ఆర్మీకి అంకితమైన ఆఫ్-రోడ్ రాజు: ఫోర్స్ గూర్ఖా విశేషాలు!
ఆటోమొబైల్స్
- 1 year, 4 month, 13 days ago
భారత్-పాక్ మధ్య ప్రస్తుతం భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఇండియా మిలిటరీ శక్తి సామర్థ్యాల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో భారత సైన్యం ఇటీవల దాదాపు 3,000 ఫోర్స్ గూర్ఖా వాహనాలను కొనుగోలు చేసిన విషయంపై కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఫోర్స్ గూర్ఖా వాహనాలు భారత సైన్యానికి దాడులకు సంబంధించి రవాణకు బాగా ఉపయోగపడుతుంది. హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సైనిక కార్యకలాపాలలో ఈ వాహనం కీలక పాత్ర పోషించింది.