మహీంద్రా థార్ రాక్స్ లో కీలక మార్పు - గమనించారా ?

ఇండియాలో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్‌ ఎస్‎యూవీలలో మహీంద్రా థార్ రాక్స్ ఒకటి. ఈ కారుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మహీంద్రా థార్ రాక్స్ మోడల్‌ పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ ఆఫ్-రోడ్ ఎస్‎యూవీ అయిన 3-డోర్స్ థార్ 2020 చివరిలో ప్రారంభించింది. అలాగే దాని 5 డోర్స్ వెర్షన్ కొత్త థార్ రాక్స్ ఆగస్టు 15, 2024న మార్కెట్లోకి వచ్చింది.

కొత్త యుగానికి నడిపించే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొట్టిందా?

గత నవంబర్‌లో, ఎన్నో ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, హోండా తన తొలి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు హోండా యాక్టివా e,QC1ను భారతీయ మార్కెట్‌లో పరిచయం చేసింది "యాక్టివా" బ్రాండ్ పేరునే ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొనసాగించడం ద్వారా, హోండా తన ఐకానిక్ స్కూటర్ పేరు ద్వారా EV విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 (ఆటో ఎక్స్‌పో 2025)లో హోండా ఈ ఎలక్ట్రిక్ యాక్టివా ధరను విడుదల చేసింది.

క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ వచ్చేసింది.. షాపింగ్ వెళ్ళడానికి సింపుల్ & స్టైలిష్

గత నవంబర్‌లో, హోండా కొత్త Activa eను ప్రదర్శించింది. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తన నేమ్‌ప్లేట్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అది మాత్రమే కాకుండా ఆ రోజు వేదికపై మరో ఆశ్చర్యకరమైన హోండా క్యూసీ1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ప్రదర్శించింది. ఇది కొత్త ఎలక్ట్రిక్ యాక్టివాకు చిన్న వెర్షన్. ఇది ఫిక్స్డ్ బ్యాటరీని కలిగి ఉంది. రెండు నెలల తర్వాత ఆటో ఎక్స్‌పోలో ధరను వెల్లడించారు హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 90,000గా నిర్ణియించింది. హోండా కొత్త QC1‌ను టెస్ట్ డ్రైవ్ చేయమని కోరింది. దీంతో తాజాగా మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ బెంగుళూరులో ఈ ఇస్కూటర్‌ను టెస్ట్ డ్రైవ్ చేసింది. దాని గురించి మా ఫీడ్ బ్యాక్ క్రింద ఇవ్వడం జరిగింది.

ఎస్1 జెన్3 స్కూటర్ల డెలివరీ షురూ చేసిన ఓలా

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. భారతదేశం అంతటా తన ఎస్ 1 జెన్ 3 స్కూటర్‌ను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందులో ఎస్1 ప్రొ+ తో పాటు ఎస్1 ప్రొ, ఎస్1 ఎక్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ విస్తృతమైన స్టోర్ల నెట్‌వర్క్, హోమ్ డెలివరీ ద్వారా వీటిని వినియోగదారులకు అందిస్తున్నారు.
Advertisement

త్వరలో మార్కెట్లోకి కొత్త బజాజ్ ఫ్రీడమ్ 150సీసీ సీఎన్జీ బైక్

బజాజ్ ఫ్రీడమ్ 125 ఒక పాపులర్ సీఎన్జీ బైక్. ఇది దేశీయ మార్కెట్‌లో చాలా మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ మోటార్‌సైకిల్ అమ్మకాల్లో కూడా కంపెనీ చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. కొత్త బజాజ్ ఫ్రీడమ్ బైక్ విడుదల అయిన 9 నెలల్లో దాదాపు 50,047 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం, ఈ మోటార్‌సైకిల్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి కంపెనీ రెడీ అవుతుంది.

ఇండియాలో అత్యధిక డిమాండ్ ఉన్న RWD కార్లు.. వీటి క్రేజ్ తగ్గదు

భారతీయ మార్కెట్లో సాధారణంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) కార్లను చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం వెనుక వీల్ డ్రైవ్ (RWD) వ్యవస్థతో పోలిస్తే ఈ కార్లు తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. తయారీదారులకు కూడా వీటిని సులభంగా తయారీ చేస్తారు. లోపల కూడా విశాలమైన స్థలం ఇవ్వడానికి వీలవుతుంది. అయితే ప్రస్తుతం దేశీయ మాస్ మార్కెట్లో వెనుక వీల్ డ్రైవ్ (RWD) వ్యవస్థతో పనిచేసే వాహనాలకు డిమాండ్ ఊపందుకుంది. ఇవి బాగా బ్యాలెన్స్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. కొన్ని మోడళ్లు ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌లోను దూసుకుపోతాయి. ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారుల కోసం కొన్ని ప్రసిద్ధ మోడళ్ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ - మైలేజ్ ఇచ్చే కొత్త ఎన్ఆర్జీ ఆటో ఫీచర్లు!

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధికి అనుగుణంగా కంపెనీలు తమతమ మోడల్స్‎ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కార్లు, బైకుల మాదిరి ఎలక్ట్రిక్ ఆటోలు కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒమేగా సీకి కంపెనీ ఇటీవల NRG ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. ఈ వాహనం చాలా స్పెషాలిటీలను కలిగి ఉంది. మార్కెట్‌లో కొత్త సంచలనాన్ని సృష్టించే అవకాశం ఉంది.

ఇండియాలో ఆ కారు కావాలంటే 3ఏళ్ళు ఆగాల్సిందే..!

ఇండియాలో కూడా కార్ల మార్కెట్ భారీగా పెరిగిపోతుంది. కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే మిడ్ సైజ్ కార్ల నుంచి లగ్జరీ కార్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాలో లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా లంబోర్ఘినీ, మెర్సిడెస్-మేబ్యాక్ వంటి బ్రాండ్లు రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.
Advertisement

క్రెటా సైజులో MG నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌

MG మోటార్స్ భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లతో హాట్ టాపిక్ అవుతోంది. సాంప్రదాయ ఇంధన కార్లతో పాటు ఈవీలలో కూడా ఇటీవల కాలంలో తన దూకుడును ప్రదర్శిస్తుంది. ఇది చైనీస్ బ్రాండ్ అయినా, JSW గ్రూప్‌లో భాగస్వామ్యం కావడంతో ఇప్పుడు దీన్ని సగం భారతీయ కంపెనీ అనుకోవచ్చు. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు గట్టి పోటీనిస్తూ, సేల్స్‌లో మెరుగైన గణంకాలను సాధిస్తుంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సూపర్ హిట్ EV మోడళ్లను కలిగి ఉంది. అయితే, భారత మార్కెట్లో ఎక్కువ మోడళ్లను విడుదల చేయకపోయినా, ఇతర దేశాల్లో ఉన్న MG కార్ల లైనప్ చూసి భారతీయ కస్టమర్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

స్కార్పియోతో సహా ఎస్‎యూవీ‎ల ధరలు పెంచనున్న మహీంద్రా

ఇటీవల కాలంలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కస్టమర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, కియా, హోండా, రెనాల్ట్ లు ఏప్రిల్ 1నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాటి దారిలోనే మహీంద్రా తమ మోడల్ శ్రేణిలో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి అమ్మకాల గణాంకాలలో తన పోటీదారులను అధిగమించి మహీంద్రా రెండో స్థానానికి చేరుకుంది.

అమ్మకాల్లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న రాయల్ ఎన్‌ఫిల్డ్ బైక్

రాయల్ ఎన్‌ఫీల్ట్ పేరు వినగానే భారత యువతలో ఎదో తెలియని క్రేజ్. చాలా మంది ఈ కంపెనీ నుంచి ఎప్పుడు కొత్త మోడల్ విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది కూడా కంపెనీ తన సేల్స్ పరంగా విజయకేతనం ఎగురవేస్తుంది. ప్రతినెలా తన అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్ట్ తాజాగా యూత్ కలల బైక్, దేశంలో బాగా డిమాండ్ ఉన్న ప్రసిద్ధ మోడల్ హంటర్ 350కి సంబంధించిన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, హంటర్ 350 మరోసారి తన హవాను చూపించింది. భారత మార్కెట్లో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తాజా అమ్మకాల నివేదిక స్పష్టంగా చెబుతోంది.

ఎంజీ విండ్సర్ ఈవీకి షాక్.. గత నెలలో 26 శాతం తగ్గిన అమ్మకాలు!

ఫిబ్రవరి నెల ముగియగానే భారతదేశంలో ఉన్నటువంటి పలు వాహన తయారీదారులు వరుసగా తమ అమ్మకాలను వెల్లడిస్తున్నారు. కంపెనీ మొత్తం సేల్స్‌తో పాటు మోడళ్ల వారీగా విడివిడిగా కూడా విక్రయాల డేటాను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా MG మోటార్ ఇండియా తన ప్రసిద్ధ మోడల్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ (Windsor)‌కు సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, ఈ కారు ఫిబ్రవరి 2025లో 2,431 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2025లో ఎంజీ మోటార్ మొత్తం 4,002 యూనిట్ల అమ్మకాలను నివేదించింది. దీనిలో విండ్సర్ వాటానే ఏకంగా 61 శాతం ఉండటం గమనార్హం. అయితే జనవరి 2025లో విండ్సర్ ఈవీ అమ్మకాలు 3,277 యూనిట్లుగా ఉండగా, ఇది నెలవారీగా చూసినట్లయితే 846 యూనిట్లు తక్కువగా 26 శాతం క్షీణతను నమోదు చేసింది.
Advertisement

టాటా పంచ్ పై రూ.1.75లక్షల ఆదా.. కాకపోతే..

టాటా మోటార్స్ మన దేశంలో ఒక విశ్వసనీయ ఆటోమొబైల్ కంపెనీ. దేశీయ మార్కెట్లో కంపెనీ ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్‎ను విక్రయిస్తుంది.ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతికల సాయంతో కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తెస్తుంది. ఇటీవల టాటా ఫిబ్రవరి నెల విక్రయాల గణాంకాలను కూడా వెల్లడించింది. అయితే ఫిబ్రవరిలో అమ్మకాలు కొంతమేర తగ్గాయి. టాటా నెక్సాన్ అమ్మకాల్లో నంబర్1గా నిలిచింది. దాని తర్వాత టాటా పంచ్ రెండో స్థానంలో ఉంది.

పేదల బండ్లు ఇవే.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే నెల మొత్తం తిరుగుతాయి

ఇండియాలో ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉండేది. ప్రస్తుతం ఇంటికో బైక్ అనివార్యం అయింది. కార్లున్నా కచ్చితంగా బైక్ ఉండాల్సిందే. అయితే కొత్త బైక్ కొనుగోలు చేసే ముందు మనలో చాలా మంది ఆలోచించే ప్రధాన అంశం మైలేజ్.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే బైక్స్ కోసం చూస్తుంటారు.

స్టన్నింగ్ లుక్స్‌తో హీరో ఎక్స్‌పల్స్ 210.. పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

హీరో మోటోకార్ప్ ఆటో ఎక్స్‌పో 2019లో XPulse 200 బైక్‌ను భారతీయుల ముందుకు తీసుకొచ్చింది. ఈ బైక్ లాంచ్ అయినప్పటి నుంచే, దేశంలోని డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైక్లింగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, BS6 ఉద్గార నిబంధనల వల్ల ఇంజిన్ కొంచెం ఎక్కువగా పనిచేయకపోవడం వల్ల XPulse 200లో సరైన పవర్ ఉందా? రైడింగ్ అనుభవం మెరుగుపడిందా?" అనే ప్రశ్నలు అప్పటి నుంచి బైక్ ప్రేమికులు చాలా మంది ప్రశ్నించారు.

టాటా మోటార్స్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్

భారతీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన వాహనాల సేల్స్‌లో దూసుకుపోతుంది. తాజాగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి తయారీదారులకు బలమైన పోటీ ఇవ్వడానికి, మరిన్ని ఎక్కువ విక్రయాలను సాధించడానికి ఇప్పుడు ఒక కొత్త అడుగు వేసింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన ఛావా సినిమాలో నటించిన బాలీవుడ్ సూపర్ స్టార్ విక్కీ కౌశల్‌ (Vicky kaushal )ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ సినిమా దాదాపు బాక్సాఫీస్ వద్ద 750 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఆయనకు యువతలో మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. అందుకే విక్కీ కౌశల్‌ ద్వారా తమ వాహనాలను యువతతో పాటు కుటుంబాలకు చేరువ చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement

ఒకప్పుడు ఈల వేస్తే గాల్లో లేచిన సుమోలు.. కొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయ్

టాటా మోటార్స్ దేశీయంగా అత్యంత విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీదారు. టాటా సుమో అంటే తెలియనివారుండరు. టాటా మోటార్స్‌ కంపెనీ ప్రతిష్ఠాత్మక వాహనమది. అలాగే కొన్నాళ్ల క్రితం కంపెనీ సుమో, నానో కార్లు దేశీయ రోడ్లపై బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య తరగతి ప్రజల్లో హాట్ ఫేవరెట్లుగా నిలిచాయి. అప్పట్లో అవి పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. అయితే, వివిధ కారణాల వల్ల సుమో, నానో కార్ల అమ్మకాలు నిలిచిపోయాయి.

భారత EV రంగంలో భారీ మార్పు.. టాటా మద్దతుతో టెస్లా అడుగుపెట్టబోతోంది!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ టెస్లా చివరికి భారతదేశానికి రాబోతోంది. దీనిపై దేశీయ తయారీదారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, టాటా మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. అంతే కాదు, సమాచారం ప్రకారం, టాటా టెస్లాకు సాయం చేయబోతుంది. అంటే ఈ రెండు అగ్రశ్రేణి కంపెనీలు కలిసి పని చేసే చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా EV మార్కెట్‌ను శాసిస్తుండగా, భారత్‌లో టాటా మోటార్స్ మాత్రం ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. టాటా నెక్సాన్ EV, టిగోర్ EV లాంటి మోడళ్లతో లోకల్‌గా అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో దిగ్గజ కంపెనీ టెస్లా తన కార్లను భారత రోడ్లపై పరిగెత్తించాలని చూస్తుంది. అయితే ఈ కీలక టైంలో ఈ రెండు కలిసి ఒక కూటమిగా ఏర్పడినట్లు సమాచారం.

11నెలల్లోనే 4 లక్షల మంది కొనుగోలు చేసిన టీవీఎస్ బైక్ స్పెషాలిటీ ఇదే!

ప్రస్తుతం యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న బైకుల్లో టీవీఎస్ అపాచీ ఒకటి. అపాచీలో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న విభాగం 150-200సీసీ. ఈ విభాగంలో టీవీఎస్ అపాచీ సక్సెస్ అయింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ఇది నాలుగు లక్షలకు పైగా బైక్‌లను విక్రయించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో అపాచీ సిరీస్ అమ్మకాలు సృష్టించిన రికార్డును బద్దలుకొట్టింది.

సూపర్ కార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గోల్ఫ్ GTI, టిగువాన్ R-లైన్ రానున్నాయి!

అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలో కార్ల తయారీలో ప్రసిద్ధి చెంది ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) ఇప్పటికే పలు వాహనాలను విక్రయిస్తూ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. మరోసారి తమ హవాను కొనసాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రెండు ప్రీమియం మోడళ్లను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. జర్మన్ కార్ల తయారీదారు ఇటీవల గోల్ఫ్ GTI,టిగువాన్ R-లైన్ మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మోడళ్లను తన భారతీయ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసింది. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, టిగువాన్ R-లైన్ కారును ఏప్రిల్ 14న లాంచ్ చేయనుండగా, గోల్ఫ్ GTI కోసం అధికారికంగా విడుదల చేసే తేదీని ఇంకా వెల్లడించలేదు. లాంచ్‌కు ముందుగా ఈ కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.
Advertisement

మరోసారి స్కూటర్ విక్రయాల్లో కింగ్ అనిపించుకున్న హోండా మోడల్

ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్స్ మార్కెట్లో దుమ్ములేపుతున్నాయి. ఆ కంపెనీ స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా (Honda Activa) టాప్‌లో కొనసాగుతుంది. దీని తర్వాత హోండా షైన్ (Honda Shine) హీరో మోటోకార్ప్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం మనదేశ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలలో ఈ హోండా యాక్టివా ఒకటి. మన దేశంలో ఏ వీధిలో చూసినా ఈ బైక్ కనిపిస్తుంది.

26+ కి.మీల మైలేజ్‌.. 7 సీటింగ్‌ కెపాసిటీ.. రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లొచ్చు..

భారతదేశంలో కుటుంబ వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల సంఖ్య పెరుగుతుండగా, ఇదే సమయంలో చిన్న కుటుంబాల సంఖ్య కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో, పెద్ద కుటుంబాల కోసం అధిక సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్లు కొనాలని అనేక మంది భావిస్తున్నారు. అయితే, సరైన కారు ఎంపిక చేయడం చాలామందికి పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రస్తుతం మార్కెట్లో పెద్ద కుటుంబాలకు అనువుగా ఉన్న టాటా సఫారీ, మారుతీ సుజుకీ ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్, టయోటా రూమియన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి 7-సీటర్ కార్లను హైలైట్ చేస్తూ, వాటి విశేషాలను క్లుప్తంగా వివరించాము.

డుకాటి డెజర్ట్‌ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్ టూరింగ్ స్పెషాలిటీ ఇదే!

మీకు అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టమా.. అయితే మంచి ఇంజిన్ ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. డుకాటీ ఇండియా తన కొత్త, లగ్జరీ డుకాటీ ఎక్స్ డిస్కవరీ బైక్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ బైక్ ను గతంలో పలుమార్లు ఆన్ లైన్లో టీజ్ చేశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. త్వరలోనే దీనిని కొనుగోలు చేసిన వాళ్లకు డెలివరీ అందించనుంది.

33 కి.మీ మైలేజ్, సన్‌రూఫ్, 5స్టార్ సేఫ్టీ.. అమ్మకాల్లో డిజైర్ రికార్డ్

ఇటీవల కాలంలో ప్రపంచంతో పాటు ఇండియాలో కూడా కార్ల వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో మార్కెట్లోకి వరుసగా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఉన్న మోడల్స్‎ను కూడా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయడానికి షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు.
Advertisement

భారీ డిమాండ్ మధ్య మహీంద్రా XUV 9E EV డెలివరీలు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ మేరకు ఉందో ఇటీవల కాలంలో జరుగుతున్న సేల్స్‌‌ను చూస్తేనే తెలిసిపోతుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈవీ తయారీలో పేరుగాంచిన అన్ని కంపెనీలు వరుసగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా (Mahindra), భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అమెరికా ప్రముఖ ఈవీ తయారీ సంస్థ టెస్లా భారతదేశానికి రావాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో టెస్లా ఇక్కడ అడుగుపెట్టి భారత రోడ్లపై విదేశీ ఎలక్ట్రిక్ కార్లను పరిగెత్తించాని చూస్తుంది. అయితే టెస్లాకు పోటీగా స్వదేశీ వాహన తయారీ కంపెనీ దాని కంటే ముందుగా లోకల్‌గా తయారు చేసిన ఎలక్ట్రిక్ SUVలు BE6, XUV 9E లను తీసుకొచ్చింది.