ఫ్యామిలీ కార్ కోసం ఎదురు చూస్తున్నారా? మారుతీ సుజుకీ సర్‌ప్రైజ్ రెడీ అవుతుంది!

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దేశంలో 10 మందిలో కనీసం 6 గురు మారుతీ కార్లు కొనడానికి ఇష్టపడుతుంటారంటే ఈ కంపెనీకి ఇక్కడ ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తుంది. ఇప్పటికే డజన్ల కొద్ది మోడళ్లను విక్రయిస్తున్న మారుతీ కొత్తగా అదిరిపోయే రూపంతో ఒక కొత్త కారును తీసుకురావాలని చూస్తోంది. చిన్న కార్లు, ప్రీమియం SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిని సేల్ చేస్తున్న పెద్ద కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 7 సీటర్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ​మారుతీ సుజుకీ 'YDB' కోడ్‌నేమ్‌తో ఒక కొత్త కాంపాక్ట్ MPV (మల్టీ పర్పస్ వెహికల్) ను ఇండియాలో ఘనంగా లాంచ్ చేయనుంది.

కోట్లు విలువ చేసే కార్లు అమ్ముకుంటూ కూడా 7500మంది కార్మికుల పొట్ట కొట్టిన టాప్ కార్ల కంపెనీ

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి(Audi) ఇండియా మార్కెట్లో మంచి ఆదరణ కలిగిన కంపెనీ. చాలా కాలాంగా లేటెస్ట్ ఫీచర్స్‎ను కలిగిన మోడల్స్‎ను రిలీజ్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను ఆకట్టుకునే కార్ మోడల్స్‎ను లాంచ్ చేయడంలో ఆడి ఇండియా బాగా పాపులర్ చెందిన సంస్థ. ఆడి కార్లకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ కారు కావాలంటే కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ తర్వాత ఇండియాలో ఆడి అతిపెద్ద లగ్జరీ కార్ల విక్రయదారు ఆడి. ఇండియాలో అభివృద్ధి చెందుతున్న కంపెనీ అయినప్పటికీ, ఆడి ప్రపంచవ్యాప్తంగా అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొంది.

70 కి.మీల బెస్ట్ మైలేజ్ ఇచ్చే మిడిల్ క్లాస్ బైక్స్ ఇవే! ఒకసారి ట్యాంక్ నింపితే చాలు

ఇండియాలో పేద, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. తమ రోజువారి అవసరాల కోసం కచ్చితంగా టూవీలర్ ఉండాల్సిందే. ఉద్యోగాలకు వెళ్ళడానికి కూలి పనులకు, కాలేజ్‌లకు, వ్యవసాయ పనులకు, ఇతర ఇంటి అవసరాలకు టూవీలర్ లేనిదే ఏ పని జరగని రోజులు ఇవి. అయితే వారంతా కూడా ఎక్కువగా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్‌తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. అలాంటివి ప్రస్తుతం మార్కెట్లో చాలా ఉన్నాయి. Hero Splendor Plus,Hero HF 100,TVS Radeon,TVS Sport, Hero Super Splendor,Bajaj Platina 100, Honda Shine 125,Hero HF Deluxe,Honda Shine 100 మోడల్స్ దేశంలో మధ్యతరగతి బైకులుగా ఉన్నాయి. వీటి ప్రస్తుత ధర, అలాగే ఫీచర్స్ గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ లో జీప్ కంపాస్ శాండ్స్ స్టార్మ్ ఎడిషన్

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్.. భారత మార్కెట్లో అత్యంత పాపులర్ ఎస్యూవీలను లాంచ్ చేస్తోంది. జీప్ ఇండియా ది బెస్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ మాత్రమే నిర్మించే ప్రీమియం బ్రాండ్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే మన దేశంలో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి చిన్న మోడల్ లైనప్ విడుదల చేయగా.. అవన్నీ బాగా అమ్ముడవుతున్నాయి.
Advertisement

ఏప్రిల్ 1 నుంచి ఆ వెహికల్స్ ధరలను అమాంతం పెంచనున్న టాటా

టాటా మోటార్స్ మన దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. ప్రస్తుతం దేశంలో అగ్రగామి కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్, కార్ల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు భారీ ట్రక్కులు, బస్సుల వంటి వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసేది. కార్ల మార్కెట్ రోజు రోజుకు పెరుగుతుండడం చూసి ఆ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది టాటా మోటార్స్.

టెన్నిస్ ఛాంపియన్ మాత్రమే కాదు.. లగ్జరీ కార్ల ప్రేమికురాలు కూడా!

హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా(Sania Mirza) భారతదేశపు అత్యంత ప్రతిభావంతమైన, విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. టెన్నిస్‌లో అనేక రికార్డులు సృష్టించడంతో పాటు, దేశం తరపున అనేక విజయాలు కూడా సాధించింది. సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో అనేక విజయాలను సాధించారు. 2023లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా 15 సంవత్సరాల క్రితం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు, అయితే పలు కారణాల వలన వారిద్దరు విడాకులు తీసుకుని ప్రస్తుతం ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. సానియా మీర్జా దేశంలో ప్రముఖ సెలబ్రిటీలలో ఒకరు. ఆమె లగ్జరీ లైఫ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆటల ద్వారా కాకుండా వివిధ కంపెనీలకు యాడ్స్ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ వ్యాన్‎కు పేటెంట్ పొందిన టాటా.. డిజైన్ అదుర్స్

టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మన దేశంలో విశ్వసనీయతకు మారు పేరుగా టాటా వాహనాలు నిలుస్తాయి. సేఫ్టీ ఫీచర్స్, బాడీ బిల్డింగులో టాటా వాహనాలకు తిరుగు లేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో టాటా వాహనాల అమ్మకాలు పడిపోయాయన్న వార్తలు వచ్చాయి. ఈ సందర్భంలోనే మిగతా కంపెనీలకు దిమ్మ తిరిగి పోయే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మారుతీ సుజుకీ షాక్! ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి

భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ(maruti suzuki) పేద, మధ్య తరగతి వినియోగదారులకు టార్గెట్ చేసి తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో కంపెనీ దేశీయ వినియెగదారులకు వరుసగా షాక్‌లు ఇస్తుంది. ఇంత కాలం అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ధరలో కార్లను తీసుకొచ్చిన మారుతీ అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఏప్రిల్ 1, 2025 నుండి తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించి వినియోగదారులకు పెద్ద షాకిచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు ధరలు పెంచిన కంపెనీ ఇప్పుడు మరోసారి ధరల పెంపుదలను ప్రకటించడం గమనార్హం. ఈ ధరల పెంపు వివిధ మోడళ్లను బట్టి 4 శాతం వరకు ఉంటుందని మారుతీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
Advertisement

టోల్ ట్యాక్స్ ఆగేది కాదు.. జీవితాంతం కట్టాల్సిందేనన్న మంత్రి

జాతీయ రహదారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద ట్యాక్స్‌ చెల్లిస్తుంటారు. ఇవి దేశంలోని బ్రిడ్జీలు, టన్నెల్లు, జాతీయ, రాష్ట్ర రహదారుల మెయింటెనెన్స్, ఉపయోగం కోసం విధించే పన్నులు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు కొన్ని నియమాలు, నిబంధనలను రూపొందించింది.

మిడ్ సైజ్ ఎస్‎యూవీ అమ్మకాల్లో తోపు అనిపించుకున్న మహీంద్రా

ఇండియా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో మూడోస్థానంలో ఉంది. కొన్నాళ్లుగా సెడాన్, హ్యాచ్ బ్యాక్ మోడల్స్ కు గుడ్ బై చెప్పి ఎస్‎యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కంపెనీలు కూడా ఈ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ విభాగంలోనే మార్కెట్ ఎక్కువగా నడుస్తోంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

భారతదేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల కారణంగా చాలా మంది చనిపోతున్నారు. వేగ పరిమితిని అతిక్రమించి అతి వేగంగా వాహనాన్ని నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్‌లను అనుసరించకపోవడం వంటి పలు కారణాల కారణంగా దేశంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది వాహనదారులు తమ ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తుండటం వలన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందుకే ఇటీవల కేంద్రం మార్చి 1 నుంచి కొత్త, కఠినమైన మోటారు వాహన జరిమానాలను అమలు చేసింది.

డ్జెట్ రైడర్లకు గుడ్ న్యూస్! కొత్త హోండా షైన్ 100 కేవలం రూ. 68 వేలకే

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) దేశంలో అత్యంత ప్రముఖమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంది. తక్కువ ధరలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన హోండా షైన్ 100 (Honda Shine) మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న వాటిలో ఇది ఒకటి. ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, మధ్యతరగతి కుటుంబ ప్రజలు తమ రోజువారి అవసరాల కోసం ఈ బైక్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటిగా ఉంది.
Advertisement

అదిరిపోయే ఫీచర్లతో కొత్త కార్ లాంచ్ చేసిన మహీంద్రా

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ 'ఎక్స్ యూవీ 700'కు మార్కెట్లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ మైలేజీ, సూపర్బ్ లుకింగ్, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారణంగా ఈ కారును కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రోడ్ల మీద ఎక్కువగా మహీంద్రా ఎక్స్ యూవీ 700 కార్లు కనిపిస్తున్నాయి.

టిగువాన్‌కు ఇంతటి కష్టాలు? కేవలం 2 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది

ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) అనేది జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌గా, హై-క్వాలిటీ,స్టైలిష్, సేఫ్ కార్లను అందించడంలో పేరుగాంచింది. ఇండియాలో కూడా చాలా కాలంగా అధునాతన కార్లను విక్రయిస్తుంది. భారతీయ వినియోగదారులకు విశ్వసనీయ బ్రాండ్‌గా ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే మోడళ్ల పట్ల మంచి ఆదరణ ఉంది. ఇటీవల, కంపెనీ ఫిబ్రవరి 2025 అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. ఈ నెలలో కస్టమర్లు చాలా మంది ఫోక్స్‌వ్యాగన్ కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని మోడళ్లలో 3,110 మంది కొత్త కస్టమర్లను కంపెనీ సంపాదించడం విశేషం. 2024 ఇదే ఫిబ్రవరి నెలలో 3,019 మంది కంపెనీకి చెందిన పలు మోడళ్లను కొనుగోలు చేయగా ఈ సారి ఆ సంఖ్య 3.01 శాతం వృద్ధి చెందింది.

మహీంద్రా ఆ మోడల్ కారు కావాలంటే ఏడాది ఆగాల్సిందే

గత కొన్నేళ్లుగా దేశీయ ఆటో మార్కెట్లో ఎస్ యూవీలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ మాత్రమే 52శాతం వాటాను కలిగి ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే ప్రముఖ దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా కొన్ని నెలల క్రితం తన ఫేమస్ ఎస్‎యూవీ XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. దీనికి అద్భుతమైన డిమాండ్ వస్తోంది.

ఎండ వేడికి మీ కారులో ఈ సమస్యలు వస్తాయా? సమర్థవంతమైన పరిష్కారాలు ఇవే!

దేశంలో అప్పుడే వేసవి కాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువలో ఉంది. ప్రజలు ఉదయం 10 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమ వావానాలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా వాహనదారులకు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ప్రతి ఏడాది కూడా తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2025లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ టైంలో వేడి కారణంగా కార్ల ఇంజిన్ వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Advertisement

ఎన్ని ఫీచర్స్ ఇచ్చిన కొనే దిక్కేలేని ఎంజీ కంపెనీ మోడల్

ఇండియాలోని కార్ల తయారీదారుల్లో ఎంజీ మోటార్స్ ఓ పాపులర్ కంపెనీ. ఎట్రాక్టివ్ లుక్స్ తో కార్లను తయారు చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ కంపెనీ కూడా ఈ సెగ్మెంట్లో భారీగా పెట్టుబడులు

టాటా టాప్ మోడల్ నెక్సాన్ ధరకే సిట్రోయెన్ కంపెనీకి చెందిన ఆల్ట్రా స్టైలిష్ మోడల్

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్(citroen) భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కంపెనీ విడుదల చేసిన మోడళ్లలో ఏవీ పెద్దగా ఇక్కడి కస్టమర్ల దృష్టిని ఆకర్షించకపోయినా కంపెనీ మాత్రం అవిశ్రాంతంగా పోరాడుతోంది. టాటా కర్వ్‌కి పోటీగా ఇటీవల విడుదల చేసిన బసాల్ట్ కూపే SUV పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ అది కూడా ఆదరణ పొందలేదనే చెప్పాలి.

టీవీఎస్ జూపిటర్ CNG, సుజుకి E యాక్సెస్ ఎప్పుడొస్తాయో తెలుసా?

ఇండియాలో టూవీలర్ తయారీదారుల్లో టీవీఎస్(TVS), సుజుకీ మోటార్‌ సైకిల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశీయ ప్రజల రోజువారి అవసరాల కోసం బడ్జెట్ ధరలో టూవీలర్స్‌ను విక్రయిస్తూ తమదైన ముద్ర వేసుకున్నాయి. హీరో, హోండా, బజాజ్ వంటి కంపెనీలకు బలమైన పోటీగా ఉంటూ ప్రతి ఏడాది సేల్స్‌ను పెంచుకుంటున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ టూ వీలర్ మార్కెట్లో వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇతర తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త మోడళ్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించాయి. ఎప్పటిలాగే పేద, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి జూపిటర్ CNG, సుజుకీ ఇ యాక్సెస్ స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నాయి.

కొత్త టయోటా కారు గురించి ఎవరూ చెప్పని ముఖ్య విషయాలు ఇవే

టయోటా కిర్లోస్కర్ ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయ ఆటోమొబైల్ తయారీదారు. జనవరిలో అట్టహాసంగా ముగిసినటు వంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ హిలక్స్ పికప్ ట్రక్ బ్లాక్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే పికప్ ట్రక్ ను ఘనంగా విడుదల చేశారు. దీని డిజైన్ చాలా ఎట్రాక్టివ్ గా ఉండడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Advertisement

బైక్‌కి పోటీ ఇచ్చే బడ్జెట్ కార్.. అమ్మకాల్లో జోరు చూపిస్తుంది

ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ మాత్రమే. దశాబ్దాల కాలంగా పేద, మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తూ పేదవారి కంపెనీగా బాగా ప్రసిద్ధి చెందింది. దేశంలో అమ్ముడుపోతున్న టాప్ 10 కార్లలో దాదాపు సగానికి పైగా మారుతీ కార్లనే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీని బట్టి ఈ కంపెనీ మోడళ్ల పట్ల భారతీయ ప్రజలు ఏ మేరకు ఆదరణ ఉందో తెలుస్తుంది. అమ్మకాల పరంగా గత నెలలో మారుతీ టాప్‌లో నిలిచింది. ఇప్పటికే పలు మోడళ్ల వారీగా సేల్స్ వివరాలు వెల్లడిస్తున్న కంపెనీ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన సెలెరియో (celerio) సేల్స్ డేటాను విడుదల చేసింది.

రూ.1.75 లక్షల తగ్గింపు.. ఇప్పుడు కాక మరెప్పుడూ? ఇది బెస్ట్ డీల్!

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (citroen) భారతదేశంలో మంచి మార్కెట్ కలిగి ఉంది. సేల్స్ పరంగా గత కొన్నేళ్లుగా మెరుగైన గణంకాలను నమోదు చేస్తుంది. 2024లో విజయవంతంగా తన కార్లను విక్రయించిన కంపెనీ 2025లో అంతకంటే ఎక్కువ మంది కస్టమర్లకు చేరువకావడానికి పండుగల సమయంలో తీసుకొచ్చినట్లు తన కార్లపై మార్చి 2025లో భారీ తగ్గింపులు అందిస్తుంది. సాధారణంగా వాహన తయారీ కంపెనీలు నెలా నెలా ప్రత్యేక తగ్గింపులు ఇస్తుంటాయి. ఇప్పటికే ఇతర సంస్థలు తమ మోడళ్లపై మార్చి ఆఫర్స్ ప్రకటించగా, ఇదే బాటలో సిట్రోయెన్ సైతం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. HT ఆటోలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఎంపిక చేసిన మోడళ్లపై ఈ నెలలో భారీ తగ్గింపు ఇస్తుంది.

రోడ్లు మీద మైలురాళ్లను చూశారా.. వాటి రంగులకు అర్థం ఏంటో తెలుసా ?

మీరు సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కిలో మీటర్ల దూరాన్ని తెలిపేందుకు వేసిన మైలు రాళ్లను చూసే ఉంటారు. దాని మీద ఊరి పేరు, వచ్చే గ్రామం ఇంకా ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందో దాని మీద పెయింట్ చేసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మైలు రాళ్లు వివిధ రకాల రంగుల్లో ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇలా మైలురాళ్లకు వివిధ రంగులు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా..

మధ్యతరగతి ప్రజల కోసం తెచ్చిన కారు.. షోరూమ్‌లలో సందడి కనిపించడంలేదు

MG మోటార్ భారతదేశంలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా ఉంది. దేశీయంగా ఉన్నటువంటి మహీంద్రా, టాటా మోటార్స్ కార్లకు పోటీగా ప్రీమియం లుక్, సరికొత్త ఫీచర్స్‌తో పలు మోడళ్లను విక్రయిస్తుంది. ఇటీవల ఫిబ్రవరి నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ ఆస్టర్ (astor) కారుకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. ఎంజీ మోటార్ అమ్మకాలలో ఆస్టర్‌ ఫెయిల్ మోడల్‌గా నిలుస్తుంది. ఎందుకంటే గత కొంత కాలంగా కస్టమర్ల నుంచి దీనికి ఆదరణ తగ్గుతూ వస్తుంది. కంపెనీ నుంచి విడుదలైన నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2025లో ఎంజీ ఆస్టర్ కేవలం 264 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అదే గత ఏడాది అనగా 2024 ఇదే ఫిబ్రవరి నెలలో ఇది 1,036 ఆస్టర్ కార్ల విక్రయాలను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 772 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి.
Advertisement

రూ.10లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే 12 మోడల్స్ ఇవే

ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్. దేశంలో కార్ల పరిశ్రమ రోజు రోజుకు పెరుగుతుంది. మన దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో వాళ్లను టార్గెట్ చేసి ఆటోమొబైల్ కంపెనీలు కార్లు తయారు చేస్తున్నాయి. సొంత కారు కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటారు. మధ్య తరగతి ప్రజలు వారి బడ్జెట్ కు తగ్గట్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాటిని సెలక్ట్ చేసుకుంటారు.