కొత్త కారు లాంచ్ చేసేందుకు రోమ్ వెళ్లిన బెంజ్

ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ తన కొత్త కార్ మోడల్‎ను విడుదల చేసేందుకు రోమ్‎కు వెళ్లింది. మరదేదో కంపెనీ కాదు మెర్సిడెస్ బెంజ్. ఇది సీఎల్ఏ అనే లగ్జరీ కారు మోడల్ ను విడుదల చేసింది. అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కారు మోడల్‌గా కంపెనీ దీనిని రూపొందించింది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ కారులో లేని ఫీచర్లను ఈ మోడల్ లో అందించింది. బెంజ్ ఈ కారులో AI టెక్నాలజీని అందించింది.

బొలెరో కారును ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారుగా మార్చిన కస్టమర్

మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. నిజానికి కొన్ని సంవత్సరాల వరకు బొలెరో ప్రతినెల మహీంద్రా నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ కారు. ఇప్పుడు మరికొన్ని లేటెస్ట్ మహీంద్రా కార్లు ఆ నంబర్ వన్ స్థానాన్నిదక్కించుకున్నాయి. అయితే, మహీంద్రా బొలెరో కార్ల అమ్మకాలు తగ్గాయని అనుకోలేము.. ఎప్పటిలాగే, నిర్దిష్ట సంఖ్యలో కస్టమర్లు ఈ బొలెరోను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

ఫిబ్రవరి 2025లో ఎక్కువగా అమ్ముడైన టాప్ కార్లు ఇవే!

ప్రపంచంలోనే భారతదేశం వాహన పరిశ్రమ అభివృద్దిలో వేగంగా దూసుకుపోతుంది. అందుకే అంతర్జాతీయ తయారీదారులు కూడా ఇక్కడి వచ్చి ప్లాంట్‌లను ఏర్పాటు చేసి తమ వాహనాలను లోకల్‌గా విక్రయిస్తునే ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. దేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని SUVలు, సెడాన్‌లు ఇతర మోడళ్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఇండియాలో కార్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహన తయారీదారులు కూడా వారిని ఆకట్టుకునే డిజైన్లతో కార్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరి నెల ముగియగానే కంపెనీలు తమ మోడళ్ల వారిగా సేల్స్ వివరాలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ నెలలో దేశంలో అత్యధికంగా విక్రయాలను సాధించిన టాప్ 5 కార్లు ఏవో కింది కథనంలో తెలుసుకోండి.

ఓలా, హీరోలకు సవాల్ విసిరిన బజాజ్! టెస్టింగ్‌లో కనిపించిన కొత్త ఇ-స్కూటర్

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుంది. గతంలో పెట్రోల్ మోడళ్లను ఎక్కువగా కొన్న జనాలు ఇప్పుడు తమ ధోరణిని క్రమంగా మార్చుకుని ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) కూడా ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే గతంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి తయారీదారులకు పోటీ నిస్తూ ఇది దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. అయితే కంపెనీ ఈ విజయపరంపరను కొనసాగించడానికి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల ఈ మెడల్‌ను రోడ్డుపై పరీక్షిస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
Advertisement

ఫిబ్రవరిలో అమ్మకాల్లో దుమ్ములేపిన టయోటా 8సీటర్ కార్

జపాన్‎కు చెందిన ప్రసిద్ధ ఆటో మొబైల్ కంపెనీ టయోటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. ఇండియాలో మారుతి సుజుకీతో పార్టనర్ షిప్ కారణంగా టయోటా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి నెల కొత్త మోడల్స్ రాకతో ఈ గణాంకాలు మారుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో అమ్ముడైన టయోటా కార్లకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

తల్లిదండ్రులూ జాగ్రత్త! 10 ఏళ్లలోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోబెడుతున్నారా?

ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. కారుతో భార్య, పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లి తిరిగి రావడం లాంటి వాటిని చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలా వెళ్తున్న పిల్లలను కొంతమంది ముందు సీట్లో కూర్చోబెడుతుంటారు. అలాగే వారిని పాఠశాలలకు తీసుకెళ్లేటప్పుడు కూడా తమ పక్కనే ముందు సీట్లో కూర్చోబెడతారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరం అని చాలా మందికి తెలియదు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టవద్దని ఇటీవల శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చంటి బిడ్డలతో కలిసి ప్రయాణించే వారు వెనుక సీట్లోనే కూర్చోవడం ఉత్తమం. వీటికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. తాజాగా UAE ప్రభుత్వం 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను తమ ఒడిలో పెట్టుకుని ప్రయాణించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

మార్కెట్లో మారుతి బెస్ట్ హైబ్రిడ్ కార్ ఇదే

ఇండియాలో మారుతి కార్లకు ఉన్న డిమాండ్ మరే కంపెనీ కార్లకు ఉండదు. ప్రతి నెల వేల సంఖ్యలో కార్లు అమ్ముడవుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈవీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కమ్రంలోనే మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇ విటారా బుకింగ్ ప్రారంభమైంది. రూ.25వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి ఇ విటారా కారును బుక్ చేసుకోవచ్చు.

కొత్త టాటా కారు రోడ్ల మీద టెస్ట్ డ్రైవ్ లో కెమెరాకు చిక్కిందోచ్

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొన్ని దశాబ్ధాలుగా నాణ్యమైన వాహనాలను ఉత్పిత్తి చేస్తూ విశ్వసనీయతకు పెట్టింది పేరుగా నిలిచింది. ఈ కంపెనీ కారు కొనుగోలు చేస్తే సేఫ్టీ గ్యారంటీ అన్న పేరు ముద్ర పడిపోయింది. అందుకే కస్టమర్లు కారు కొనుగోలు చేయాలనుకుంటే వారి బెస్ట్ ఛాయిస్ ఈ కంపెనీదే అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు నయా కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది టాటా కంపెనీ.
Advertisement

175 కి.మీ రేంజ్ ఉన్న బైక్ ధర ఈ స్థాయిలో పెరగాలా? EV బైక్ లవర్స్ షాక్!

దేశంలో అన్ని రాష్టాల్లో కూడా పెట్రోలో ధరలు దాదాపు రూ.100కు పైనే ఉంది. పెద, మధ్య తరగతి ప్రజలకు టూవీలర్ లేనిదే రోజు గడవని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలకు, వ్యాపారాలకు, కాలేజ్‌లకు, ఇంటి అవసరాల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బదులుగా చాలా మంది టూవీలర్ ఉపయోగిస్తున్నారు. అయితే భారీగా ఉన్న పెట్రోల్ ధరలతో సామాన్యుడు భయపడిపోతున్నాడు. చాలి చాలని జీతంతో ఇంటిని గట్టేక్కిస్తున్న పరిస్థితుల్లో సంపాదనలో టూవీలర్ మెయింటనెన్స్‌కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. రోజూ పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హాయిగా బ్యాటరీ ఛార్జ్ చేసుకుని రోజంతా తిరిగే ఈవీ బైకులను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. అందుకే వాహన తయారీదారులు కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు.

28.06 కి.మీ మైలేజ్.. ఫుల్ సేఫ్టీ.. బడ్జెట్ ఫ్రెండ్లీ టాటా టియాగో NRG!

ఇండియాలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కార్లను తయారు చేసే కంపెనీ అంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చే టాటా మోటార్స్(tata motors) మాత్రమే. రతన్ టాటా ఆశయాలకు అనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది. గత ఏడాదిలో అధునాతన ఫీచర్స్‌ కలిగిన కార్లను లాంచ్ చేయగా, 2025లో తన సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది. దీనిలో భాగంగా తన ప్రసిద్ధ మోడల్ టియాగో ( Tiago) అప్‌డేట్ వెర్షన్ NRGను ఇటీవల విడుదల చేసింది. Tata Tiago NRGలో సాధారణ టియాగో కారుతో పోలిస్తే కొత్త ఫీచర్స్ చాలా ఉన్నాయి.

మార్కెట్లో మరో హై పర్ఫామెన్స్ బెక్ రిలీజ్ చేసిన కీవే ఇండియా

ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ ప్రపంచ వ్యాప్తంగా వాహనాలను విడుదల చేస్తుంది. దాని యాజమాన్యంలో ఉన్న హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే ఇండియన్ మార్కెట్లోకి తన ప్రోడక్ట్ పోర్ట్ ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. దేశీయ మార్కెట్లోకి ఇప్పటికే కీవే వియస్టా 300 , కీవే సిక్స్టీస్ 300ఐతో పాటుగా కీవే కె-లైట్ అనే క్రూయిజర్ బైక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

చిన్న ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోన్న ఎంజీ.. కేవలం ఈ నెలలోనే!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (Mg motor India) ఇటీవల తన దూకుడును మరింత ఎక్కువగా ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేస్తూ టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీదారులకు గట్టి సవాల్ విసురుతుంది. ముఖ్యంగా సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేస్తూనే అదే సమయంలో బాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌పై కూడా కీలకంగా దృష్టి సారించింది. SUV మోడల్ హెక్టర్ లాంచ్‌తో ఎంజీ మోటార్ దేశంలో బలమైన వృద్దిని సాధిస్తుంది. కామెట్ ఈవీ, విండ్సర్ ఈవీలను కూడా తీసుకొచ్చి ఇప్పటి వరకు ఈవీ కార్ల పరంగా టాప్ ప్లేస్‌లో ఉన్నటువంటి టాటా మోటార్స్ గట్టి షాక్ ఇచ్చి సేల్స్ విషయంలో మెరుగైన గణాంకాలను నమోదు చేసింది.
Advertisement

కేటీఎం బైక్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్ - త్వరపడండి

ప్రస్తుతం దేశంలో ద్విచక్రవాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతుంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఇవి కనీసం అవసరంగా మారిపోయాయి. గతంలో కుటుంబానికి ఒక్క బైక్ ఉంటే సరిపోయేది. కానీ ప్రస్తుం పరిస్థితి మారిపోయింది. మహిళలు కూడా ఉద్యోగాల చేస్తుండడంతో వారికీ బైక్, కార్లు అవసరం అయిపోయాయి. అంతే కాకుండా కాలేజీ వెళ్లే పిల్లలకు కూడా బైక్ తప్పనిసరి అయింది. దీంతో అనేక కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి దించుతున్నాయి కంపెనీలు.

రోల్స్ రాయిస్ కారును కొన్న ఊర్వశి రౌతేలా.. దీని ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటి ఊర్వశి రౌతేలా (urvashi rautela). ఇటీవల కాలంలో తెలుగులో అగ్రహీరోల పక్కన స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా బాగా పాపులరాటి సంపాదించింది. గత ఏడాది సంక్రాంతి సమయంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేలా చేతినిండా బాగా సంపాదిస్తునే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ, ఇంకోవైపు వివిధ కంపెనీలకు యాడ్స్ చేస్తూ బాగానే కూడబెడుతుంది.

సామాన్యుల నుంచి స్టార్స్ వరకూ అందరి ఫేవరెట్ కారు.. గతనెల ఎంతమంది కొన్నారంటే?

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki) అమ్మకాల పరంగా దేశంలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి నెలా ముగియగానే తన కార్ల సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా (grand vitara)కు సంబంధించిన అమ్మకాల డేటాను విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా సేల్స్ సాధించిన SUVల లిస్ట్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. అధునాతన డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో దేశంలోని సామాన్యుడి నుంచి మొదలుకుని సినిమా తారల వరకు అందరూ ఈ ఎస్‌యూవీని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. చూడగానే లగ్జరీ లుక్‌తో కట్టిపడేసే గ్రాండ్ విటారా ఫిబ్రవరి 2025లో దాదాపు 10,669 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

లేటెస్ట్ సఫారీ స్టీల్త్ ఎడిషన్ ఫస్ట్ డెలివరీ ఇచ్చిన టాటా

టాటా మోటార్స్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆటోమోబైల్ మార్కెట్లో దీనికి ఉన్న విశ్వసనీయత మరో కంపెనీకి లేదంటే అతిశయోక్తి కాదు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కంపెనీ పాపులర్ SUVలు హారియర్, సఫారీల 'స్టీల్త్ ఎడిషన్' ఆవిష్కరించింది.
Advertisement

అవును, ఇది నిజమే! ఓలా స్కూటర్ పై ఏకంగా రూ.26 వేల భారీ తగ్గింపు

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇటీవల కాలంలో అమ్మకాల పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దేశంలో ఈవీలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో పెద్ద వాహన తయారీ కంపెనీలే కాకుండా ఇతర స్టార్టప్ సంస్థలు సైతం పుట్టుకొచ్చి ట్రెండ్‌కు అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వెరైటీ డిజైన్లతో కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను వరుసగా విడుదల చేస్తున్నాయి. దీంతో ప్యత్యర్థుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి ఓలా కంపెనీ తీవ్రంగా కష్టపడుతుంది. ఇప్పుడు కంపెనీ సేల్స్ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత నెల అమ్మకాలను చూసినట్లయితే ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ నాల్గవ స్థానానికి పడిపోయింది. గతంలో మొదటి స్థానంలో ఉండగా, ఈ సారి సేల్స్ బాగా తగ్గిపోవడం కారణంగా తన స్థానాన్ని కోల్పోయింది.

మహీంద్రా బీఈ 6 వర్సెస్ ఫార్చ్యూనర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఎస్‎యూవీని లాంచ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీనిని హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారుకు పోటీగా తన బీఈ 6(BE6)కారును ఆవిష్కరించింది. డ్రైవింగ్‌ అవసరాలు, వేర్వేరు ప్రాధాన్యతలకు అనుగుణంగా వెరైటీ వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రతి వేరియంట్లో అడ్వాన్స్‎డ్, బ్లెండింగ్ పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ, డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

శ్రీలంకలో టాటా పాపులర్ కార్ లాంచ్.. మార్కెట్లో సెన్సేషన్ ఖాయం

భారతదేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ మార్కెట్ కు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో కార్లను విడుదల చేస్తుంది. సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా ఈ కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రజలు కూడా కారు కొనాలనుకుంటే ఆలోచించే ఫస్ట్ కంపెనీ టాటా మోటార్స్. ఇప్పటికే ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. తాజాగా మరో దేశంలోనూ టాటా మోటార్స్ కొన్ని మోడల్స్ లాంచ్ చేసింది.

ఇంకా హైటెక్, ఇంకా స్టైలిష్! కియా కారెన్స్ 2025 అప్‌డేట్ వచ్చేస్తోంది!

ఇండియాలో ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కార్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. పెద్ద కుటుంబం అంతా కలిసి ఒకే కారులో హాయిగా వెళ్లడానికి ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటార్స్‌కు చెందిన కారెన్స్ (carens) బాగా ప్రసిద్ది చెందిన మోడల్. ఎంపీవీ (mpv) విభాగంలో ఇతర కంపెనీలకు చెందిన కార్లతో పోలిస్తే, ఆదరణ పరంగా ఒక మెట్టు పైనే ఉంటుంది. కియా సోనెట్, సెల్టోస్ ఎస్‌యూవీల మాదిరిగానే ఇంండియాలో కారెన్స్ మోడల్ అమ్మకాల పరంగా దూసుకెళ్తుంది. దీనికి ప్రజల నుంచి ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం దాని ఆకట్టుకునే డిజైన్, బడ్జెట్ ధర, మంచి మైలేజ్, ప్రీమియం ఫీచర్లు కలిగి ఉండటం.
Advertisement

టాటా పంచ్.. టాటా నెక్సాన్ మోడల్స్ లో ఏది కొనడం బెస్ట్ ?

టాటా కార్లకు భారత దేశంలో ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. విశ్వసనీయతకు మారు పేరుగా ఉన్న ఆ కంపెనీ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల కాలంలో టాటా కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తక్కువ ధరలు, అత్యధిక సేఫ్టీ రేటింగ్‌లు కలిగిన కార్లను ఉత్పత్తి చేయడం వల్ల కంపెనీకి మార్కెట్లో మంచి పేరు వచ్చింది. ఈ కంపెనీ కార్లలో టాప్ ప్లేసులో నిలిచే కార్లు టాటా నెక్సాన్, టాటా పంచ్.

లక్ష డిస్కౌంట్ ఆఫర్ పెట్టినా మారుతి ఆ మోడల్ కొనే దిక్కే లేదు

ప్రస్తుతం మార్కెట్లో ఆఫ్ రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన మహీంద్రా థార్ తో పాటు జిమ్నీలను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత ఈ వాహనాలకు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ జిమ్నీను తీసుకొచ్చింది.

మీరు సెల్ ఫోన్ కొనుక్కున్న డబ్బుతో ఈ కొత్త స్కూటర్ కొనవచ్చు!

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గతంలో కంటే బాగా పెరుగుతున్నాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం కారణంగా ప్రజలు ఇంధన ఖర్చులు భరించలేక, అలాగే, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన వంటి కారణాల వలన ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లలో మంచి ఆదరణ కారణంగా తయారీదారులు సైతం పోటీ పడుతూ భారత మార్కెట్లో కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ల జోరు మామూలుగా లేదు. కొత్తగా లాంచ్ అవుతున్న వాటిలో వీటి వాటా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు గత కొద్ది నెలలుగా మార్కెట్‌పై దండయాత్ర చేస్తున్నట్టుగా విడుదల అవుతూనే ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని చిన్నవి కూడా పోటా పోటీగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి.

తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు ఇస్తున్న మహీంద్రా కార్.. ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్

భారతదేశంలో రోజురోజుకు కార్ల మార్కెట్ పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పుడు అనేక కంపెనీలకు చెందిన కార్లు అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ ను టార్గెట్ చేస్తూ కంపెనీలు అన్నీ కూడా తక్కువ బడ్జెట్ కార్లను తీసుకొస్తున్నాయి. అలాగే మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్లోనే అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి కార్లను అందించడంలో మహీంద్రా కంపెనీ ముందుందనేది వాస్తవం.
Advertisement

బుల్లెట్ రైడర్స్‌కు షాక్.. హోండా CB350RS కొత్త లుక్స్‌లో అదరగొడుతోంది!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇండియాలో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్లాసిక్, బుల్లెట్ మోడళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. వీటికి పోటీగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) రెండు మోడళ్లు హైనెస్ CB350, CB350RS ఇంతకు ముందు విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్‌తో ఇవి ఇప్పటికే దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ రెండు కూడా వేరు వేరు డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మొదటి మోడల్ రెట్రో స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉండగా, CB350 RS స్క్రాంబ్లర్ స్టైల్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా కంపెనీ దీన్ని మరింత కొత్తగా అప్‌డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.