170 కి.మీ రేంజ్‌తో రాబోతున్న కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు!

వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ విన్‌ఫాస్ట్ (Vinfast) భారత మార్కెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చెన్నై, సూరత్‌లలో డీలర్‌షిప్‌లను ప్రారంభించి, తన ప్రెజెన్స్‌ను స్థిరపరిచిన ఈ కంపెనీ, ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో, విన్‌ఫాస్ట్ VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ SUV మోడళ్లను విడుదల చేయనుంది. ఇంతలో, ఈ బ్రాండ్ భారతదేశంలో మరో కీలక అడుగు వేసింది, మినియో గ్రీన్ EV ( VinFast Minio Green EV) అనే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ మోడల్ గురించి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, ఇది VF6, VF7 తర్వాత విడుదలయ్యే తదుపరి మోడల్ కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఫ్రెష్ లుక్, ఆధునిక ఫీచర్లతో రానున్న కొత్త కైగర్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUVల ఆకర్షణ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. స్టైలిష్ లుక్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రోడ్‌పై ప్రెజెన్స్, ఫీచర్లతో నిండిన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల SUVలకు విపరీతమైన కస్టమర్ బేస్ ఏర్పడింది. ఈ భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి, అనేక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడి కొత్త SUV మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. అయితే, SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టాలంటే సాధారణంగా కొంచెం ఎక్కువ బడ్జెట్ అవసరం అవుతుంది. అందుకే, తక్కువ ధరలో SUV కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఎక్కువగా వెతుకుతుంటారు. ఈ సందర్భంలో, అందుబాటులో ఉండే SUVల జాబితాలో రెనాల్ట్ కైగర్ (Renault Kiger) ప్రత్యేక గుర్తింపు పొందింది.

25 లక్షల లోపు ధరలో, 500 కి.మీ పైగా రేంజ్ ఉన్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే

వినాయక చవితి పండుగ దగ్గర్లో ఉంది. ఈ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేరే ఊర్లలో ఉంటున్న వారు తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలిగే ఐదు అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ. 25 లక్షల లోపే ఉంది. దూర ప్రయాణాలకు ఎంతగానో ఉపయోగపడే ఆ కార్లు ఏంటో, వాటి ఫీచర్లు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

కేవలం రూ.12కే నిస్సాన్ కారుకు 10 సంవత్సరాల వారంటీ

నిస్సాన్ ఇండియా తమ పాపులర్ ఎస్‌యూవీ కారు మాగ్నైట్ కోసం ఒక స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం కారు యజమానులు తమ వాహనాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ పొడిగించిన వారంటీ కోసం రోజుకు కేవలం రూ. 12 లేదా కిలోమీటరుకు 22 పైసల ఖర్చుతో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ అద్భుతమైన ఆఫర్ గురించి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

పెట్రోల్, CNGలో బెస్ట్ మైలేజ్ ఇచ్చినా.. అమ్మకాల్లో వెనుకబడిన ఆల్టో K10

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం తక్కువ ధరలో హ్యాచ్‌బ్యాక్‌లకు డిమాండ్ కొంత తగ్గింది. ఎప్పటిలాగే ఈ విభాగంలో ప్రధానంగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10) కూడా ఈ ప్రభావం నుండి తప్పించుకోలేకపోయింది. తక్కువ ధర, సరళమైన డిజైన్, సిటీ డ్రైవింగ్‌కు అనువైన పరిమాణం వంటి ప్రత్యేకతలతో మార్కెట్లో మంచి ఆదరణ పొందిన ఈ కారు, గత కొన్ని నెలలుగా అమ్మకాల పరంగా కాస్త వెనుకబడి ఉంది. ప్రస్తుత జూలై 2025 నెలలో వచ్చిన తాజా అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నెలలో మారుతి సుజుకి కేవలం 5,910 ఆల్టో K10 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కానీ ఇదే జూలై 2024లో ఈ కారు అమ్మకాలు 7,353 యూనిట్లుగా నమోదయ్యాయి.

E-20 ఇంధనంపై అపోహలు vs వాస్తవాలు ఇవే

భారతదేశం పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన భవిష్యత్తు కోసం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను చేరుకోవడానికి బయోఫ్యూయల్స్, సహజ వాయువు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేస్తాయి.

బొలెరో SUV ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జూలైలో సేల్స్ 8% పెరిగాయి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల పట్ల ఉన్న డిమాండ్‌ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నా, కొన్ని SUVలు మాత్రం కాలాన్ని తట్టుకుని, తమ ప్రత్యేక గుర్తింపుతో ముందుకు సాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఒకటి. ఈ కారు ఆగస్టు 4, 2000న భారత మార్కెట్లో అడుగుపెట్టింది. అప్పటినుంచి, ఏళ్ల తరబడి మారుతున్న ట్రెండ్స్, కొత్త పోటీ మోడల్స్, మారుతున్న కస్టమర్ అభిరుచులు.. ఇవన్నింటినీ అధిగమిస్తూ, బొలెరో తన స్థానాన్ని గట్టిగా నిలబెట్టుకుంది. ఈ మధ్యతరగతి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకే రేంజ్‌లో సౌకర్యం, మన్నిక, బలమైన పనితీరుతో ప్రసిద్ధి చెందింది. పావు శతాబ్దం గడిచినా, బొలెరో అమ్మకాలలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.

ట్రాఫిక్ చలాన్లతో ఇబ్బందులా? లోక్ అదాలత్‌లో సగం మాఫీ చేయించుకోండి

భారీ ట్రాఫిక్ చలాన్లతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. వాటిని సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంది. మీరు ఉదయం ఆఫీసుకు బయలుదేరి, ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే, మీ బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లినా లేదా రెడ్ లైట్ దాటినా, పార్కింగ్ నిషేధిత ప్రాంతంలో వాహనాన్ని పార్క్ చేసినా, మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని అనుకుంటారు.
Advertisement

హోండా 25 ఏళ్ల వేడుక మూడు కొత్త స్పెషల్ ఎడిషన్లు విడుదల

భారతదేశంలో స్కూటర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. నమ్మకానికి, నాణ్యతకు మారుపేరైన హోండా, భారత మార్కెట్లో స్వతంత్రంగా ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, హోండా తమ వినియోగదారుల కోసం మూడు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది.

కొత్త కలర్స్, కొత్త లుక్.. యెజ్డి రోడ్‌స్టర్ 2025 వచ్చేసింది!

జావా-యెజ్డి మోటార్‌సైకిల్స్ (Jawa Yezdi Motorcycle) తమ క్లాసిక్ విభాగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 యెజ్డి రోడ్‌స్టర్‌ (Yezdi Roadster)ను ఆవిష్కరించింది. గత నెలలో రోడ్డుపై కెమెరా కళ్లలో చిక్కుకున్న టెస్ట్ మోడల్‌ను చూసినప్పటి నుంచే బైక్ ప్రేమికుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఇప్పుడు ఆ ఉత్సాహానికి మరింత ఊపు ఇచ్చేలా, 2025 రోడ్‌స్టర్ భారత మార్కెట్‌లో కొత్త కలర్స్, కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్‌లతో ప్రవేశించింది. ఇది కేవలం రైడ్ మాత్రమే కాకుండా, ఒక స్టైల్ స్టేట్మెంట్‌గా మారే అవకాశం కలిగిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.09 లక్షల నుండి ప్రారంభమయ్యే ఈ మోడల్, తన సొగసైన కొత్త డిజైన్‌తోనే కాకుండా, ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, వెడల్పైన వెనుక టైర్లు వంటి అంశాలతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.

లగ్జరీ లుక్, సేఫ్టీ ఫీచర్లతో టయోటా టైజర్‌కి కొత్త అప్‌డేట్

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కాంపాక్ట్ SUV అయిన అర్బన్ క్రూయిజర్ టైజర్ (Urban Cruiser Taisor) కోసం ఈరోజు రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లు కేవలం ఫీచర్ల పరంగా మాత్రమే కాకుండా, కస్టమర్ల భద్రత, స్టైల్ రెండింటినీ మరింత మెరుగుపరచే విధంగా ఉండటం విశేషం. మొదటగా, టయోటా ఈ మోడల్‌కు కొత్త బ్లూయిష్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్‌ను జోడించింది. ఈ ప్రత్యేకమైన కలర్ కాంబినేషన్ SUVకి మరింత ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో కస్టమర్లు వ్యక్తిగత ఇష్టాలను ప్రతిబింబించే ప్రత్యేక రంగుల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న తరుణంలో, ఈ కొత్త షేడ్ అర్బన్ క్రూయిజర్ టైసర్ ఆకర్షణను మరింత పెంచుతుంది.

వినాయక చవితికి గుడ్ న్యూస్.. ఈ 5-సీటర్ ఎస్‌యూవీపై భారీ తగ్గింపు

వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. ఈ పవిత్రమైన రోజున చాలామంది కొత్త వస్తువులు, ముఖ్యంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఈ ఆగస్టు నెలలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తమ మ్యాగ్నైట్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ కారు ఇప్పుడు మరింత సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వివరాలు, కారు ప్రత్యేకతలు, మైలేజ్ వంటి పూర్తి సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

బడ్జెట్‌లో లగ్జరీ టచ్.. కొత్త Citroen C3X వచ్చేసింది!

సిట్రోయెన్ ఇండియా, తన Citroën 2.0 - షిఫ్ట్ ఇన్‌టు ది న్యూ (Shift Into the New) స్ట్రాటజిక్ ప్లాన్‌లో భాగంగా, ఈ రోజు కొత్త Citroën C3X రేంజ్‌ను ఆవిష్కరించింది. SUV-స్టైల్‌లో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ మోడల్, ఇప్పుడు మరింత కొత్త రూపంలో, అధునాతన మార్పులతో వచ్చింది. 15 కొత్త ఇంటెలిజెంట్ ఫీచర్లతో కూడిన ఈ ఎడిషన్, ప్రతి ప్రయాణంలో మరింత సౌకర్యం, టెక్నాలజీ ఆధారిత సౌలభ్యం, భద్రతను అందించేలా రూపొందించబడింది. ఇది కేవలం ఫీచర్ల పరంగానే కాదు, ధర పరంగా కూడా తన సెగ్మెంట్‌లో అత్యంత సులభంగా అందుబాటులో ఉండే మోడల్‌గా తన స్థాయిని కొనసాగిస్తోంది. మెరుగైన కంఫర్ట్, యూజర్-ఫ్రెండ్లీ టెక్ ఆప్షన్స్, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిపి ఇవ్వడం వలన, ఇది నగర రోడ్ల నుంచి హైవేల వరకు ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేక అనుభవంగా మార్చబోతోంది.

గ్లాంజా, హైరైడర్, ఇన్నోవా.. ఈ కార్లపై ఆఫర్ల సునామీ

టాటా కంపెనీ కార్లపై ఆగస్టు 2025లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. హ్యుందాయ్ వెన్యూ, టాటా టిగోర్, టాటా సఫారీ వంటి మోడళ్లపై కంపెనీలు బంపర్ ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే, ఇప్పుడు టయోటా కూడా తన కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. టయోటా గ్లాంజా, హైరైడర్, టైసర్, ఇన్నోవా, రూమియన్ వంటి మోడళ్లపై ఏకంగా రూ. 1.05 లక్షల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం.

గణేష్ చతుర్థి రోజు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 3 మోడల్స్ మిస్ కావొద్దు!

వినాయక చవితి రోజు కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఆ నిర్ణయం కేవలం ఓ కొనుగోలు కాదు, ఒక శుభారంభం కూడా అవుతుంది. మన సంప్రదాయంలో, వినాయక చవితి రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడం లేదా కొత్త వస్తువు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. శ్రీ గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు కావడంతో, ఈ రోజున కొనుగోలు చేసిన వాహనం భవిష్యత్తులో మీ ప్రయాణం సాఫీగా సాగేందుకు ఒక మంచి ఆరంభం ఇస్తుందని నమ్మకం. ఈ పండుగ రోజున షోరూమ్‌లకు వెళ్లి తమ కలల బైక్‌ను బుక్ చేసుకుంటారు. కొత్త వాహనం మీద గణపతి బప్పాకు పూజలు చేసి, మొదటి రైడ్‌ను ఆరంభించడం ఒక ప్రత్యేకమైన ఆనందం. రూ.1 లక్ష లోపు మూడు శక్తివంతమైన 125cc బైక్‌ల గురించి ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.

టాటా సఫారీ అమ్మకాలు పడిపోవడానికి అసలు కారణాలు ఇవే

కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా 6 లేదా 7 సీటర్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే టాటా సఫారీ గురించి తెలిసే ఉంటుంది. పవర్ఫుల్ ఇంజిన్, అద్భుతమైన ఫీచర్లు, మంచి డిజైన్‌తో ఇది చాలామందికి ఫేవరేట్ కారుగా మారింది. కానీ, ఇప్పుడు ఈ కారు అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? దాని వెనుక ఉన్న కారణాలేంటి? వివరంగా తెలుసుకుందాం.
Advertisement

జూలైలో థార్ సేల్స్ పెరిగింది కాదు.. పేలిపోయింది!

మహీంద్రా థార్ (Mahindra Thar), భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఆఫ్-రోడ్ SUVలలో ఒక ప్రతిష్టాత్మక పేరు. తన అదిరిపోయే లుక్, ఆకర్షణీయమైన డిజైన్, ఆఫ్-రోడింగ్‌లో అద్భుతమైన సామర్థ్యం కారణంగా ఇది ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకుంటూ వస్తోంది. వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన థార్, రోడ్డుపై, రోడ్డుకు బయట రెండింట్లోనూ సమానంగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇది థార్ రాక్స్, క్లాసిక్ 3-డోర్ వెర్షన్ రూపాల్లో అందుబాటులో ఉండటం ద్వారా, కస్టమర్లకు మరిన్ని ఆప్షన్స్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఇస్తోంది. ఇటీవల జూలై 2025లో థార్ మళ్లీ తన సేల్స్‌ శక్తిని చాటుకుంది. గత నెలలో ఈ కారును 9,845 మంది కొనుగోలు చేయడం విశేషం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఇప్పుడు కొత్త రంగులో కూడా

బైక్ లవర్స్‎కు గుడ్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఒక ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో కూడిన ఈ బైక్, ఇప్పుడు కొత్త రంగులో మార్కెట్‌లోకి వచ్చింది. హంటర్ 350 బైక్ బేస్ (రెట్రో), మిడ్ (డాపర్), టాప్ (రెబెల్) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇప్పుడు మిడ్ (డాపర్) వేరియంట్‌ను కొత్త రంగులో విడుదల చేశారు. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కమర్షియల్ వెహికల్ సేల్స్‎లో తోపు కంపెనీ అదే.. దాన్ని మించింది లేదు

భారతదేశంలో కమర్షియల్ వెహికల్ విభాగం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి చెందుతోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు, రవాణా రంగానికి ఇవి కీలకమైనవి. లారీలు, గూడ్స్ ఆటోలు వంటి కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల గణాంకాలను చూస్తే, ఒక్క నెలలోనే వేల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. జూలై నెలలో మార్కెట్ ఎలా ఉంది.. ఏ కంపెనీలు ఎంత అమ్మి లాభపడ్డాయో పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

యువ రైడర్స్ కోసం ప్రత్యేకంగా.. KTM 160 డ్యూక్ భారత్‌లో ఎంట్రీ!

ప్రీమియం పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్ల ప్రపంచంలో అగ్రగామి బ్రాండ్‌గా పేరుగాంచిన KTM, భారతీయ బైక్ మార్కెట్‌లో మరోసారి సంచలనాన్ని సృష్టించింది. ఎప్పుడూ తన రెడీ టూ రేస్‌ను ముందుకు నెడుతూ, అత్యుత్తమ పనితీరు, అద్భుతమైన డిజైన్, రైడింగ్ థ్రిల్‌ను అందించే KTM, ఇప్పుడు కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌ కెటీఎమ్ 160 డ్యూక్ (KTM 160 Duke) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో దీని ధర వచ్చేసి రూ.1.85 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త డ్యూక్, ప్రీమియం 160cc సెగ్మెంట్‌లోకి KTM తీసుకున్న సాహసోపేతమైన అడుగుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 200cc పైగా ఉన్న బైక్‌లతో స్పోర్ట్స్ బైక్ ప్రేమికులను అలరించిన KTM, ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో ఎక్కువ మంది యువ కస్టమర్లను పెంచుకునే దిశగా ఈ కొత్త బైకును తీసుకొచ్చింది.
Advertisement

కుటుంబ భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందిన కార్లు ఇవే!

ఇటీవలి కాలంలో భారతీయ కారు మార్కెట్‌లో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంటోంది. ముందు రోజుల్లో, కొత్త కారు కొనుగోలు చేసే వారు మైలేజీ, లుక్, ధరలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. రోడ్లపై ప్రమాదాలు పెరగడం, అవగాహన పెరగడం వల్ల, సేఫ్టీ ముఖ్య అంశంగా మారింది. ముఖ్యంగా, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన మోడల్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా పేద-మధ్యతరగతి వినియోగదారులు 8 లక్షల లోపు ధరలో ఎక్కువ ప్రయోజనాలను కలిగించే మోడళ్లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఆల్టో K10, టాటా ఆల్ట్రోజ్ గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

భారత మార్కెట్లో స్కోడా కొత్త ఫెస్టివ్ బహుమతి.. కుషాక్, స్లావియా, కైలాక్ స్పెషల్ ఎడిషన్స్

భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్కోడా కార్లు ఎప్పటినుంచో మంచి డిమాండ్‌ను పొందుతున్నాయి. దశాబ్దాలుగా ఆకట్టుకునే డిజైన్‌లు, నాణ్యమైన నిర్మాణం, నమ్మకమైన పనితీరుతో ఈ బ్రాండ్ వినియోగదారుల మనసు గెలుచుకుంది. కాలానికి అనుగుణంగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తన మోడళ్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. ఇటీవల స్కోడా, భారత మార్కెట్లో అడుగుపెట్టిన 25వ వార్షికోత్సవం, అలాగే ప్రపంచవ్యాప్తంగా 130 సంవత్సరాల విజయగాథను పురస్కరించుకొని, ప్రత్యేక ఉత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా, స్కోడా ఆటో ఇండియా తన మూడు ప్రముఖ మోడళ్లకు పరిమిత ఎడిషన్ వెర్షన్‌లను విడుదల చేసింది. ఇవి కేవలం లుక్ పరంగా మాత్రమే కాకుండా, ప్రత్యేక కలర్ స్కీమ్‌లు, ప్రత్యేక డిజైన్ టచ్‌లు, అదనపు ప్రీమియం ఫీచర్లతో మరింత ప్రత్యేకతను పొందాయి.

ఓలా, బజాజ్‌లకు షాక్ ఇస్తూ నెంబర్ 1గా నిలిచిన టీవీఎస్

భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది అని చూస్తే, టాప్ కంపెనీలు తమ అమ్మకాల్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ జాబితాలో టీవీఎస్ మోటార్ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 175 కి.మీ.లు వెళ్తుంది.. ఓబెన్ రోర్ EZ సిగ్మా వివరాలు

ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు గణనీయంగా పెరిగి, వినియోగదారుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ విభాగంలో, స్టైల్, పనితీరు, టెక్నాలజీ కలయికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్‌గా ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నిలిచింది. ప్రముఖ స్టార్ట్-అప్ అయిన ఈ కంపెనీ, వినియోగదారుల అభిరుచులు, రైడింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ మోడళ్లను మరింత స్మార్ట్‌గా, ఆధునికంగా మార్చడంలో ముందంజలో ఉంది. ఆ ప్రయత్నాల ఫలితంగానే, తాజాగా ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా (Oben Rorr EZ Sigma) పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వెర్షన్, ప్రీమియం లుక్‌తో పాటు, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో, ఎలక్ట్రిక్ బైక్ అభిమానులను ఆకర్షించేలా రూపుదిద్దుకుంది. దీని గురించి ఈ కథనంలో చూద్దాం.
Advertisement

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వచ్చేస్తోంది.. ఇవి గుర్తుంచుకోండి

లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు చాలామంది తరచుగా మర్చిపోయే విషయం తమ కార్లలో ఉన్న ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం. అప్పుడప్పుడు టోల్ ప్లాజాలోకి వెళ్ళిన తర్వాత సరిపడా బ్యాలెన్స్ లేదని తెలిస్తే చిరాకు కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెట్టింది.