ఇకపై 100 దేశాల చూపు భారత్‌పైనే.. మారుతి ఇ విటారా గొప్ప విజయం!

కొన్ని సార్లు రావడం కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్న పవన్ డైలాగ్ ప్రస్తుతం మారుతికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న దిగ్గజ కంపెనీ మారుతి. కంపెనీ ఎప్పుడు ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుందా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించేలా తొలి సారిగా ఎలక్ట్రిక్ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతుంది.

భారత మార్కెట్‌లో దూసుకెళ్తున్న కియా.. మార్చిలో 25,525 యూనిట్ల సేల్స్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రసిద్ధ కంపెనీగా అవతరించింది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు బలమైన పోటీగా ఎదిగి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు తన కార్లను పరిచయం చేస్తుంది. సెల్టోస్, సోనెట్ లాంటి SUV లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టి, కేవలం కొన్ని సంవత్సరాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కియా, దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన మోడళ్లను లాంచ్ చేస్తుంది. భారత మార్కెట్లో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ బ్రాండ్‌లు తమదైన ముద్ర వేయడానికి పోటీ పడుతున్నప్పటికీ, కియా మాత్రం ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ను దక్కించుకుంది.

ఇకపై స్కూటర్‌కు ఇద్దరు హెల్మెట్లు తప్పనిసరి! భద్రతకు పెద్దపీట!

వాహనదారుల భద్రత పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతేడాది జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వందల మంది మరణిస్తుండడంతో ప్రభుత్వం వాటి నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక మీదట కొత్తగా స్కూటర్, బైక్ కొనుగోలు చేస్తే దానితో పాటు కొనుగోలుదారుడికి డీలర్ నుంచి రెండు హెల్మెట్లు ఇవ్వాలని రూల్ పెట్టింది.

భారతదేశంలోని నెంబర్ 1 ప్యాసింజర్ వెహికల్‌గా అవతరించిన వ్యాగన్ఆర్

భారతదేశంలో బడ్జెట్ ధరలో లభించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా అందుబాటు ధరలో, మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా గత ఆర్థిక సంవత్సరం ముగిసి కొత ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో వాహన తయారీదారులు తమ సేల్స్ వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన విక్రయాల డేటాను వెల్లడించింది. కంపెనీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బెస్ట్ సెల్లింగ్ కార్ టైటిల్‌ను మారుతీ మరోసారి తన సొంతం చేసుకుంది.
Advertisement

మహీంద్రా చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు! థార్, స్కార్పియో, XUV700 హవా!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ కాలంలో మొత్తం 5,51,487 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (FY24)లో నమోదైన 4,59,877 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 20 శాతం వృద్ధిని సూచిస్తుంది.

చలాన్ కట్టేయండి.. లేకుంటే లైసెన్స్ రద్దు.. గవర్నమెంట్ కఠిన నిర్ణయం

భారతదేశంలో రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారికి కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం పలు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే జరిమానాలు విధించడం మాత్రమే ఉండగా, ఇప్పుడు మరింత కఠినమైన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఇ-చలాన్లు చెల్లించనట్లయితే, సంబంధిత వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసే విధానం అమల్లోకి రావచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫైన్ విధించే వారు.

నిస్సాన్ మళ్లీ ఫామ్‌లోకి! Fy2024-25 ఆర్థిక సంవత్సరంలో సేల్స్ బ్రేకింగ్ రికార్డ్!

ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ నిస్సాన్(Nissan) గత కొంత కాలంగా బలమైన సేల్స్‌ను సాధిస్తుంది. ఇతర కంపెనీలకు ధీటుగా వేగంగా వరుసగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ కస్టమర్లను తన వైపు తిప్పుకుంటుంది. తాజాగా నిస్సాన్ తన అమ్మకాలపై కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన విక్రయాలు సాధించినట్టు ప్రకటించింది. గత ఏడు సంవత్సరాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతకుముందు 2024-25లో మెరుగైన గణంకాలను సాధించింది. వాహన మార్కెట్లో కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి అదిరిపోయే డిజైన్స్, లేటెస్ట్ ప్రీమియం ఫీచర్స్‌తో కార్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో నిస్సాన్ వారిని ఆకట్టుకోవడంతో కొంత సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ లగ్జరీ లైఫ్: మెర్సిడెస్ బెంజ్‌లో విమానాశ్రయానికి!

మనదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ విడాకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో విడాకులు కోరుతూ కోర్టుల మెట్లెక్కుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సామాజిక ఒత్తిళ్లను అధిగమించి, సంతోషం లేని బంధాల నుంచి బయటకు రావడానికి, ఆర్థిక స్వాతంత్ర్యం, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన వంటి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Advertisement

హృతిక్ రోషన్‌కి ఇష్టమైన బైక్‌ను గత మూడు నెలలుగా ఎవరూ కొనలేదు

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ భారత్‌లో బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. పేద, మధ్య తరగతి, ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని పలు టూవీలర్స్‌ను విడుదల చేస్తూ, హోండా, టీవీఎస్ వంటి ఇతర తయారీదారులకు గట్టి పోటీగా నిలుస్తుంది. తాజాగా హీరో తన ప్రసిద్ధ మోడల్ అయినటువంటి కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్ 210 (karizma xmr 210)కు సంబంధించిన అమ్మకాల డేటా విడుదల అయింది. దీని ప్రకారం, వందలాది మోడళ్లతో భారతదేశాన్ని టూవీలర్ సెగ్మెంట్‌లో ఏలుతున్న హీరో కంపెనీ.. ఇప్పుడు తన ఒక ప్రధాన బైక్ మోడల్‌తో ఊహించని ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. అంచనాలు పెట్టుకున్న హీరో కరిజ్మా 210 బైక్‌ కు ఆశించిన స్పందన రాకపోవడం, వాస్తవానికి మూడు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం.

టయోటా నుంచి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఈవీ

భారత ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) మార్కెట్‌లోకి టయోటా తన తొలి అడుగు వేయడానికి రెడీ అవుతుంది. అర్బన్ క్రూజర్ బీఈవీ(BEV) పేరుతో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతుంది. ప్రియస్ కారు ద్వారా హైబ్రిడ్ టెక్నాలజీని 15ఏళ్ల క్రితమే పరిచయం చేసిన టొయోటా, ఇప్పుడు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనంతో సత్తా చాటాలని చూస్తోంది. ఈ కారు ఇప్పటికే గతేడాది డిసెంబర్‌లో యూరోప్‌లో విడుదలైంది. కొద్ది నెలల్లో ఇండియాలోకి రానుందని అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్ 2025లో భారతీయ మార్కెట్‌లో విడుదల కానున్న మోడల్స్ ఇవే !

భారతీయ వాహనదారులను ఆకర్షించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు ఏప్రిల్ 2025లో సరికొత్త కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలో కొత్త కార్లతో పాటు ఇప్పటికే ఉన్న మోడళ్ల అప్‎డేటెడ్ వెర్షన్లు కూడా విడుదల కానున్నాయి. గత నెలల మాదిరిగానే, ఈ ఏప్రిల్‌లో కూడా దేశీయ ఫోర్ వీలర్ విభాగంలో సందడి నెలకొననుంది. ఈ ఏప్రిల్‌లో విడుదల కానున్న టాప్ 5 కార్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

CNG కారును ఇలా నడిపితే.. మైలేజ్ ఊహించనంత పెరుగుతుంది!

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో, CNG కార్లు తిరిగి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే ఈ వాహనాలను ఎంతో మంది ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేసిన చాలా మంది ఆ తర్వాత వాటిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. దీంతో దాని మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం వంటి ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఈ కారును తమ వద్ద కలిగి ఉన్నట్లయితే ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మేము చెప్పిన విషయాలను మీరు పాటించినట్లయితే మీ CNG కారు మెరుగైన మైలేజ్, పనితీరును అందిస్తుంది. అవెంటో కింది కథనంలో తెలుసుకుందాం.
Advertisement

టయోటా సంచలనం.. తక్కువ ధరలో ల్యాండ్ క్రూయిజర్.. గెట్ రెడీ బాయ్స్

మనదేశంలో SUV మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌కు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. అయితే, అధిక ధర కారణంగా చాలా మంది కొనుగోలుదారులు దానిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టయోటా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. అదేంటంటే, ఫార్చ్యూనర్‌కు మరింత సరసమైన ధరలో ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఈ కొత్త SUVనే టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ.

మంచి రేంజ్‌తో అదిరిపోయే కొత్త కార్! భారత మార్కెట్‌లోకి VinFast VF3 EV దూసుకొస్తోంది!

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (Vinfast) భారతీయ కార్ల మార్కెట్లో తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇంతకుముందు ప్రధానంగా వియత్నాం మార్కెట్‌కే పరిమితమైన ఈ బ్రాండ్, ఇప్పుడు భారత్ వంటి విస్తృత వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పలు మోడళ్లను విడుదల చేయడానికి కీలకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో 'VF3' ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. చిన్నదైన, స్టైలిష్‌ లుక్‌తో, పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌తో వస్తున్న ఈ కారు, భారతీయ రహదారులపై విప్లవాత్మక మార్పుని తీసుకురాబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

పోర్షే కార్లలో విప్లవాత్మక మార్పులు - ఇంటీరియర్‌లో సరికొత్త ఫీచర్లు, మరింత కనెక్టివిటీ!

లగ్జరీ కార్లలోకి అడుగుపెడితే మళ్లీ దిగాలనిపించదు. అంతేకాదు లెక్కలేనన్ని ఫీచర్లు లగ్జరీ వాహనాల్లో ఉంటాయి. వాహనాల్లో మార్పులు తీసుకురావడం అన్ని బ్రాండ్‌లు చేసేదే. 911, టేకాన్, పనామెరా, కయీన్ మోడళ్లలో కస్టమర్ల సౌలభ్యం, కనెక్టివిటీని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. తాజా మోడళ్లలో మెరుగైన ఆడియో టెక్నాలజీతో పలు కీలక అప్ డేట్స్ అందిస్తోంది.

మహీంద్రా స్కార్పియో పిక్-అప్‌లతో సైనిక బలగాలకు కొత్త జోష్!

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (mahindra And mahindra) మరోసారి భారత సాయుధ దళానికి కీలక మద్దతునిచ్చే దిశగా ముందడుగు వేసింది. దేశీయ SUV దిగ్గజం భారత సైన్యానికి 1,986 యూనిట్ల స్కార్పియో పిక్-అప్‌లను సరఫరా చేయడానికి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విలువ ఏకంగా రూ.2,700 కోట్ల వరకు ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి కంపెనీ ఉన్నతాధికారులు, భారత సాయుధ దళం అధికారుల మధ్య ఒప్పందానికి సంబంధించి సంతకాలు కూడా పూర్తయినట్లు సంబంధిత వర్గాల వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం మహీంద్రా, భారత రక్షణ దళాల మధ్య దీర్ఘకాలికమైన సహకారానికి మరొక మైలురాయిగా నిలుస్తుంది.
Advertisement

లెజెండరీ SUV సియెర్రా మళ్లీ రాబోతుంది.. అందరు సిద్దంగా ఉండండి!

భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో అత్యంత ఐకానిక్ SUVలలో ఒకటిగా గుర్తింపు పొందిన టాటా సియెర్రా (tata sierra) రెండు దశాబ్దాల విరామం తర్వాత కొత్తగా శక్తివంతమైన రూపంలో మార్కెట్లోకి తిరిగి వస్తోంది. .21వ శతాబ్దపు ఈ సరికొత్త మోడల్ తన రివొల్యూషనరీ డిజైన్, అధునాతన టెక్నాలజీ‌తో SUV విభాగంలో తన సత్తా చాటడానికి వస్తుంది. ఇది భారత కార్ ప్రేమికులకు ఒక నమ్మశక్యం కాని కమ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా సియెర్రా సరికొత్త డిజైన్‌ను ప్రపంచానికి కంపెనీ పరిచయం చేసింది. అప్పటి నుంచి కూడా ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

Kia Seltos : హైబ్రిడ్ ఇంజన్‌తో మార్కెట్లో దుమ్ములేపనున్న కియా సెల్టోస్

కియా సెల్టోస్ దాని స్టైలిష్ లుక్స్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్, పర్ఫామెన్స్ తో భారతీయ కొనుగోలుదారులను ఆకట్టుకుంది. ఇది కియా మోటార్స్ భారతదేశంలో స్థిరపడటానికి సాయపడింది. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కియా సెల్టోస్‌లో అప్‌డేట్‌లు, ఫేస్‌లిఫ్ట్‌లు వస్తూ ఉన్నాయి. కియా సెల్టోస్ అనేది కియా మోటార్స్ భారతదేశంలో విడుదల చేసిన ఒక కాంపాక్ట్ SUV. ఇది 2019లో విడుదలైంది..తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది.

రూ. 12 లక్షల లోపు బెస్ట్ 5-సీటర్ SUVలు: ఎక్కువ మైలేజ్, సూపర్ ఫీచర్లు!

మనదేశంలో SUVల హవా కొనసాగుతోంది. వాటి స్టైలిష్ డిజైన్, విశాలమైన క్యాబిన్, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా కొత్త SUV కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, రూ. 12 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని అద్భుతమైన 5-సీటర్ SUVల గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో 4 బెస్ట్ CNG కార్లు.. సూపర్ మైలేజ్, లగ్జరీ ఫీచర్లు

ఇటీవలి కాలంలో, భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో CNG కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే, ఈ కార్లు ఎక్కువ మైలేజీ, తక్కువ ఇంధన ఖర్చుతో ఒనర్లకు తక్కువ మెయింటనెన్స్ ఖర్చును ఇస్తాయి. పైగా ఇవి పర్యావరణ అనుకూలమైనవి. దీంతో ఈ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, CNG కార్లలో ప్రయాణం 'స్మార్ట్' ఆప్షన్ గా మారింది. ఈ కార్లు ఒక క్యూబిక్ మీటర్ గ్యాస్‌తో పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి.
Advertisement

హీరో స్ప్లెండర్ ప్లస్‌కు పోటీగా 3 కొత్త బైక్‌లు - మీ బడ్జెట్‌లో ఏది బెస్ట్?

ఇండియాలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒక పాపులర్ మోటార్ సైకిల్. ఇది మధ్యతరగతి ప్రజలకు అనువైన బైక్. దీని ధర రూ. 76,000 నుంచి రూ. 79,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 97.2సీసీ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 70 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇది ఫోర్స్ సిల్వర్, బ్లాక్ రెడ్ పర్పుల్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

ఆఫ్-రోడింగ్ కింగ్ వచ్చేశాడు.. ల్యాండ్ రోవర్ కొత్త మోడల్ పూర్తి వివరాలు ఇవే!

ప్రసిద్ధ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) ఇటీవల సరికొత్త డిఫెండర్ ఒక్టా (Defender Octa) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ SUV ప్రారంభ ధర రూ.2 కోట్ల 59 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ 4x4 లగ్జరీ SUV, అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్థ్యంతో పాటుగా, విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతలతో కూడి ఉంది. డిఫెండర్ OCTA తన మునుపటి మోడల్ కంటే మరింత ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంది. రైడ్ ఎత్తు పెంచడం వలన కఠినమైన భూభాగాలపై కూడా సులభంగా ప్రయాణాన్ని సాగిస్తుంది.

వోక్స్ వ్యాగన్ కార్ మోడల్స్ పై ఏకంగా రూ.2.5 లక్షల డిస్కౌంట్

వోక్స్‌వ్యాగన్ మనదేశంలోని ప్రముఖ కారు కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ప్రతేడాది అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయిస్తుంది. వోక్స్‌వ్యాగన్ కస్టమర్లను ఆకర్షించడానికి కాలానుగుణంగా ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తుంది. ముఖ్యంగా, ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున, వీలైనంత ఎక్కువ కార్లను విక్రయించడానికి భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని వోక్స్ వ్యాగన్ కార్లపై అందించే ఆఫర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సుపర్ స్పేస్, అధునాతన ఫీచర్లు.. టయోటా-సుజుకీ నుంచి సరికొత్త వాహనం!

కరోనా తర్వాత కాలంలో మొత్తం కుటుంబం అంతా కలిసి ప్రయాణాలు చేయడం బాగా పెరిగింది. దీంతో వాహన తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందిన కార్ల తయారీదారులు పోటా పోటీగా పలు మోడళ్లను లాంచ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వాణిజ్య అవసరాల కోసం కూడా ఉపయోగపడే వ్యాన్ తరహా మోడళ్లకు కూడా డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దిగ్గజ కంపెనీలు కలిసి ఇలాంటి వ్యాన్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. సుజుకీ (Suzuki), టయోటా (toyota) కంపెనీలు సంయుక్తంగా వ్యాన్‌ను తయారు చేయనున్నాయి.
Advertisement

ఏప్రిల్‌లో లాంచ్ అవుతున్న టాప్ 4 కార్లు! అందరు ఇక సిద్ధంగా ఉండండి

భారత ఆటోమొబైల్ మార్కెట్‌ కొత్త లాంచ్‌ల కోసం ఎదురు చూస్తుంది. వచ్చే నెలలో దేశీయ వినియోగదారుల కోసం దిగ్గజ వాహన తయారీదారులు కొత్త కార్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిలో సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ అధునాతన టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్స్, అదిరిపోయే పెర్ఫామెన్స్ అందించడానికి వాహన ప్రియులను ఆకట్టుకోవడానికి విడుదల కాబోతున్నాయి. దేశీయంగా కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki), ఎంజీ మోటార్ (Mg motor), టాటా మోటార్స్ (tata motors), నిస్సాన్ (nissan) కంపెనీల నుంచి అత్యాధునిక టెక్నాలజీతో, అధునాతన సదుపాయాలతో కూడిన కార్తు విడుదల కానున్నాయి. వాటి గురించి కింది కథనంలో తెలుసుకుందాం.