల విపరీతమైన డిమాండ్‌కు దారితీసింది. పొడవైన, ఎత్తైన SUVలు ఇప్పుడు ప్రతి కుటుంబం కలల కారు లాంటి స్థాయికి చేరుకున్నాయి. ఇంటీరియర్ స్పేస్, హైడ్ డ్రైవింగ్ పొజిషన్, బూట్ స్పేస్,సురక్షితంగా ఉండే ఫీల్ వంటి అంశాలు SUVల వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు కొత్త SUVలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం, రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో ఆకర్షణీయమైన SUVలను ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.
Advertisement

హ్యుందాయ్ లగ్జరీ బ్రాండ్ జెనసిస్ ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా?

లగ్జరీ కార్లంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ లాంటి బ్రాండ్స్. ఇప్పుడు ఆ జాబితాలోకి హ్యుందాయ్ మోటార్స్ నుండి ఒక కొత్త పేరు చేరబోతోంది. అదే జెనసిస్ బ్రాండ్. హ్యుందాయ్ లగ్జరీ డివిజన్ అయిన జెనసిస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా వంటి కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతున్న ఈ సంస్థ, జెనసిస్‌తో లగ్జరీ కార్ల మార్కెట్‌లో కూడా అడుగు పెట్టనుంది. మరి జెనసిస్ ఎప్పుడు వస్తుంది, దాని ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్.. అద్భుతమైన గ్లామర్, 5-స్టార్ సేఫ్టీ!

నిస్సాన్ కంపెనీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మాగ్నైట్ కారు. ఈ ఒక్క కారుతోనే నిస్సాన్ భారత మార్కెట్లో చాలా గట్టిగా నిలబడింది. మాగ్నైట్ లాంచ్ అయి దాదాపు ఐదేళ్లు అవుతున్నా, దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్‌ను కొత్త లుక్‌లో కురో ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్ కలర్, అదిరిపోయే ఫీచర్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తున్న ఈ కారు ధర, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.90,000 వరకు డిస్కౌంట్! రెనాల్ట్ బంపర్ ఆఫర్

తక్కువ ధరలో అదిరిపోయే కార్లను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారికి రెనాల్ట్(Renault) కంపెనీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్లైన క్విడ్, ట్రైబర్, కిగర్‌లపై ఆగస్టులో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అమ్మకాలను పెంచాలనే ఉద్దేశంతో, రెనాల్ట్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి సేల్స్ పెంచడానికి మోడళ్ల వారీగా కంపెనీ గరిష్ఠంగా రూ.90,000 వరకు ప్రయోజనాల వరకు అందిస్తుంది. ఇందులో కాష్ డిస్కౌంట్‌లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి వాటితో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన వేరియంట్లపై అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెనాల్ట్ తీసుకున్న ఈ నిర్ణయం, పెరుగుతున్న మార్కెట్ పోటీ మధ్య మరింత సానుకూలతను తీసుకురానుంది.

ఓలా 'సంకల్ప్ 2025'.. ఆగస్టు 15న కొత్త ఉత్పత్తుల ప్రకటన!

ఓలా ఎలక్ట్రిక్ అంటే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్కూటర్లే. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓలా ఒక పెద్ద పేరు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్త మోడళ్లను, టెక్నాలజీలను పరిచయం చేయడం ఓలాకు ఒక ఆనవాయితీగా మారింది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15న 'సంకల్ప్ 2025' పేరుతో ఒక పెద్ద ఈవెంట్‌ను నిర్వహించనుంది. మరి ఈ ఈవెంట్‌లో ఓలా ఎలాంటి కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయబోతుంది? ఈసారి ఏం కొత్తగా ఆవిష్కరించనుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

డ్యూయల్ టోన్ డిజైన్‌తో సుజుకి అవెనిస్ కొత్త వేరియంట్.. యూత్‌కు స్పెషల్ గిఫ్ట్!

భారత టూవీలర్ వాహన మార్కెట్లో నిలకడగా తన స్థానం నిలుపుకుంటున్న సుజుకి (suzuki) మోటార్‌సైకిల్, యాక్సెస్ స్కూటర్‌తో కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. మెరుగైన మైలేజ్, మన్నికైన ఇంజిన్, స్మూత్ డ్రైవింగ్ అనుభవంతో యాక్సెస్ సిరీస్ ఇప్పటికే మార్కెట్‌లో హాట్ ఫేవరెట్ అయింది. ఇప్పుడు, అదే విజయాన్ని మరింత బలోపేతం చేస్తూ సుజుకి కంపెనీ తన మరో ప్రముఖ మోడల్ అయిన అవెనిస్ (Avenis) స్కూటర్‌ను రిఫ్రెష్ చేసి మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవెనిస్ స్కూటర్‌ను ఈసారి నూతన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో విడుదల చేశారు. కొత్త కలర్ కాంబినేషన్లు, స్టైలిష్ గ్రాఫిక్స్, స్పోర్టీ డిజైన్‌తో ఈ స్కూటర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.

ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్లలోనే టాటాకు చెమటలు పట్టించిన ఎంజీ

కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఎంజీ మోటార్ గురించి తప్పకుండా వినే ఉంటారు. ఈ సంస్థ భారత్‌లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆరేళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు టాటా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల జేఎస్‌డబ్ల్యూతో చేతులు కలిపి మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. మరి ఈ ఆరేళ్లలో ఎంజీ సంస్థ సాధించిన విజయాలు ఏంటి? ప్రస్తుతం ఎంజీ అందిస్తున్న ఆఫర్లు, కొత్త మోడళ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా దూసుకుపోతోంది.. 1 లక్ష స్కూటర్ల సేల్స్

భారతదేశపు టూవీలర్ రంగం ప్రస్తుతం ఓ కీలక మార్గంలో ప్రయాణిస్తోంది. పెట్రోలు ధరల పెరుగుదల, పర్యావరణంపై పెరుగుతున్న ఆలోచనలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ప్రభావంతో, ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం వేగంగా పెరుగుతోంది. మార్కెట్ వాతావరణం ఇలా మారుతున్న వేళ, దేశంలోని పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఈ మార్పును ముందుగానే గ్రహించిన సంస్థల్లో ఒకటే హీరో మోటోకార్ప్ (Hero Motocorp). దేశవ్యాప్తంగా మోటోరైజ్డ్ టూవీలర్ మార్కెట్‌ను శాసించిన ఈ సంస్థ, 2022 అక్టోబర్‌లో విడా (Vida) అనే ప్రత్యేక ఎలక్ట్రిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇది హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రయాణానికి ఒక కొత్త ఆరంభం.

మెట్రో నగరాలపై ఎలన్ మస్క్ ఫోకస్..త్వరలోనే టెస్లా రెండో షో రూమ్ ఓపెన్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన అడుగులను బలంగా వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్‌ను తెరవబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టెస్లా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కొత్త షోరూమ్ ఎక్కడ ఉంది. ఏ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

ఇన్నోవా రికార్డ్ క్రియేట్ చేసింది.. 12 లక్షల కార్లు అమ్ముడయ్యాయి!

టయోటా (Toyota) భారతదేశంలో వాహన మార్కెట్‌లో దిగ్గజ బ్రాండ్‌లలో ఒకటి. అంతర్జాతీయంగా తన సత్తాను చాటుతూ, ఇండియాలో కూడా తన హవాను చూపిస్తుంది. ఈ కంపెనీ నుంచి అనేక కార్లు ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. టయోటా ప్రసిద్ధ మోడల్ ఇన్నోవా (Innova) తాజాగా కీలక మైలురాయికి చేరుకుంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఈ కారు విడుదలైన 2005 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా, భారతీయ కుటుంబాల మనసులు గెలుచుకుంటూ వచ్చింది. ఒక MPV (మల్టీ పర్పస్ వెహికల్) అయినా, ఇది సాధారణంగా చూసే కార్ల కన్నా భిన్నంగా నిలుస్తుంది. అందుకే 20 ఏళ్లుగా భారతీయ ప్రజల అభిమానాలను పొందుతుంది.

రూ.10 లక్షల బడ్జెట్‌లో టాప్ 3 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే..!

భారతదేశంలో కార్ల కొనుగోలు అనేది కేవలం ఓ వాహనం తీసుకోవడం మాత్రమే కాదు, అది ఆ కుటుంబం ఆర్ధిక స్థితిని, అవసరాలను ప్రతిబింబించే ఒక కీలక నిర్ణయం. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, మెరుగైన పనితీరును అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రధానంగా మధ్యతరగతి వారు ప్రత్యేకించి రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, మైలేజ్, భద్రతా ప్రమాణాలు ఉండే కారును ఎంచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంటారు. ఈ ఆగస్టు 2025లో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన మూడు కార్లు వాటి ధర, లక్షణాలు, ప్రాక్టికాలిటీ విషయంలో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది.

టాటా హారియర్ కొత్త అడ్వెంచర్ రేంజ్.. ఫీచర్లు అవే... ధర తక్కువ

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్ తమ ప్రముఖ హారియర్ ఎస్‌యూవీలో మరిన్ని మార్పులతో కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. కొత్తగా వచ్చిన అడ్వంచర్ X, అడ్వంచర్ X+ వేరియంట్‌ల ధరలు రూ.18.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది పాత మోడల్‌తో పోలిస్తే ఏకంగా రూ.55,000 వరకు తక్కువ. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త హారియర్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఏథర్ రిజ్వా.. అమ్మకాలలో సరికొత్త రికార్డు, కారణాలు ఇవే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఇప్పుడు దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన రిజ్వా స్కూటర్‌కు కస్టమర్ల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏథర్ కంపెనీ ఏకంగా 46,078 యూనిట్లను అమ్మింది. గతేడాదితో పోలిస్తే ఇది 97% ఎక్కువ. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement

ఒక్క ఛార్జ్‌తో 175 కి.మీ.. రూ.1.27 లక్షలకే అందుబాటులోకి ఒబెన్ బైక్

ఎలక్ట్రిక్ బైకులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో సేల్స్ సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విభాగంలో చాలా కంపెనీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో తనదైన ముద్ర వేసుకుంటోంది. రోర్ మోడల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ట్-అప్ సంస్థ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా మరింత స్మార్ట్‌గా, అప్‌డేట్ చేసిన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తాజాగా కంపెనీ ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా (oben rorr ez sigma) పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గత వర్షన్ రోర్ ఈజీకి కొత్త రూపం అని చెప్పొచ్చు. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది.