పవర్, టెక్నాలజీ, మైలేజ్ అన్నీ ఒక్కటే.. టయోటా RAV4 ఆవిష్కరణ
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 29 days ago
భారతీయ వాహన ప్రేమికుల మనసు దోచుకున్న తయారీదారుల్లో టయోటా (Toyota) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దీని బ్రాండ్ గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మారుతీ సుజుకీతో కలసి పలు మోడళ్లను రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్నా, "టయోటా" అనే పేరే ప్రజలను మళ్లీ మళ్లీ అదే వైపు మళ్లిస్తుంది. ఇక ఇప్పుడు, టయోటా మరో మారు ప్రపంచ మార్కెట్‌లో తన సత్తాను చూపించడానికి సిద్ధమైంది. కంపెనీ సరికొత్త తరం RAV4 SUVను ఇటీవల ఆవిష్కరించింది. బోల్డ్ డిజైన్, కట్ చేసిన లైన్లు, ఆకట్టుకునే హెడ్‌లైట్లు ఇవన్నీ కలసి ఈ కారును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా SUV అభిమానుల మనసులు గెలుచుకున్న మోడల్‌లో టయోటా RAV4 ఒకటి. చాలామంది దీనిని "మినీ ఫార్చ్యూనర్" అని పిలుస్తుంటారు.