జూలైలో అమ్మకాలు తగ్గినా బ్రెజ్జా డిమాండ్ ఇంకా హై

దేశీయ దిగ్గజ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki)కి చెందిన బ్రెజ్జా (Brezza), భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన నమ్మకమైన SUV. స్టైలిష్, కాంపాక్ట్ డిజైన్‌తో పాటు, డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండటం దీని ప్రధాన బలాలు. రోడ్డుపై దాని ప్రెజెన్స్, ప్రాక్టికల్ సైజు, ఫీచర్స్ ఇవి అన్నీ కలిపి బ్రెజ్జాను కుటుంబాలకే కాకుండా యువతరానికి కూడా ఒక సరైన ఎంపికగా నిలిపాయి. పనితీరులోనూ ఇది తన క్లాస్‌లో ఒక నమ్మకమైన మోడల్‌గా ప్రసిద్ధి చెందింది. జూలై నెల ముగిసిన నేపథ్యంలో మారుతి ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూలై 2025లో బ్రెజ్జా మొత్తం 14,065 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

బొలెరోలో ఏడీఏఎస్.. డ్రైవింగ్ సేఫ్టీని పెంచే అత్యాధునిక ఫీచర్స్ ఇవే!

మహీంద్రాకు అత్యధికంగా అమ్ముడైన, విశ్వసనీయమైన ఎస్‌యూవీలలో బొలెరో ఒకటి. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో దీనికి ఉన్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. ఇప్పుడు, ఈ ఐకానిక్ ఎస్‌యూవీ 2026లో కొత్త జనరేషన్‌తో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది పాత బొలెరో దృఢత్వాన్ని నిలుపుకుంటూనే, ఆశ్చర్యపరిచే డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో రానుందని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ కొత్త బొలెరోలో ఏమేమి ఫీచర్లు ఉండబోతున్నాయో చూద్దాం.

మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ ఆవిష్కరణ

భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకి (Maruti Suzuki) తన కార్ల విక్రయానికి ప్రత్యేక డీలర్ నెట్‌వర్క్‌ ద్వారా కస్టమర్లకు చేరువ అవుతుంది. తాజాగా ప్రీమియం కార్ల విక్రయానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నెక్సా డీలర్‌షిప్ నెట్‌వర్క్, భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది విజయవంతంగా 10 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. 2015లో ఆరంభమైన ఈ ప్రీమియం సేల్స్ చానల్, ఇప్పటివరకు లక్షలాది కార్లను వినియోగదారుల చేతికి చేర్చింది. ఈ పదవ వార్షికోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, కంపెనీ తన ప్రీమియం SUV అయిన గ్రాండ్ విటారా కొత్త 'ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ (PHANTOM BLAQ Edition)'ను ఆవిష్కరించింది.

క్లాసిక్ స్టైల్, మోడ్రన్ పర్ఫార్మెన్స్.. మార్కెట్లోకి ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400

Triumph Thruxton 400 launched in India at ₹2.74 lakh. It blends classic style with a 398cc engine, clip-on bars, and bar-end mirrors. | ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 భారతదేశంలో ₹2.74 లక్షలకు విడుదల అయింది. ఇది క్లాసిక్ శైలిని 398cc ఇంజిన్, క్లిప్-ఆన్ బార్‌లు మరియు బార్-ఎండ్ మిర్రర్‌లతో మిళితం చేస్తుంది.
Advertisement

పండుగ సీజన్లో కొత్త బైక్ కొంటున్నారా? రూ. 1 లక్ష లోపు బెస్ట్ 125సీసీ బైక్స్ ఇవే!

భారత మార్కెట్లో 125 సీసీ సెగ్మెంట్‌లోని బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. ఇవి మంచి మైలేజీతో పాటు, స్టైలిష్ డిజైన్, పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా పండుగ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో, చాలామంది కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం రూ.లక్ష లోపు లభించే టాప్ 5 బెస్ట్ 125 సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.

ఎంజీ విండ్‌సార్ ఈవీ కొనే వారికి షాక్.. ఇక పాత ధరలకు కొనడం అసాధ్యం!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాడకం బాగా పెరిగింది. టాటా, ఎంజీ, హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు తమ కొత్తకొత్త ఈవీలను నిరంతరం మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏదైనా ఉందంటే, అది ఎంజీ విండ్‌సర్ ఈవీ. ఈ కారు ఇప్పుడు చాలామందికి ఒక కల. అయితే, ఈ కారు కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. దీని ధర మళ్లీ పెరిగింది.

అత్యంత చవకైన ఎస్‌యూవీ రెనాల్ట్ కైగర్ ధర పెంపు

దేశంలో అత్యంత సరసమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా పేరుపొందిన రెనాల్ట్ కైగర్ ధర ఇప్పుడు పెరిగింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.10 లక్షలు ఉండగా, ప్రస్తుతం అది రూ. 6.15 లక్షలకు పెరిగింది. అంటే, కంపెనీ ఈ కారుపై రూ.5,000 పెంచింది. అదే విధంగా, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర కూడా రూ. 7.35 లక్షల నుంచి రూ. 7.40 లక్షలకు పెరిగింది.

భవిష్యత్తు లుక్‌తో ఎలక్ట్రిక్ బైక్.. భారత యువకుడి ప్రతిభకు ప్రపంచం ఫిదా!

నేటి భారతీయ యువత ప్రతిభ, సృజనాత్మకత, పట్టుదల ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి చేరుకున్నాయి. చదువులోనూ, టెక్నాలజీలోనూ, ఆవిష్కరణల్లోనూ వారు చూపిస్తున్న ప్రతిభ అనేక దేశాలలో అనేక రంగాలలో ప్రకాశిస్తోంది. మనం తరచూ వార్తాపత్రికలలో లేదా సోషల్ మీడియాలో, గ్యారేజీల్లో, చిన్న వర్క్‌షాప్‌లలో, లేదా ఇంటి వెనుక ప్రాంగణంలోనే తయారైన వినూత్న కార్లు, బైక్‌లు చూసే ఉంటాం. కానీ, ఈ సారి వెలుగులోకి వచ్చిన కథ మాత్రం అందులో ప్రత్యేకం. ఎందుకంటే ఇది కేవలం ఒక బైక్ కాదు, భారతీయ ఇంజనీర్‌ ప్రతిభకు నిదర్శనం. ఒక యువకుడు తన సొంత ఇంట్లోనే, పూర్తిగా పనిచేసే హబ్‌లెస్ ఎలక్ట్రిక్ బైకును డిజైన్ చేసి, నిర్మించగలిగాడు. వీల్స్‌కు సాంప్రదాయ హబ్ లేకుండా ఉండే ఈ డిజైన్, భవిష్యత్తు వాహనాల రూపకల్పనను తలపిస్తుంది.
Advertisement

బైక్ ప్రేమికులకు నిరాశ.. స్పీడ్ 400 రోడ్‌స్టర్ ధర పెరిగింది!

బ్రిటిష్ టూవీలర్ వాహనాల తయారీ దిగ్గజం ట్రయంఫ్ (Triumph), కొంతకాలం వరకు లగ్జరీ బైక్స్‌కే పరిమితమై ఉండి, అధిక ధరల కారణంగా కేవలం కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, 400cc సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఈ కంపెనీ భారత మార్కెట్‌లో తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంది. సాధారణంగా ఉన్నత వర్గానికి మాత్రమే కాకుండా, మధ్యతరగతి బైక్ ప్రేమికులకు కూడా ట్రయంఫ్ తన వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రయాణానికి నాంది పలికింది జూలై 2023లో. ఈ సమయంలో ట్రయంఫ్ ఒకేసారి రెండు మోడళ్లను భారతదేశంలో ఆవిష్కరించింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X ద్వారా వినియోగదారుల మనసును గెలవడం మొదలుపెట్టింది. వీటిలో స్పీడ్ 400 దేశంలో తొలిసారిగా వచ్చిన రోడ్‌స్టర్ వెర్షన్ కావడం విశేషం.

టాటా నెక్సాన్, క్రెటాకు పోటీగా కొత్త డస్టర్.. ఇక దబిడిదిబిడే

రెనాల్ట్ డస్టర్.. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవర్ఫుల్ ఎస్‌యూవీ. ఈ కారును 2012లో దేశీయంగా విడుదల చేశారు. ఆ తర్వాత 2020 వరకు మార్కెట్లో చాలా బాగా అమ్ముడైంది. అయితే, కొన్ని కారణాల వల్ల డస్టర్ అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు అదే ఎస్‌యూవీని సరికొత్త రూపంలో మళ్లీ తీసుకురావడానికి రెనాల్ట్ సిద్ధమవుతోంది. త్వరలో రాబోయే కొత్త రెనాల్ట్ డస్టర్ ధర ఎంత ఉండవచ్చు, దాని ఫీచర్స్ ఏంటి వంటి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఐయోనిక్ 5పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకంటే

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల వాడకం రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అయిన ఐయోనిక్ 5 పై ఊహించని డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆగస్టు నెలలో కంపెనీ తమ 2024 మోడల్ సంవత్సరానికి చెందిన మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ భారీ ఆఫర్‌ను అందిస్తోంది.

జూలై 2025లో మహీంద్రా స్కార్పియో సేల్స్ ఊహించని రీతిలో పెరిగాయి

దేశీయ దిగ్గజ వాహన తయారీదారు అయినటువంటి మహీంద్రా (Mahindra) శక్తివంతమైన పనితీరుతో కూడిన వాహనాలను విడుదల చేస్తుంది. ప్రధానంగా ఎస్‌యూవీ స్టైల్‌కు చెందిన వాటిని తీసుకురావడంలో ఈ కంపెనీ ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలోనే స్కార్పియో (Scorpio)ను తీసుకొచ్చింది. ఈ కారు తన సొగసైన డిజైన్‌తో పాటు, డజన్ల కొద్దీ ఆధునిక ఫీచర్లను కలిగి ఉండటం వల్ల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైల్, సౌకర్యం, టెక్నాలజీ.. ఈ మూడు అంశాల్లోనూ అభిమానాన్ని సాధించిన మోడల్‌గా ఇది మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ కారణంగానే, వినియోగదారులు దీన్ని విశ్వసనీయంగా ఎంచుకుంటూ, కొనుగోలు జాబితాలో ముందు ఉంచుతున్నారు. దానికి తాజా నిదర్శనంగా జూలై 2025లో దీని అమ్మకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి.
Advertisement

ఇండియాలో విన్‌ఫాస్ట్ దూకుడు.. త్వరలో 7-సీటర్ ఎస్‌యూవీ

ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారికి ఇప్పుడు మంచి సమయం నడుస్తోంది. స్వదేశీ బ్రాండ్‌లతో పాటు, కొన్ని ప్రపంచ స్థాయి విదేశీ కంపెనీలు కూడా భారత మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా రాక దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే, టెస్లాకు విదేశీ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పుడు భారతదేశంలో కూడా అడుగుపెట్టింది.

డిజైర్ నుంచి టిగోర్ వరకు.. రూ.10 లక్షలలో అందుబాటులో ఉన్న బెస్ట్ సెడాన్‌లు!

ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల క్రేజ్ అమాంతం పెరిగిపోయినా, సెడాన్ కార్లకు ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎవరూ కాదనలేరు. స్లీక్ డిజైన్, సౌకర్యవంతమైన రైడ్, హైవేల్లో అందించే స్మూత్ డ్రైవింగ్ అనుభవం, ఇవన్నీ సెడాన్‌లను ఇంకా అనేకమందికి ఇష్టంగా ఉంచుతున్నాయి. తాజాగా కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు కూడా SUVలతో పాటు సెడాన్‌ల వైపు చూపు మళ్లించడం గమనించదగ్గ విషయం. దానికి నిదర్శనంగా, మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు స్థానాన్ని దక్కించుకుంది. ఇది ప్రస్తుత SUV ఆధిపత్యం మధ్యలో కూడా సెడాన్‌లు ఎంతటి స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయో స్పష్టంగా చూపిస్తుంది.

భారత మార్కెట్లో గేమ్ చేంజ్ చేయబోతున్న సిట్రోయెన్

కారు మార్కెట్లో సత్తా చాటడానికి సిట్రోయెన్ ఇండియా కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఈ కొత్త వ్యూహానికి సిట్రోన్ 2.0 అని పేరు పెట్టింది. ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం, భారతదేశంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడం. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మోడల్స్‌లో కొత్త అప్‌డేట్స్‌, రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ వ్యూహం అంతా కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

థార్ అభిమానులు సిద్ధం కావాలి.. సెప్టెంబర్ 1న రానున్న కొత్త 3-డోర్ వెర్షన్!

మహీంద్రా (Mahindra) ఆఫ్-రోడ్ SUV విభాగంలో తన థార్ (Thar) మోడల్‌తో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చాలా ఏళ్లుగా 3-డోర్ల వెర్షన్‌ను మాత్రమే అందిస్తూ, ఈ కారు అడ్వెంచర్ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఇదే విభాగంలో మారుతి సుజుకి, జిమ్నీని 5-డోర్ల మోడల్‌గా విడుదల చేసి పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇప్పుడు, భారత మార్కెట్‌లో మంచి అమ్మకాలు సాధిస్తున్న తన 3-డోర్ల థార్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా మహీంద్రా ముందడుగు వేసింది. కొత్తగా అప్‌డేట్ చేసిన ఈ మోడల్‌ను సెప్టెంబర్ 1న అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్‌డేట్‌తో థార్ అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Advertisement

ఆగస్టు 2025లో ఆల్టో K10 వెయిటింగ్ పీరియడ్ ఇలా ఉంది

మారుతి సుజుకి ఆల్టో కె10 (Maruti Suzuki Alto k10) మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకున్న హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగాంచింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు, సౌకర్యవంతమైన ఇంటీరియర్, నమ్మదగిన పనితీరుతో భారతీయ ప్రజల మనసును గెలుచుకుంది. ఇది దశాబ్దాలుగా స్థిరంగా అమ్ముడవుతూ, తన విశ్వసనీయత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో భారతీయ కుటుంబాల్లో ఒక స్థానం సంపాదించింది. రోజువారీ ప్రయాణాలకైనా, చిన్న కుటుంబ అవసరాలకైనా, ఆల్టో K10 సరైన ఎంపికగా నిలుస్తోంది. ఈ కారుకు డిమాండ్ ఇప్పుడు భారీగానే ఉంది. తాజాగా కార్‌డెకో దేశంలోని వివిధ నగరాల్లో ఆగస్టు నెలలో ఆల్టో K10 వెయిటింగ్ పీరియడ్‌పై ఒక నివేదికను వెల్లడించింది. ఇది దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత పవర్‌ఫుల్ బైక్ వచ్చేస్తోంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలో రాబోతోంది. కంపెనీ తమ లైనప్‌లో అత్యంత శక్తివంతమైన బైక్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750ను విడుదల చేయబోతోందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కొత్త మోడల్స్, కాన్సెప్ట్ బైక్‌లను ప్రదర్శించడానికి EICMA షో ఒక గొప్ప వేదిక. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కూడా ఈ వేదికను చాలా సందర్భాల్లో ఉపయోగించుకుంది.

భారత్‌లో తయారైన మారుతి ఈ-విటారా కారుకు కఠినమైన క్రాష్ టెస్ట్

భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ కారు కోసం మారుతి సుజుకి ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 3న ఈ ఎదురుచూపులకు తెరపడనుంది. మారుతి సుజుకి నుండి రాబోతున్న ఈ కారు పేరు ఈ-విటారా. భారతదేశంలో తయారు కానున్న ఈ మోడల్‌ను జపాన్, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అమ్మకానికి పెట్టనున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్లు

పెట్రోల్ ధరలు పెరుగుతున్న కొద్ది, పేద-మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇంధనంపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక పెద్ద మార్గం చూపుతున్నాయి. వీటి ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పెట్రోల్ అవసరం లేకుండా కేవలం విద్యుత్‌తో నడవడం. ఇంట్లో లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ అందించడంతో పాటు, రన్నింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలుష్యం లేని ప్రయాణం అందించడం వీటి మరో ప్రధాన బలం. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి, వాటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.
Advertisement

బ్రెజా, నెక్సాన్‌లకు షాక్.. సరికొత్త హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది

సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్‌లో ఒకప్పుడు మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. ఆ తర్వాత టాటా నెక్సన్, కియా సోనెట్ వంటి మోడల్స్ రావడంతో పోటీ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు, హ్యుందాయ్ వెన్యూ తన పాత డిజైన్‌ను పక్కన పెట్టి సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.

పోటీదారులకు గట్టి షాక్.. టయోటా హైరైడర్ SUV జూలైలోనే 8,814 యూనిట్ల సేల్స్

ప్రముఖ కార్ల తయారీదారు అయినటువంటి టయోటా (Toyota) కంపెనీ అంతర్జాతీయంగా, దేశీయంగా తన సత్తా చాటుతుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా కొత్త కార్లను విడుదల చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder)కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. 2025 జూలై నెలలోనే టయోటా హైరైడర్ 8,814 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడింది. గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 7,419 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల పరిమాణం 19 శాతం వృద్ధి సాధించింది. ఇది కేవలం ఒక SUV మాత్రమే కాకుండా, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతీకగా నిలుస్తోంది.

టాటా, మహీంద్రా కార్లకు షాక్.. మళ్ళీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్న క్రెటా

భారతదేశంలో కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. జూలై 2025 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితా బయటికి వచ్చింది. ఈ జాబితాలో మరోసారి హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ జాబితాలో బ్రెజా, నెక్సాన్, పంచ్ వంటి పాపులర్ ఎస్‌యూవీలు ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. టాప్-10లో కేవలం నాలుగు మోడళ్లకు మాత్రమే అమ్మకాల్లో వృద్ధి కనిపించింది.

టీవీఎస్, బజాజ్ దూసుకుపోతే.. ఓలా మూడో స్థానానికి!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వృద్ధికి ప్రధాన కారణాలు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులు, చిన్న దూర ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో, సైలెంట్‌గా, తక్కువ నిర్వహణతో ఉపయోగపడే ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో ఎలక్ట్రిక్ వంటి బ్రాండ్‌లు కొత్త మోడళ్లు, అధిక రేంజ్, ఆధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. గ్రామీణ మార్కెట్‌లో కూడా ఇప్పుడు నెమ్మదిగా వీటికి డిమాండ్ పెరుగుతోంది, ముఖ్యంగా రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. 2025 సంవత్సరానికి అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. ఆ వివరాలను ఈ కింది కథనంలో చూద్దాం.
Advertisement

ప్రపంచ రికార్డు సృష్టించిన మారుతి వ్యాగన్‌ఆర్.. ఇంతకీ ఏంటంటే ?

కారు మార్కెట్లో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నప్పటికీ కొన్ని కార్లు మాత్రమే ప్రజల మనసులను గెలుచుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి మారుతి సుజుకి వాగన్ఆర్. ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా కోటి యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. సుజుకి సంస్థకు ఇది ఒక చరిత్రాత్మక విజయం. 1993లో జపాన్‌లో ప్రారంభమైన ఈ కారు ఆ తర్వాత ఐరోపా, భారత్ వంటి మార్కెట్లలో తనదైన ముద్ర వేసింది.