పాత కారు కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి

కొత్త కారు కొనడానికి బడ్జెట్ సరిపోవడం లేదా? అయితే పాత కారు కొనడం ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే కొత్త కారుతో పోలిస్తే పాత కారు తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, పాత కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, లాభానికి బదులు నష్టాలు ఎదురవ్వవచ్చు. పాత కారు కొనుగోలు చేసే ముందు మీరు తప్పకుండా పరిశీలించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జూలై నెలలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే

ఫ్యామిలీతో కలిసి ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలున్న 7-సీటర్ కార్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువ మంది కూర్చునే సౌకర్యం, లగేజీ పెట్టుకునే అవకాశం ఉండటం వల్ల చాలామంది ప్రజలు ఈ రకం కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు మారుతి సుజుకి, మహీంద్రా, టయోటా, కియా వంటి కంపెనీల 7-సీటర్ కార్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.ఇటీవల విడుదలైన జూలై నెల అమ్మకాల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 7-సీటర్ కార్ల వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

మహీంద్రా కారు సేల్స్ పడిపోవడానికి కారణం ఏంటి?

కొత్త కారు కొనాలనుకునే వారిలో చాలామందికి మహీంద్రా XUV700 ఒక మంచి ఆఫ్షన్‎గా కనిపిస్తుంది. ఇది అడ్వాన్సుడ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, అద్భుతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అయినప్పటికీ, జూలై నెలలో ఈ కారు అమ్మకాలు కొంతవరకు తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాలలో 9% క్షీణత కనిపించింది.

గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న ప్యాసింజర్ కార్లు, టూ-వీలర్ల ధరలు

కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా ? అయితే ఇది మీకు శుభవార్తే. రాబోయే దీపావళి నాటికి ప్యాసింజర్ కార్లు, టూ-వీలర్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణలను అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా జీఎస్టీ శ్లాబులను సరళీకృతం చేసి, కొన్ని వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించనుంది.
Advertisement

జూలైలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోని నిస్సాన్ లగ్జరీ ఎక్స్-ట్రైల్

నిస్సాన్ (Nissan) కంపెనీ భారత మార్కెట్లో తన వాహనాలను తయారు చేసి విక్రయిస్తున్నప్పటికీ, అమ్మకాల పరంగా పెద్ద స్థాయిలో ఎదగలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం, సంస్థ వద్ద ఉన్న మోడళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండటమే. తక్కువ వేరియంట్లతో మార్కెట్లో పోటీని ఎదుర్కోవడం కష్టమవుతోంది. నిస్సాన్‌కి ప్రస్తుతం మాగ్నైట్ కారు మాత్రమే అమ్మకాలలో ప్రధాన భరోసా ఇస్తోంది. ఇది సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మధ్య తరగతి వినియోగదారులను ఆకట్టుకుంటూ, మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. అయితే, అదే సమయంలో కంపెనీ లగ్జరీ మోడల్‌గా మార్కెట్లో ఉంచిన X-ట్రయల్ మాత్రం పూర్తిగా విఫలమవుతోంది. గత జూలై నెల అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చినప్పుడు, ఒక్క X-ట్రయల్ కూడా అమ్ముడుపోలేదనే విషయం బయటపడింది.

మైక్రో SUVలలో లీడర్‌గా ఉన్న ఎక్స్‌టర్ సేల్స్‌లో డ్రాప్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUVలకు ఎప్పటిలాగే విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా, తక్కువ ధరలో లభించే మైక్రో SUVలు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్‌లో కాంపిటీషన్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అటువంటి పరిస్థితుల్లో, హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ఒక కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మోడల్‌ను హ్యుందాయ్ 2023 జూలైలో భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్స్, కాంపాక్ట్ సైజ్, ఫీచర్లలో రిచ్ ప్యాకేజీ, అలాగే సులభంగా అందుబాటులో ఉండే ధరతో ఇది వినియోగదారులను ఆకర్షించగలిగింది. మార్కెట్లోకి అడుగుపెట్టిన వెంటనే మంచి స్పందన దక్కించుకున్న ఎక్స్టర్, మైక్రో SUV సెగ్మెంట్‌లో ఒక ప్రాముఖ్యమైన మోడల్‌గా నిలిచింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ పరుగెత్తే ఓలా కొత్త S1 ప్రో స్పోర్ట్

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా (Ola) కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, మార్కెట్లో ఇతర కంపెనీలకు బలమైన పోటీ ఇవ్వడానికి అధునాతన సాంకేతికతతో కూడిన S1 ప్రో స్పోర్ట్ (ola s1 pro sport) అనే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టి వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ విడుదలతో ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ ఒక కొత్త అడుగు వేసింది. S1 ప్రో స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ధరను రూ.1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. స్కూటర్ డెలివరీలు వచ్చే సంవత్సరం జనవరి 2026 నుండి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ మరింత మెరుగైన డిజైన్‌తో వస్తోంది. స్పోర్టీ టచ్, స్టైలిష్ లుక్ కలిపి యువతరాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

స్టైల్ కావాలా? మైలేజ్ కావాలా? పవర్ కావాలా? ఒకే కారులో అన్నీ ఇచ్చేసిన కియా!

కియా మోటార్స్ (Kia Motors) భారత ఆటోమొబైల్ రంగంలో తన స్థానం మరింత బలపరచుకుంటోంది. దేశీయ ప్రజలను ఆకట్టుకోవడానికి అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ తన సత్తాను చాటుతుంది. ఈ కంపెనీ కార్లు అమ్మకాల పరంగా ఆశించిన మేరకు గణంకాలను నమోదు చేస్తున్నాయి. తాజాగా కియాకు చెందిన ప్రసిద్ధ మోడళ్లు అయినటువంటి కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ EVని కస్టమర్లు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. మే నెలలో కంపెనీ కారెన్స్ క్లావిస్ స్టాండర్డ్ వేరియంట్‌ను పరిచయం చేయగా, జూలైలో దాని ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన కారెన్స్ క్లావిస్ EV‌ను ఆవిష్కరించింది. ఈ రెండు MPVలు ఆధునికమైన డిజైన్‌తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండటంతో మార్కెట్‌లో మంచి హైప్ క్రియేట్ చేశాయి.
Advertisement

టాప్ మోడల్ XUV 3XOపై అతిపెద్ద ఆఫర్.. రూ.89,000 వరకు డిస్కౌంట్

భారతదేశపు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) తన సేల్స్ పెంచుకోవడానికి ఆగష్టు నెలలో ప్రసిద్ధ మోడల్ అయినటువంటి XUV 3XO కారుపై భారీ ఎత్తున తగ్గింపు ఆఫర్స్‌ను ప్రకటించింది. తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన XUV 3XO SUVపై అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో కంపెనీ సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఆఫర్ల వల్ల కొనుగోలుదారులు గణనీయమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వేరియంట్‌ను బట్టి ఈ ప్రయోజనాలు రూ. 44,000 నుంచి గరిష్టంగా రూ. 89,000 వరకు అందుబాటులో ఉంటాయి.

కేవలం రూ.1కి 1 కి.మీ ఖర్చు.. ఏథర్ కొత్త బ్యాటరీ సర్వీస్ ప్లాన్‌

ఏథర్ ఎనర్జీ (Ather Energy) 2020లో ఎలక్ట్రిక్ స్కూటర్ 450ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త ఆవిష్కరణలకు మార్గదర్శిగా నిలుస్తూ వస్తోంది. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం ఏథర్ తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చిన రిజ్టా స్కూటర్‌తో సాధారణ వినియోగదారుల దృష్టినీ ఆకర్షించింది. ఈ స్కూటర్‌ వలన మరింత ఎక్కువ మార్కెట్ చేరుకోవడానికి కంపెనీకి అవకాశం లభించింది. ఇప్పుడు, రిజ్టా ధరను మరింత సులభతరం చేసి, ఎలక్ట్రిక్ వాహనాలను అందరికి చేరువ చేయాలని ఏథర్ నిర్ణయించింది. అందుకోసమే వారు వినూత్నమైన BaaS (Battery-as-a-Service) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, స్కూటర్‌ను బ్యాటరీని లీజు ఆధారంగా పొందుతారు.

అదిరిపోయే లుక్‌తో విజన్ S, విజన్ X కాన్సెప్ట్‌లు

భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా ఎప్పటినుంచో తన ప్రత్యేకమైన శైలి, నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంస్థ. ముఖ్యంగా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలకు వచ్చినప్పుడు, మహీంద్రా పేరు ముందే గుర్తుకు వస్తుంది. మంచి డిజైన్, బలమైన పనితీరు, ఎక్స్‌ప్లోరర్ స్పిరిట్‌ను ప్రతిబింబించే వాహనాలతో ఈ బ్రాండ్ ఎప్పుడూ ప్రత్యేకతను చూపింది. ఈసారి, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో, మహీంద్రా భవిష్యత్‌ దిశగా మరోసారి అడుగుపెట్టింది. విజన్ S, విజన్ X పేర్లతో రెండు అద్భుతమైన కాన్సెప్ట్ ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. వీటిని కేవలం వాహనాలుగా కాకుండా, మహీంద్రా రేపటి ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఎలా ఊహిస్తోంది అనే దానికి ప్రతీకలుగా పరిచయం చేసింది.

థార్ అభిమానులకు గుడ్ న్యూస్.. మహీంద్రా విజన్ టీ వచ్చేసింది!

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమలో మహీంద్రా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలకు పేరుగాంచిన ఈ సంస్థ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఫ్రీడమ్ నూ ఈవెంట్‌లో విజన్ టీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ వాహనం భవిష్యత్తులో రాబోయే మహీంద్రా థార్ మోడల్స్‌కు ఒక సూచనగా కనిపిస్తోంది.
Advertisement

రగ్గెడ్ లుక్‌తో మహీంద్రా కొత్త కాన్సెప్ట్ కార్

కొత్త కారు, అందులోనూ ఎస్‌యూవీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ, ఆ ఎస్‌యూవీ ఒక పికప్ ట్రక్ లా ఉంటే? అవును, వింటుంది నిజమే. మహీంద్రా కంపెనీ తమ కొత్త విజన్ ఎస్‌ఎక్స్‌టీ కాన్సెప్ట్‎ని ఆవిష్కరించింది. ఇది మహీంద్రా థార్ పికప్ ట్రక్‌కు ఫ్యూచర్ లుక్ అని చెప్పొచ్చు. ఈ కొత్త కాన్సెప్ట్ కారులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, దాని డిజైన్ ఎలా ఉంది, ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

బ్యాట్‌మ్యాన్ అభిమానులకు మహీంద్రా స్పెషల్ ఎడిషన్

భారతీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6 కోసం డీసీ కామిక్స్, బ్యాట్‌మ్యాన్ సినిమాల నిర్మాత అయిన వార్నర్ బ్రదర్స్‌తో కలిసి ఒక సరికొత్త, ప్రత్యేకమైన ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. దీనికి BE 6 డార్క్(బ్యాట్‌మ్యాన్ ఎడిషన్) అని పేరు పెట్టారు. ఈ కారు డిజైన్, ఫీచర్లు పూర్తిగా బ్యాట్‌మ్యాన్ సినిమాలు, కామిక్స్‌ల నుండి ప్రేరణ పొంది రూపొందించబడ్డాయి.

యమహా ఫాసినో 125, రేజర్ 125 హైబ్రిడ్ స్కూటర్లు కొత్త ఫీచర్లతో లాంచ్!

ప్రముఖ టూవీలర్ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha), తన ప్రీమియమ్ 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ సిరీస్‌ను కొత్త రూపంలో రోడ్డెక్కించింది. Fascino 125 Fi హైబ్రిడ్, RayZR 125 Fi హైబ్రిడ్ మోడళ్లు ఇప్పుడు మరింత ఆధునికంగా, మరింత స్మార్ట్‌గా, మరింత స్టైలిష్‌గా మారాయి. ఈసారి యమహా కేవలం కలర్స్‌ను మాత్రమే అప్‌డేట్ చేయలేదు, రైడింగ్ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే సాంకేతిక మార్పులు కూడా చేసింది. కొత్త వేరియంట్లలో ఎన్‌హాన్స్డ్ పవర్ అసిస్ట్ ఫంక్షన్‌ను జోడించడం ప్రధాన ఆకర్షణ. దీని వల్ల ట్రాఫిక్ సిగ్నల్ నుంచి స్టార్ట్ అయినా, ఎత్తైన రోడ్లపై ప్రయాణమైనా స్కూటర్ తక్షణమే అదనపు బూస్ట్ ఇస్తుంది, ఫలితంగా రైడర్‌కు మరింత స్మూత్, స్పోర్టీ ఫీలింగ్ వస్తుంది. ఇది హైబ్రిడ్ టెక్నాలజీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా రూపొందించబడింది.

రెండేళ్ల సైలెన్స్ తర్వాత.. మరాజ్జో MPV మార్కెట్లో మళ్ళీ హల్‌చల్!

ప్రముఖ వాహన తయారీదారు మహీంద్రా (Mahindra), గత కొంతకాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తూ వస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశంతో, కంపెనీకి మరింత ఊపు వచ్చి, హ్యుందాయ్‌ను అధిగమించి దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది. జూలై 2025లో మహీంద్రా నెలవారీ అమ్మకాలు మళ్లీ అరలక్ష యూనిట్ల మార్క్‌ను చేరుకున్నాయి. గత నెలలో మాత్రమే కంపెనీ 49,871 యూనిట్లను విక్రయించింది. ఈ గణాంకాలను గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, జూలై 2024లో అమ్ముడైన 41,623 యూనిట్ల నుంచి 2025 జూలైలో 20 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం విశేషం. మహీంద్రా మోడళ్లన్నీ దాదాపుగా ప్రతినెలా కూడా మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తున్నప్పటికి ఒక్క మోడల్ మాత్రం ఆశించిన మేరకు సేల్స్ సాధించడం లేదు.
Advertisement

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే!

ఆగస్టు 27న వినాయక చవితి పండుగ వస్తోంది. ఈ పండుగ రోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడం చాలామందికి ఒక మంచి సెంటిమెంట్. మీరు కూడా ఈ వినాయక చవితికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ బైకులు రూ.70,000ల నుంచి ప్రారంభమై, ఒక లీటరు పెట్రోల్‌కు 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపిక.. జూలై 2025లో ఈకో బంపర్ సేల్స్!

మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) భారతీయ MPV మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నమ్మకమైన కారు. సింపుల్ కానీ ఉపయోగకరమైన డిజైన్, విశాలమైన ఇంటీరియర్ స్థలం, అనేక ఆకర్షణీయమైన అంశాలు దీనిని కుటుంబాల నుండి చిన్న వ్యాపారాల వరకు అన్ని వర్గాల వినియోగదారుల అవసరాలను తీర్చగల మోడల్‌గా నిలబెట్టాయి. ఫ్యూయల్, పనితీరులోనూ ఈకో తన క్లాస్‌లో మంచి పనితనాన్ని చూపిస్తుంది, అందుకే ఇది చాలామంది ఈ మల్టిపర్పస్ కారును కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా విడుదలైన సేల్స్ నివేదిక ప్రకారం, మారుతి ఈకో 2025 జూలైలో 12,341 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది.

టాటా, మహీంద్రా నుంచి వస్తున్న 4 కొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీలివే

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు, ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతాయి. ఈసారి దసరా నుంచి దీపావళి మధ్యలో భారత మార్కెట్‌లోకి 4 కొత్త ఎస్‌యూవీలు రాబోతున్నాయి. ఇవి చూడడానికి స్టైలిష్‌గా ఉండటంతో పాటు, అడ్వాన్సుడ్ టెక్నాలజీ, శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

వరుసగా 10 నెలలుగా నంబర్‌ 1.. MG విండ్సర్ EV రికార్డు క్రియేట్ చేసింది!

JSW MG మోటార్ ఇండియా దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని మొత్తం మార్చేసింది. ఈ విభాగంలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తుంది. కంపెనీ నుంచి విడుదలయ్యే ఈవీలకు మార్కెట్లో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి MG విండ్సర్ (Mg Windsor) వరుసగా పది నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుంది. ఈ స్థిరమైన విజయం, మార్కెట్లో EV విభాగంలో విండ్సర్ స్థానం ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా జూలై 2025 నెల JSW MG మోటార్ ఇండియాకు ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఆ నెలలో విండ్సర్ అమ్మకాలు 4,308 యూనిట్లకు చేరుకుని, ఇప్పటివరకు ఉన్న అన్ని నెలవారీ రికార్డులను బద్దలు కొట్టింది.
Advertisement

రేపటి నుంచి టోల్ ప్లాజాలో రూ.15తోనే దూసుకెళ్లొచ్చు

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పథకం ప్రారంభం కాబోతోంది. ఈ పాస్ తీసుకున్నవారు సంవత్సరమంతా టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ పాస్‌ గురించి ప్రకటన చేశారు.

ఒకప్పుడు బుకింగ్స్ వరద.. ఇప్పుడు అమ్మకాల కరువు

భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం వారు కొనుగోలు చేయగలిగే విధంగా అందుబాటు ధరల్లో కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది మారుతి సుజుకి (maruti suzuki). సాధాణంగా ఈ కంపెనీ ప్రతి నెలా సేల్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తుంది. దాని ప్రసిద్ధ మోడళ్లు టాప్ నిలవడం సర్వ సాధారణం. జూలై నెల ముగిసిన తరువాత తన కార్ల అమ్మకాల వివరాలను వెల్లడిస్తున్న కంపెనీ దాని బడ్జెట్ కారు మోడల్ అయినటువంటి ఎస్-ప్రెస్సో (S-Presso)కు సంబంధించిన సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. జూలై 2025లో మారుతి సుజుకి S-ప్రెస్సో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెలలో కేవలం 912 యూనిట్లు మాత్రమే మార్కెట్లోకి వెళ్లగా, గత సంవత్సరం ఇదే నెలలో 2,607 కార్లు అమ్ముడయ్యాయి.

ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో దడ పుట్టించిన కవాసాకి

బైక్ లవర్స్‎కు గుడ్ న్యూస్. ప్రపంచ ప్రఖ్యాత సూపర్ బైక్ తయారీదారు అయిన కవాసకి, భారత మార్కెట్‌లో తన అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాహసాలను ఇష్టపడే వారికి, ఆఫ్-రోడ్ రైడింగ్ ఆసక్తి ఉన్న వారికి KLX230 బైక్ ధరను భారీగా తగ్గించింది. మోటోక్రాస్ బైక్‌ల స్టైలిష్ లుక్‌తో వచ్చిన ఈ మోడల్ గత సంవత్సరం విడుదలైనప్పుడు, దాని ధరను చూసి చాలామంది వెనకడుగు వేశారు.

ఒక్క ఛార్జ్‌తో హైదరాబాద్-నల్గొండ వెళ్లొచ్చు.. హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పోటీని పెంచుతూ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఇప్పుడు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ స్కూటర్‌కు ఒడిస్సీ సన్ అని పేరు పెట్టారు. దీని ప్రారంభ ధర కేవలం రూ.81,000 మాత్రమే. టాప్ మోడల్ ధర రూ.91,000(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 322 కి.మీ.. కోమాకి XR7 సూపర్ లాంగ్ రేంజ్ స్కూటర్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ఈ మధ్య కాలంలో ఊహించని రీతిలో వేగంగా పెరుగుతోంది. నగరాల్లో మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈవీల వైపు ఆసక్తి చూపుతున్నారు. కొత్త మోడళ్లు వరుసగా లాంచ్ అవుతున్న ఈ సమయంలో, ఎలక్ట్రిక్ వాహన రంగంలో మంచి గుర్తింపు పొందిన కోమాకి ఎలక్ట్రిక్ (Komaki Electric) ఒక పెద్ద అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. తక్కువ ధరలో, మంచి నాణ్యతతో వాహనాలను అందించడం ద్వారా ఇప్పటికే పట్టణ, గ్రామీణ మార్కెట్‌ల్లో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు మరొక మైలురాయిని చేరింది. కోమాకి తాజాగా 'XR7' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది దేశంలోనే అత్యంత లాంగ్ రేంజ్‌ను అందించగలదు. ఇది కేవలం నగర ప్రయాణాలకే కాకుండా, గ్రామీణ ప్రాంతాల అవసరాలకు కూడా సరిపోయేలా డిజైన్ చేయబడింది.