ఒకప్పుడు హిట్టు... ఇప్పుడు ఫ్లాప్... గ్రాండ్ విటారా అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయ్?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒకప్పుడు బాగా అమ్ముడుపోయిన ఎస్యూవీ. మంచి మైలేజ్, ఫీచర్లు ఉన్నా కొద్ది నెలలుగా దీని అమ్మకాలు తగ్గుతున్నాయి. ఎందుకలా జరుగుతోంది? కొనుగోలుదారులు ఈ కారును ఎందుకు అంతగా ఇష్టపడటం లేదో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అదిరిపోయిన అమ్మకాలు! ఏప్రిల్‌లో టాటా టియాగోకు భారీ గిరాకీ

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టాటా మోటార్స్ (tata motors) ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమ నాణ్యతతో కూడిన కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇదే క్రమంలో టాటా నుంచి వచ్చిన టియాగో (tiago) ప్రసిద్ద మోడల్‌గా భారతీయ వినియోగదారులకు ఇష్టమైన కారుగా నిలుస్తుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటి. తక్కువ ధరలో, గట్టి నిర్మాణం, మెరుగైన మైలేజీ, ప్రధానంగా సేఫ్టీ పరంగా అద్భుతమైన మోడల్. ఈ కారుకు ఉన్న డిమాండ్ ఏప్రిల్ 2025 అమ్మకాల గణాంకాల్లో బాగా కనిపించింది. తాజాగా టాటా మోటార్స్ నుంచి వెల్లడైన డేటా ప్రకారం, ఏప్రిల్ 2025లో టాటా టియాగో మొత్తం 8,277 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

షోరూమ్ నుంచి రాగానే టైర్లు మార్చేశాడు... ఎందుకో తెలిస్తే షాక్!

కొత్త కారు కొన్న సంబరంలో కొందరు చేసే పనులు వింతగా ఉంటాయి. ఇక్కడొక వ్యక్తి మహీంద్రా నుంచి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ కారును షోరూమ్ నుంచి తెచ్చిన వెంటనే దాని టైర్లను మార్చేశాడు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటో తెలిస్తే షాకవుతారు. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన బీఈ 6కు మార్కెట్‌లో మంచి స్పందన వస్తోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ కారుకు ఫిబ్రవరిలో అధికారికంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఓ ప్రీమియం ప్రయాణం మొదలైంది.. ఇది కియా క్లావిస్ రివ్యూ

ప్రపంచం కరోనా విలయం నుంచి కోలుకుంటూ ముందుకు సాగుతున్న సమయం, 2021 చివరి నెల. అదే సమయంలో, డిసెంబర్ 16న, కియా తన కొత్త MPV మోడల్ "Carens"ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది కియా సెల్టోస్ ప్లాట్‌ఫారాన్ని ఆధారంగా చేసుకుని, దాన్ని కొంచెం పొడిగించి రూపొందించిన వాహనం. ఆ క్షణం నుంచి, ఈ కారుకి మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. వినియోగదారులు ఈ MPVని కుటుంబ ప్రయాణాలకు అనువుగా, ప్రీమియంగా స్వీకరించారు. ఇలా నాలుగేళ్ల కాలంలో ఎంతో మందికి చేరిన కారు, ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ అయి వచ్చింది. సాధారణంగా వాహన కంపెనీలు ఎప్పటికప్పుడు ఒక మోడల్‌కి ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువచ్చి, పాత మోడల్‌ను మార్కెట్ నుంచి తొలగించడమే చూస్తాం. కానీ కియా, ఈసారి అలా చేయలేదు.
Advertisement

ఎంజీ బాగా అమ్మింది కానీ ఈ కారుని నలుగురే కొన్నారు! ఎందుకో?

 ఎంజీ మోటార్ ఇండియా ఏప్రిల్‌లో మంచి అమ్మకాలు సాధించినా ఒక కారుని మాత్రం ఎవ్వరూ కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కారు ఏంటి? ఎందుకు కొనట్లేదు? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఏప్రిల్‌లో ఎంజీ మోటార్ ఇండియా బాగానే కార్లు అమ్మేసింది. ఏకంగా 5,829కార్లు అమ్ముడయ్యాయి. 2025లో మొదటి నాలుగు నెలల్లో ఇదే ఎక్కువ అమ్మకాలు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి.

పెట్రోల్ ఖర్చులు తగ్గాలా? 28.1 కి.మీ మైలేజ్ ఇచ్చే కొత్త కారు వచ్చేసింది!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో వినియోగదారుల దృష్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్‌జీ (CNG)లపై కూడా పడింది. ఇది కేవలం అవసరం కాదు, ఇప్పుడు అది ఒక శక్తిమంతమైన ట్రెండ్‌గా మారింది. వినియోగదారుల్లో పెరిగిన ఈ డిమాండ్‌ను గమనించిన కార్ల తయారీ సంస్థలు కూడా క్రమంగా సీఎన‌్‌జీ ఆధారిత వాహనాలను విడుదల చేయడానికి అడుగులు వేస్తున్నారు. మారుతీ సుజుకీ, టాటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ బ్రాండ్లు ఇప్పటికే ఫ్యాక్టరీలోనే అమర్చిన CNG కిట్‌లతో కార్లను అందించడం ప్రారంభించాయి. ఇవి కొనుగోలుదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి ఆదరణ మేరకు ఈ విభాగంలో సత్తా చాటడానికి ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ కూడా ఈ దిశగా అడుగులు వేసింది.

టీవీఎస్ ఐక్యూబ్ కొత్త అవతారం.. రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్, తమ సక్సెస్‎ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీ‎లో సరికొత్త మోడళ్లను విడుదల చేసింది. 2025 సంవత్సరానికి గాను టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ పేర్లతో విడుదలైన ఈ స్కూటర్లు, మునుపటి మోడళ్ల కంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలతో వినియోగదారులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. బైక్ ప్రేమికుల కలలు నిజం కాబోతున్నాయి

పెట్రోల్ ధరలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అందరి చూపు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంలో ఊపందుకున్నాయి. ఇప్పుడు అదే దారిలో బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ విభాగంలో ఇతర ప్రసిద్ధ టూవీలర్ తయారీదారులు దూసుకుపోతుండటంతో ఎన్‌ఫీల్డ్ ఈవీలో కూడా తన సత్తాను చాటడానికి ఫ్లయింగ్ ఫ్లీ C6, S6 మోడళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ రెండింటి ద్వారా కంపెనీ కొత్త చరిత్రను మొదలుపెట్టాలని చూస్తుంది. ఈ రెండు మోడళ్లలో ప్రధానంగా ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎంతో ఆసక్తికరమైన మోడల్‌గా నిలవబోతోంది.
Advertisement

టాటా, టెస్లా కలిసికట్టు.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో దుమ్మురేపనున్నాయా?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్లా ఎంట్రీకి టైమ్ దగ్గరపడుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం మనదేశంలో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ కూడా చూసుకుందట. ఇంతకుముందు ముంబై, ఢిల్లీ లాంటి చాలా చోట్ల స్థలం కోసం వెతికారు.

భారత సైన్యంలో శక్తివంతమైన వాహనాలు.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తాయి

భారత సైన్యం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఎంత శక్తివంతమైనదో అందరికి తెలిసిందే. దేశంలోని హిమాలయ పర్వతాల నుండి రాజస్థాన్ ఎడారుల దాకా, ప్రతి అంచును మన సైన్యం ఎంతో ధైర్యంగా కాపాడుతుంది. దేశంలోని ప్రతి భూభాగాన్ని రక్షించడంలో సైన్యం ఉపయోగించే వాహనాలు కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ ప్రజలు రోజు ఉపయోగించే వాహనాలు కాకుండా దేశ రక్షణకు ప్రత్యేకత కలిగిన శక్తివంతమైన వాటిని వారు వాడుతుంటారు. ఈ దేశంలో, ప్రతి అంచును చేరుకోవాలంటే కేవలం దళసైన్యం మాత్రమే కాదు, వారికి తోడుగా ఉండే శక్తివంతమైన వాహనాలూ అవసరం. ఒక వైపు ట్యాంకులు, రాకెట్ లాంచర్లు ఉండగా, మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం ఆధునిక SUVలు, ట్రక్కులు కూడా కీలకంగా మారాయి. సైన్యంలో వాహనాల పాత్ర, ఒక గేమ్‌చేంజర్‌లా ఉంటుంది.

టాటా నెక్సాన్, టియాగో, పంచ్, కర్వ్ ఈవీలపై భారీ డిస్కౌంట్లు!

సామాన్యుడికి ఎలక్ట్రిక్ కారు కల నిజం చేసిన కంపెనీల్లో టాటా మోటార్స్ ముందుంటుంది. నెక్సాన్ ఈవీతో మొదలైన ఎలక్ట్రిక్ విప్లవం.. తర్వాత టియాగో ఈవీ, పంచ్ ఈవీ రూపంలో కొనసాగుతోంది. తక్కువ ధరలో ఇవన్నీ సాధ్యం చేయడంతో ఇతర కంపెనీలకు కూడా ఇదొక స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఎంజీ మోటార్స్‌తో గట్టి పోటీ ఉండడంతో, టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఒకవైపు డిఫెండర్ రికార్డు అమ్మకాలు, మరోవైపు ఆదాయం తగ్గుదల

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సంస్థ 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, తన స్థిరమైన ప్రదర్శనతో మరోసారి మార్కెట్లో తన ఉనికిని నిలబెట్టుకుంది. తాజాగా కంపెనీ నుంచి విడుదలైన సమాచారం ప్రకారం, ఎఫ్‌వై 2025లో కంపెనీ మొత్తం ఆదాయం 1.7 శాతం స్వల్పంగా తగ్గి 7.7 బిలియన్ యూరోల స్థాయికి చేరుకుంది. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ, సంస్థ వరుసగా పదవ త్రైమాసికంలో లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఆదాయం సాధించడానికి కంపెనీకి చెందిన పలు మోడళ్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మోడల్ ఈ ఏడాది అసాధారణమైన మార్కెట్ స్పందనను అందుకుంది.
Advertisement

హ్యుందాయ్ కస్టమర్ల కోసం సూపర్ యాప్.. అన్ని సేవలు ఒకే చోట!

ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హ్యుందాయ్ కంపెనీ తన కస్టమర్ల కోసం తీసుకొచ్చిన 'మైహ్యుందాయ్' (myHyundai) అప్లికేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్ ఇప్పుడు ఏకంగా 2.6 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ వినియోగదారులకు ఇది ఒక డిజిటల్ ఫ్రెండ్‌లా పనిచేస్తుంది.

క్రమంగా పడిపోతున్న టాటా సఫారీ అమ్మకాలు

టాటా సఫారీ (tata safari) అనే పేరు చాలాకాలంగా భారతీయ SUV ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, అద్భుతమైన సేఫ్టీ అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పచుకుంది. కానీ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మాత్రం ఈ కారుకు ఎదురుదెబ్బ తగలినట్టు తెలుస్తోంది. మారుతున్న ప్రజల అభిరుచుల కారణంగా రోజు రోజుకు విక్రయాల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ సఫారీకి సంబంధించిన అమ్మకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం, గత ఏప్రిల్ (2025) నెలలో టాటా కంపెనీ సఫారీ మోడల్ కేవలం 1,340 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇదే కాలంలో అంటే 2024 ఏప్రిల్‌లో ఈ కారుకు 1,716 యూనిట్ల అమ్మకాలు నమోదు కావడం జరిగింది.

షాకింగ్! రూ.4000 పెట్రోల్‌తో 1000 కి.మీ ప్రయాణమా? ఈ కారుతో సాధ్యమే!

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. కార్ల తయారీదారులు ఈ వాహనాల రేంజ్‌ను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో హోండా సిటీ హైబ్రిడ్ (హోండా సిటీ ఈహెచ్ఈవీ) ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారులా పనిచేస్తూ, అవసరమైనప్పుడు పెట్రోల్‌కు మారుతుంది. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇది ఒక ఫుల్ ట్యాంక్‌తో 1000 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

భారతదేశంలో తయారైన ఫ్రాంక్స్.. జపాన్‌లో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో దుమ్మురేపింది!

మారుతీ సుజుకీ రూపొందించిన ఫ్రాంక్స్ (Fronx) కారు ఇప్పుడు కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటుతోంది. ఓ ప్రముఖ SUVగా అవతరించిన ఈ ఫ్రాంక్స్ కారు, బలమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. భారతదేశంలో ఇప్పటికే ఈ కారు వందల సంఖ్యలో అమ్ముడవుతోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే SUVని సుజుకి మోటార్ కార్పొరేషన్ మారుతీ సుజుకీ మాతృసంస్థ ఇప్పుడు జపాన్ మార్కెట్లో కూడా ఈ కారును విక్రయిస్తోంది. అక్కడ కూడా ఈ కారు మంచి ఆదరణ పొందుతూ పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇది కేవలం అమ్మకాలు మాత్రమే కాదు, ఫ్రాంక్స్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా అద్బుతమైన కారుగా నిలిచింది.
Advertisement

క్కువ ధర ఎలక్ట్రిక్ కారుకి షాకింగ్ న్యూస్! ఎంజీ కామెట్ ధర పెరిగింది!

సిటీల్లో తిరగడానికి ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి ఎంజీ మోటార్స్ కామెట్ ఈవీని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత మహిళలు కూడా ఈ చిట్టి కారుకు అభిమానులుగా మారారు. దీని ప్రధాన బలం ఏమిటంటే ఇది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది.

మహీంద్రా నుంచి బొలెరో బోల్డ్ ఎడిషన్.. కొత్త డిజైన్ అదిరిపోయింది!

మహీంద్రా కంపెనీకి చెందిన ప్రసిద్ధ మోడల్ బొలెరో దేశంలో చాలా కాలంగా అమ్మకానికి ఉంది. 2000వ సంవత్సరంలో మార్కెట్‌లో అడుగుపెట్టి, రెండు దశాబ్దాలకుపైగా భారతీయుల మదిలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ మహీంద్రా వాహనం, నిజంగా ఒక లెజెండ్ అని చెప్పాలి. పట్టణాల్లో తక్కువగా కనిపించినా, గ్రామీణ భారత్‌లో ఇది ఒక సంచలనం. పొలాలు, పల్లెలు, ఎత్తైన ప్రాంతాలు, లోతైన దారులు,, ఎక్కడైనా కూడా రయ్ మంటూ దూసుకుపోయే పనితీరుతో బొలెరో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. గంభీరమైన డిజైన్, మెరుస్తున్న మెటల్ బాడీ, శక్తివంతమైన ఇంజిన్ కలిగిన బొలెరో వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మల్టీ పర్పస్ వాహనంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, దీని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.

బాలెనో కంటే 10 అడుగులు ముందున్న టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్

2025లో రిలీజ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్, మారుతి బాలెనో వంటి పోటీదారుల నుంచి తనను ప్రత్యేకంగా నిలబెట్టే అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్‌లతో వస్తోంది. స్టైల్, టెక్నాలజీ, సేఫ్టీలో మార్పులతో, అప్‌డేట్ చేయబడిన ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త స్టాండ్డర్స్ నెలకొల్పడానికి రెడీగా ఉంది. ముఖ్యంగా బాలెనోలో లేని పది ప్రత్యేకమైన ఫీచర్లను ఇది కలిగి ఉంది. ఇది మార్కెట్‌లో దాని స్థానాన్ని మరింత బలపరుస్తుంది.

ఔరా అనిపించేలా టయోటా కొత్త కారు.. అదిరిపోతున్న కరోల్లా క్రాస్ ఫేస్‌లిఫ్ట్

టయోటా బ్రాండ్ గురించి తెలియని వారు ఉండరు. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖమైన కార్లను విడుదల చేస్తూ మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ఆకట్టుకునే డిజైన్, క్లాస్-లీడింగ్ టెక్నాలజీ, మంచి పనితీరు కలిగిన వాహనాలను విడుదల చేయడంలో టయోటా బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. కంపెనీ తన విలువను పెంచుకోవడానికి టయోటా తాజాగా యూరోపియన్ మార్కెట్‌ కోసం తన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV కరోల్లా క్రాస్ (corolla cross) ను 2025 ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం చేసింది. అయితే ఇది భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో లేదు. మన మార్కెట్లో లాంచ్‌పై కంపెనీ నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త కరోల్లా క్రాస్ 2025 ఫేస్‌లిఫ్ట్ తన రూపాన్ని పూర్తిగా కొత్తగా సంతరించుకుంది.
Advertisement

తక్కువ ధరలో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు,, హోండాకు మంచి ప్రత్యామ్నాయాలు!

హోండా యాక్టివా ఒకప్పుడు మిడిల్ క్లాస్ ప్రజల ఆల్ టైం ఫేవరెట్ స్కూటర్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. హోండా కూడా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఈ'ని ఇటీవల విడుదల చేసింది. దీని ధర రూ. 1.17లక్షల నుంచి రూ. 1.52లక్షల వరకు ఉంది. ఇది 1.5కిలోవాట్ బ్యాటరీతో ఒక ఛార్జ్‌పై 102కి.మీ రేంజ్ ఇస్తుంది. TFTడిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వచ్చింది.. చూసింది.. కానీ ఇంకా గెలవలేకపోయింది.. సిట్రోయెన్ సేల్స్ ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సుదీర్ఘకాలంగా స్థిరపడే ఆశతో అడుగుపెట్టిన ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం సిట్రోయెన్ (citroen) చాలా కాలంగా అమ్మకాల పరంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం భారత వాహన మార్కెట్ ఎంతో ఆశాజకంగా ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారుల నుంచి బలమైన పోటీ కారణంగా సిట్రోయెన్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. తాజాగా 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను చూస్తే ఇది అర్థం అవుతుంది. సేల్స్ నివేదిక ప్రకారం, ఏప్రిల్ 2025లో సిట్రోయెన్ భారత్‌లో కేవలం 339 యూనిట్లను మాత్రమే విక్రయించింది. బ్రాండ్‌కి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతి, యూనిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్లకు ఉన్న పేరును బట్టి కంపెనీ అమ్మకాల్లో వృద్ధిని చూపించాలని అనుకున్నప్పటికి క్రమంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతుంది.

పెరుగుతున్న పోటీకి తలొగ్గిన పంచ్? ఏప్రిల్‌ అమ్మకాల రిపోర్ట్

ప్రయాణికులకు ప్రమాద సమయంలో అత్యుత్తమ రక్షణ అందించే కార్లను తయారు చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది టాటా మోటార్స్ (tata motors). ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ వరుసగా తన మోడళ్ల వారీగా అమ్మకాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో తన ప్రసిద్థ మోడల్ పంచ్ మైక్రో SUVకి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, గత ఏడాది ఇదే నెలలో (ఏప్రిల్ 2024) 19,158 యూనిట్లు విక్రయించిన ఈ మోడల్, ఏప్రిల్ 2025లో కేవలం 12,496 యూనిట్లకే పరిమితమైంది. ఇది సుమారు 35 శాతం తగ్గుదలగా నమోదు కావడంతో, పంచ్ మోడల్‌కు మార్కెట్ డిమాండ్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టాప్-5 SUVల జాబితాలో నిలిచిన పంచ్, ఇప్పుడు 6వ స్థానానికి పరిమితమవడం, గమనించదగిన మార్పు.

ఏప్రిల్‌లో దుమ్మురేపిన ఎస్‌యూవీలు ఇవే.. అమ్మకాల పరంగా ఏది టాప్ అంటే?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో 2025 ఏప్రిల్ నెలలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎస్యూవీ, ప్యాసింజర్ కార్లకు ఉన్న డిమాండ్‌ను ఇది స్పష్టంగా చూపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా కేవలం అత్యుత్తమ ఎస్‌యూవీగానే కాకుండా ఆ నెల మొత్తం అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దానికున్న ప్రజాదరణను ఇది తెలియజేస్తుంది. ఆ తర్వాత మారుతి సుజుకి డిజైర్, మారుతి బ్రెజ్జా ఉన్నాయి. ఈ బ్రాండ్‌లు, మోడళ్లపై వినియోగదారుల అభిమానాన్ని ఇది నొక్కి చెబుతుంది.
Advertisement

మహీంద్రా థార్ దూసుకెళ్తోంది.. 2025 ఏప్రిల్ అమ్మకాల్లో అదిరిపోయే సేల్స్

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా నుంచి గతంలో విడుదలైన శక్తివంతమైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ (Thar) అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే మార్కెట్లో తన హవాను చూపించిన ఈ మోడల్ ప్రతినెలా వేలకు పైగా విక్రయాలను నమోదు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గత నెలలో కూడా ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్లు ఆసక్తి కనబరిచారు. తాజాగా ఏప్రిల్ 2025లో, మహీంద్రా థార్ తన ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నెలలో బ్రాండ్ తొలిసారిగా 10,000 కార్ల నెలవారీ అమ్మకాల మార్కును దాటి, SUV ప్రీమియం విభాగంలో తన స్థానం మరింత బలపరిచింది.