తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు ఇస్తున్న మహీంద్రా కార్.. ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్

భారతదేశంలో రోజురోజుకు కార్ల మార్కెట్ పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పుడు అనేక కంపెనీలకు చెందిన కార్లు అందుబాటులో ఉన్నాయి. మిడిల్ క్లాస్ ను టార్గెట్ చేస్తూ కంపెనీలు అన్నీ కూడా తక్కువ బడ్జెట్ కార్లను తీసుకొస్తున్నాయి. అలాగే మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. దీంతో తక్కువ బడ్జెట్లోనే అత్యాధునిక ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి కార్లను అందించడంలో మహీంద్రా కంపెనీ ముందుందనేది వాస్తవం.

బుల్లెట్ రైడర్స్‌కు షాక్.. హోండా CB350RS కొత్త లుక్స్‌లో అదరగొడుతోంది!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇండియాలో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్లాసిక్, బుల్లెట్ మోడళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. వీటికి పోటీగా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) రెండు మోడళ్లు హైనెస్ CB350, CB350RS ఇంతకు ముందు విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్‌తో ఇవి ఇప్పటికే దేశీయంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ రెండు కూడా వేరు వేరు డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మొదటి మోడల్ రెట్రో స్టైల్‌ డిజైన్‌ను కలిగి ఉండగా, CB350 RS స్క్రాంబ్లర్ స్టైల్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా కంపెనీ దీన్ని మరింత కొత్తగా అప్‌డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.

రోజువారీ ప్రయాణాలకు మినీ EV.. స్టైలిష్ లుక్, సూపర్ మైలేజ్!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ గతంలో కంటే భారీగా పుంజుకుంది. పలు ఈవీ తయారీదారులు హోరా హోరీగా మార్కెట్ వాటా కోసం పోటీ పడుతున్నారు. అన్ని కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలవడానికి చాలా కాలంగా జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్‌వ్యాగన్ కృషి చేస్తుంది. ఇన్ని రోజులు సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందుకే ఈ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీ త్వరలో ఒక కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆ మోడల్ పేరు ఐడి ఎవ్రీ1(id every1). దీన్ని తాజాగా ఫోక్స్‌వ్యాగన్ ఆవిష్కరించింది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ చూపరులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కలర్ విషయానికి వస్తే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది.

అద్భుతమైన ఫీచర్లతో టాటా టియాగో ఎన్ఆర్‌జీ న్యూ వెర్షన్ వచ్చేసింది

దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్ పై కస్టమర్లు ఎలాంటి నమ్మకం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ వాహకాలకు ఇచ్చే స్ట్రాంగ్ బాడీ బిల్డింగ్ కారణంగా ఈ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టాటా కంపెనీ ఆధునిక మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే టాటా టియాగో ఎన్ఆర్జీ (Tata Tiago NRG) న్యూ వెర్షన్ ను రిలీజ్ చేసింది.
Advertisement

తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. చాలా మంది కొత్త వినియోగదారులు సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ మోడళ్లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో లభించే వాటిలో మంచి బ్యాటరీ పనితీరు, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కలిగిన మోడళ్లను ఎంచుకుని కొనుగోలు చేస్తున్నారు. భారత కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈవీ తయారీదారులు వారి ఇష్టానికి అనుగుణంగా వరుసగా కొత్త ఇస్కూటర్లను విడుదల చేస్తున్నారు. పెద్ద కంపెనీలకు పోటీగా స్టార్టప్ కంపెనీలు సైతం ముందడుగు వేసి తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్‌లోనే పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మార్కెట్లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ సింపుల్ ఎనర్జీ (Simple Energy) కొత్తగా సింపుల్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫిబ్రవరిలో రికార్డు సేల్స్ నమోదు చేసిన హ్యుందాయ్ మోడల్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. మన దేశంలో మారుతి సుజుకి తర్వాత హ్యుందాయ్ కంపెనీ కార్లు అత్యధికంగా అమ్ముడవుతాయి. సాధారణంగా ప్రతి నెలా సుమారు 50,000 కార్లను అమ్ముతున్న హ్యుందాయ్, ఫిబ్రవరిలో అమ్ముడైన కార్ల వివరాలను విడుదల చేసింది. ఈ గణాంకాల్లో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం.

ఇండియాలో సిట్రోయెన్ కార్లకు డిమాండ్ తగ్గిందా? భారీగా పడిపోయిన సేల్స్

ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ (citroen) ఇండియాలో చాలా కాలంగా తన వాహనాలను విక్రయిస్తుంది. గతంలో మెరుగైన అమ్మకాలను సాధించిన కంపెనీ ఇటీవల కాలంలో తీవ్రంగా ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. గత కొద్ది నెలలుగా సిట్రోయెన్ కార్ల సేల్స్ భారీగా తగ్గిపోతున్నాయి. ఇదే సమయంలో ఇతర తయారీదారులు తమ మార్కెట్‌ను విస్తరించుకుంటున్న తరుణంలో ఈ కంపెనీ సేల్స్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కార్ల తయారీదారులు ఫిబ్రవరి నెల ముగిసిన నేపథ్యంలో తమ మొత్తం సేల్స్ డేటాను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ కంపెనీ సైతం తన వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం, ఫిబ్రవరి 2025లో కంపెనీ అమ్మకాల ఏకంగా ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. ఇది దాని గత సేల్స్‌తో పోల్చినట్లయితే ఇది భారీ క్షీణతగా పేర్కొనవచ్చు.

మార్కెట్లోకి రాకముందే సెన్సేషన్ సృష్టిస్తోన్న మహీంద్రా థార్ రాక్స్ బ్లాక్ ఎడిషన్

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా గతేడాది థార్ రాక్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని అద్భుతమైన డిజైన్, ఆఫ్ రోడింగ్ కెపాసిటీకి మంచి పేరు వచ్చింది. దీంతో భారతీయ మార్కెట్లో థార్ రాక్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీని కారణంగా ఆ మోడల్ వెయిటింగ్ పిరయడ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో 4x2, 4x4 వేరియంట్ల కోసం డిఫరెంట్ వెయిటింగ్ పిరియడ్ లను కలిగి ఉంది.
Advertisement

మరో ఘనత సాధించిన దేశంలోనే మొట్టమొదటి హై ఓల్జేజీ బైక్

మన దేశంలో ఈవీ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు వారి అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త వాహన మోడల్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో స్కూటర్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున స్టార్టప్ బ్రాండ్లు కూడా వివిధ రకాల ఎలక్ట్రిక్ బైక్ లను ప్రవేశపెడుతున్నాయి.

ఆటో కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్! కేవలం రూ.25,000 చెల్లిస్తే చాలు

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్ (Bajaj) ఇండియాలో టూవీలర్ వాహనాలతో పాటు, త్రీవీలర్స్‌ను కూడా విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో బడ్జెట్ ధరలో తన వాహనాలను తీసుకొస్తుంది. తాజాగా బజాజ్ మార్కెట్లోకి గోగో(gogo) బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల డెలివరీలను లక్నోలో మొదలుపెట్టింది. తక్కువ ధరకు తన త్రీవీలర్ వాహనాన్ని దేశీయ కస్టమర్లకు అందించడానికి బజాజ్ రూ.3.26 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో దీన్ని ప్రారంభించింది. ప్రీమియం వేరియంట్ ధర వచ్చేసి రూ. 3,83,004 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తుంది. రూ.24,999 డౌన్ పేమెంట్ చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చని బజాజ్ ప్రకటించింది.

ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలు

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. వాతావరణానికి అనుకూలంగా ఉండడం, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ వాహనాలు చాలా బెస్ట్. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీల హవా నడుస్తోంది. దీంతో అన్ని కంపెనీలు ఈ వాహనాల మీద దృష్టి సారించాయి.

టెస్లా, మహీంద్రా, టాటాలకు షాక్ ఇచ్చిన చైనా బ్రాండ్.. మరింత కొత్తగా suvల అప్‌డేట్

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ మామూలుగా లేదు. కొత్తగా విడుదల అవుతున్న చాలా వరకు ఈవీలే ఎక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తయారీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా టెస్లా, BYD దిగ్గజ తయారీదారులు చాలా కాలంగా ప్రపంచ ఈవీ మార్కెట్‌ను ఛేజిక్కించుకోడానికి తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇటీవల అమెరికా ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా(Tesla)ను చైనా BYD కంపెనీ అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా అవతరించింది. అంతర్జాతీయంగా ఇప్పుడు భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ఈ నేపథ్యంలో టెస్లా, BYD కంపెనీలు తమ చూపును భారత్‌ వైపు పెట్టాయి. అయితే మస్క్‌కు టెస్లా కంపెనీ ఇంకా ఇక్కడ అడుగుపెట్టలేదు. కానీ చైనా బ్రాండ్ బీవైడీ మాత్రం ఇప్పటికే ఇండియాలో మంచి మార్కెట్ కలిగి ఉంది.
Advertisement

దేశంలోనే మొట్టమొదటి 150సీసీ హైబ్రిడ్ బైక్ లాంచ్ చేసిన యమహా

భారతదేశంలోని మోటార్ సైకిల్ విభాగంలో బజాజ్ పల్సర్ల తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన మోడల్ యమహా FZ సిరీస్. 150సీసీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ బైక్ ఒకప్పుడు యూత్ కు ఇష్టమైన వాహనం. RX100, R15 వంటి బ్లాక్ బస్టర్ బైకుల తర్వాత యమహా లైనప్ లో అత్యంత సక్సెస్ ఫుల్ బైక్ గా FZ గుర్తించబడటానికి కారణం వెనుక భాగంలో ఉన్న పెద్ద సైజ్ టైర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రూ.8 లక్షలకే 5 సీట్లు, 25.51 కి.మీల మైలేజ్.. కానీ గత నెలలో తగ్గిన జోరు

ఇండియాలో పేద-మధ్య తరగతి వారికి బాగా ఇష్టమైన కార్ల తయారీ కంపెనీ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది మారుతీ సుజుకీ(Maruti Suzuki) మాత్రమే. దీని నుంచి వచ్చిన ప్రసిద్ధ మోడల్ బ్రెజ్జా(Brezza) చాలా కాలంగా దేశంలో అందరి అభిమానాన్ని పొందుతుంది. అత్యంత ప్రజాధారణ suvలలో ఇది ఒకటిగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఫిబ్రవరి నెల ముగియగానే అన్ని వాహన తయారీదారులు వరుసగా తమ సేల్స్ వివరాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మారుతీ సైతం తన ప్రసిద్ధ SUV బ్రెజ్జాకు సంబంధించిన సేల్స్ వివరాలు వెల్లడించింది. డేటా ప్రకారం, ఈ మోడల్ ఫిబ్రవరి 2025లో 15,392 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఏడాది 2024 ఇదే నెలలో మొత్తం 15,765 యూనిట్ల అమ్మకాలను సాధించగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఈ సారి సేల్స్ 2 శాతం తగ్గడం గమనార్హం.

డిస్క్ బ్రేక్స్‎తో రాబోతున్ను హీరో స్ప్లెండర్

ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రముఖ కంపెనీ హీరో టాప్ ప్లేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ తయారు చేసే హీరో స్ప్లెండర్ మోటర్ సైకిళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వాటిని మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కవగా కొనుగోలు చేస్తారు. అయితే హీరో స్ప్లెండర్ నుంచి త్వరలో కొత్త మోడల్ రాబోతుంది. రాబోయే 2025 స్ప్లెండర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఈ బైక్ లలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

KTM 390 డ్యూక్ క్రూయిజ్ కంట్రోల్‌తో ఇక హైవే రైడింగ్ ఇంకొంత ఈజీ!

ఇండియాలో గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ మోడల్ తరహా బైకులకు ఆదరణ పెరుగుతుంది. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాని గురించి వాకబు చేసుకుని కొనుగోలు చేసి రోజు రైడ్స్ వేయాల్సిందే. ముఖ్యంగా దేశంలో కేటీఎం(KTM) ఇలాంటి మోడళ్లను విడుదల చేయడంతో బాగా ప్రసిద్ధి. ఈ కంపెనీ నుంచి వచ్చే బైక్స్‌కు డిమాండ్ మాములుగా ఉండదు. ప్రధానంగా KTM డ్యూక్ (duke) అనే పదం వినగానే యువత కళ్లలో ఏదో తెలియని ఆనందం. చాలా మంది రైడర్లు ఇష్టంగా డ్యూక్‌ను కొనుగోలు చేస్తుంటారు. రోడ్లపై ఈ బైక్‌తో యువత రయ్ మంటూ దూసుకుపోతుంటారు. నగరాల్లో కొందరు ఈ మోడల్‌తోనే ఎక్కువగా రేసింగ్‌లలో పాల్గొంటారు. దీని ఇంజిన్ అత్యంత శక్తివంతమైనది. అలాగే పెర్ఫామెన్స్ విషయంలో దీనికి ఏదీ సాటిరాదు.
Advertisement

స్లావియా ధరను భారీగా తగ్గించిన స్కోడా కంపెనీ

కొన్నేళ్ల కిందటి వరకు ఎక్కువగా జనాలు సెడాన్ కార్లను ఉపయోగించే వారు. కానీ కాలం మారిన కొద్దీ ఇప్పుడు జనాలంతా ఎస్‎యూవీల వెంటపడుతున్నారు. అయితే ఇప్పటికీ కొందరు మాత్రం పాత మోడల్స్‎ను ఇష్టపడుతుంటారు. కాబట్టి సెడాన్ మోడల్స్ కు గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. ఒకప్పుడు ఉన్నంత ప్రజాదరణ లేకపోయినా త్రి బాక్స్ టైప్ వెహికల్స్ నేటికీ బాగానే అమ్ముడవుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు(ఎస్‎యూవీ) లకు ఉన్న రైడింగ్ కంఫర్ట్. చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ స్కోడా అనేది దాని సెడాన్లతో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన టాటా పంచ్ అమ్మకాలు

టాటా మోటార్స్ కార్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సాయంతో కార్లను మార్కెట్లోకి వదులుతుంది. దేశంలో సబ్ ఫోర్ మీటర్ లేదా కాంపాక్ట్ ఎస్ యూవీలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని విభాగాలను వది ఈ సెగ్మెంట్లో తమ లేటెస్ట్ కార్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కస్టమర్లు కూడా అలాంటి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. టాటా కూడా తన మైక్రో ఎస్ యూవీ పంచ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

లగ్జరీలో విమానాన్ని మించిపోయే SUV.. కానీ వెంటనే దొరకదండోయ్!

భారతదేశంలో కార్ల తయారీ దారుల్లో ఎంజీ మోటార్స్ (Mg Motors) ఒక ప్రసిద్ధ కంపెనీ. ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను విడుదల చేయడం దీని ప్రత్యేకత. లోకల్‌గా టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వీటికి పోటీగా ఎంజీ సైతం ఈ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు భారతీయ ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోడల్ MG విండ్సర్ కారుకు దేశంలో డిమాండ్ బాగా ఉంది. ఇది ఒక ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV. దీని ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్స్‌తో చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇది భారీ సంఖ్యలో అమ్ముడుపోతుంది. దీని లాంచ్ తర్వాత డెలివరీలు మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా సగటున 3,000 కార్ల సేల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్ మోడల్ కు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్ యాడ్ చేసిన టయోటా

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా మోటార్స్ విడుదల చేసే కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో కూడా ఈ కార్లు రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో ఇన్నోవా కారు అంటే తెలియని వారుండదు. అప్పట్లో అంబాసిడర్ ఏ విధంగా వాడే వారో ప్రస్తుత ఇన్నోవాను కూడా స్టేటస్ సింబల్ గా వాడుతున్నారు. దీని మంచి లుక్, పికప్, ఎక్కువ మంది ప్రయాణించే వీలు ఉండడంతో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్నోవా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Advertisement

టాటా సియెర్రా 2025 డిజైన్ లీక్

దిగ్గజ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత మార్కెట్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. బాడీ బిల్డ్ క్వాలిటీ ఇవ్వడంలో టాటాకు మించింది లేదు. అందుకే వినియోగదారులు చాలా మంది టాటా కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి టాటా మోటార్స్ ఈ ఏడాది భారత మార్కట్లోకి అనేక కొత్త కార్లు, ఎస్ యూవీలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.

అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ VS ఓలా, ఏథర్, హీరో! ఎవరు గెలుస్తారు?

గత కొంత కాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈవీ తయారీదారులు పోటా పోటాగా కొత్త టూవీలర్స్‌ను విడుదల చేస్తూ, దేశాన్ని ఈవీలకు ప్రధాన గమ్యస్థానంగా మారుస్తున్నారు. పెద్ద కంపెనీల నుంచి మొదలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ అల్ట్రావయోలెట్(Ultraviolette) గత వారం భారతదేశంలో రెండు కొత్త ఈవీలను విడుదల చేసింది. ఇప్పటి వరకు లక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌లను మాత్రమే విడుదల చేసిన ఈ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కూడా పట్టు సాధించడానికి టెస్రాక్ట్ (Tesseract)ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ మోడల్ మార్కెట్లో పెద్ద సంచలనం అయింది. దీని ఆకట్టుకునే రూపంతో భారీ ఆదరణ సంపాదిస్తుంది.

రెండు దశాబ్దాల నుంచి భారత రోడ్లను ఏలుతున్న స్టైల్ ఐకాన్

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతీ సుజుకీ(Maruti suzuki) అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తుంది. ధర చాలా వరకు అందుబాటులో ఉంచడం దీని ప్రత్యేకత. అందుకే గత దశాబ్దాల కాలంగా కూడా మారుతీ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం. కారు కొనాలని కోరిక ఉండి కొనలేక భాదపడుతున్న వారికి మారుతీ తక్కువ ధరలోనే తన ప్రసిద్ధ మోడళ్లను అందిస్తూ సొంత కారు కలిగి ఉండాలనే కోరికను నెరవేర్చుతుంది. సేల్స్‌లో ప్రతి ఏడాది కూడా మొదటి స్థానంలో నిలవడం మారుతీకే చెందుతుంది. మార్కెట్లో చాలా కార్ల తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మారుతీ సుజుకీ కార్లంటే దేశంలో చాలా మందికి ఇష్టం. ఇదిలా ఉంటే ఫిబ్రవరి నెల ముగియగానే ఆటోమొబైల్ కంపెనీలన్ని కూడా తమ అమ్మకాల వివరాలు విడుదల చేస్తున్నాయి.

సేల్స్‌లో రెచ్చిపోతున్న ఆనంద్ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు

దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా (mahindra and mahindra) పెట్రోల్, డీజిల్ ఇంధనాల కార్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా తన సత్తాను చాటడానికి కీలకంగా కృషి చేస్తుంది. ఈవీ మార్కె్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఇతర దేశాల తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి కొత్త XEV 9e, BE 6 ఎలక్ట్రిక్ SUV లను తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి వీటికి మంచి ఆదరణ వస్తుందని తాజాగా విడుదల అయిన సేల్స్ డేటాను చూస్తే తెలిసిపోతుంది. మహీంద్రా వెల్లడించినదాని ప్రకారం, ఫిబ్రవరి 2025 నెలలో ఈ ఈవీ కార్లు భారీ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేశాయి. మొత్తం 3,196 యూనిట్ల సేల్స్‌తో ఇవి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో డిమండ్ ఉన్న మోడళ్లుగా అవతరించాయి.
Advertisement

భారీ అమ్మకాలతో దూసుకుపోతున్న స్కోడా కైలాక్

భారత ఆటోమొబైల్ రంగం ఇటీవల కాలంలో బాగా వృద్ధి చెందింది. ఇక్కడ మిడ్ రేంజ్ కార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు రూ.10లక్షల లోపు కార్లను మార్కెట్లో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే కోవలో స్కోడా ఆటో ఇండియా కూడా గతేడాది ఇండియాలో తన మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‎యూవీ అయిన స్కోడా కైలాక్‎ను లాంచ్ చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి బడ్జెట్ ధరలోనే ఈ కారును తీసుకొచ్చింది.