పవర్‌ఫుల్ SUV అయినా మట్టిలో చిక్కుకుంది.. చివరికి ట్రాక్టర్ వచ్చి కాపాడింది
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 1 day ago
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) 2024 చివరలో అత్యంత ప్రజాదరణ పొందిన SUV మోడల్ అయిన థార్‌కు కొత్త రూపాన్ని తీసుకొచ్చింది, అదే థార్ రాక్స్ (Thar roxx). ఇది ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 3-డోర్ల థార్ మోడల్‌కు కొనసాగింపుగా 5-డోర్ల వెర్షన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. మాములుగానే 3 డోర్ థార్ మార్కెట్లోకి విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఎంతో ఆదరణ సంపాదించింది. అయితే కుటుంబ ప్రయాణాలకు ఇది అనుకూలంగా లేకపోవడంతో కంపెనీ వెంటనే రాక్స్‌ను తీసుకురాగా, ఇది విజయవంతంగా అమ్మకాలను సాధిస్తుంది. ఇప్పటికే ఈ కారును చాలా మంది వాడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కారుకు సంబంధించిన ఒక విషయం ఆసక్తికరంగా మారింది.