తిరిగినంత తిరగండి నచ్చకపోతే బైక్ ఇచ్చేయండి.. కైనటిక్ సంచలన ప్రకటన

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. స్పెషల్ ఆఫర్లను ప్రకటించడం కొత్తేమీ కాదు. ప్రతి కంపెనీ ఫలానా సందర్భంలో ప్రకటించడం కామనే. కానీ ఇటీవల కొన్ని ఆటోమేకర్స్ ఎవరూ నమ్మలేని, ఇంతకు ముందు ఎవరూ చూడని ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కథనంలో కూడా మనం అలాంటి ఓ ప్రకటన గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల్లో ఒకటైన కైనెటిక్ గ్రీన్ ఈ సంచలన ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే, వారు విక్రయించే ఇ-లూనా ఎలక్ట్రిక్ మోపెడ్‌ను ఎన్ని కిలోమీటర్లు నడిపినా, నచ్చకపోతే తిరిగి ఇచ్చేయవచ్చు. దానికి రూ. 36 వేల వరకు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ పథకం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో పెద్ద సంచలనం సృష్టించింది.

బెస్ట్ మైలేజ్ కార్ కోసం చూస్తున్నారా? అయితే ఈ 5-సీటర్ మోడల్ బెస్ట్ ఆప్షన్!

భారతీయ వాహన మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌ల డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి, బడ్జెట్‌లో లభించి, అధిక మైలేజీ, స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్‌లు కలిగి ఉండే వాటిని దేశీయంగా ప్రజలు ఎగబడి మరి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటివి చాలా మోడళ్లు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధి వాహన తయారీ కంపెనీకి చెందినటువంటి మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన స్విఫ్ట్ (swift) భారతదేశంలో అత్యంత విజయవంతమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా ఉంది. ఇది పేద-మధ్యతరగతి వినియోగదారుల కోసం తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తూ, మెరుగైన మైలేజ్ అందిస్తుంది. ఇది గత 20 సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది.

గ్రీన్ ఎనర్జీ రైలు జూన్‌లో ట్రాక్ పైకి! భవిష్యత్తు రవాణాకు ఇదే మార్గమా?

భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ (Hydrogen Fuel Cell) రైలు ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని చాలా మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవానికి మొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ రైలు డిసెంబర్ 2024లో ప్రారంభించాలని నిర్ణయించారు. తరువాత మార్చి 31 నాటికి వినియోగానికి అందుబాటులోకి వస్తుందని భావించినప్పటికీ, దీనిని టెస్టింగ్ చేస్తున్న సమయంలో పలు సాంకేతిక సమస్యలు వెలుగులోకి రావడంతో ఈ రైలు ప్రారంభాన్ని మరికొంత కాలం వాయిదా వేశారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇండియా మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైలు మరింత పేలోడ్ మోసుకెళ్లగల సామర్థ్యాన్ని పొందేందుకు మరిన్ని మార్పులు చేయాల్సి ఉంది.

ఒకే రోజు 10ఇండియన్ టెస్లా కార్లను రిలీజ్ చేసిన మహీంద్రా

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో పలు సంస్థలకు ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అద్బుతమైన ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి. కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో మార్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలోకి టెస్లా కార్లు రాబోతుండడంతో ఆ కంపెనీ అందించే ఫీచర్లను ఇండియా కార్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి.
Advertisement

దక్షిణ భారతదేశంలో ఈవీ సేల్స్‌లో దూసుకుపోతున్న ఎంజీ మోటార్

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఒక విప్లవాన్ని సృష్టించిన ఎంజీ మోటార్ (Mg Motor) ఇటీవల కాలంలో తన అమ్మకాలలో దూకుడును ప్రదర్శిస్తుంది. లోకల్ ఉన్నటువంటి దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి తయారీదారులకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తూ ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌‌లో మెరుగైన సంఖ్యలను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఎంజీ కంపెనీకి చెందిన ఈవీ కార్లకు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా ఆదరణ లభిస్తుంది. తాజాగా వాహన్ డేటా నుంచి డేటా ప్రకారం, 2024లో JSW MG మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో దాదాపు సగం దక్షిణ భారత మార్కెట్‌లో జరిగిందని తేలింది. MG విండ్సర్ అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో ఒకటిగా ఉంది.

Top-3 Safest Cars: ఇండియాలో తక్కువ ధరలకు లభించే టాప్ 3 సేఫ్టీ కార్లు ఇవే !

Top-3 Safest Cars: ఇండియాలో వాహన భద్రతకు ప్రాధాన్యత పెరుగుతోంది. వినియోగదారులు సురక్షితమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల కార్ల తయారీదారులు కూడా ఎక్కువ భద్రతలో పాటు సరసమైన ధరల్లో కొన్ని కార్లను అందిస్తున్నారు. డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఏ కారు కొనాలనే విషయంలో వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

సూపర్ ఆఫర్! హోండా XL750 ట్రాన్సాల్ప్ పై భారీ డిస్కౌంట్

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే మోడళ్లను మాత్రమే కాకుండా ప్రీమియం లగ్జరీ సూపర్ బైక్స్‌ను కూడా విక్రయిస్తుంది. యాక్టివా, షైన్, యునికార్న్ వంటి ప్రజాదరణ పొందిన బైక్స్ గురించి మాత్రమే చాలా మందికి తెలుసు కానీ, కంపెనీ అవే కాకుండా ఇతర అడ్వెంచర్ తరహా ఆఫ్‌రోడ్ బైక్స్‌ను విక్రయిస్తుంది. ఈ కోవకే చెందిన మోడళ్లలో ఎక్స్‌ఎల్750 ట్రాన్సాల్ప్ (XL750 Transalp) కూడా ఒకటి. జపనీస్ బ్రాండ్ ప్రీమియం లగ్జరీ సూపర్ బైక్స్ విభాగంలోనూ దూసుకుపోవడానికి దీన్ని లాంచ్ చేసింది. ఇది అడ్వెంచర్, టూరింగ్ లవర్స్ కోసం హోండా అందించిన మరో అద్భుతమైన బైక్. ఇందులో పవర్‌ఫుల్ ఇంజిన్, లేటెస్ట్ సస్పెన్షన్ సెటప్, అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన మహ్రీంద్రా పాపులర్ మోడల్ అమ్మకాలు

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మహీంద్రా బొలేరో ఒకటి. ప్రస్తుత ఫిబ్రవరి 2025 నెలకు ఈ కారు అమ్మకాల నివేదిక ఇప్పుడు విడుదలైంది. దీని ప్రకారం మహీంద్రా ఫిబ్రవరి 2025లో 8,690 బొలెరో కార్లను విక్రయించింది. కానీ ఈ సంఖ్య ఫిబ్రవరి 2024లో 10,113. దాంతో పోల్చుకుంటే 1,423 తక్కువ కార్లు అమ్ముడయ్యాయి. అంటే ఇది 14.07 శాతం తగ్గుదల.
Advertisement

ఈ కార్లు ప్రమాద సమయంలో మీ ప్రాణాలను కాపాడతాయి.. ఎయిర్‌బ్యాగ్‌లతో లభించే టాప్ మోడళ్లు ఇవే!

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా కార్ల యాక్సిడెంట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షణ అందించే మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ ఎయిర్ బ్యాగులతో లభించే వాటిని ఎంచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 2 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా లగ్జరీ ఫీచర్‌గా భావించబడేవి, కానీ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు నార్మల్ అయిపోయాయి. ఇంకా అధిక భద్రత కోరుకునే వినియోగదారుల కోసం, 7 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం క్రాష్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, డ్రైవర్ మోకాళ్లను రక్షించేందుకు అదనపు ఫీచర్లతో వస్తున్నాయి. వాటిలో కొన్నింటిని కస్టమర్ల కోసం కింది కథనంలో అందించడం జరిగింది.

ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 కాంపాక్ట్ ఎస్‎యూవీలు ఇవే

ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ విస్తరిస్తుంది. కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీంతో కార్ల కంపెనీలు కూడా వారి అవసరాలకు అనుగుణంగా కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి. అలాగే ప్రస్తుతం మెట్రో సిటీల్లో పెరుగుతున్న ట్రాఫిక్‎కు అనుగుణంగా తిరగడానికి వీలుగా ఆటోమేటిక్ కార్లను పెంచుతున్నాయి కంపెనీలు.

నేడే 2025 ఏసర్ ఫాస్టర్ అవార్డ్స్

భారతదేశంలోని వాహన ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏసర్ ఫాస్టర్ అవార్డుల (acer faster awards) నాల్గవ ఎడిషన్ విజేతలను ఈరోజు ప్రకటించనున్నారు. గత ఏడాది (2024)లో ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ ఈ సారి మరింత ఘనంగా నిర్వహించనున్నారు. గతేడాది మార్కెట్లో విడుదలైన కార్లు, బైక్స్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి బహుమతులతో సత్కరిస్తారు.

2025 బజాజ్ పల్సర్ NS160 వచ్చేసింది! కొత్త ఫీచర్లతో మరింత పవర్‌ఫుల్!

భారతదేశంలోని ప్రముఖ ఆటో కంపెనీలలో ఒకటైన బజాజ్(Bajaj) దేశీయంగా మంచి మార్కెట్ కలిగి ఉంది. ముఖ్యంగా ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ బైక్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బజాజ్ బ్రాండ్ పేరు తెలియని వారు ఉండవచ్చు, కానీ పల్సర్ బైక్ గురించి తెలియని బైక్ గురించి తెలియని వారు ఉండరు. దీనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. స్పోర్టీ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్, ఆకట్టుకునే డిజైన్, బలమైన బాడీ నిర్మాణంతో ప్రధానంగా యువతలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉండటం కారణంగా పల్సర్‌‌ను టూవీలర్ విభాగంలో ఓ ట్రెండ్‌సెటర్‌గా నిలిచేలా చేశాయి. దీంతో తన కస్టమర్లకు నమ్మకాన్ని పోగోట్టుకోకుండా ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేసిన కొత్త పల్సర్ బైక్‌లను లాంచ్ చేస్తూనే ఉంది.
Advertisement

కలిసిపోయిన టాటా, టెస్లా.. ఇరుకునపడ్డ మహీంద్రా.. అయ్యే ఎంత పనైందే ?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతోంది. ఈ సారి టెస్లాకు భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ తోడైంది. టెస్లా, టాటా మోటార్స్ భాగస్వామ్యం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాల ముప్పు.. కారణాలు తెలుసా?

ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వలన దేశంలో ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికి కూడా కొంత మంది వాటిని పాటించడం లేదు. హెల్మెట్ వేసుకోవడం, సీట్ బెల్ట్ ధరించడం లాంటి అత్యవసర నియమాలను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు.

జనాలు షోరూంలో ఎగబడి కొంటున్న టయోటా మోడల్ ఇదే

నాణ్యమైన, నమ్మదగిన వాహనాలను ఉత్పత్తి చేస్తూ జనాల్లో బాగా పాపులర్ అయింది టయోటా కంపెనీ. ఇది అనేక రకాల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో చిన్న కార్లు, లగ్జరీ సెడాన్లు, SUVలు, కమర్షియల్ వాహనాలు ఉన్నాయి. టొయోటా మోటార్ కార్పొరేషన్ (Toyota Motor Corporation) జపాన్‌లోని ఐచి, టయోటా సిటీలోని జపనీస్ బహుళజాతి ఆటోమోటివ్ తయారీదారు.

హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య భీకర పోటీ.. మీకు ఏది బెస్ట్?

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) భారతీయ వినియోగదారుల్లో ఈవీ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల యాక్టివా ఇ (Activa e), క్యూసీ1 (Qc1)లను విడుదల చేసింది. ఇవి మార్కెట్లో ఇతర టూవీలర్లకు బలమైన పోటీగా నిలవనున్నాయి. ఆకట్టుకునే డిజైన్, మెరుగైన పెర్ఫామెన్స్‌తో కస్టమర్లకు కొత్త రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. ఇటీవల మా డ్రైవ్‌స్పార్క్ టీం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను టెస్ట్ డ్రైవ్ చేసింది. వారికి రైడింగ్‌లో కలిగిన అనుభూతి గురించి కూడా క్షుణ్ణంగా వివరించాము. అయితే ఈ కథనంలో ఈ రెండు ఈవీ స్కూటర్ల మధ్య ఉన్న తేడాలు, సారుప్యతల గురించి వివరిస్తున్నాము.
Advertisement

త్వరలో మార్కెట్లోకి పొలిటికల్ లీడర్ల కోసం స్పెషల్ కారు

ఎంజీ మోటార్స్ (MG Motors) ఒక బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ. ఇది ప్రస్తుతం చైనాకు చెందిన SAIC మోటార్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది. ఎంజీ మోటార్స్ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇప్పుడు SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లతో సహా అనేక రకాల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ మోటార్స్ 2019లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాణ్యమైన, టెక్నాలజీతో నిండిన కార్లను అందించడం ద్వారా భారత మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

రోల్స్ రాయిస్ కల్లినన్‌కు ఘన స్వాగతం.. లగ్జరీ SUVకి సంప్రదాయ హారతి!

భారతీయులుగా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను తప్పనిసరిగా పాటిస్తాము. ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టిన, అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ముందుగా వాటికి పూజ చేయడం తప్పనిసరి. ఇంటికి కొత్తగా కారు, బైకు లేదా ఇతర ఏ వాహనాలను తెచ్చుకున్న పూజ జరిపించిన తరువాతే వాటిని రోడ్లపైకి తీసుకువస్తాము. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్-II లగ్జరీ కారు డెలివరీని అందుకున్న తరువాత ఓనర్ దానికి ప్రత్యేకంగా పూజ జరిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన చాలా మంది ఎన్ని కోట్ల విలువ అయినప్పటికీ మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయనిదే రోడ్డు పైకి వాహనాలను తీసుకురారు అనడానికి ఇది నిదర్శనం అని అంటున్నారు.

ఎయిర్ పోర్ట్ సేఫ్టీలో సిట్రోయెన్ ఎస్‎యూవీ

ఫ్రెంచ్ వాహన తయారీదారు సిట్రోయెన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటికీ..ఇక్కడ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. మొదల విడుదల చేసిన సీ5 ఎయిర్ క్రాస్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో, దేశీయంగా తయారైన మోడల్స్ పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అవి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. సిట్రోయెన్ వాహనాలు నాణ్యతలో రాజీపడకుండా, మంచి సస్పెన్షన్, ఇంజన్ ఆఫ్షన్లు, రైడ్ క్వాలిటీని అందిస్తాయి. కానీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది.

టాటా అంటేనే ఇండియన్స్ ఎమోషన్.. వారి కోసం ఏకంగా 26కి.మీ మైలేజ్ ఇచ్చే నయా మోడల్

తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే కొద్ది రోజులు ఆగండి. టాటా చాలా కొత్త కార్లను మార్కెట్లోకి తెస్తుంది. టాటా అంటే తెలుసుకదా మన ఇండియన్స్ ఎమోషన్. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్, సేఫ్టీని అందించే ఆటోమొబైల్ కంపెనీ. నెక్సాన్, పంచ్ లాంటి మోడల్స్ మార్కెట్లో హీరోలుగా నిలుచున్నాయి. వాటి తర్వాత తక్కువ ధరలో అత్యధికంగా అమ్ముడయ్యే కొన్ని మోడల్స్ అప్ డేట్ వెర్షన్స్ రాబోతున్నాయి.
Advertisement

కొత్త OBD2B ప్రమాణాలతో Suzuki స్కూటర్లు.. కేవలం రూ.93,200 నుంచి స్టార్ట్

భారతదేశంలో పర్యావరణ ప్రమాణాలు కఠినతరం అవుతున్న కొద్దీ, వాహన తయారీదారులు తమ వాహనాలను OBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల అవుతున్న మోడళ్లు కూడా ఇదే విధమైన ప్రమాణాలతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి(suzuki) OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినటువంటి రెండు స్కూటర్లను విపణిలోకి తాజాగా విడుదల చేసింది. ఆ మోడళ్ల పేరు అవెనిస్ (avenis), బర్గ్‌మాన్ (burgman). వీటిని భారతీయ పేద, మధ్య తరగతి కస్టమర్ల కోసం బడ్జెట్ ధరలో అందిస్తుంది. అవెనిస్ మోడల్ ధర రూ. 93,200 కాగా, బర్గ్‌మాన్ స్ట్రీట్ స్కూటర్ ధర వచ్చేసి 95,800గా కంపెనీ నిర్ణయించింది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు.

లీటరు పెట్రోల్‎తో 70కి.మీ. మైలేజ్ - దాని ధర కూడా చాలా చౌక !

దేశంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారు పనికి వెళ్లడానికి ప్రతిరోజు బైకులు చాలా అవసరం. అయితే, ఏ బైక్ కొనాలి, ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, ఏది తక్కువ ధరలో లభిస్తుంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అలాంటి వారి కోసం టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, బజాజ్ ప్లాటినా110, హోండా లివో, హీరో గ్లామర్ బైక్‌లు బెస్ట్ ఆఫ్షన్లుగా నిలుస్తున్నాయి. వీటి ధరలు, ఫీచర్లు, మైలేజ్ వివరాలను తెలుసుకుందాం.

భారత ఈవీ మార్కెట్‌ను షేక్ చేయడానికి కియా రెడీ.. కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్

ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా ఉండటం పైగా ఈ మధ్య కాలంలో పర్యావరణ స్పృహ ఎక్కువ అవడం కారణంగా ఈవీలను కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులంతా కూడా ఈ సెగ్మెంట్ వాహనాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా బ్రాండ్ కియా ఇండియా (Kia India) విభాగం దేశీయ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ కియా ఈవీ6, ఈవీ9 కార్లను వినియోగదారులకు అందిస్తుండగా, పోటీ ఎక్కువ అయిన నేపథ్యంలో ఇతర కంపెనీలకు గట్టిగా బదులు చెప్పడానికి రానున్న రోజుల్లో రెండు ఈవీ కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ట్యాక్సీ కార్లు ఇవే

బతుకు బండిని లాగడానికి ప్రతి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకుంటాడు. కొందరు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉద్యోగాలు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం కారు నడపడం నేర్చుకుని డ్రైవర్‎గా స్థిరపడుతుంటారు. వాళ్లు మంచి మైలేజీ, తక్కువ ధరలో లభించే కార్ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసం మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి ఎర్టిగా వంటి కార్లు డ్రైవర్ ఉద్యోగానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.
Advertisement

మైక్రో SUVల హవా.. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి పెరుగుతున్న డిమాండ్!

భారతదేశంలో ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీ(SUV)లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ఈ సెగ్మెంట్‌లో దేశీయ దిగ్గజ కంపెనీలు టాటా మోటార్స్(tata motors)కు చెందిన ప్రసిద్ధ మోడల్ పంచ్(Punch), దక్షిణ బ్రాండ్‌ హ్యుందాయ్ (Hyundai)కు చెందిన ఎక్స్‌టర్ (Exter) మోడళ్లుగా అత్యుత్తమైన కార్లుగా అవతరించాయి. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సేల్స్ గణంకాలను గమనించినట్లయితే ఈ రెండు suvలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. భారతీయ వినియోగదారుల నుంచి వీటికి భారీ ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందరిని ఆకర్షించే డిజైన్, మెరుగైన ఇంజిన్ పెర్ఫామెన్స్, ప్రీమియం ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అన్నింటినీ కలిపి అందించే బెస్ట్ చాయిస్‌గా ఈ మైక్రో SUVలు నిలుస్తున్నాయి. అందుకే ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లుగా నిలుస్తున్నాయి.