రూ.3.25 లక్షలకే సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వైవ్ ఇవా ప్రత్యేకతలివే !

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైవ్ మొబిలిటీ అనే సోలార్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తన సరికొత్త ఉత్పత్తి అయిన ఇవా కాంపాక్ట్ సోలార్ ఎలక్ట్రిక్ 2-సీటర్ కారును ప్రదర్శించింది. ఈ కారు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ రద్దీ, లిమిటెడ్ పార్కింగ్ ప్లేస్, పెరుగుతున్న ఇంధన ధరల వంటి సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించారు. ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

ఈ స్కూటర్‌ని జనాలు చూడగానే కొంటారు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

భారతదేశంలో స్కూటర్ల రాజుగా వెలుగొందుతున్న మోడల్ అంటే అందరికి మొదట గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే(Honda Activa). ఇది దేశంలో ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్‌గా ఉంది. పేద, మధ్య తరగతి వినియోగదారులను ఆకర్షిస్తూ సరికొత్త డిజైన్, శక్తివంతమైన పనితీరుతో ఆకట్టుకుంటుంది. మార్కెట్లో ఎన్నో మోడళ్లు ఉన్నప్పటికి కూడా యాక్టివాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. భారతీయుల హృదయాల్లో చెరిగిపోని ముద్రగా ఉండిపోయింది. 2001లో భారత్‌లో పరిచయమైన ఈ మోడల్ మంచి మైలేజ్, నమ్మకమైన పనితనంతో భారతీయ రోడ్లపై అధిపత్యం చలాయిస్తోంది. ఈ స్కూటర్‌ను యువత నుండి వృద్ధుల వరకు అందరు కూడా ఈజీగా నడపవచ్చు. అందుకే ఇది సేల్స్ విషయంలో ఇతర మోడళ్ల కంటే టాప్ ప్లేస్‌లో ఉంటుంది.

మారుతి ఏ కారుకు ఎంత రేటు పెంచిందో తెలుసా ?

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు ఎప్పటి మాదిరే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీనిని భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి మొదట ప్రారంభించింది. మారుతి సుజుకి తన కార్ల ధరలను వచ్చే నెల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది.

భారతదేశపు మొట్టమొదటి AI కారు వచ్చేసింది

ఎంజీ మోటార్ ఇండియా.. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'ఎంజీ ఆస్టర్' కారును విడుదల చేసింది. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికత, సేఫ్టీ, సౌకర్యం ఉన్నాయి. ఎంజీ ఆస్టర్ ఇప్పుడు దాని కొత్త షైన్ వేరియంట్‌తో రూ.12.5 లక్షల(ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధరకే పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే దాని సెగ్మెంట్లో ఏకైక SUV అని కంపెనీ చెబుతోంది.
Advertisement

మహీంద్రా XUV700 పై భారీ డిస్కౌంట్ .. ఏకంగా రూ.75,000 తగ్గింపు

దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. అత్యంత ప్రజాదరణ పొందిన తన ప్రసిద్ధ మోడల్ XUV700 SUV మోడల్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, హై-టెక్ భద్రతా ప్రమాణాలతో పాపులర్ అయిన ఈ మోడల్‌పై కస్టమర్లకు వేరియంట్‌ను బట్టి తగ్గింపు ధరను ఆఫర్ చేస్తుంది. కుటుంబ SUVగా హిట్ అయిన XUV700 ఈ తగ్గింపు వల్ల మరింత మంది కస్టమర్లు ఈ కారును తమ గ్యారేజ్‌లో నిలుపుకునే అవకాశం లభించనుంది. మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం SUV మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. తక్కువ ధరలో హై-ఎండ్ కారు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం.

బేస్ వేరియంట్ లోనే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చే బెస్ట్ కార్స్ ఇవే

కొత్త కారును కొనుగోలు చేసే వాళ్లు తక్కువ ధర, మైలేజీని మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సేఫ్టీని ప్రాధాన్యతగా చూస్తున్నారు. టాటా మోటార్స్ వంటి కంపెనీలు భద్రతకు పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో కార్ల టాప్ వేరియంట్లలో మాత్రమే కనిపించే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పుడు బేస్ వేరియంట్లలో కూడా లభిస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన కార్లలో కూడా ఈ ఫీచర్ ఉండడం విశేషం. 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్న చౌకైన 15 కార్లలేంటో చూద్దాం.

500 కిమీల రేంజ్.. అదిరే ఫీచర్లు! మారుతీ ఇ-విటారా కోసం అందరు సిద్ధంగా ఉండండి

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారతదేశంలో పేద, మధ్య తరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు సంప్రదాయ ఇంధన మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ క్రమంగా తన ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టింది. ఈ నేపథ్యంలో 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతీ తన తొలి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాని ఆవిష్కరించింది. సురక్షితమైన నిర్మాణం, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ వంటి కార్లకు గట్టి పోటీగా నిలవనుంది. మారుతీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో అమ్మకాల పరంగా కొత్త సంచలనాలకు తెర లేపే అవకాశం ఉంది.

ఓలా, ఊబర్‌కు చెక్.. కేంద్రం నుంచి 'సహకార్ ట్యాక్సీ' సేవలు!

ఓలా, ఊబర్‌ వంటి ప్రైవేట్ కంపెనీలు ప్రస్తుతం ట్యాక్సీ సర్వీసుల్లో ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం 'సహకార్ ట్యాక్సీ'ని విజయవంతంగా అమలు చేస్తే, డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
Advertisement

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల హవా.. మహీంద్రా నుంచి 6 సూపర్ మోడల్స్!

భారతీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) మారుతున్న కాలానికి అనుగుణంగా ఐసీఈ ఇంజిన్‌ కార్లను తయారు చేస్తునే మరోవైపు ఎలక్ట్రిక్ విభాగాంపై కూడా కీలకంగా దృష్టి సారించింది. భారత ఆటోమొబైల్ మార్కెట్ అత్యంత లాభదాయకంగా ఉండటంతో అంతర్జాతీయంగా ఈవీ తయారీదారులుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీలు టెస్లా, బీవైడీలు తమ మార్కెట్‌ను ఇండియాలో పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనాకు చెందిన ఈవీ తయారీదారు బీవైడీ కంపెనీ ఇప్పటికే దేశంలో ఉనికిని కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా టెస్లా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతటి పోటీ ఉన్న తరుణంలో మహీంద్రా భారతీయ వినియోగదారులకు స్వదేశీ కంపెనీ నుంచి ఇక్కడే తయారైన వాహనాలను అందివ్వడానికి కీలకంగా ప్రణాళికలు రచించి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ SUV కార్లను విడుదల చేయాలని చూస్తుంది.

హైదరాబాద్‌లో రూ.85,000 కోట్ల భారీ పెట్టుబడి! భారత EV మార్కెట్‌పై BYD సంచలనం

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజల నుంచి ఈవీలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో అంతర్జాతీయంగా ప్రముఖ కంపెలన్నీ కూడా ఇప్పుడు భారత్‌కు రావడానికి క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్నటువంటి చైనా దేశానికి చెందిన దిగ్గజ వాహన తయారీదారు BYD (బీవైడీ) ఇండియా మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే మంచి మార్కెట్ కలిగి ఉండగా, తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించడానికి పెద్ద ఎత్తున కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్: కొత్త లుక్, అధునాతన సాంకేతికత!

ప్రపంచ ఆటోమోటివ్ దిగ్గజం టయోటా తన సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో SUVని రిలీజ్ చేసింది. టయోటా కంపెనీ సేఫ్టీకి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అందరికీ తెలుసు. ఇటీవల జరిగిన క్రాష్ టెస్టుల్లో, ప్రాడో 5స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ANCAP) నిర్వహించిన ఈ టెస్టులో ప్రాడో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఫలితాలను సాధించింది.

5 నిమిషాల్లో కారు బ్యాటరీ ఛార్జ్…మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. అయినా చాలా మంది ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. కారణంగా ఆ వాహనాలకు ఛార్జింజ్ పెట్టుకునేందుకు సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఒక వేళ ఉన్నా ఆ వాహనాలు ఛార్జింగ్ అయ్యేందుకు చాలా సమయం తీసుకోవడంతో వాటిని కొనేందుకు కాస్త ఆలోచిస్తున్నారు.
Advertisement

సైన్యంలో స్థానం దక్కించుకున్న ఫోర్స్ గూర్ఖా.. భారీ డీల్ కుదిరింది!

భారత మార్కెట్లో ఆఫ్-రోడ్ SUVల మధ్య పోటీ ఎక్కువగానే ఉంది. ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ నిరంతరం తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుండగా, మరిన్ని బ్రాండ్‌లు తమ హవా చూపించేందుకు చాలా కాలంగా పోటీ పడుతున్నాయి. థార్‌కు పోటీగా మారుతీ సుజుకీ 2023లో జిమ్నీని విడుదల చేసింది. అయితే జిమ్నీ కారు మార్కెట్లోకి రాకముందే థార్‌కు పోటీగా ఒక శక్తివవంతమైన ఆఫ్‌రోడర్ ఉంది. అదే ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ ఫోర్స్ మోటార్స్ నుంచి వచ్చిన గూర్ఖా వాహనం. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, పవర్‌ఫుల్ ఇంజిన్, కఠినమైన వాతావరణ పరిస్ధితులను తట్టుకునే బలమైన బాడీతో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ఎప్పటి నుంచో థార్‌కి పోటీ ఇస్తోంది.

మారుతి డిజైర్ vs సెలెరియో: ధర, మైలేజ్, ఫీచర్లు, భద్రత

కారు లేదా బైక్ ఏదైనా కొత్తగా కొనాలనుకునే వారు కచ్చితంగా సేఫ్టీ, ఎక్కువ మైలేజీ ఇచ్చే వాటికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, ఈ రెండు ఫీచర్లను ఏ కారు ఇస్తుందో చాలా మందికి తెలియదు. అలాంటి కస్టమర్లకు 6ఎయిర్‌బ్యాగ్‌లతో ఎక్కువ మైలేజీ అందించే మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి సెలెరియో బెస్ట్ ఆఫ్షన్ కావచ్చు. ఈ కథనంలో ఈ కార్ల ధర, స్పెసిఫికేషన్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

పెట్రోల్ ఖర్చు తగ్గించాలా? మాగ్నైట్ CNG అదిరిపోయే మైలేజీతో వస్తోంది

దేశంలో పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో, CNG కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే ఎలక్ట్రిక్ కార్లతో పాటు, సీఎన్‌‌జీల వైపు కూడా చూస్తున్నారు. ఇప్పటికే భారతీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తమ కార్లలో cng కిట్‌లను కూడా అమర్చి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటి సరసన చేరడానికి మరో కంపెనీ సిద్ధమైంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ (Nissan)కూడా CNG సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. దేశీయ మార్కెట్లో హల్‌చల్ సృష్టించిన మాగ్నైట్ SUV త్వరలో CNG వెర్షన్‌లో రానుందని టీజర్ సూచిస్తోంది. మాగ్నైట్ కారు ఇప్పటికే చాలాసార్లు CNG కిట్‌తో రోడ్లపై పరీక్షిస్తున్నట్లు కనిపించింది.

మెర్సిడెస్ ఏఎంజీ ఈ-క్లాస్ కార్ల రీకాల్, ఫైర్ ప్రమాదం అవకాశం

మెర్సిడెస్-బెంజ్ జర్మనీకి చెందిన ఒక లగ్జరీ ఆటోమొబైల్ తయారీ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా తన ఖరీదైన కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. విభిన్న రకాల లగ్జరీ కార్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో సెడాన్లు, కూపేలు, SUVలు, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. ప్రసిద్ధ మోడళ్లలో S-క్లాస్, E-క్లాస్, C-క్లాస్, మరియు SUV లలో GLE, GLS ఉన్నాయి.
Advertisement

ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా 110 కి.మీ ప్రయాణించవచ్చు!

ఆటోమొబైల్ పరిశ్రమలో హైబ్రిడ్ వాహనాల ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. ఎక్కువ కార్ల తయారీదారులు హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను (PHEV) తీసుకొస్తున్నారు. ఇప్పుడు, లగ్జరీ కార్ల తయారీదారు ప్రముఖ కంపెనీ ఆడి (audi) కూడా తన కొత్త మోడల్ A5 మోడల్‌తో ఈ విభాగంలోకి అడుగు పెడుతుంది. తాజాగా ఈ కారును కొత్త PHEV పవర్‌ట్రెయిన్‌తో అప్‌డేట్ చేసింది. దాంతో ఇది ఎలక్ట్రిక్ మోటారు ద్వారా 110 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యాటరీ, పెట్రోల్ రెండింటి ద్వారా ప్రయాణించడం వల్ల కారు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది.

నిస్సాన్ నుంచి కొత్త 7-సీటర్ MPV, SUV రాబోతున్నాయి! రెడీ అయిపోండి!

జపాన్‌కు చెందిన ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ నిస్సాన్ (nissan) త్వరలో భారతీయ మార్కెట్లో తన ఆటోమోటివ్ శక్తిని మరింత పెంచనుంది. క్రమంగా వాహన పరిశ్రమలో పోటీ ఎక్కువ అవుతున్న తరుణంలో ఇతర కంపెనీలకు ఎదుర్కొని వాటికి ధీటుగా అమ్మకాల్లో దూసుకుపోవడానికి కొత్త మోడళ్ల లాంచ్ అవసరం ఉన్న నేపథ్యంలో మరిన్ని కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో మాగ్నైట్ ( Magnite), X-ట్రైల్(X Trail) SUVలను మాత్రమే అందిస్తుంది. అయితే మాగ్నైట్ మాత్రమే భారతీయ మార్కెట్లో గణనీయమైన అమ్మకాలను సాధిస్తుండగా, పూర్తిగా దిగుమతి చేయబడిన X-ట్రైల్ ప్రజల నుంచి తక్కువ ఆదరణను పొందుతుంది. దానికి ప్రధాన కారణం ధర ఎక్కువగా ఉండటమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు తన మోడల్ లైనప్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

ఆల్టో K10 క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ సాధిస్తుందా?

భారత మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో K10 ఒక కీలకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. దీనిని చిన్న మధ్య తరగతి కుటుంబాల కోసం తయారు చేశారు. మారుతి సుజుకి ఆల్టో K10 వివిధ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది విభిన్న బడ్జెట్‌లు, అవసరాలను తీరుస్తుంది. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది

ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్ 2025.. ఇండియాలో ఏ బైక్, ఏ కార్ బెస్ట్ తెలుసా?

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ అలాగే, ఆటో ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏసర్ ఫాస్టర్ (acer faster awards 2025) అవార్డుల నాలుగో ఎడిషన్ విజేతలను ప్రకటించే ఈవెంట్ గురుగ్రామ్‌లో అత్యంత అట్టహాసంగా ముగిసింది. 2024 ఏడాదిలో విడుదలైన ఉత్తమ వాహనాలకు ఈ కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేశారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో డ్రైవ్‌స్పార్క్ సహా మొత్తం 6 ప్రముఖ ఆటోమొబైల్ మీడియా సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి చెందిన ప్రోమిత్ ఘోష్ కూడా జ్యూరీ సభ్యుడిగా ఈ అవార్డుల ఎంపికలో భాగం కావడం విశేషం.
Advertisement

ఎలక్ట్రిక్ కార్లలో కొత్త విప్లవం: ఫోర్డ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్!

ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటికి ఆటోమేటిక్ ట్రాన్స్‎మిషన్ మాత్రమే ఇప్పటి వరకు అందించారు. అందుకే చాలా మంది వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఆటోమేటిక్స్‌పై కొంచెం ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ కొందరు మాత్రం ఎలక్ట్రిక్ కార్లకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. అలాంటి వారికోసం ఫోర్డ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.

అమెరికా ఆటో మార్కెట్ కు ట్రంప్ షాక్.. దిగుమతి కార్లపై 25% సుంకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని విదేశీ తయారీ ఆటోమోటివ్ వాహనాలపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీనివల్ల దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతో పాటు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.

డబ్బుంటే ఆలస్యం ఎందుకు? ఈ పవర్‌ఫుల్ SUVలలో ఒకటి వెంటనే బుక్ చేసుకోండి!

భారతదేశంలోని ఆటోమోటివ్ రంగం వేగంగా మారుతున్నప్పటికీ, డీజిల్ SUVల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అధిక మైలేజ్, శక్తివంతమైన, మెరుగైన పెర్ఫార్మెన్స్ కారణంగా, ఇవి ఇంకా వినియోగదారులకు బాగా ఇష్టమైన మోడళ్లుగా అత్యంత ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే, మార్కెట్‌లో డీజిల్ వేరియంట్లను మెల్లగా తగ్గించే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రత్యేకంగా ఆటోమేటిక్ గేరింగ్ కలిగిన డీజిల్ SUVల ఎంపికలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయినప్పటికీ మార్కెట్లో కొన్ని రూ. 25 లక్షల ధరలో వినియోగదారులకు అనుకూలమైన కార్లు అందుబాటులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక్టా

లగ్జరీ ఎస్‎యూవీ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఈ కంపెనీ సరికొత్త డిఫెండర్ ఒక్టా (Defender Octa) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది డిఫెండర్ శ్రేణిలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన ఎస్యూవీగా నిలవనుంది. ఇవి ధరలోనూ చాలా ఖరీదుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లగల సామర్థ్యంతో వాటిని రూపొందిస్తుంటారు.
Advertisement

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు ప్రీ-బుకింగ్‌లు స్టార్ట్

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రసిద్ధ కార్లను విక్రయిస్తుంది. తాజాగా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టిగువాన్ ఆర్-లైన్ (tiguan-r-line) కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారును ఇటీవల ఆవిష్కరించగా, ఇప్పుడు బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ మోడల్ భారతీయ కస్టమర్లకు ప్రీమియం పనితీరు, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కారును బుకింగ్ చేసుకోవాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయిన ప్రీ-బుకింగ్‌లను చేసుకోవచ్చు. ఇదే కాకుండా, Golf GTI మోడల్ గురించి కూడా ఆసక్తిని సేకరించేందుకు ఫోక్స్‌వ్యాగన్ సర్వే ప్రారంభించింది.