ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ప్లెండర్ అమ్మకాలు డౌన్

దేశంలోని రోడ్లపై ఎక్కడ చూసినా కనిపించే బైక్ అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది "హీరో స్ప్లెండర్ (Hero Splendor)". సింపుల్ డిజైన్, అనుకూలమైన ధర, మైలేజీలో మహారాజు, ఇవన్నీ కలిసి స్ప్లెండర్‌ను పేద, మధ్యతరగతి ప్రజలకు నమ్మరమైన మోడల్‌గా మార్చాయి. చిన్న నగరం అయినా, గ్రామమైనా, పట్టణమైనా, ప్రతి కుటుంబంలో కనీసం ఒక స్ప్లెండర్ కనిపిస్తుంది. అంతటి పాపులారిటీ ఉన్న ఈ మోడల్ ఈ ఏప్రిల్‌లో మాత్రం కొంచెం వెనుకబడింది. 2025 ఏప్రిల్‌లో హీరో మోటోకార్ప్ మొత్తం 1,97,893 యూనిట్ల స్ప్లెండర్ బైకులను విక్రయించింది. అయితే, 2024లో ఇదే నెలలో అమ్మకాల సంఖ్య 3,20,959 యూనిట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాదిలోనే అమ్మకాలు దాదాపు 38.3 శాతం మేరకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ బైక్ కొనాలంటే వేగంగా వెళ్ళండి.. హోండా షైన్ సేల్స్ చూశారా!

కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్, తక్కువ ధర, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలా? అయితే, హోండా షైన్ (Honda Shine) గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj) వంటి కంపెనీలకు షాక్ ఇస్తూ హోండా షైన్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ బైక్‌లో ఏముంది? ఎందుకని షోరూముల్లో జనం కిటకిటలాడుతున్నారు? చూద్దాం.

వర్షాకాలానికి అద్భుతమైన 3 SUVలు.. థార్, గూర్ఖా, జిమ్నీ వివరాలు

వర్షకాలం వచ్చిందంటే చాలు కార్లతో బయటికి వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. రోడ్లు జారిపోవడం, ట్రాఫిక్ సమస్యలు, మట్టి మార్గాల్లో వాహనం నడపడం వంటి వాటి వల్ల వర్షకాలం కార్లను బయటికి తీయాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆఫీస్ లేదా ఇంటికి వెళ్లడానికి లేదంటే ఇతర అవసరాలకు కారును వర్షపు నీళ్లలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. దీంతో ఇటీవల కాలంలో వర్షంలో కూడా తిరగడానికి కంఫర్ట్‌గా ఉండే మోడళ్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు వంటి అంశాల ఆధారంగా చేసుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిని కొనడానికి కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వాతవరణ పరిస్థితుల్లో ఎస్‌యూవీ (SUV)లు ఎంతగానో ఉపయోగపడుతాయి. కొన్ని ప్రధాన SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంవత్సరానికి ఒక్కసారి కడితే చాలు.. టోల్ ఫ్రీ ప్రయాణం!

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణాలు చేస్తుంటారా.. టోల్ ప్లాజాల దగ్గర నిలబడి డబ్బు కట్టడం విసుగు తెప్పిస్తుందా.. అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకురాబోతుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి డబ్బు కడితే చాలు, ఏడాది పొడవునా టోల్ భారం ఉండదు. కేవలం కొన్ని సెకన్లలో టోల్ ప్లాజా దాటేయొచ్చు. మరి ఈ కొత్త వార్షిక టోల్ విధానం ఏమిటి? ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది? వివరాలు తెలుసుకుందాం.
Advertisement

ఏప్రిల్‌లో మరోసారి టయోటా మ్యాజిక్.. ఒక్క నెలలో 2,421 టైజర్ అమ్మకాలు

దేశీయ కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న సంస్థలలో టయోటా ఒకటి. వినియోగదారుల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ జపాన్‌కు చెందిన తయారీదారు, భారత మార్కెట్‌లో ఇన్నోవా, గ్లాంజా, ఫార్చ్యూనర్, రుమియన్ వంటి మోడళ్లతో బాగా ప్రసిద్ధి పొందింది. టయోటా మోడళ్లకు డిమాండ్ ఎప్పటికీ తక్కువ కాదు. తాజాగా కంపెనీ గత నెల అంటే, ఏప్రిల్ 2025లో సాధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, టయోటా మరోసారి తన మార్కెట్‌ స్థిరత్వాన్ని రుజువు చేసింది. మొత్తం 24,833 కార్లను విజయవంతంగా డెలివరీ చేసింది. ఈ సంఖ్య చూస్తేనే కంపెనీకి వినియోగదారులలో ఎంతటి ఆదరణ ఉందో అర్థం అవుతుంది. ఈ మొత్తంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అమ్ముడైన మోడల్‌ అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) కూడా కీలక పాత్ర పోషించింది.

ఓలా రోడ్‌స్టర్ X వచ్చేసింది.. కస్టమర్లకు డెలివరీలు మొదలయ్యాయి!

ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ X(Roadster X) ను మార్కెట్‌కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటుతున్న కంపెనీ ఇప్పుడు రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్ ద్వారా పెట్రోల్ బైకులకు గణనీయమైన పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఓలా డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులకు రోడ్‌స్టర్ X బైక్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఇ-బైక్ డిజైన్ చూసినవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేలా చేసే ఆకట్టుకుంటుంది. స్పోర్టీ లుక్స్, మోడర్న్ ఫినిషింగ్, యూత్‌ఫుల్ స్టైల్‌ను ఈ బైక్ ప్రతిబింబిస్తుంది.

టాటా హారియర్ EV..500 కి.మీ. రేంజ్, అద్భుతమైన ఫీచర్లు!

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? మహీంద్రాకు షాక్ ఇవ్వడానికి టాటా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకువస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు టాటా హారియర్ EV (Tata Harrier EV) అనే కారుతో టాటా మోటార్స్ పెద్ద ప్లాన్ వేసింది.

ఈ వైరల్ వీడియో చూడండి: ఫార్చ్యూనర్‌కు ఇలాంటి గతి పట్టిందే!

కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్‌లు ఎంత ముఖ్యమో తెలుసా? ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner) లాంటి పెద్ద SUVనడిపేటప్పుడు సైడ్ మిర్రర్‌లు లేకపోతే ఎంత ప్రమాదమో ఊహించగలరా? అయితే, ఒడిశాలో ఒక ఫార్చ్యూనర్ డ్రైవర్ చేసిన పని చూస్తే మీరు షాక్ అవుతారు. సైడ్ మిర్రర్ బదులు అద్దం పెట్టుకున్న ఆ డ్రైవర్ గురించి.. ఆ సంఘటన గురించిన పూర్తి వివరాలు, ఇంకా ఫార్చ్యూనర్ స్పెషల్స్ గురించి తెలుసుకుందాం.
Advertisement

హోండా కొత్త బైక్ రెబెల్ 500.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే

దేశీయ ప్రముఖ టూవీలర్ వాహన తయారీదారు హోండా స్కూటర్ & మోటార్‌సైకిల్ ఇండియా (HMSI), దేశంలోని ప్రతి మూలకూ చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా, ఈ సంస్థ నంచి వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. నమ్మకమైన పనితీరు కారణంగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హోండా కంపెనీ రూపొందించే బైక్‌లు, స్కూటర్లు నిత్యజీవిత అవసరాలకు సరిపోయేలా ఉండటంతో, ప్రజలు వాటిని నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు. దాని విజయపరంపరను కొనసాగించడానికి హోండా ఇటీవల అదిరిపోయే బైకును విడుదల చేసింది. దాని పేరే "రెబెల్ 500 (Rebel 500)". బైక్‌ రూపకల్పన నుండీ పనితీరు వరకు ప్రతీ విషయంలోనూ ఒక ప్రత్యేకతను చూపిస్తోంది.

5-స్టార్ సేఫ్టీతో టాటా కర్వ్: సిట్రాన్ బసాల్ట్‌కు షాక్ ఇచ్చేనా?

కొత్త కారు కొనాలని చూస్తున్నారా? స్టైల్‌తో పాటు సేఫ్టీ కూడా ఉండాలని అనుకుంటున్నారా ? మార్కెట్‌లో కొత్తగా వస్తున్న కూపే ఎస్‌యూవీల గురించి తెలుసుకోవాలని ఉందా? టాటా మోటార్స్ 'కర్వ్' (Curvv) అనే కొత్త కారుతో బరిలోకి దిగుతోంది.

స్పోర్ట్స్ కార్‌ను తలపించే ఫోక్స్‌వ్యాగన్ కొత్త మోడల్.. డ్రైవింగ్ ఫీడ్‌బ్యాక్ ఇదే!

"GTI" అనే మూడు అక్షరాలు, హాట్ హ్యాచ్‌ల పట్ల మక్కువ కలిగిన ఆటోమొటివ్ ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ పేరుకు గుర్తుగా నిలిచిన కార్ అంటే ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్‌నే. ప్రపంచవ్యాప్తంగా డ్రైవింగ్‌ను ఆస్వాదించే వారికి ఇది ఒక విలక్షణమైన ఎంపిక. వీకెండ్ ట్రిప్స్ కోసం ఉత్సాహంగా నడిపే కారు కావాలి, కానీ అదే సమయంలో కుటుంబానికి సరిపడే హ్యాచ్‌బ్యాక్ కావాలి అన్నవారికి ఇది చాలా కాలంగా హిట్టయిన మోడల్. కానీ 2007లో ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ, గోల్ఫ్ మాత్రం ఎన్నడూ ఇండియాలోకి రాలేదు. దీని ప్రధాన కారణం, దీని ధర, పరిమాణం భారత మార్కెట్‌కి అనువుగా ఉండకపోవడమే. అందుకే అప్పట్లో మనకు గోల్ఫ్‌కి ప్రత్యామ్నాయంగా జెట్టా (అంటే సెడాన్ రూపంలో గోల్ఫ్‌) వచ్చింది.

టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ వస్తోంది.. మైలేజ్ చూసి మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్ ఏది ఎక్కువ ఇస్తుందని ఆరా తీస్తున్నారా ? అయితే TVS నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే మైలేజ్‌తో మార్కెట్‌ను పూర్తిగా మార్చేయడానికి టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ (TVS Jupiter 125 CNG) స్కూటర్ వస్తోంది.
Advertisement

ఎర్టిగా నుంచి కారెన్స్ క్లావిస్ వరకు.. 7 సీటర్ ఫ్యామిలీ కార్లు

ప్రస్తుత కుటుంబ ప్రయాణాలకు ప్రాముఖ్యత పెరిగింది. దీంతో 7 సీటర్ కలిగిన కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. . ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు మూడు వరుసల్లో కూర్చోనే వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇవి కేవలం ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలు కాదు. ఇవి కుటుంబ బంధాలను దగ్గర చేయే వేదికలు కూడా. అందరు కలిసి హాయిగా ఒకే కారులో ఆడుతూ, పాడుతూ సంతోషంగా ప్రయాణిస్తుంటే ఆ ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. మార్కెట్లో ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ అధునాతన ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకీ ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్ క్లావిస్ వంటి పెద్ద కార్లు కుటుంబాలకు బాగ అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి ఒకసారి కింది కథణంలో తెలుసుకుందాం.

95 కి.మీ. రేంజ్, స్టైలిష్ డిజైన్: సుజుకి ఇ-యాక్సెస్ వచ్చేసింది!

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే సుజుకి నుంచి ఒక అదిరిపోయే వార్త.. మార్కెట్‌లోకి రాకముందే అందరి దృష్టిని ఆకర్షించిన సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభమైంది. 95 కి.మీ. రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ స్కూటర్, ధర కూడా తెలిస్తే కచ్చితంగా కొనేస్తారు. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కుటుంబ ప్రయాణాల కలను నిజం చేసే మారుతీ సుజుకీ కొత్త కారు

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ (Maruti Suzuki) అతిపెద్ద కార్ల తయారీ దారుగా అవతరించింది. పోటీ పెరుగుతున్న కొద్ది కొత్త మోడళ్లను వరుసగా తీసుకొస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసారి సంస్థ ఒక కొత్త SUV‌ను తీసుకురానుంది. గతంలో ఇది గ్రాండ్ విటారా ఆధారంగా వచ్చే 7-సీటర్ వెర్షన్‌గా భావించబడినప్పటికీ, ఈ మోడల్ ఇప్పుడు ఒక సరికొత్త 5-సీట్ల మధ్యతరహా SUVగా రూపుదిద్దుకుంటోంది. ఇటీవలి మీడియా సమావేశంలో మారుతి సుజుకీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ స్వయంగా ఈ SUV ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాహనాన్ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఇప్పటి వరకు సంస్థ ఈ కొత్త మోడల్ పేరును అధికారికంగా వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం దీనిని 'Y17' అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్నారు.

ఎక్సీకామ్ కొత్త EV ఛార్జర్: హార్మొనీ డైరెక్ట్ 2.0 వచ్చేసింది!

ఎలక్ట్రిక్ వెహికల్ (EV) వాడుతున్నారా? లేక కొత్తగా EV కొనాలని చూస్తున్నారా? EV ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ సరిగా అవ్వట్లేదని, లేక స్పీడ్‌గా ఛార్జ్ కావట్లేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.
Advertisement

గ్రామీణ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒబెన్ 'O100' ప్లాట్‌ఫామ్

బెంగళూరుకు చెందిన ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) భారతదేశంలోని వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా, ఈ సంస్థ కీలకమైన విభాగంలోకి అడుగుపెట్టి, సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రఖ్యాత పెట్రోల్ బైక్‌లైన హోండా షైన్, హీరో స్ప్లెండర్ లాంటి 100cc విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా "O100" అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. ఇది లక్ష రూపాయల లోపు ధరలో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయడానికి రూపొందించబడిన వినూత్న వేదిక. ఈ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా రూపొందించబడ్డ బైక్‌లు, తక్కువ ఖర్చుతో నడిచే శక్తివంతమైన, నమ్మదగిన మోడళ్లుగా మార్కెట్‌లోకి రానున్నాయి.

జెనీలియాకు తప్పిన ప్రమాదం.. ఆమెను కాపాడిన అద్భుతమైన కారు ఇదే

ఒకప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా గుర్తుందా? రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వెంకటేష్, రామ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన తర్వాత తెలుగు సినీ ప్రపంచంలో కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంతకీ ఆ కారు ఏంటి? దాని ఫీచర్ల గురించి వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు ప్రారంభం.. కస్టమర్లకు పండగే!

కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఓలా నుంచి వచ్చిన రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X) డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. మరి ఈ బైక్ ధరలు, ఫీచర్లు, డెలివరీలకు సంబంధించిన తాజా వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

15 నిమిషాల్లో 620 కి.మీ.! షియోమి YU7 టెక్నాలజీకి టెస్లా కూడా షాక్!

చైనా‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (xiaomi) ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోన తన స్థానాన్ని బలపర్చుతోంది. సంస్థ తొలిసారి విడుదల చేసిన ఎలక్ట్రిక్ సెడాన్ SU7, అంచనాలకు మించి సక్సెస్ అయింది.. ఈ కారుకు మార్కెట్లో విశేష ఆదరణ లభించడంతో షియోమి దాదాపు 2.58 లక్షల కార్లను విక్రయించింది. ఇది సంస్థకు పెద్ద మైలురాయిగా నిలిచింది. తన కార్లకు మంచి డిమాండ్ ఉందని గమనించిన కంపెనీ తన వాహన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి YU7ని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUVను ప్రత్యేకంగా టెస్లా మోడల్ Yకి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చినట్టు కంపెనీ చెబుతోంది. ఇది శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. షియోమి మొబైల్ రంగంలో ఎలాంటి వినూత్నత చూపిందో, అదే స్థాయిలో ఆటోమొబైల్ రంగంలోనూ తనదైన ముద్ర వేయాలని ఈ కారుతో ప్రయత్నిస్తోంది.
Advertisement

CB750 హార్నెట్, CB1000 హార్నెట్ SP లాంచ్: బుకింగ్స్ ఓపెన్!

పవర్‌ఫుల్ బైక్‌లు కొనాలని చూస్తున్న వాళ్ల కోసం హోండా నుంచి సరికొత్త బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తమ ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. అవి CB750 హార్నెట్ (Hornet), CB1000 హార్నెట్ SP (Hornet SP). ఈ బైక్‌లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా అందిస్తాయి.

ఏప్రిల్‌లో MG హెక్టర్ SUVకి ఊహించని ఆదరణ

MG మోటార్ గత కొంతకాలంగా భారత మార్కెట్లో తమ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు ధీటుగా బలమైన, అధునాతన కార్లను విడుదల చేస్తూ తన సేల్స్ పెంచుకోవడానికి చాలా కాలంగా కృషి చేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన అత్యంత ప్రసిద్ధ SUV మోడల్ అయిన హెక్టర్ (Hector) కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. ఏప్రిల్ 2025లో హెక్టర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఇది విడుదలైనప్పటి నుంచి మార్కెట్లో మంచి స్పందనను రాబట్టినప్పటికీ, గత కొన్ని నెలలుగా దాని అమ్మకాల్లో కొంత తగ్గుదల నెలకొంది.

ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లతో ఎన్టీఆర్ లైఫ్ స్టైల్.. అదరగొడుతున్న 'యంగ్ టైగర్'!

సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఒకప్పుడు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు, ఇప్పుడు ప్రైవేట్ జెట్‌తో పాటు కోట్లాది రూపాయల కార్లతో ఎలా జీవిస్తున్నాడు.

ఏప్రిల్‌లో సెలెరియో అమ్మకాలపై భారీ ప్రభావం.. 54% తగ్గుదల

మారుతీ సుజుకీకి (Maruti Suzuki) చెందిన ప్రసిద్ద సెలెరియో (Celerio) దేశంలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు బాగా ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్. ఇది ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మార్కెట్‌లో ఒత్తిడి ఎదుర్కొంటోంది. మారుతీ అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే సెలెరియో గతంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో స్థానం సంపాదించుకోగా ప్రస్తుతం మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాజాగా మారుతీ నుంచి వెల్లడైన సేల్స్ నివేదిక ప్రకారం, 2025 ఏప్రిల్ నెలలో సెలెరియో కేవలం 1,474 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయింది. ఇదే సమయంలో 2024లో 3,220 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది ఏకంగా 54.22 శాతం తగ్గుదలగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే అమ్మకాలు సగానికి పైగా తగ్గిపోవడం అంటే సాధారణ విషయం కాదు.
Advertisement

టాటా ఆల్ట్రోజ్ వర్సెస్ పోటీదారులు.. ఏది బెస్ట్?

కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని చూస్తున్నారా? టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఫేస్‌లిఫ్ట్, మారుతి బాలెనో (Maruti Baleno), టయోటా గ్లాంజా (Toyota Glanza), హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) వంటి కార్లలో ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్తను పూర్తిగా చదవండి. టాటా కంపెనీ ఇటీవల తమ ఆల్ట్రోజ్ కారుకు కొత్త అప్‌డేట్‌లు ఇచ్చి, మార్కెట్‌లోకి విడుదల చేసింది.