బొలెరో ఫ్యాన్స్‌కి బంపర్ గిఫ్ట్.. కొత్త CNG HD పికప్ లాంచ్!
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 25 days ago
భారతదేశపు నంబర్ 1 పికప్ వాహన బ్రాండ్‌గా పేరుగాంచిన మహీంద్రా (Mahindra), మరోసారి తన శక్తివంతమైన కొత్త వాహనంతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. వ్యాపార, ఇతర అవసరాలకు అనుగుణంగా ఉండేలా కొత్తగా బొలెరో మాక్స్ పికప్ హెచ్‌డీ సీఎన్‌జీ (Bolero MaXX Pik-Up HD CNG)ని విడుదల చేసింది. ఈ కొత్త బొలెరో పికప్ ట్రక్ డిజైన్ పూర్తిగా ప్రాక్టికల్ అవసరాలకు అనుగుణంగా ఉంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీని ఫీచర్లు, సామర్థ్యం రూపొందించబడ్డాయి. ఇది గరిష్టంగా 1.85 టన్నుల పేలోడ్‌ను మోయగలదు, అంటే, పెద్ద పరిమాణంలో సరుకులను తరలించాల్సిన చిన్న వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది నిజంగా సూపర్ ఎంపిక అవుతుంది. దీని ధర వచ్చేసి రూ.11.19 లక్షల ఎక్స్-షోరూమ్