రాశీ ఖన్నా స్కోడా SUVలో గ్లామర్ రైడ్.. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా

అందం, అభినయం కలగలిపిన నటిమనుల్లో రాశి ఖన్నా కూడా ఒకరు. తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోల ప్రక్కన నటించి అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషల్లో కూడా నటిస్తూ స్టార్ పొజిషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల ద్వారా మంచిగానే సంపాదిస్తున్న నటి తాజాగా ఖరీదైన కారుతో కనిపించారు. రాశి ఖన్నా స్కోడా కుషాక్ SUVలో ప్రయాణిస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ తారలు లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే వాతావరణంలో, ఈ నటి మిడ్-సైజ్ SUV అయిన స్కోడా కుషాక్‌లో కనిపించడం కొంత భిన్నంగా అనిపించింది. ఆమె స్టైల్‌కి సూటయ్యే విధంగా ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ కారులోని వెనుక సీటులో కూర్చున్న విధానం దేవతల్ని తలపించేలా ఉంది.

చిన్న కార్ల సెగ్మెంట్‌లో మారుతి దూకుడు! రాబోయే కార్లు ఇవే!

మారుతి సుజుకి, మనందరికీ తెలిసిన కార్ల కంపెనీ. చిన్న కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్‌తో మార్కెట్‌ని ఒక ఊపు ఊపేయడానికి రెడీ అవుతోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండాలనే ఆలోచనతో ఈ జపనీస్ కంపెనీ హైబ్రిడ్ (పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ సాయంతో నడిచేవి), ఎలక్ట్రిక్ వెహికల్స్ (పూర్తిగా కరెంట్‌తో నడిచేవి) లాంటి చాలా రకాల కార్లను తీసుకొనిరావడానికి ప్లాన్ చేస్తోంది.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో బాలెనో జోరు.. ఏప్రిల్ అమ్మకాల్లో మెరుగుదల

భారతీయ ఆటోమొబైల్ ప్రపంచంలో బాలెనో అనే పేరు తెలియని వారు ఉండరు. మారుతీ సుజుకీ నుంచి వచ్చినటువంటి ఈ మోడల్ 2015 అక్టోబర్ చివరలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. నెక్సా డీలర్షిప్ ద్వారా విక్రయించబడిన ఈ కార్, ఆ సంస్థకు ప్రీమియం సెగ్మెంట్లో గట్టి స్థానం సంపాదించేలా చేసింది. ఈ బాలెనో హ్యాచ్‌బ్యాక్ తన ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మంచి మైలేజ్, లోపల విశాలమైన ఇంటీరియర్ వంటి అంశాలతో వినియోగాదారులను ఆకట్టుకుంటుంది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా మారింది. ఇదిలా ఉంటే కంపెనీ తాజాగా ఏప్రిల్ 2025కు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది.

టాప్ 10లో టాటా నెక్సాన్ హవా! అమ్మకాలు చూస్తే షాక్ అవుతారు!

టాటా నెక్సాన్ జనాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కాంపాక్ట్ SUV. గల్లి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఊరిలోని ప్రతి ఇంటిలోనూ దీని ప్రస్తావన వచ్చే ఉంటుంది. ఈ కారు ఎట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కస్టమర్లు కూడా దీని కోసం షోరూంల ఎదుట ఎగబడుతున్నారు. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఈ 'నెక్సాన్' భారీ స్థాయిలో అమ్ముడైంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

భారత సైన్యానికి ఎంతో ఇష్టమైన కారు.. 20 ఏళ్లు దాటినా తగ్గని క్రేజ్

భారతీయ SUV కార్ల మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కారు మహీంద్రా స్కార్పియో. గత 2002 నుంచి అమ్మకానికి ఉన్న మహీంద్రా స్కార్పియో కారును భారత పోలీసు అధికారులు, సైనికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ రియల్ హీరోలకే కాకుండా, సినిమా హీరోలు, విలన్లకు కూడా మహీంద్రా స్కార్పియో అంటే చాలా ఇష్టం. మహీంద్రా స్కార్పియో కారు కండలు తిరిగినట్లు ఉండే దృఢమైన రూపమే దీనికి ప్రధాన కారణం.

మాతృ దినోత్సవం స్పెషల్.. మీ అమ్మకు గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ కార్లు ఇవే!

ప్రతేడాది మే 11న మాతృ దినోత్సవం(Mothers Day) జరుపుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుటుంబానికి పెద్దగా అమ్మ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. వారికి వాహనం నడపడం కూడా ఒక గొప్ప విషయమే. ప్రస్తుతం చాలా కుటుంబాల్లో తల్లులు స్వయంగా కార్లు నడుపుతున్నారు. అలాంటి భారతీయ తల్లులకు డ్రైవింగ్ ఈజీ చేసే కార్ల గురించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

ఈ మదర్స్ డేను మరపురాని అనుభూతిగా మార్చండి

ప్రతి మనిషి జీవితంలో తల్లి స్థానం అమూల్యం. అమ్మ అనగానే గుర్తొచ్చేది ఆమె ప్రేమ, త్యాగం, ఎన్నటికీ మారని ఆదరణ. కాలం మారుతోంది, అభిరుచులు మారుతున్నాయి, కానీ తల్లి చూపే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఈ విశిష్టతను గుర్తు చేసుకుంటూ, మాతృ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. ఈ ఏడాది మదర్స్ డే మే 11న వస్తోంది. మీరు ఆ రోజున మీ అమ్మకి జీవితంలో మరపురాని సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ఒక స్మార్ట్, స్టైలిష్, సౌకర్యవంతమైన స్కూటర్ కంటే మంచి బహుమతి ఇంకేమీ ఉండదు. ఈ సందర్భానికి అనుకూలంగా, మార్కెట్లోని కొన్ని ప్రముఖ స్కూటర్ మోడల్స్‌ను ఎంపిక చేసుకుని మీ అమ్మకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

బెంజ్ కొనాలనుకుంటున్నారా? జూన్ 1 నుండి మీ జేబుకు చిల్లు పడటం ఖాయం!

మెర్సిడెస్-బెంజ్.. భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ. ప్రతి నెలా కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన కార్లను వేల సంఖ్యలో మెర్సిడెస్ సంస్థ విక్రయిస్తోంది. భారతదేశంలో బెంజ్ కార్లు లేని వ్యాపారవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇతర కార్ల కంపెనీల మాదిరిగానే కార్ల ధరలను ఎప్పటికప్పుడు పెంచడాన్ని మెర్సిడెస్-బెంజ్ సంస్థ మరచిపోదు. నిర్ణీత కాల వ్యవధిలో మెర్సిడెస్ సంస్థ కార్ల ధరలను పెంచుతూ ఉంటుంది.
Advertisement

డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇష్టమైన కారు.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (maruti suzuki) ఇటీవల ఏప్రిల్ నెల ముగిసిన నేపథ్యంలో మోడళ్ల వారీగా అమ్మకాలను విడుదల చేస్తుంది. కంపెనీ తాజాగా వ్యాగన్ఆర్ (Wagon R)కు సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడిస్తుంది. ఇది భారత మార్కెట్లో ఒక పేరుపొందిన హ్యాచ్‌బ్యాక్. దీని డిజైన్ సాధారణంగా ఆకర్షణీయంగా ఉండి, మంచి మైలేజీతో పాటు వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపొందించబడింది. ప్రత్యేకించి మిడిల్ క్లాస్, మధ్య తరగతి కుటుంబాల్లో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. తక్కువ ధరలో, మంచి మైలేజ్, మెయింటెనెన్స్‌లో తక్కువ ఖర్చు లాంటి అంశాల కారణంగా మార్కెట్లో నిలకడగా ఉంది.

సిరోస్ SUV కొనాలంటే ఇప్పుడు మీ జేబుకు చిల్లు పడుతుంది!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) సోనెట్, సెల్టోస్ వంటి పలు మోడళ్లతో పాటు ప్రసిద్ధ సిరోస్ (syros)ను కూడా విక్రయిస్తుంది. తాజాగా విడుదల చేసిన సిరోస్ SUV మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతుంది. గత ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉండగా, బాక్సీ డిజైన్‌తో పాటు, ప్రాక్టికల్ ఫీచర్లతో చాలామంది కస్టమర్లను ఆకర్షించగలిగింది. సోనెట్, సెల్టోస్ మధ్య స్థానం కలిగి ఉన్న ఈ మోడల్, మార్కెట్లో తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించి, మార్చి నెలలో మాత్రమే 5,000కు పైగా కార్లు అమ్ముడుపోవడం దీనికి నిదర్శనం.

కియా కారెన్స్ క్లావిస్ వర్సెస్ ఇన్నోవా క్రిస్టా.. ఏది బెస్ట్ అంటే ?

కియా తన సరికొత్త క్లావిస్ ఎంపీవీని ఎట్టకేలకు నిన్న ఆవిష్కరించింది. దీనిని భారతదేశంలో కియా కారెన్స్ క్లావిస్ పేరుతో పరిచయం చేస్తుంది. ఇది కాస్త ప్రీమియం MPV కాబట్టి, ధరలు ప్రకటించిన తర్వాత ఈ కారు డబ్బుకు తగిన విలువైనదేనా అని చెప్పే వీలుంటుంది. మా అంచనా ప్రకారం ధరలు వచ్చే నెలలో ప్రకటించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ రెడీ... ఇప్పుడు హడావుడి చేసే సమయం వచ్చింది!

బైకుల రారాజు అంటే దేశంలో అందరికి గుర్తుకువచ్చే కంపెనీ ఏదంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). తన క్లాసిక్ డిజైన్‌కు తోడుగా లేటెస్ట్ రూపాన్ని జోడిస్తూ టూవీలర్ విభాగంలో ప్రపంచంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. గత కొద్దికాలంగా, కంపెనీ కీలకమైన చర్యలు తీసుకుంటుంది. భారత వాహన మార్కెట్ మంచి లాభాదాయకంగా ఉండటంతో చాలా టూవీలర్ తయారీదారులు మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి వరుసగా కొత్త కొత్త టూవీలర్స్‌ను విడుదల చేస్తూ క్రమంగా ప్రజలకు తమ వాహనాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పోటీ వాతావరణం తట్టుకుని నిలబడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ పలు కొత్త బైకులను విడుదల చేయాలని చూస్తుంది.
Advertisement

మన దేశంలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బండి ఇదే.. ధర కూడా రూ.59వేలే

మన దేశంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బండి తక్కువ బడ్జెట్లో మంచి బండి కావాలనుకునే వాళ్లకు ఒక మంచి ఆప్షన్. ఈ బండి ధర కూడా అక్షరాలా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు (షోరూమ్‌లో). తక్కువ ధరలో ఎక్కువ దూరం వెళ్లే బండి కోసం చూసేవాళ్లకు ఇది చాలా మంచిది. ఇంకా ఇది చాలా మంచి మైలేజ్ కూడా ఇస్తుంది.

అసలైన గేమ్ ఛేంజర్.. ఈ కొత్త ఆల్ట్రోజ్‌కి బ్రేక్ వేయడం ఎవరి తరం కాదు!

ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో దేశీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) కొత్త మోడళ్లను విడుదల చేయడంపై సన్నాహాలు చేస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం త్వరలో ఆల్ట్రోజ్(Altroz) కొత్త ఫేస్‌లిఫ్ట వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. టాటా విడుదల చేసే ప్రతి వాహనంపై ప్రజలకూ, పరిశ్రమకు కూడా ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉండటం సహజం. అలాంటి నమ్మకాన్ని తిరిగి నిరూపించేందుకు ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ కొత్త అవతారంలో రానుంది. ఈ కొత్త మోడల్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు విడుదలకు ముందే దీనికి సంబంధించిన డిజైన్, ఫీచర్స్ అంశాలు కొన్ని లీక్ అయ్యాయి. టాటా తన ప్రసిద్ధ కారును మే 22న మార్కెట్లోకి ప్రారభించనుంది.

సామాన్యుడిలా కనిపించే ఈ సూపర్ స్టార్ దగ్గర ఎన్ని కార్లున్నాయో తెలిస్తే.. వాటి విలువ వింటేనే గుండె జారిపోద్ది

ఒకప్పుడు బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్లో తిరిగే స్థాయికి ఎదిగిన నటుడు రజనీకాంత్. ఆయన కార్ల కలెక్షన్ తన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన గ్యారేజ్‌లో ఒకప్పటి సాధారణ ప్రీమియర్ పద్మిని నుంచి అత్యాధునిక హైపర్-పర్ఫార్మెన్స్ కార్ల వరకు అన్నీ ఉన్నాయి.

డిస్కౌంట్ పండగ: మాగ్నైట్ SUV కొనుగోలుపై భారీ తగ్గింపు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నిస్సాన్ (Nissan) మే నెలకు సంబంధించి ప్రత్యేకంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తగ్గింపు ప్రయోజనాలను తీసుకొచ్చింది. తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి మాగ్నైట్ (Magnite) కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఎస్‌యూవీ మెరుగైన పనితీరును అందిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న ఈ కారుపై మే 2025లో గరిష్టంగా దాదాపు రూ.90,000 వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ కారుకు ఉన్న డిమాండ్ ను గమనిస్తే, ప్రతీ నెలా ఈ SUV సుమారు 2,000 యూనిట్లకు పైగా అమ్ముడవుతోంది. మాగ్నైట్ కారు నిస్సాన్ కంపెనీకి అత్యంత కీలకమైన మోడల్.
Advertisement

పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? ఈ బైక్స్‌తో టెన్షన్ లేదు!

ప్రతి రోజూ ఆఫీస్ పనుల కోసం వెళ్లే వారికి మోటార్ సైకిళ్లు చాలా అవసరం. అయితే, చాలా మందికి ఏ బైక్ తీసుకుంటే మంచిది? అది ఎక్కువ కాలం మన్నుతుందా? తక్కువ ధరలో దొరుకుతుందా? ఎక్కువ మైలేజీ అందిస్తుందా అన్న సందేహాలు ఉంటాయి. ఇక్కడ రోజువారీ అవసరాల కోసం ఉపయోగించడానికి బాగా సరిపోయే, ఎక్కువ మైలేజీ ఇచ్చే 7 ముఖ్యమైన మోటార్ సైకిళ్ల ధర, స్పెషాలిటీ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ విండ్సర్ EV ప్రో బుకింగ్‌లు ప్రారంభం.. లేట్ చేయకుండా బుక్ చేసుకోండి!

భారత వాహన మార్కెట్లో ఎంజీ కార్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్లను ప్రజలు చాలా ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. ప్రసిద్ద మోడల్ విండ్సర్ ఈవీకి దేశీయంగా బాగా డిమాండ్ ఉంటుంది. ఇది ఇప్పటికే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డులు నెలకొల్పింది. ఇది కేవలం శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవం మాత్రమే కాదు, దాని స్టైలింగ్, ఇంటీరియర్ ఫీచర్లు, టెక్ ఆధారిత కనెక్టివిటీతో ఒక ప్రీమియం క్లాస్‌ టచ్ అనుభూతిని ఇస్తుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా విండ్సర్ EV ప్రో (Windsor Ev Pro)ను తీసుకొచ్చింది. దీని మునుపటి మోడల్‌తో పోలిస్తే దీనిలో చాలా కొత్త అప్‌డేట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది.

టీవీఎస్ దెబ్బకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బేజారు! నార్టన్ రాకతో మార్కెట్ షేక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి తిరుగులేని బైక్ బ్రాండ్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి టీవీఎస్ మోటార్ కంపెనీ సిద్ధమవుతోంది. 2020లో టీవీఎస్ కొనుగోలు చేసిన బ్రిటిష్ బ్రాండ్ నార్టన్ మోటార్‌సైకిల్స్ ఇప్పుడు భారతీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. 2025 చివరి నాటికి నార్టన్ బైక్‌లు ఇక్కడ సందడి చేయనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

అద్భుతమైన ఫీచర్లతో కియా కారెన్స్ క్లావిస్ వచ్చేసింది

దక్షిణ కొరియాకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాప్ ఆటోమేకర్ కంపెనీలో స్థానం సంపాదించుకుంది. భారత వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా కియా కొత్తగా కారెన్స్ క్లావిస్ (carens clavis) కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పటికే దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉన్నటువంటి కారెన్స్ ఇప్పుడు కొత్త ఫీచర్స్‌, డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వచ్చింది. ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కంపెనీ గొప్ప గుడ్‌న్యూస్‌ను అందించింది. తాజాగా కారెన్స్ క్లావిస్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. కారును కావాలనుకున్న వారు రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement

యూత్ ఫేవరెట్ బైక్‌లో సమస్య.. అమ్మకాలు ఆపేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్!

భారతదేశంలోని యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒకప్పటి ఇబ్బందికరమైన బండ్ల నుంచి ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ లేని అదిరిపోయే యంగ్ మోటార్‌సైకిల్స్‌ను ఈ బ్రాండ్ అందిస్తోంది. అయినా సరే, ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఏ బైక్‌నైనా బుల్లెట్ అనే ముద్దు పేరుతోనే పిలుచుకుంటారు.

'ధూమ్' బైక్ కొన్న బెంగళూరు బిజినెస్ ఉమెన్! ఆమె చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు!

'ధూమ్' సినిమా రాకముందు చాలా మంది భారతీయులకు సుజుకి హయబుసా అనే మోటార్‌సైకిల్ గురించి పెద్దగా పరిచయం లేదు. ఆ సినిమాలో విలన్‌గా నటించిన జాన్ అబ్రహంతో పాటు ఈ జపనీస్ సూపర్ బైక్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్‎గా నిలిచింది. 'ధూమ్' సినిమా తర్వాత సుజుకి హయబుసా భారతీయ మార్కెట్‌లో బాగా పాపులర్ అయింది.

ఇది నెక్స్ట్ లెవల్ కారు.. హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఈవీ రాబోతుంది!

దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ ఐసీఈ ఇంజిన్ ఆధారిత వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో Ioniq 5 (ఐయోనిక్ 5)ని తీసుకొచ్చింది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా ఇప్పటికే భారత మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కొత్త ఫీచర్స్‌తో ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకురాబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన స్పై ఫోటోలు ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉండగా, భారత మార్కెట్‌లో ఇది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో లభించే అవకాశం ఉంది. ఈ కొత్త కారును చూసినట్లయితే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాత దానితో పోలిస్తే అదనంగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఇచ్చారు.

సగం ధరకే రోల్స్ రాయిస్ కార్లు! మోదీ వేసిన మాస్టర్ స్ట్రోక్!

భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్‎ను పూర్తిగా మార్చే విధంగా బ్రిటన్-భారత్ ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) రూపొందించారు. దీని ప్రకారం, బ్రిటన్‌లో తయారైన కార్లపై పన్ను 100శాతం నుండి 10శాతానికి తగ్గించారు. దీనివల్ల భారతీయ వినియోగదారులకు ఈ వాహనాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. దిగుమతి సుంకంలో ఈ గణనీయమైన తగ్గింపు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది.
Advertisement

ఆర్మీకి అంకితమైన ఆఫ్-రోడ్ రాజు: ఫోర్స్ గూర్ఖా విశేషాలు!

భారత్-పాక్ మధ్య ప్రస్తుతం భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఇండియా మిలిటరీ శక్తి సామర్థ్యాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత సైన్యం ఇటీవల దాదాపు 3,000 ఫోర్స్ గూర్ఖా వాహనాలను కొనుగోలు చేసిన విషయంపై కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఫోర్స్ గూర్ఖా వాహనాలు భారత సైన్యానికి దాడులకు సంబంధించి రవాణకు బాగా ఉపయోగపడుతుంది. హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సైనిక కార్యకలాపాలలో ఈ వాహనం కీలక పాత్ర పోషించింది.